• శ్రీశ్రీ మహాప్రస్థానం ప్రత్యేక స్మరిణికపై జనసేనాని – త్రివిక్రమ్ ముచ్చట

 శ్రీశ్రీ సమున్నత శిఖరం

మనమంతా గులకరాళ్ళు

• శ్రీశ్రీ మహాప్రస్థానం ప్రత్యేక స్మరిణికపై జనసేనాని – త్రివిక్రమ్ ముచ్చట

శ్రీ పవన్ కల్యాణ్ గారు… శ్రీ త్రివిక్రమ్ గారు కలసినప్పుడల్లా ఏం మాట్లాడుకుంటారు?  ఏం ముచ్చట్లు చెప్పుకుంటారు? ఏ సంగతులు వారి మాటల ప్రవాహంలో దొర్లుతుంటాయి?
గడియారంలో ముళ్లు సెకన్లు, నిమిషాలు, గంటలు దాటిపోతున్నా వారి చర్చలకు తెరపడదు. జనసేనాని,  త్రివిక్రమ్ ల మధ్య సంభాషణా స్రవంతి గోదారి ప్రవాహంలా సాగుతుంది. వారిద్దరూ లోతుగా చర్చించేది సినిమాల గురించా… రాజకీయాల గురించా?
శ్రీ పవన్ కల్యాణ్ గారు, శ్రీ త్రివిక్రమ్  గారి గురించి బాగా తెలిసినవారు – ఆ ఇద్దరూ మాట్లాడుకొంటుంటే అనే మాటలోని అంతరార్థం ఎప్పటికైనా ఒకటే ‘ఆ ఇద్దరూ సాహితీ చర్చల్లో ఉన్నారు’ అని. వారితోనే ఆ మాట అంటే ఈ సాహితీ మిత్రులు కూడా సరదాగా అంటూ ఉంటారు – ‘ఔను… మేం సాహితీ చర్చల మధ్య సినిమాలు చేస్తుంటాం’ అని.
శ్రీశ్రీ సాహిత్యం నుంచి శేషేంద్ర ఆధునిక మహాభారతం వరకూ… చిన్నయసూరి వ్యాకరణం నుంచి తెలుగు శతకాల వరకూ… జాషువా కవిత్వం నుంచి చలం రచనల వరకూ, కొడవటిగంటి కథల నుంచి మధుబాబు డిటెక్టివ్ నవలల వరకూ తెలుగు సాహిత్యం గురించి కబుర్లు సురగంగా ప్రవాహంలా సాగిపోతుంటాయి.
సాహితీ మిత్రులు శ్రీ పవన్ కల్యాణ్ గారు, శ్రీ త్రివిక్రం గారు శుక్రవారం సాయంత్రం ‘భీమ్లా నాయక్’ సెట్లో మహాకవి శ్రీశ్రీ రచనా వైశిష్ట్యం గురించి… పదాల పరుగులతో పోహళింపుతో చదువరులను చైతన్యపరచడం గురించి, యువతరం రక్తాన్ని వేడెక్కించడం గురించి మాట్లాడుకున్నారు. శ్రీశ్రీ చేతిరాతతో ఉన్న మహా ప్రస్థానం ప్రత్యేక స్మరణికను శ్రీ పవన్ కల్యాణ్ గారు శ్రీ త్రివిక్రమ్ గారికి జ్ఞాపికగా అందచేశారు. ఆ పుస్తక ముద్రణ, అందులోని అరుదైన చిత్రాల గురించి వీరు చర్చించుకున్నారు. ‘శ్రీశ్రీ కవిత్వం గురించి రెండు మాటలు చెప్పండి… మీరు చెబితే వచ్చే అందం వేరు’ అని శ్రీ త్రివిక్రమ్ గారిని శ్రీ పవన్ కల్యాణ్ గారు కోరారు.
ఇందుకు శ్రీ త్రివిక్రమ్ గారు స్పందిస్తూ “కవి తాలూకు ప్రయాణం అంటే ఒక జాతి తాలూకు ప్రయాణం. ఆయన వేసిన ఒక అడుగు.. రాసిన ఒక పుస్తకం.. ఒక శతాబ్దం మొత్తం మాట్లాడుకుంటుంది.. చాలా శతాబ్దాలపాటు మాట్లాడుకొంటూనే ఉంటుంది.
ఆయన తాలూకు జ్ఞాపకం మన జాతి పాడుకునే గీతం. శ్రీశ్రీ తెలుగువాళ్లు గర్వించదగ్గ కవి.. ఈ శతాబ్దం నాది అని గర్వంగా చాటినవాడు.. కవికుండాల్సిన ధిషణాహంకారం ఉన్నవాడు.. తెలంగాణ విమోచన దినోత్సవం రోజు ఆయన పుస్తకం చూడడం నిజంగా గొప్ప విషయం. ఆయన ఆత్మ ఎక్కడున్నా స్వతంత్రం అనే సరికి అక్కడికి వచ్చి ఆగుతుంది” అన్నారు.
ఇందుకు శ్రీ పవన్ కల్యాణ్ గారు మాట్లాడుతూ ‘ఒక కవి గురించి మరో కవి చెబితే వచ్చే సొబగు ఇది’ అన్నారు. వెంటనే శ్రీ త్రివిక్రమ్ గారు స్పందించి ‘శ్రీశ్రీ అంటే ఒక సమున్నత శిఖరం. మనందరం ఆ శిఖరం దగ్గరి గులక రాళ్లు’ అన్నారు.
ఇలా సాగింది… జనసేనాని – త్రివిక్రమ్ ల మధ్య చిన్నపాటి సాహితీ చర్చ.

*Sri Sri is a towering peak
We are all just pebbles
*Janasena President and Sri Trivikram reminisce on the special memoir of Sri Sri’s Maha Prasthanam

What do Sri Pawan Kalyan and Sri Trivikram talk about when they meet? What do they reminisce about? What are the topics that unfurl during their talks? Their talk does not end even as seconds, minutes and hours roll down the clock. The conversation between Janasena President and Sri Trivikram flow like the water in River Godavari. Do they talk about films or politics?
Those who know Sri Pawan Kalyan and Sri Trivikram are aware that it is only literary discussion in their conversation. When anybody broaches the topic of their discussion, they say, “Yes we create movies in the middle of literary discussion.”
From Sri Sri’s lirerary works to Seshandra Sarma’s modern Mahabharat, from the grammar of Chinnayya Suri to Telugu Satakas, Jashua’s poetry to Chalam’s works, Kodavatiganti’s stories to Madhubabu’s detective novels, their discussion flows live the eternal Ganga.
Literary friends Sri Pawan Kalyan and Sri Trivikram met on the sets of ‘Bhima Nayak” and discussed about Maha Kavi Sri Sri’s literary prowess and his knack of creating awareness among the readers through his literary genius and thereby enkindling the blood of the youth. Sri Pawan Kalyan gifted the memoir of Sri Sri’s Mahaprasthanam written in the poet’s own hand-writing, to Sri Trivikram.  They discussed about the book’s publication and the valuable sketches in the book. Sri Trivikram asked Sri Pawan Kalyan, “Please speak about the literary prowess of Sri Sri. The beauty of your narration is in itself a boon to listen.”
Continuing the conversation, Sri Trivikram said, “The poet’s travel is like the transition of a race. The step that the poet takes, the book that he writes is spoken about for a century. It remains the topic of discussion for centuries. The poet’s memories are the nation’s song. Sri Sri is Telugu people’s pride. He proudly said that the century belongs to him. It’s a moment of pride to receive the book on the occasion of Telangana Vimochana Dinothsavam. Wherever the poet’s soul is, it stops at the word independence,” he said.
Replying to the comments, Sri Pawan Kalyan said, “This is the beauty derived at when a poet speaks about another poet.”
Reacting to it, Sri Trivikram said, “Sri Sri is a pivotal peak. We all are just pebbles near the mountain.”
Thus ensued the literary treat between Janasena President and Sri Trivikram.

photos (2) photos (4) photos (5) photos (6) photos (1) photos (3)