విడుదలకు సిద్ధమైన ‘ఉదయ్ శంకర్,ఐశ్వర్య రాజేష్’ ల ‘మిస్ మ్యాచ్’: ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 6 న విడుదల

012 copy JVR_9108 copy KNRL0203a copy KNRL8530 NL__0017 PDP_3657 copy PDP_5755 copy

* విడుదలకు సిద్ధమైన ‘ఉదయ్ శంకర్,ఐశ్వర్య రాజేష్’ ల ‘మిస్ మ్యాచ్’
* ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 6 న విడుదల
* ‘మిస్ మ్యాచ్’ అందరికి నచ్చే సినిమా అవుతుంది – దర్సక,నిర్మాతలు

‘అధిరోహ్ క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి’ సంస్థ తమ తొలి ప్రయత్నంగా నిర్మిస్తున్న చిత్రం  ’మిస్ మ్యాచ్’. ఉదయ్ శంకర్ (ఆట గదరా శివ ఫేమ్) కథానాయకునిగా, ఐశ్వర్య రాజేష్ (కాకా ముత్తై, కన్నా తమిళ చిత్రాల నాయిక, దివంగత ప్రముఖ నటుడు రాజేష్ కుమార్తె) నాయికగా నటిస్తున్నారు. తమిళనాట హీరో విజయ్ ఆంటోని నటించగా ‘సలీం’ వంటి విజయవంతమైన చిత్రాన్ని రూపొందించిన ఎన్ వి. నిర్మల్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆయనకిది తొలి తెలుగు చిత్రం. నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న’మిస్ మ్యాచ్’ విడుదలకు సిద్ధమైంది. ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 6 న ‘మిస్ మ్యాచ్’ ను  విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్మాతలు జి.శ్రీరామ్ రాజు, భరత్ రామ్ లు  మీడియాకు అధికారికంగా ప్రకటించారు.
ఇటీవల ప్రముఖ దర్శకుడు ‘క్రిష్’ చేతుల మీదుగా  విడుదల అయిన ‘మిస్ మ్యాచ్’ తొలి ప్రచార చిత్రాలు, విక్టరీ వెంకటేష్ గారు విడుదల చేసిన చిత్రం టీజర్ కు ప్రేక్షకులనుంచి విశేషమైన స్పందన లభించిందన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ వారికి మరోసారి కృతఙ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా హీరో ఉదయ్ శంకర్ మాట్లాడుతూ…”మిస్ మ్యాచ్ చిత్ర కథను భూపతిరాజ గారు ఇచ్చారు. మంచి కథలు వింటున్న సమయంలో ఈ కథ నాకు రావడం అదృష్టం. దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించిన విధానం సినిమాకు ప్లస్. ట్యాలెంటెడ్ ఆర్టిస్ట్ ఐశ్వర్య రాజేష్ పక్కన నేను నటించడం గ్రేట్ ఎక్స్ పీరియన్స్.  చిత్ర కథ, కథనాలు ప్రేక్షకులను అలరిస్తాయి. డిసెంబర్  ఆరు న చిత్రం విడుదల అవుతోంది. మీ ఆశీస్సులు కావాలి అన్నారు. సహకరిస్తున్న మీడియాకు కృతఙ్ఞతలు అన్నారు.

హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ… ఒకమంచి కథ మిస్ చేసుకోకూడదని ఈ సినిమా చేసాను. భూపతిరాజ గారి కథ చాలా బాగుంది. దర్శకుడు కథను అందంగా తెరమీద చూపించారు. నా పాత్ర ఈ సినిమాలో కొత్తగా ఉంటుంది.  నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా సినిమాను నిర్మించారు. గణేష్ సినిమాటోగ్రఫీ బాగుంది అన్నారు.

రచయిత భూపతి రాజా మాట్లాడుతూ..”ఈ సినిమా రెండు కుటుంభాల మధ్య జరిగే కథ. హీరో హీరోయిన్ లు పోటీ పడి నటించారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతకు, దర్శకుడు ఎన్.వి.నిర్మల్ కు ధన్యవాదాలు. ఈ చిత్రం మిమ్మల్ని ఆలరిస్తుందని నమ్ముతున్నాను” అన్నారు.

దర్శకుడు ఎన్ వి. నిర్మల్ కుమార్ మాట్లాడుతూ…”ఈ చిత్రంలో హీరో హీరోయిన్ ల పాత్రలు కొత్తగా ఉంటాయి. సరికొత్త కధ,కథనాలతో తో దర్శకుడిగా తెలుగులో పరిచయం అవుతున్నందుకు ఆనందంగా ఉంది. చిత్ర నిర్మాణంలో నిర్మాతలు  జి.శ్రీరామ్ రాజు, భరత్ రామ్ నాకు బాగా సహకరించారు. మీ  అందరికి ఈ సినిమా నచ్చుతుందని భావిస్తున్నాను” అన్నారు.

నిర్మాతలు జి.శ్రీరామ్ రాజు, భరత్ రామ్ లు  మాట్లాడుతూ..ఈ చిత్రంలో ఉదయ్ శంకర్, ఐశ్వర్య రాజేష్ చాలా బాగా నటించారు. హీరోయిన్ క్రీడా నేపధ్యం కలిగి ఉన్న పాత్రలో, ఛాలెంజింగ్ రోల్ లో నటించింది. గిఫ్టన్ ఇలియాస్ సంగీతం, నేపధ్య సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణ కానున్నాయి” అన్నారు.ఆడియన్స్ కోరుకుంటున్న అన్ని అంశాలు సినిమాలో ఉంటాయి. సినిమా బాగా వచ్చింది. డైరెక్టర్ ఎన్.వి.నిర్మల్ బాగా తీశారు అని తెలిపారు.

ఈ చిత్రం లోని ఇతర ప్రధాన పాత్రలలో సంజయ్ స్వరూప్, ప్రదీప్ రావత్, రూపాలక్ష్మి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: గిఫ్టన్ ఇలియాస్, కధ: భూపతి రాజా, మాటలు: రాజేంద్రకుమార్, మధు; ఛాయా గ్రహణం: గణేష్ చంద్ర; పాటలు: సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సుద్దాల అశోక్ తేజ; కళా దర్శకుడు: మణి వాసగం
దర్శకుడు. ఎన్.వి.నిర్మల్ కుమార్ .
నిర్మాతలు జి.శ్రీరామ్ రాజు, భరత్ రామ్

Miss Match Fine Miss Match
World wide release of the Uday Shankar- Aishwarya Rajesh  starrer MISMATCH on Dec 6th , Makers are confident that the film will be a crowd pleaser ‘.
This film is the first under the Adhiroh Creative Signs banner .
The hero of the film is G Uday Shankar ( Aatagadhara Shiva ) and the heroine is Aishwarya Rajesh ( Nawab , Kanaa , Vada Chennai ) who is the daughter of yesteryear actor Rajesh .
The director is N V Nirmal Kumar who created ripples with his much acclaimed debut Doctor Salim .
The producers of the film G Sriram Raju and K Bharat Ram officially have announced that the film is ready for release on Dec 6th .
The team of MISMATCH thank noted director Krish for unveiling the first look of the film and actor Victory Venkatesh for launching the teaser .
The hero of the film G Uday Shankar thanked the producers for giving him an opportunity to act in the film . He further appreciated the novel story given by veteran writer Bhupathy Raja . He explained that the vision brought in by the director would greatly enhance the quality of the film. Uday Shankar said that it was a fun experience working with the talented actress Aishwarya Rajesh .
He further expressed sincere thanks to the media for their support and sought the blessings of the audience for the film which is releasing on Dec 6th .
The Heroine Aishwarya Rajesh said that she accepted the film because it was a must do subject . The director has a great job . She felt that her role in the film would be appreciated for its uniqueness.
The writer Bhupathy Raja expressed thanks to the producers and the director for accepting and presenting his story.
The director NV Nirmal Kumar said that the roles conveyed by the hero and heroine in the film were very fresh . He expressed thanks to the producers for launching him in the Telugu Industry and said that he hoped to please the Telugu audience with his maiden effort.
Other co actors sanjay swaroop,Pradeep rawath ,roopalaxmi,sharanya
Music Director: Gifton Elias, Director of Photography: Ganesh Chandrra Story: Bhupathy Raja Dialogue writer: Rajendra Kumar, Madhu
Lyrics: Sirivennela Sitarama Sastry, Suddhala Ashok teja,Oruganti Dharma teja,Shreshta,  Art Director: Mani Vasagam Director: NV NirmalKumar Producers: G. Sriram Raju,K. Bharath Ram