వినోదభరిత కుటుంబకధా చిత్రం ‘బారిష్టర్ శంకర్ నారాయణ్’

IMG_4909

రాజ్ కుమార్ కధానాయకునిగా నటిస్తున్న చిత్రం. సుప్రసిద్ధ నృత్య దర్శకురాలు ‘తార’ ఈ చిత్రం ద్వారా దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. నందవరం శ్రీ చౌడేశ్వరీ దేవి పిక్చర్స్ పతాకం పై శ్రీమతి రమారాజ్ కుమార్ సమర్పణలో సకుటుంబ సపరి వార సమేతంగా చూడ తగ్గ చిత్రం గా ఈ ‘బారిష్టర్ శంకర్ నారాయణ్’ చిత్రం తెరకెక్కుతోంది. నిర్మాణ కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్న ఈ చిత్రం గురించి…
రాజ్ కుమార్ మాట్లాడుతూ..’ తాను లాయర్ గా రెండు భిన్నమైన పాత్రలను పోషించిన ఈ చిత్రం సకుటుంబ సపరి వార సమేతంగా చూడతగ్గ చిత్రమని అన్నారు. వ్రుత్తి జీవితంలో ‘బారిష్టర్ శంకర్ నారాయణ్’ కు ఎదురైన సంఘటనలు,సమస్యలు వాటి పర్యవసానం ఏమిటి ..? చివరకు ఏమి జరిగినదన్న అంశానికి వినోదాన్ని జోడించి రూపొందించిన చిత్రమిది అన్నారు రాజ్ కుమార్.
ఓ మంచి కధా చిత్రం ద్వారా దర్శకురాలిగా పరిచయం కావటం ఎంతో సంతృప్తి గా ఉన్నదని దర్శకురాలు ‘తార’ అన్నారు.చిత్రంలో నాయకా.నాయికల పాత్రలు అభినయానికి ఎంతో అవకాశం ఉన్నవని అనారు. పాత్రల మధ్య భావోద్వేగాలు సన్నివేశాలను రక్తి కట్టించాయని తెలిపారు. ‘నృత్య దర్శకురాలిగా తనకున్న పేరును ఈ చిత్రం దర్శకురాలిగా మరింత ఉన్నత స్థాయికి తీసుకు వెళుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసారు ‘తార’.
అలంగ్రిత, అలియా త్రివేది నాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రలలో లక్ష్మి,హేమ,అపూర్వ,ఎం.ఎస్.నారాయణ, ఏవీఎస్,అనంత్,మహర్షి,కిశోర్ దాస్,శ్రీరాం ,శశాంక్, సింగం మహేష్, టంగుటూరి రామకృష్ణ,రవిదాస్, వీడియోకాన్ రామ చంద్రారెడ్డి, ఆంజన్ బాబు, ప్రత్యేక పాత్రలో 20 సూత్రాల పధకం చైర్మన్ ‘ఎన్.తులసి రెడ్డి’ నటించారు. 
సాంకేతిక నిపుణులుగా..మాటలు: వెంకట మాడభూషి, సంగీతం; సాకేత్, పాటలు; భువనచంద్ర:,కెమెరా: ఎస్.వి.శివారెడ్డి, ఎడిటింగ్:గౌతంరాజు:ఆర్ట్ రామకృష్ణ

నిర్మాత: వి.వి.రాజ్ కుమార్
సమర్పణ: శ్రీమతి రమా రాజ్ కుమార్
కొరియోగ్రఫీ – దర్శకత్వం: ఎన్.ఏ.తార