*Pawan Kalyan’s birthday leaves a powerful mark on movie lovers and fans with the power glance of historical drama Hari Hara Veera Mallu!*

మీసం తిప్పి బరిలోకి దిగిన ‘వీరమల్లు’
 
పవన్ కళ్యాణ్ హీరోగా, సృజనాత్మక దర్శకుడు క్రిష్ జాగ‌ర్ల‌మూడి
రూపొందిస్తోన్నచిత్రం  ’హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు.‘నిధి అగర్వాల్‘ నాయిక. మెగా సూర్యా ప్రొడ‌క్షన్ బ్యాన‌ర్‌పై లెజండ‌రీ ప్రొడ్యూస‌ర్ ఎ.ఎం. ర‌త్నం సమర్పణలో నిర్మాత దయాకర్ రావు ఈ ఎపిక్‌ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈరోజు(సెప్టెంబర్ 2) పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కానుకగా ‘పవర్ గ్లాన్స్’ పేరుతో ఓ పవర్ ఫుల్ వీడియో ను విడుదల చేశారు మేకర్స్.

 తాజాగా విడుదలైన ‘పవర్ గ్లాన్స్’ ఈ చిత్రంపై అంచనాలను ఎన్నో రేట్లు పెంచేలా ఉంది. 17వ శ‌తాబ్దం నాటి మొఘ‌లాయిలు, కుతుబ్ షాహీల శ‌కం నేప‌థ్యంలో జ‌రిగే క‌థ‌తో, అత్య‌ద్భుత‌మైన విజువ‌ల్ ఫీస్ట్‌గా ఈ”హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు” సినిమా రూపొంద నుండటంతో చిత్రం పై అంచనాలూ అధికంగానే ఉన్నాయి. ఈ ప్రచార చిత్రంలో వీర‌మ‌ల్లుగా పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రజెన్స్ అత్యున్నత స్థాయిలో ఉంది. మీసం తిప్పి, కదన రంగంలో అడుగుపెట్టి, మల్ల యోధులను మట్టి కరిపిస్తూ శక్తివంతమైన యోధుడు గా దర్శనమిచ్చారు పవర్ స్టార్. ఇక ఆయన తొడగొట్టే షాట్ అయితే అభిమానులకు పూనకాలు తెప్పించేలా ఉంది. ఎం.ఎం.కీరవాణి అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ఎప్పటిలాగే ప్రశంసనీయం. ‘పవర్ గ్లాన్స్’ని బట్టి చూస్తే అద్భుతమైన క‌థ‌, అత్య‌ద్భుత‌మైన విజువ‌ల్స్ తో రూపొందుతోన్న ఈ చిత్రంలో ఎన్నో ఫ్యాన్‌బాయ్ మూమెంట్స్‌ ఉండనున్నాయని అర్థమవుతోంది. అభిమానులు తమ ఆరాధ్య నటుడు పుట్టినరోజును జరుపుకుంటున్న సమయంలో విడుదలైన ఈ పవర్ గ్లాన్స్ వారి ఆనందాన్ని రెట్టింపు చేసేలా ఉంది. యాక్షన్, గ్రాండియర్, హీరోయిజం, కంటెంట్ మరియు క్లాస్ ఇలా అన్నింటితో కలిసి ఓ పవర్-ప్యాక్డ్ ఫిల్మ్ లా వస్తున్న ఈ చిత్రం సిల్వర్ స్క్రీన్ పై ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూద్దాం.

 

*Pawan Kalyan’s birthday leaves a powerful mark on movie lovers and fans with the power glance of historical drama Hari Hara Veera Mallu!*

Hari Hari Veera Mallu has been the talk of the town with Pawan Kalyan donning a never-seen-before role in a period drama. Niddhi Agerwal plays the female lead in this magnum opus directed by Krish Jagarlamudi. The film is presented by A M Rathnam under Mega Surya Production and produced by A. Dayakar Rao. Today, on the birthday of Pawan Kalyan, the makers released the power glance of the movie.

The power glance of film, set in the 17th century Mughal era, captures the visual glory of the place and the fort with an aerial view and slowly reveals Pawan Kalyan stepping into a sporting arena. As the wrestlers approach him, he knocks off one after the other in style and showcases his grit. After the title reveal, Pawan Kalyan charms with his gait as the musicians sing in the backdrop. M M Keeravani pulls off a stunner with a thumping background score.

Hari Hari Veera Mallu looks like a well packaged film with right dose of entertainment and fanboy moments. This power glance will bring a lot of joy for the fans as they celebrate their star’s birthday. The film is a royal treat and checks all the buttons of action, grandeur, heroism, content, and class. As of today, let’s rejoice the power-packed offering from the makers and wait for the story of the legendary outlaw unfold on the screen soon.

HHVM_THUMB_STILL

 

సూపర్ స్టార్ కృష్ణ చేతుల మీదుగా విడుదలైన అలనాటి అందాల నటుడు హరనాథ్ జీవిత చరిత్ర ‘అందాల నటుడు’

సూపర్ స్టార్ కృష్ణ చేతుల మీదుగా విడుదలైన అలనాటి అందాల నటుడు హరనాథ్ జీవిత చరిత్ర ‘అందాల నటుడు’

బ్లాక్ అండ్ వైట్ సినిమా కాలంలో అప్పటి అమ్మాయిల కలల రాకుమారుడిగా పేరు తెచ్చుకున్న తెలుగు హీరో బుద్ధరాజు హరనాథ్ రాజు 1936లో సెప్టెంబర్ 2న తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలంలోని రాపర్తి గ్రామంలో జన్మించారు. చెన్నైలో పాఠశాల విద్యను అభ్యసించిన ఆయన కాకినాడలోని పి.ఆర్ కళాశాలలో B.A డిగ్రీని పూర్తి చేశారు. ఆయన తన కెరీర్ లో తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, బెంగాలీ భాషల్లో కలిపి 167 సినిమాల్లో నటించారు. హరనాథ్ 1989, నవంబర్ 1 న మరణించారు.

హరనాథ్ జీవిత చరిత్రను ‘అందాల నటుడు’ పేరుతో ఆయన వీరాభిమాని, ఆరాధకుడు డాక్టర్ కంపల్లి రవిచంద్రన్ రచించారు. అరుదైన ఫోటోలు, ఎవరికీ అంతగా తెలియని ఆసక్తికరమైన విషయాలతో ఈ పుస్తకాన్ని అందంగా తీర్చిదిద్దారు. డాక్టర్ కంపల్లి రవిచంద్రన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరియు ఇతర సంస్థల నుండి అనేక అవార్డులు అందుకున్నారు.

దివంగత హీరో హరనాథ్ జీవిత చరిత్ర ‘అందాల నటుడు’ని ఆయన పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న ఉదయం 10 గంటలకు హరనాథ్ కుమార్తె జి.పద్మజ, అల్లుడు జివిజి రాజు(చిత్ర నిర్మాత-’తొలి ప్రేమ’ , ‘గోదావరి’ ) మరియు మనవలు శ్రీనాథ్ రాజు మరియు శ్రీరామ్ రాజు సమక్షంలో నటశేఖర సూపర్ స్టార్ కృష్ణ ఆయన నివాసంలో విడుదల చేశారు.

హరనాథ్ కుమారుడు బి. శ్రీనివాస్ రాజు(చిత్ర నిర్మాత- ‘గోకులంలో సీత’ , ‘రాఘవేంద్ర’), కోడలు మాధురి, మనవరాళ్లు శ్రీలేఖ, శ్రీహరి చెన్నైలో నివాసం ఉంటున్నారు.

పుస్తక విడుదల సందర్భంగా సూపర్‌స్టార్ కృష్ణ గారు జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. తాను, హరనాథ్ కలిసి పలు సినిమాల్లో నటించామని అన్నారు. అతను నిజమైన అందాల నటుడని, అలాగే మంచి మనసున్న వ్యక్తి అని కొనియాడారు. అంతేకాకుండా తాను హీరోగా హరినాథ్ ‘మా ఇంటి దేవత’ అనే చిత్రాన్ని కూడా నిర్మించారని గుర్తుచేసుకున్నారు.

స్వర్గీయ నటరత్న ఎన్.టి.రామారావు దర్శకత్వం వహించిన ‘సీతారామ కళ్యాణం’ చిత్రంలోని ‘శ్రీ సీతారాముల కళ్యాణము చూడము రారండి’ పాటలో శ్రీరామునిగా ఆయన రూపం తెలుగు ప్రేక్షకుల జ్ఞాపకాలలో చిరస్థాయిగా నిలిచిపోతుంది.

Buddharaju Haranath Raju erstwhile Telugu hero of the Black & White era and the heart throb and darling boy of many women folk of his time, was born on 2nd September, 1936 in Raparthi, Pithapuram, E. Godavari Dist. Andhra Pradesh.
Did his schooling in Chennai, and completed his B. A. Degree in P. R. College, Kakinada.
In his career span, acted in 167 movies across five languages notably Telugu, Tamil, Kannada and one each in Hindi and Bengali.
He passed away in the year 1989 on the 1st November.
An ardent fan and admirer Dr. Kampally Ravichandran has penned his biography, titled ‘Andaala Natudu’ compiling some rare photographs and lesser known interesting facts.
Dr. Kampally Ravichandran is the recipient of many Nandi awards and other official decorations from Andhra Pradesh State and other organisations.

‘Andaala Natudu’ biography of Hero Late Harinath was released on the occasion of his birthday September 2nd, at 10 am by his contemporary Natasekhar Superstar Krishna at his residence in the presence of
Harnath’s daughter G. Padmaja, son in law GVG Raju (Film Producer-’ Tholi Prema’ , ‘Godavari’ ) and grandsons Srinath Raju and Sriram Raju.

His son B. Srinivas Raju, (Film Producer- ‘Gokulamlo Seetha’ , ‘Raghavendra’) daughter in law Madhuri,
grandchildren Srilekha and Srihari reside in Chennai.

Releasing the book Superstar Krishna garu recollected fond and cheerful memories and mentioned that they had acted together in several movies and that he was a real (Andhaala Natudu) handsome hero and also a kind hearted human being.
Krishna garu also told that Harinath also produced a movie ‘Maa Inti Devatha’ with Krishna as hero.

His portrayal as Lord Rama in the song ‘Sri Sitaramula kalyanamu chudamu rarandi’ from the film ‘Sitarama Kalyanam’ Directed by Late Nataratna N. T. Rama Rao shall remain etched forever in the memories of Telugu audience.

 

YPS02307 YPS02325 YPS02337 YPS02331

Hari Hara Veera Mallu News

 స్వాగతిస్తుంది సమరపథం..

దూసుకొస్తుంది వీరమల్లు విజయరథం.

 

*పవన్ కళ్యాణ్ పుట్టినరోజు (సెప్టెంబర్2) సందర్భంగా నేడు ప్రచారచిత్రం విడుదల

*‘రేపు సెప్టెంబర్ 2, సాయంత్రం గం: 5.45 నిమిషాలకు పవర్ గ్లాన్స్ పేరుతో ‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు‘ ప్రచార చిత్రం విడుదల

పవన్ కళ్యాణ్ హీరోగా, సృజనాత్మక దర్శకుడు క్రిష్ జాగ‌ర్ల‌మూడి రూపొందిస్తోన్న మహత్తర చిత్ర రాజం‌ ’హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’.‘నిధి అగర్వాల్‘ నాయిక. మెగా సూర్యా ప్రొడ‌క్షన్ బ్యాన‌ర్‌పై లెజండ‌రీ ప్రొడ్యూస‌ర్ ఎ.ఎం. ర‌త్నం సమర్పణలో నిర్మాత దయాకర్ రావు ఈ ఎపిక్‌ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రేపు చిత్ర కథానాయకుడు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు (సెప్టెంబర్ 2) సందర్భంగా ప్రచార చిత్రంను నేడు విడుదల చేశారు చిత్ర బృందం.

ఈ ప్రచార చిత్రంలో…

స్వాగతిస్తుంది సమరపథం..

దూసుకొస్తుంది వీరమల్లు విజయరథం…

అన్నట్లుగా కనిపిస్తారు కథానాయకుడు “హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు“. అంతేకాదు రేపు సెప్టెంబర్ 2, సాయంత్రం గం: 5.45 నిమిషాలకు పవర్ గ్లాన్స్ పేరుతో ఓ పవర్ ఫుల్ వీడియో ను విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించటం తో అభిమానుల ఆనంద సంబరాలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. వారి ఆనందాన్ని మరింత ఉచ్ఛ స్థితికి వెళ్లేలా ఆ వీడియో ఉండబోతోందన్నది నిజం.

17వ శ‌తాబ్దం నాటి మొఘ‌లాయిలు, కుతుబ్ షాహీల శ‌కం నేప‌థ్యంలో జ‌రిగే క‌థ‌తో, అత్య‌ద్భుత‌మైన విజువ‌ల్ ఫీస్ట్‌గా ఈ”హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు” సినిమా రూపొందుతోంది. ఇది ఒక లెజండ‌రీ బందిపోటు వీరోచిత గాథ.” ఇది భార‌తీయ సినిమాలో ఇప్ప‌టిదాకా చెప్ప‌ని క‌థ‌. ఖచ్చితంగా ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌కు ఒక మ‌ర‌పురాని అనుభ‌వాన్ని ఇస్తుంది. ఏ విష‌యంలోనూ రాజీప‌డ‌ని ఉన్న‌త‌స్థాయి నిర్మాణ విలువ‌ల‌తో భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. పాన్‌-ఇండియా స్థాయిలో నిర్మాణ‌మ‌వుతోన్న ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీ, త‌మిళ‌, కన్నడ, మ‌ల‌యాళం భాష‌ల్లో ఏక కాలంలో విడుద‌ల చేయ‌నున్నారు. ఇప్పటివరకు ‘హరిహర వీరమల్లు’ షూటింగ్‌ యాభై శాతం పూర్త‌యింది. త్వరలో చిత్రం నూతన షెడ్యూల్ ప్రారంభం అవుతుందని నిర్మాత‌ ఎ.ద‌యాక‌ర్ రావు తెలియచేశారు.

అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను అలరించేలా ‘హరిహర వీరమల్లు’ చిత్రం రూపు దిద్దుకుంటోంది.

ఈ చిత్రానికి అగ్ర‌శ్రేణి సంగీత ద‌ర్శ‌కుడు ఎం.ఎం. కీర‌వాణి సంగీత బాణీలు అందిస్తుండ‌గా, పేరొందిన సినిమాటోగ్రాఫ‌ర్ జ్ఞాన‌శేఖ‌ర్ వి.ఎస్‌. కెమెరాను హ్యాండిల్ చేస్తున్నారు. ప్రముఖ రచయిత సాయిమాధ‌వ్ బుర్రా ఈ చిత్రానికి సంభాషణలు సమకూరుస్తున్నారు. ఎడిటర్ గా కె.ఎల్. ప్రవీణ్ పూడి, విఎఫ్ఎక్స్ హరి హర సుతన్, పోరాటాలు శామ్ కౌశల్, తడోర్ లజరొవ్ జుజి, రామ్ లక్ష్మణ్, దిలీప్ సుబ్బరాయన్ లు సాంకేతిక నిపుణులుగా వ్యవహరిస్తున్నారు.

క్రిష్ జాగ‌ర్ల‌మూడి ద‌ర్శ‌క‌త్వంలో లెజండ‌రీ ప్రొడ్యూస‌ర్ ఎ.ఎం. ర‌త్నం సమర్పణలో మెగాసూర్యా ప్రొడ‌క్ష‌న్‌ బ్యాన‌ర్‌ పై నిర్మాత‌ ఎ.ద‌యాక‌ర్ రావు ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

పి.ఆర్.ఓ: ల‌క్ష్మీవేణుగోపాల్‌.

 

Pawan Kalyan sparkles in a regal avatar in historical drama Hari Hara Veera Mallu’s latest poster, leaving fans craving for more

Pawan Kalyan’s historical drama Hari Hara Veera Mallu helmed by reputed filmmaker Krish Jagarlamudi is easily one of the most awaited films among movie buffs. Nidhhi Agerwal plays the female lead in the film presented by A M Rathnam under Mega Surya Production and produced by A.Dayakar Rao.

Commemorating the birthday of Pawan Kalyan (September 2), the makers of Hari Hara Veera Mallu plan to unveil a special glimpse of the film at 5.45 pm tomorrow. The joy of the star’s fans knew no bounds upon hearing the news and the team is confident that they’ll live up to their expectations.

On the eve of the big day, movie buffs received a pleasant surprise from the film team. A special poster from Hari Hara Veera Mallu was unveiled today. In the poster, Pawan Kalyan in the titular character, sporting a rounded moustache, transports the viewers to a different era in a regal avatar, beaming with intensity while riding a chariot.

The poster suggests that the protagonist is amidst a heated, war-like situation where several men are marching towards the enemy holding their weapons. This is just the perfect icing on the cake for Pawan Kalyan’s fans as they await a special glimpse from the team tomorrow.

For the unversed, the film is set in the 17th century revolving around the Mughals and the era of Qutub Shahis and promises to be a visual feast. Hari Hara Veera Mallu is a first-of-its-kind story in Indian cinema about a legendary outlaw and is set to transport viewers to a different world.

The pan-Indian film, set to release in Telugu, Hindi, Tamil, Kannada and Malayalam, is being made on a huge scale. The film’s shoot is 50% complete and a new schedule will commence soon, the producer Dayakar Rao added. MM Keeravaani provides the music score for the epic actioner while VS Gnanasekhar cranks the camera. Sai Madhav Burra pens the dialogues.

Legendary technician Thota Tharani is the production designer for the film with KL Praveen handling editing duties. Sham Kaushal, Todor Lazarov Juji, Ram-Laxman and Dileep Subbarayan are the stunt choreographers for this big-budget adventure. Hari Hara Suthan is the VFX head for the project.

PRO: Lakshmi Venugopal

 

power-glance-insta-1still (1) #HHVM-HBD Poster