న్యాయవాద వృత్తిపట్ల గౌరవాన్ని పెంచే ‘బారిష్టర్ శంకర్ నారాయణ్’

 GSPL5152GSPL5440 GSPL5445 GSPL5145 GSPL5538 GSPL5058 GSPL5240 copy.jpg www GSPL5335 GSPL5408 GSPL5502 GSPL5507ప్రముఖ కధానాయకుడు రాజ్ కుమార్ కధానాయకునిగా నటిస్తున్న చిత్రం ‘బారిష్టర్ శంకర్ నారాయణ్’. అలంగ్రిత నాయికగా, సుప్రసిద్ధ నృత్య దర్శకురాలు ‘తార’ ఈ చిత్రం ద్వారా దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. నందవరం శ్రీ చౌడేశ్వరీ దేవి పిక్చర్స్ పతాకం పై శ్రీమతి రమారాజ్ కుమార్ సమర్పణలో ఈ ‘బారిష్టర్ శంకర్ నారాయణ్’ చిత్రం తెరకెక్కుతోంది. నిర్మాణ కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్న ఈ చిత్రం గురించి…

రాజ్ కుమార్ మాట్లాడుతూ..’ ప్రస్తుతం చిత్రానికి సంభందించి డి.టి.ఎస్. కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నెలాఖరులోగా ఆడియో ను చలనచిత్ర ప్రముఖుల సమక్షంలో విడుదలచేయనున్నాము అన్నారు. ఆయనే మాట్లాడుతూ  లాయర్ గా తాను పోషించిన టైటిల్ రోల్ నటుడిగా తనను ఉన్నత స్థాయికి తీసుకు వెళుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. నటునిగా తనను సరికొత్త కోణంలో చూపించే చిత్రమని అన్నారు. వ్రుత్తి జీవితంలో ‘బారిష్టర్ శంకర్ నారాయణ్’ కు ఎదురైన సంఘటనలు,సమస్యలు వాటి పర్యవసానం ఏమిటి ..? చివరకు ఏమి జరిగినదన్న అంశానికి వినోదాన్ని జోడించి రూపొందించిన చిత్రమిది అన్నారు రాజ్ కుమార్.

ఈ చిత్రం ద్వారా సీనియర్ నృత్య దర్శకురాలు ‘తార’ మాస్టర్ ను దర్శకురాలిగా పరిచయం చేయటం ఎంతో సంతోషం గా ఉందని అన్నారు. ‘బారిష్టర్ శంకర్ నారాయణ్’ పాత్ర తీరు తెన్నులను ‘తార’ మాస్టర్ తెర కెక్కించిన తీరు తెరపై చూడవలసిన దేనని తెలిపారు రాజ్ కుమార్.చిత్రానికి సంభందించిన మీడియా పబ్లిసిటీ సినీ.వ్యాపార వర్గాలలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
 ప్రత్యేక పాత్రలో 20 సూత్రాల పధకం చైర్మన్ ‘ఎన్.తులసిరెడ్డి నటించారు. ఎం.ఎస్.నారాయణ.ఏవీఎస్.అనంత్,కిశోర్ దాస్. హేమ,అపూర్వ ల పాత్రలు ఎంతో వినోదాన్ని పంచుతాయని దర్శకురాలు తెలిపారు.అలాగే ‘సాకేత్’ సంగీతం ఆకట్టు కుంటుంది. కదానుగుణం గా సాగే వెంకట్ మాడ భూషి సంభాషణలు ఆలోచింప చేస్తాయి. ముప్పాళ్ళ మహేష్ ఛాయాగ్రహణ పనితనం ఓ ఎస్సెట్ ఈ చిత్రానికి అని తెలిపారు నిర్మాత.
 అలంగ్రిత, అలియా త్రివేది నాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రలలో లక్ష్మి,హేమ,అపూర్వ,ఎం.ఎస్.నారాయణ, ఏవీఎస్,అనంత్,మహర్షి,కిశోర్ దాస్,శ్రీరాం ,శశాంక్, సింగం మహేష్, టంగుటూరి రామకృష్ణ,రవిదాస్, వీడియోకాన్ రామ చంద్రారెడ్డి, ఆంజన్ బాబులు నటించారు. 
 సాంకేతిక నిపుణులుగా..మాటలు: వెంకట మాడభూషి, సంగీతం; సాకేత్, పాటలు; భువనచంద్ర:,కెమెరా: ముప్పాళ్ళ మహేష్ , ఎడిటింగ్: గౌతంరాజు:  ఆర్ట్ :రామకృష్ణ:   ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎల్.వేణుగోపాల్ 
నిర్మాత: వి.వి.రాజ్ కుమార్ 
సమర్పణ: శ్రీమతి రమా రాజ్ కుమార్
కొరియోగ్రఫీ – దర్శకత్వం: ఎన్.ఏ.తారGSPL5510