Sep 2 2021
*పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ ల కాంబినేషన్లో మైత్రి మూవీ మేకర్స్ సినిమా ప్రచార చిత్రం విడుదల
పవన్ కళ్యాణ్ కథానాయకుడు గా ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్, ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ లు కాంబినేషన్లో గతంలో రూపొందిన ‘గబ్బర్ సింగ్’ ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్టయ్యిందో, ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ ను రిపీట్ చేస్తోంది ఈ సంస్థ.
నేడు పవన్ కళ్యాణ్ గారు పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ చిత్రానికి సంబంధించి ఓ ప్రచార చిత్రాన్ని విడుదల చేసింది చిత్ర బృందం.
ఈ ప్రచార చిత్రాన్ని గమనిస్తే…. ఆధునిక వాహనం పై పవన్ కళ్యాణ్ స్టైలిష్ గా కూర్చుని ఉండటం కనిపిస్తుంది. అయితే పవన్ కల్యాణ్ ను పూర్తిగా చూపించకుండ ఉండటాన్ని ప్రీ లుక్ గా భావించాలని చిత్ర బృందం చేసిన ప్రయత్నం హర్షించదగ్గది. అయినా ప్రచార చిత్రం యువతను కిర్రెక్కిస్తోంది. అభిమాన యువతలో మరో బ్లాక్ బస్టర్ చిత్రం ‘జాతర షురూ’ అన్న ఆనందాలు వెల్లువెత్తుతున్నాయి.
దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి అయాంక బోస్ ఛాయాగ్రహణ దర్శకత్వం వహిస్తున్నారు. కళా దర్శకుడు గా ఆనంద సాయి, ఎడిటర్ గా చోటా కె ప్రసాద్, పోరాటాలు రామ్ లక్ష్మణ్ పేర్లు ప్రధాన సాంకేతిక నిపుణులుగా ఈ ప్రచారచిత్రం లో కనిపిస్తాయి.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ లు నిర్మాతలు