Jan 26 2019
నేటితరం ప్రేమకథాచిత్రం `4 లెటర్స్` టీజర్ ను విడుదల చేసిన దర్శకేంద్రుడు శ్రీ కె.రాఘవేంద్ర రావు
ఓం శ్రీ చక్ర క్రియేషన్స్ బ్యానర్ ప్రొడక్షన్ నెం.1గా రూపొందుతోన్న చిత్రం `4 లెటర్స్`.
‘కుర్రాళ్ళకి అర్ధమవుతుందిలే’ అన్నది ఉప శీర్షిక
ఈశ్వర్, టువ చక్రవర్తి, అంకిత మహారాణా హీరో హీరోయిన్లుగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని ఆర్.రఘురాజ్ దర్శకత్వంలో దొమ్మరాజు హేమలత, దొమ్మరాజు ఉదయ్‌కుమార్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది.
`4 లెటర్స్` టీజర్ ను విడుదల చేసిన దర్శకేంద్రుడు శ్రీ కె.రాఘవేంద్ర రావు
ఈ చిత్రం టీజర్ ను దర్శకేంద్రుడు శ్రీ కె.రాఘవేంద్ర రావు ఈ రోజు ఉదయం 11 గంటలకు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..’ ప్రవాస భారతీయుడైన ఈ చిత్ర నిర్మాత ఉదయ్ కుమార్ గారు నిర్మించిన ఈ చిత్రం ’4 లెటర్స్’ టీజర్ నేటి తరం యువతి యువకుల మనోభావాలకు అడ్డం పట్టేలా ఉంది. హీరో ఈశ్వర్ కు ఇది తొలి చిత్రమైనా ఎంతో చక్కగా నటించాడు. సత్యానంద్ గారి శిష్యరికం కాబట్టి చక్కని ప్రతిభ కనబరిచాడు. అతనికి చిత్రపరిశ్రమలో ఉజ్వలమైన భవిష్యత్ ఉండాలని ఆశిస్తున్నాను. అలాగే నిర్మాత ఉదయ్ కుమార్, దర్శకుడు రఘురాజ్ లు ఈ చిత్రం తో మంచి విజయాన్ని అందుకోవాలని అభిలషించారు.
ఈ నెల ౩౦న చిత్రం ఆడియో, ఫిబ్రవరి 2 వ వారంలో చిత్రం విడుదల
ఈ సందర్భంగా…నిర్మాతలు దొమ్మరాజు హేమలత, దొమ్మరాజు ఉదయ్‌కుమార్ మాట్లాడుతూ – “మా బ్యానర్‌లో నిర్మిస్తోన్న తొలి చిత్రం `4 లెటర్స్`. ఈ చిత్రం టీజర్ ను సుప్రసిద్ధ దర్శకులు శ్రీ రాఘవేంద్ర రావు గారు విడుదల చేయటం మాకెంతో ఆనందంగా ఉంది. ఆయనకు కృతఙ్ఞతలు. చిత్రం ద్వారా ఈశ్వర్‌ను హీరోగా పరిచయం చేయడం ఆనందంగా ఉంది. చాలా చక్కగా నటించాడు. సత్యానంద్‌గారి వద్ద శిక్షణ తీసుకున్న ఈశ్వర్.. ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశారు. కమర్షియల్ హంగులతో యూత్ సహా అన్నీ వర్గాలను ఆకట్టుకునే ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందించాం. ఈ నెల ౩౦న చిత్రం ఆడియో,. ఫిబ్రవరి 2 వ వారంలో చిత్రం విడుదల అవుతాయని తెలిపారు.
హీరో ఈశ్వర్ మాట్లాడుతూ..’ ఎంతోమంది టాప్ స్టార్స్ ను వెండితెరకు పరిచయం చేసిన గ్రేట్ డైరెక్టర్ శ్రీ రాఘవేంద్ర రావు గారు నా తొలి చిత్రం టీజర్ ను విడుదల చేయటం, నన్ను ఆశీర్వదించటం సంతోషం గా ఉంది. ఆయన హస్తవాసి మంచిదని ఎంతో మంది అంటూ ఉంటారు. ఆయన చేతుల మీదుగా విడుదల అయిన ఈ చిత్రం టీజర్ తోపాటు, చిత్రం కూడా ప్రేక్షకాదరణకు నోచుకుంటుందనే నమ్మకం ఉందని అన్నారు.
దర్శకుడు ఆర్.రఘురాజ్ మాట్లాడుతూ `కలుసుకోవాలని` తర్వాత తెలుగులో నేను డైరెక్ట్ చేసిన మూవీ ఈ 4 లెటర్స్. టీజర్ ను గురు తుల్యులు శ్రీ రాఘవేంద్ర రావు గారి చేతులమీదుగా విడుదల అవటం ఈ చిత్ర విజయానికి శుభ సూచకం. ఆయనకు హృదయపూర్వక కృతఙ్ఞతలు. నేటి ట్రెండ్‌కు తగ్గట్లు సినిమాను తెరకెక్కించాను. ఒక రకంగా చెప్పాలంటే `4 లెటర్స్`: నేటితరం ప్రేమకథాచిత్రం. అందుకే ‘కుర్రాళ్ళకి అర్ధమవుతుందిలే’ అన్నది ఉప శీర్షిక గా పెట్టాము. ప్రేమ,పెళ్లి విషయాలలో నేటితరం యువత ఆలోచనలు,అభిప్రాయాలు,వాస్తవాలు ఏమిటన్నది విషయాలను వాస్తవానికి దగ్గరగా ఉండేలా చిత్రీకరించటం జరిగింది. చిత్ర కధ,కధనాలు,సంభాషణలు అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా సాగటం తో పాటు,ఆలోచన రేకెత్తించేలా ఉంటాయి అన్నారు. హీరో ఈశ్వర్ చక్కగా నటించాడు. తనకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. హీరోయిన్స్ టువ చక్రవర్తి, అంకిత మహారాణాలు చక్కగా నటించారు. హైదరాబాద్‌లో టాకీ పార్ట్‌ను, బ్యాంకాక్‌లో సాంగ్స్‌ను చిత్రీకరించాం. నిర్మాతలు మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సపోర్ట్ చేయడంతో సినిమాను అనుకున్న ప్రణాళిక ప్రకారం పూర్తి చేశాం“ అన్నారు.
ఈశ్వర్, టువచక్రవర్తి, అంకిత మహారాణా హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రంలో కౌసల్య, అన్నపూర్ణ, సుధ, సత్యకృష్ణ, విద్యుల్లేఖా రామన్, సురేష్, పోసాని కృష్ణమురళి, కృష్ణభగవాన్, గౌతంరాజు, అనంత్, వేణు, ధనరాజ్, తడివేల్, విట్టా మహేశ్ ఇతర తారాగణంగా నటించారు.
సాంకేతిక నిపుణులు:
కో డైరెక్టర్: రాజశేఖర్ మారి శెట్టి, ప్రొడక్షన్ కంట్రోలర్: సి.భాస్కర్ రాజు, పాటలు: సురేశ్ ఉపాధ్యాయ, కొరియోగ్రఫీ: గణేష్, స్టిల్స్: అన్బు, డిజైన్స్: ఈశ్వర్, ఆర్ట్: వర్మ, మ్యూజిక్: భీమ్స్ సిసిరోలియో, సినిమాటోగ్రఫీ: చిట్టిబాబు.కె
నిర్మాతలు: దొమ్మరాజు హేమలత, దొమ్మరాజు ఉదయ్‌కుమార్,
కథ, మాటలు, ఎడిటింగ్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఆర్.రఘురాజ్.
’4 LETTERS’ MOVIE TEASER LAUNCHED BY LEGENDARY Director SRI. K. RAGHAVENDRA RAO GARU.
The teaser of the movie ’4 LETTERS’, from Om Sri Chakra Creations launched by the legendary Sri. K. Raghavendra Rao garu at 11 a.m. today. He watched the teaser of the movie and was surprised by the wondrous performance of the hero, Eswar. He blessed Eswar believing that he has the potential to be a star in Tollywood. He appreciated the producer, Mr. Udaya Kumar Dommaraju for convening and supporting a luxuriant production. He told the director R. RaghuRaj, that he was intrigued by the eccentric teaser and is eagerly waiting to watch the movie. The audio launch will be performed on the 30th of January along with the release of theatrical trailer of the movie. The movie will hit the big screens on the second week of February.

INTRODUCING – ESWAR
INTRODUCING – TUYA CHAKRABORTHY & ANKETA MAHARANA
KAUSALYA, ANNAPURNA, SUDHA, SATYA KRISHNAN, VIDYU LEKHA RAMAN
SURESH, POSANI KRISHNA MURALI, KRISHNA BHAGAVAN, GOWTHAM RAJU, ANANTH VENU, DHANRAJ, TADIVEL, VITTA MAHES
CO-DIRECTOR RAJASEKHAR MAARISETTY
PRODUCTION CONTROLLER: C. BHASKAR RAJU
LYRICS – SURESH UPADHYAYA
CHOREOGRAPHY – GANESH
STILLS – ANBU
DESIGNS ESHWAR
ART – VARMA
MUSIC- BHEEMS CICEROLEO
DIRECTOR OF PHOTOGRAPHY – CHITTI BABU. K

PRODUCERS – DOMMARAJU HEMALATHA ,DOMMARAJU UDAYA KUMAR
STORY, SCREENPLAY, DIALOGUES, EDITING, DIRECTION – R. RAGHURAJ