పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విడుదల చేసిన నితిన్ ‘ఛల్ మోహన్ రంగ’ టీజర్

Still 1 Still 2ఛల్ మోహన్ రంగ

‘నితిన్, మేఘా ఆకాష్’ జంటగా శ్రేష్ట్ మూవీస్, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ నిర్మిస్తున్న చిత్రం.
కథానాయకుడు  నితిన్ కు 25 వ చిత్రం.
మాటల మాంత్రికుడు ,దర్శకుడు త్రివిక్రమ్ ఈ చిత్రానికి కథను అందిస్తున్నారు.
చిత్రం టీజర్ ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ @pkcreativeworks ఖాతా ద్వారా  ఈ రోజు ఉదయం 9 గంటలకు విడుదల చేసి చిత్రం యూనిట్ కు అభినందనలు తెలిపారు.’ఛల్ మోహన్ రంగ’ టీజర్ కు లభిస్తున్న స్పందన ఎంతో సంతోషంగా ఉందని హీరో నితిన్ తన స్పందనను సోషల్ మీడియా వేదికగా కృతఙ్ఞతలు తెలుపుతున్నారు. 
శ్రీమతి నిఖితారెడ్డి సమర్పణ లో ప్రముఖ నిర్మాత ఎన్. సుధాకర్ రెడ్డి ఈ చిత్రాన్ని కృష్ణ చైతన్య దర్శకత్వం లో నిర్మిస్తున్నారు.హైదరాబాద్, ఊటీ, అమెరికాలలో ఇప్పటివరకు షూటింగ్ జరుపుకుందీ ఈ చిత్రం.
‘ఛల్ మోహన్ రంగ’ చిత్రానికి సంబంధించి ఆఖరి పాట చిత్రీకరణ ఈ రోజు హైదరాబాద్ లో ప్రారంభమయింది.    ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సుధ్హాకర్ రెడ్డి మాట్లాడుతూ.. హీరో నితిన్ పై ఈ పాట చిత్రీకరణ జరుగుతోంది.శేఖర్ ఈ పాటకు నృత్య దర్శకత్వం వహిస్తున్నారు. మరోవైపు  ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఏప్రిల్ 5 న చిత్రం విడుదల కానుందని తెలిపారు. 
చిత్ర దర్శకుడు కృష్ణ చైతన్య మాట్లాడుతూ..’ ప్రేమతో కూడిన కుటుంబ కధా చిత్రం ఇది. చాలా సరదాగా సాగుతుంది అని తెలిపారు. 
 
చిత్రం లోని ఇతర ప్రధాన తారాగణం: డా.కె.వి.నరేష్, లిజి,రోహిణి హట్టంగడి, రావురమేష్,సంజయ్ స్వరూప్, ప్రభాస్ శ్రీను, నర్రాశ్రీను, మధునందన్, ప్రగతి, సత్య, పమ్మి సాయి, రాజశ్రీ నాయర్, ఆశు రెడ్డి, వెన్నెల రామారావు, కిరీటి, రణధీర్, నీలిమ భవాని, బేబి హాసిని, బేబి కృత్తిక, మాస్టర్ జోయ్, మాస్టర్ లిఖిత్, మాస్టర్ స్నేహిత్, మాస్టర్ స్కందన్.
సంగీతం: థమన్.ఎస్.ఎస్.,కెమెరా: ఎం.నటరాజ సుబ్రమణియన్, , కూర్పు: ఎస్.ఆర్.శేఖర్, నృత్యాలు:శేఖర్.వి.జె, పోరాటాలు: స్టంట్ సిల్వ, రవివర్మ; 
సమర్పణ: శ్రీమతి నిఖిత రెడ్డి
నిర్మాత: ఎన్.సుధాకర్ రెడ్డి
స్క్రీన్ ప్లే,మాటలు,దర్శకత్వం: కృష్ణ చైతన్య 
 

నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణకు టి.సుబ్బరామిరెడ్డి లలిత కళాపరిషత్‌ ఆధ్వర్యంలో విశ్వవిఖ్యాత నటసామ్రాట్‌ బిరుదు ప్రదానం

నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణకు టి.సుబ్బరామిరెడ్డి లలిత కళాపరిషత్‌ ఆధ్వర్యంలో విశ్వవిఖ్యాత నటసామ్రాట్‌ బిరుదు ప్రదానం చేశారు. విశాఖలో జరిగిన మహాశివరాత్రి మహోత్సవంలో భాగంగా ఈ కార్యక్రమం సాగింది. మంగళవారం రాత్రి ఆర్కేబీచ్‌ తీరంలో జరిగిన కార్యక్రమంలో టి.సుబ్బరామిరెడ్డి లలిత కళాపరిషత్‌ వ్యవస్థాపకుడు సుబ్బరామిరెడ్డి, మంత్రి గంటా శ్రీనివాసరావు, ప్రముఖ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, రాజమహేంద్రవరం ఎంపీ మురళీమోహన్‌, సినీ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావుల చేతుల మీదుగా కైకాల సత్యనారాయణకు బిరుదుతో పాటు బంగారు కంకణాన్ని ప్రదానం చేశారు. సినీ రంగంలో కైకాల చేసిన కృషికి ఈ అవార్డును బహుకరిస్తున్నట్లు టి.సుబ్బరామిరెడ్డి తెలిపారు. సుమారు 780 చిత్రాల్లో నటించిన కైకాలను సత్కరించుకోవటం ఆనందంగా ఉందని బాలకృష్ణ అన్నారు. సినీ, కళా, సామాజిక రంగాల్లో కృషిచేసిన పలువురికి టి.సుబ్బరామిరెడ్డి లలిత కళాపరిషత్‌ ఆధ్వర్యంలో శివశక్తి అవార్డులను సైతం బాలకృష్ణ అందజేశారు. కార్యక్రమంలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, కళాకారులు పాల్గొన్నారు.– 

20180214_105508 20180214_105709 20180214_110124 20180214_110312 20180214_110613 BVN_3540 BVN_3543 BVN_3561 BVN_3589 BVN_3592 BVN_3600 BVN_3607 YRK_2472 YRK_2518_1 YRK_2525 YRK_2574 YRK_2575

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విడుదల చేసిన ‘నితిన్, మేఘా ఆకాష్’ జంటగా శ్రేష్ట్ మూవీస్, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ చిత్రం ఫస్ట్ లుక్ ‘చల్ మోహన్ రంగ’


FIRSTLOOK-1 FIRSTLOOK-2 Still-1 Still-2 unnamed 
 
‘నితిన్, మేఘా ఆకాష్’ జంటగా శ్రేష్ట్ మూవీస్, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం. మాటల మాంత్రికుడు ,దర్శకుడు త్రివిక్రమ్ ఈ చిత్రానికి కథను అందిస్తుండగా,శ్రీమతి నిఖితారెడ్డి సమర్పణ లో ప్రముఖ నిర్మాత ఎన్. సుధాకర్ రెడ్డి ఈ చిత్రాన్ని కృష్ణ చైతన్య దర్శకత్వం లో నిర్మిస్తున్నారు. ఇది నితిన్ కు 25 వ చిత్రం కావటం విశేషం. 
ఈ చిత్రం ఫస్ట్ లుక్  ‘చల్ మోహన్ రంగ’ ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ లో ఈరోజు ఉదయం తొమ్మిది గంటల ముప్ఫయి నిమిషాలకు విడుదల చేసి చిత్ర యూనిట్ కు అభినందనలు తెలిపారు. నా అభిమాన కథానాయకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈ చిత్రం ప్రచార చిత్రాలను ట్విట్టర్ ద్వారా విడుదల చేయటం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా కృతఙ్ఞతలు తెలిపారు హీరో నితిన్.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సుధ్హాకర్ రెడ్డి మాట్లాడుతూ.. చిత్రం తొలి ప్రచార చిత్రాలను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు విడుదల చేయటం ఏంటో సంతోషంగాఉంది. ఆయనకు మా తరపున చిత్రం యూనిట్  తరపున ప్రత్యేక కృతఙ్ఞతలు అన్నారు. చిత్రం టీజర్ ను ప్రేమికులరోజు అయిన ఈ నెల 14న, చిత్రం ను ఏప్రిల్ 5 న విడుదల చేయనున్నట్లు తెలిపారు. మిగిలిన ఒక్క గీతాన్ని ఈ నెల  
  14 నుంచి హైదరాబాద్ లో చిత్రీకరించనున్నామని తెలిపారు.  హైదరాబాద్, ఊటీ, అమెరికాలలో ఇప్పటివరకు షూటింగ్ జరుపుకుందీ ఈ చిత్రం. చిత్ర దర్శకుడు కృష్ణ చైతన్య మాట్లాడుతూ..’ ప్రేమతో కూడిన కుటుంబ కధా చిత్రం ఇది. చాలా సరదాగా సాగుతుంది అని తెలిపారు. నా ఈ చిత్రం తొలి ప్రచార చిత్రాలను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు విడుదల చేయటం ఆనందంగా ఉందని, కృతఙ్ఞతలు తెలిపారు. 
ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. 
చిత్రం లోని ఇతర ప్రధాన తారాగణం: డా.కె.వి.నరేష్, లిజి,రోహిణి హట్టంగడి, రావురమేష్,సంజయ్ స్వరూప్, ప్రభాస్ శ్రీను, నర్రాశ్రీను, మధునందన్, ప్రగతి, సత్య, పమ్మి సాయి, రాజశ్రీ నాయర్, ఆశు రెడ్డి, వెన్నెల రామారావు, కిరీటి, రణధీర్, నీలిమ భవాని, బేబి హాసిని, బేబి కృత్తిక, మాస్టర్ జోయ్, మాస్టర్ లిఖిత్, మాస్టర్ స్నేహిత్, మాస్టర్ స్కందన్.
సంగీతం: థమన్.ఎస్.ఎస్.,కెమెరా: ఎం.నటరాజ సుబ్రమణియన్, , కూర్పు: ఎస్.ఆర్.శేఖర్, నృత్యాలు:శేఖర్.వి.జె, పోరాటాలు: స్టంట్ సిల్వ, రవివర్మ; 
సమర్పణ: శ్రీమతి నిఖిత రెడ్డి
నిర్మాత: ఎం.సుధాకర్ రెడ్డి
స్క్రీన్ ప్లే,మాటలు,దర్శకత్వం: కృష్ణ చైతన్య 

 

Dr.T.Subbaraamireddy pressmeet

DSC_5421 DSC_5476 new doc 2018-02-10 12.40.40_1 new doc 2018-02-10 12.41.18_1