జాదూగాడు’ గా నాగశౌర్య..!

DGA_8962 DGA_9006 DGA_9203 DGA_8964 DGA_9645‘చింతకాయల రవి’ ఫేం దర్శకుడు ‘యోగేష్’ దర్శకత్వం లో, వి.వి.యన్.ప్రసాద్ నిర్మాతగా ‘సత్య ఎంటర్టైన్మెంట్స్’ పతాకం ఫై ఓ చిత్రం రూపొందుతోంది . ‘ఊహలు గుసగుస లాడే, దిక్కులు చూడకు రామయ్య’,లక్ష్మీ రావే మాఇంటికి’ వంటి విజయ వంతమైన చిత్రాల యువ హీరో ‘నాగ శౌర్య’  ఈ చిత్ర కధానాయకుడు కాగా, నాయికగా ‘హర హర మహాదేవ’ సీరియల్ లో పార్వతి గా నటించిన ‘సోనారిక’ ఈ చిత్రం ద్వారా నాయికగా తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు.  ఈ చిత్రానికి ‘జాదూగాడు’ అనే పేరును నిర్ణయించినట్లు చిత్ర దర్శక నిర్మాతలు తెలిపారు.

‘జాదూగాడు’: మాస్ ఎంటర్ టైనర్

చిత్ర దర్శకుడు ‘యోగేష్’ మాట్లాడుతూ..’ కధానాయకుడు నాగశౌర్య ఇప్పటివరకు ప్రేమ కధా చిత్రాల నాయకుడిగా నటించారు. కానీ ఈ చిత్రం లోఅతని పాత్ర గత చిత్రాలకు భిన్నంగా ఉంటుంది.  మాస్ ప్రేక్షకులను సైతం ఆకట్టుకునే విధంగా ఈ చిత్రం లో కధానాయకుడి పాత్రను తీర్చి దిద్దటం జరిగిందని తెలిపారు. వినోదంతో కూడిన మాస్ కధా చిత్రం ఈ ‘జాదూగాడు’ అన్నారు.

ఏప్రిల్ లో ‘జాదూగాడు’ విడుదల:

పూర్తి మాస్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్నఈ ‘జాదూగాడు’ షూటింగ్ కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్నాయి. ఈ నెలలోనే చిత్రం ఆడియో, ఏప్రిల్ ద్వితీయార్ధంలో చిత్రం విడుదల అవుతుందని నిర్మాత వి.వి.ఎన్.ప్రసాద్ తెలిపారు.

ప్రధాన  తారాగణం :

కోట శ్రీనివాసరావు,అజయ్, శ్రీనివాస్ రెడ్డి, పృథ్వి,  సప్తగిరి, తాగుబోతు రమేష్, జాకీర్ హుస్సేన్,   ఆశిష్ విద్యార్ధి, రవి కాలే, ‘ప్రబాస్’ శ్రీను, ‘రాకెట్’ రాఘవ,‘అదుర్స్’ రఘు,  స్వామిరారా సత్య, ఫిష్ వెంకట్ లు నటిస్తున్నారు.

సాంకేతిక వర్గం :

సినిమాటోగ్రాఫర్ : సాయి శ్రీరామ్ ,ఎడిటర్: యం.ఆర్.వర్మ: ఆర్ట్ : సాహి సురేష్ ; ఫైట్స్ : వెంకట్ ; కథ , మాటలు : మధు సూదన్; పాటలు : వరికుప్పల యాదగిరి , శ్రీమణి, నిర్మాత : వి.వి.ఎన్.ప్రసాద్,  స్క్రీన్ ప్లే , దర్శకత్వం : యోగేష్

FIRSTLOOK STILL