They fake love to survive, but soon, it feels all too real. – HRIDAYAM SONG PROMO from KINGDOM IS A WINNER

కింగ్‌డమ్’ చిత్రం నుండి మొదటి గీతం ‘హృదయం లోపల’ ప్రోమో విడుదల

‘కింగ్‌డమ్’ చిత్రం నుండి అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మొదటి గీతం ‘హృదయం లోపల’ ప్రోమో విడుదలైంది. విడుదలైన క్షణాల్లోనే అందరి మనసుని దోచేసింది.

కథానాయకుడు విజయ్ దేవరకొండ, దర్శకుడు గౌతమ్ తిన్ననూరి, సంగీత దర్శకుడు అనిరుధ్ త్రయం చేతులు కలిపితే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ప్రోమో ఉంది. ప్రోమోలో విజయ్, భాగ్యశ్రీ బోర్సే జోడీ చూడ ముచ్చటగా ఉంది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చక్కగా కుదిరింది. పూర్తి గీతం మే 2వ తేదీన విడుదల కానుంది.

“వారు బ్రతకడానికి ప్రేమను నటిస్తారు, కానీ త్వరలోనే అది నిజమనిపిస్తుంది.” అనే వాక్యాన్ని నిర్మాతలు జోడించారు. దానిని బట్టి చూస్తే.. ప్రధాన పాత్రలు మొదట ప్రేమలో ఉన్నట్లు నటిస్తాయి, కానీ చివరికి నిజంగానే ప్రేమలో పడిపోతాయని అర్థమవుతోంది.

విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. సినిమా పట్ల ఆసక్తిని, అంచనాలను రెట్టింపు చేస్తున్నాయి. జోమోన్ టి. జాన్ మరియు గిరీష్ గంగాధరన్ ఛాయాగ్రహణం అత్యున్నత స్థాయిలో ఉంది. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఈ చిత్ర ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

మే 2న విడుదల కానున్న ‘హృదయం లోపల’ గీతం ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రోమోలో అనిరుధ్ సంగీతం కట్టిపడేసింది. అలాగే అనిరుధ్, అనుమిత నదేశన్ తమదైన గాత్రంతో మెప్పించారు. ఈ మనోహరమైన గీతానికి కెకె సాహిత్యం అందించారు. దార్ గై తన కొరియోగ్రఫీతో ఈ పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చారు.

దర్శకుడు గౌతమ్ తిన్ననూరి అద్భుతమైన కథను, అంతే అద్భుతంగా తెరకెక్కిస్తూ ‘కింగ్‌డమ్’తో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించడానికి సిద్ధమవుతున్నారు.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకరా స్టూడియోస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

 

They fake love to survive,
but soon, it feels all too real.
- HRIDAYAM SONG PROMO from KINGDOM IS A WINNER

The most awaited Hridayam Lopala promo from Kingdom is out now and it’s already playing on loop!

The beats hit instantly and it looks like the powerful trio of Vijay Deverakonda, Gowtam Tinnanuri and Anirudh have struck big . Real fireworks are clearly set for May 2nd with full song release.

As the makers captioned:
“They fake love to survive, but soon it feels all too real.”

From what we see, it looks like the characters start by pretending to be in love… but eventually fall for real.

The visuals are stunning, grand and absolutely worth the wait and hype. The cinematography, handled by Jomon T. John ISC and Girish Gangadharan ISC is top notch, while Navin Nooli handling editing.

Full song on May 2nd and Anirudh and Anumita Nadesan has already struck the right chord building massive anticipation with his
KK has penned the lyrics for this soulful and intense melody. Dar Gai has added her touch of magic with the choreography.

Gowtam Tinnanuri has written and directed this film on a truly grand scale.

Produced by Naga Vamsi and Sai Soujanya under the banners of Sithara Entertainments, Fortune Four Cinemas and Srikara Studios.

Hridayam Lopala - STILL InstaPost Video Cover-KINGDOM_TEL PROMO OUT

*Retro Telugu Pre Release Event: A Night of Love and Celebrations*

ఘనంగా సూర్య ‘రెట్రో’ ప్రీ రిలీజ్ వేడుక

‘రెట్రో’ చిత్రం ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: విజయ్ దేవరకొండ

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య కొత్త చిత్రం ప్రకటన

కోలీవుడ్ స్టార్ సూర్య కథానాయకుడిగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రెట్రో’. పూజా హెగ్డే కథానాయిక. సూర్య, జ్యోతిక నేతృత్వంలోని 2D ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రూపుదిద్దుకున్న ఈ చిత్రం, మే 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. తెలుగునాట ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని పంపిణీ చేస్తుండటం విశేషం. శనివారం సాయంత్రం హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ లో ‘రెట్రో’ ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది. ప్రముఖ కథానాయకుడు విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ముఖ్య అతిథి, ప్రముఖ కథానాయకుడు విజయ్ దేవరకొండ మాట్లాడుతూ, “అందరికీ నమస్కారం. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. సినిమా గురించి మాట్లాడేముందు.. ముందుగా పహల్గాం బాధితులకు నివాళులు. సూర్య అన్న మూవీ ప్రమోషన్ కోసం నేను ఇక్కడికి రావడం సంతోషంగా ఉంది. నేను గజిని సినిమా చూసి సూర్య అన్నతో ప్రేమలో పడిపోయాను. ఎవర్రా ఈయన, ఇంత బాగా నటిస్తున్నాడు అనుకొని.. సూర్య అన్న నటించిన మిగతా సినిమాలన్నీ చూశాను. సూర్య సన్నాఫ్ కృష్ణన్ నా మనసుకి బాగా నచ్చిన సినిమా. చంచల సాంగ్ చూసి భావోద్వేగానికి గురయ్యాను. ఆ పాట నాకెప్పటికీ ఓ మంచి జ్ఞాపకం. సూర్య అన్నను తెరమీద చూసి.. అసలు ఈ మనిషి బాడీ ఏంటి, యాక్టింగ్ ఏంటి, డ్యాన్స్ ఏంటి? ఒక్కసారైనా జీవితంలో కలవాలి అనుకున్నాను. అలాంటిది ఇప్పుడు ఆయనతో వేదిక పంచుకోవడం ఎప్పటికీ మరిచిపోలేను. నటుడిగా సూర్య అన్న అంటే నాకెంతో ఇష్టం. ఆయన సినిమాల ఎంపిక మిగతా నటుల్లో స్ఫూర్తి నింపేలా ఉంటుంది. విభిన్న జానర్స్ లో సినిమాలు చేస్తుంటారు. రెట్రోతో సూర్య అన్న మరో ఘన విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నాను. అగరం ఫౌండేషన్ ద్వారా సూర్య అన్న ఎందరో విద్యార్థులకు అండగా నిలబడుతున్నారు. ఆయన స్ఫూర్తితో నేను కూడా విద్యార్థులకు సాయం చేయాలి అనుకుంటున్నాను. మే 1న విడుదలవుతున్న రెట్రో సినిమాని అందరూ చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను.” అన్నారు.

చిత్ర కథానాయకుడు సూర్య మాట్లాడుతూ, “ముందుగా పహల్గాం బాధితులకు నివాళులు. రెట్రో వేడుకకు విచ్చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. మీరు నాపై కురిపిస్తున్న ప్రేమ ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. కార్తీక్ సుబ్బరాజ్ గారి సినిమాలు ప్రత్యేకంగా ఉంటాయి. మేకింగ్ కొత్తగా ఉంటుంది. ఆయనతో కలిసి పని చేయడం సంతోషంగా ఉంది. రెట్రో ట్రైలర్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సంతోష్ నారాయణన్ గారు అద్భుతమైన సంగీతం అందించారు. అలాగే తెలుగులో శ్యామ్ గారు బ్యూటిఫుల్ లిరిక్స్ రాశారు. ప్రకాష్ రాజ్ గారు, జోజు జార్జ్ గారు, జయరామ్ గారు, నాజర్ గారు లాంటి సీనియర్ నటులతో స్క్రీన్ షేర్ చేసుకోవడం హ్యాపీగా ఉంది. పూజ హెగ్డే నాకంటే ఎక్కువగా సినిమాని ప్రమోట్ చేస్తోంది. మీరు ట్రైలర్ లో చూసినట్టుగానే.. లవ్, కామెడీ, యాక్షన్, ఇంటెన్సిటీ అన్నీ సినిమాలో ఉంటాయి. మే 1న విడుదలవుతున్న రెట్రో మీ అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను. నాగవంశీ గారిది లక్కీ హ్యాండ్ అంటుంటారు. ఆయనతో చేతులు కలపడం సంతోషంగా ఉంది. నా తదుపరి చిత్రాన్ని నాగవంశీ గారి నిర్మాణంలో, వెంకీ అట్లూరి దర్శకత్వంలో చేస్తున్నాను. ఈ సందర్భంగా ఈ విషయాన్ని పంచుకోవడం ఆనందంగా ఉంది. మే 1న విడుదలవుతున్న నాని ‘హిట్-3′ కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నాను. విజయ్ నా సోదరుడు లాంటివాడు. విజయ్ జర్నీ చూస్తే నాకు గర్వంగా అనిపిస్తుంది. ‘కింగ్ డమ్’ సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. విజయ్ అగరం ఫౌండేషన్ గురించి మాట్లాడాడు. అయితే చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ నా సేవా కార్యక్రమాలకు స్ఫూర్తి అని చెప్పవచ్చు. మా అగరం ఫౌండేషన్ కి ఎందరో తెలుగువారు అండగా ఉన్నారు. నాకు ఇన్నేళ్ళుగా సపోర్ట్ గా నిలుస్తూ వస్తున్న నా అభిమాన సోదరులకు, సోదరీమణులకు మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు.” అన్నారు.

అతిథి, ప్రముఖ దర్శకుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ, “ఇక్కడ చాలామంది సూర్య గారి అభిమానులున్నారు. వారిలో నేను కూడా ఉన్నాను. నా కాలేజ్ లైఫ్ లో సూర్య గారి సినిమా ఒక పాఠం లాంటిది. గజినీ సినిమా చూసి.. ఒక సినిమా ఇలా కూడా ఉంటుందా? ఒక నటుడు ఇంత కష్టపడతారా? అనుకున్నాను. నేను సినీ పరిశ్రమలోకి రావాలి అనుకుంటున్నప్పుడు చూసిన సినిమా అది. నాకెప్పుడూ ప్రత్యేకమైనదే. ఇక ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ అయితే.. అది సినిమా కాదు, అదొక టెక్స్ట్ బుక్. ప్రేమలో ఎలా పడాలో నేర్పింది, విఫలమైతే దాని నుంచి ఎలా బయటపడాలో నేర్పింది, క్రమశిక్షణ కూడా నేర్పింది. సూర్య గారు ఎన్నో గొప్ప సినిమాలు చేశారు. ఆయన ప్రతి సినిమా నుంచి ఏదోకటి నేర్చుకున్నాము. ఇప్పుడు రెట్రోతో వస్తున్నారు. కార్తీక్ సుబ్బరాజ్ గారి మేకింగ్ కొత్తగా ఉంటుంది. ఇలాంటి ట్రైలర్ కట్ నేనెప్పుడూ చూడలేదు. సినిమా కూడా ఇదే స్థాయిలో ఉంటుందని భావిస్తున్నాను. సూర్య గారు, విజయ్ గారు బ్రదర్స్ లా ఉన్నారు. ఇద్దరూ మల్టీస్టారర్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. మే 1న విడుదలవుతున్న రెట్రో పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటూ, టీం అందరికీ ఆల్ ది బెస్ట్.” అన్నారు.

ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ, “తెలుగులో రెట్రో సినిమాని విడుదల చేసే అవకాశమిచ్చిన సూర్య గారికి ధన్యవాదాలు. మిమ్మల్ని ఈ తరహా సినిమాలో చూడాలని తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంతో మీరు ఘన విజయాన్ని అందుకుంటారని ఆశిస్తున్నాను. ఈ వేడుకకు విచ్చేసిన విజయ్ దేవరకొండ గారికి, సోదరుడు వెంకీ అట్లూరికి థాంక్స్.” అన్నారు.

చిత్ర సహ నిర్మాత కార్తికేయన్ సంతానం మాట్లాడుతూ, “2D ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ తో కలిసి ఈ సినిమా నిర్మాణంలో భాగం కావడం సంతోషంగా ఉంది. మా టీం అందరికీ ఈ సినిమా ప్రత్యేకమైనది. అందరం ఎంతో కష్టపడి పనిచేశాము. సూర్య గారు చాలా మంచి మనిషి. ఆయన నుంచి ఎన్నో గొప్ప విషయాలు నేర్చుకున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసిన విజయ్ దేవరకొండ గారికి, వెంకీ అట్లూరి గారికి ధన్యవాదాలు. ఈ సినిమాని తెలుగులో విడుదల చేస్తున్న సితార ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ గారికి ప్రత్యేక కృతఙ్ఞతలు.” అన్నారు.

గీత రచయిత కాసర్ల శ్యామ్ మాట్లాడుతూ, “సూర్య గారికి తెలుగులో ఎందరో అభిమానులు ఉన్నారు. ఈ సినిమాలో ఉన్న ఆరు పాటలూ నేను రాయడం జరిగింది. కార్తీక్ సుబ్బరాజ్ గారితో నాకిది రెండో సినిమా. తమిళ నుంచి అనువాదం లాగా కాకుండా, పక్కా తెలుగు లాగా రాశారని ఎందరో సూర్య గారి అభిమానులు నాకు మెసేజ్ లు చేయడం సంతోషం కలిగించింది.” అన్నారు.

నటుడు కరుణాకరన్ మాట్లాడుతూ, “నేను ఎంతగానో అభిమానించే సూర్య గారి సినిమాలో నటించడం అనేది నా కల నిజమైనట్టుగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ గారికి కృతఙ్ఞతలు.” అన్నారు.

*RETRO will entertain everyone: Suriya at Telugu pre release event**”I wish for the grand success of the film ‘Retro’: Vijay Deverakonda at RETRO pre Release event*

*Suriya’s upcoming film has been officially announced under the Sithara Entertainments banner, directed by Venky Atluri*

Kollywood star Suriya plays the lead role in the film ‘Retro,’ directed by Karthik Subbaraj, with Pooja Hegde as the female lead. Produced under the 2D Entertainment banner led by Suriya and Jyothika, the film is set for a grand worldwide release on May 1. Notably, prominent Telugu production house Sitara Entertainments is distributing the film in the Telugu states. On Saturday evening, a grand pre-release event was held at JRC Convention in Hyderabad, where popular actor Vijay Deverakonda attended as the chief guest.

Speaking at the event, Vijay Deverakonda said, “Namaste to everyone. I hope you’re all doing well. Before talking about the film, I would like to pay my respects to the victims of the Pahalgam incident. I’m happy to be here to promote Suriya anna’s movie. I fell in love with his acting after watching Ghajini. I was curious to know who he was and watched all his other films. Suriya Son of Krishnan was especially close to my heart. The ‘Chanchala’ song moved me emotionally and has remained a beautiful memory. Watching Suriya anna on screen, I was in awe of his physique, acting, and dance. I once dreamed of meeting him, and now sharing the stage with him is an unforgettable moment. I truly admire him as an actor. His choice of films inspires others in the industry, and he always explores different genres. I wish him a huge success with ‘Retro’. Through the Agaram Foundation, Suriya anna has supported countless students, and he inspires me to do the same. I hope everyone enjoys ‘Retro’ when it releases on May 1.”

Suriya said, “First, I offer my condolences to the victims of the Pahalgam tragedy. Thank you to everyone who came to the Retro event. I’m overwhelmed by the love you’ve been showing me. Karthik Subbaraj’s films are always unique and innovative. It was a joy to work with him. I hope you all liked the Retro trailer. Santhosh Narayanan has composed amazing music, and in Telugu, Shyam has penned beautiful lyrics. I’m happy to share the screen with senior actors like Prakash Raj, Joju George, Jayaram, and Nassar. Pooja Hegde is promoting the film even more than I am. Just like you saw in the trailer, the movie has love, comedy, action, and intensity. I believe ‘Retro’ will win your hearts on May 1. People say Naga Vamsi has a lucky hand, and I’m glad to be working with him. I’m also happy to share that my next film will be under Naga Vamsi’s production and directed by Venky Atluri. I hope Nani’s ‘HIT-3′, also releasing on May 1, will be successful. Vijay is like a younger brother to me, and I feel proud seeing his journey. I wish his film ‘KINGDOM’ becomes a big success. Vijay mentioned the Agaram Foundation today, but I must say that Chiranjeevi garu’s Blood Bank has always been my inspiration for social service. Many Telugu people have supported our Agaram Foundation over the years. I’m deeply grateful to all my beloved fans who have stood by me for so long.”

Talented director Venky Atluri said, “There are many fans of Suriya garu here, and I’m one of them. During my college days, Suriya’s films were like lessons to me. After watching Ghajini, I was amazed and thought, can a movie be like this? Can an actor work this hard? It was one of the films that made me want to join the industry. ‘Soorarai Pottru’ wasn’t just a film – it was a textbook. It taught how to fall in love, how to deal with heartbreak, and even discipline. We’ve learned something from each of Suriya’s films. Now he’s coming with ‘Retro’, and Karthik Subbaraj’s making style is always unique. I’ve never seen a trailer cut like this before, so I believe the film will be on the same level. Suriya and Vijay are like brothers. I feel they should do a multistarrer together. Wishing ‘Retro’, releasing on May 1, to become a huge blockbuster and all the best to the entire team.”

Renowned producer Suryadevara Naga Vamsi said, “I thank Suriya garu for giving us the opportunity to release ‘Retro’ in Telugu. Telugu audiences have long awaited to see you in a film like this. I’m confident you’ll achieve great success with this project. Thanks to Vijay Deverakonda and my brother Venky Atluri for gracing this event.”

Co-producer Kartikeyan Santhanam said, “I’m happy to be a part of this film’s production in association with the 2D Entertainment banner. This film is special to all of us on the team. We all worked very hard on it. Suriya sir is a wonderful person, and I’ve learned many valuable things from him. I sincerely thank Vijay Deverakonda and Venky Atluri for attending this event. Special thanks to Naga Vamsi of Sithara Entertainments for releasing the film in Telugu.”

Lyricist Kasarla Shyam said, “Suriya sir has a huge fan base in Telugu. I had the opportunity to write all six songs in this film. This is my second collaboration with director Karthik Subbaraj. I’ve received messages from many Suriya fans appreciating that the lyrics don’t feel like Tamil translations but sound like native Telugu, which makes me very happy.”

Actor Karunakaran said, “Acting in a film with Suriya sir, whom I deeply admire, feels like a dream come true. I’m grateful to director Karthik Subbaraj for giving me this opportunity.”

 

GANI7612 DSC784 DSC_7647 DSC_7532 DSC_7642

Tu Mera Lover Hits Hard – Whistles Guaranteed On the Big Screens

మాస్ మహారాజా రవితేజ ‘మాస్ జాతర’ చిత్రం నుంచి మొదటి గీతం ‘తు మేరా లవర్’ విడుదల

మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక 75వ చిత్రం ‘మాస్ జాతర’. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ఇప్పుడు ఈ చిత్రం నుంచి మొదటి గీతంగా ‘తు మేరా లవర్’ను విడుదల చేశారు.
ప్రోమోతోనే అందరి దృష్టిని ఆకర్షించిన ‘తు మేరా లవర్’ గీతం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూశారు. తాజాగా విడుదలైన ఈ పాట, ఒక్కసారి వినగానే శ్రోతలకు అభిమాన గీతం మారిపోతోంది. ధమాకా జోడి రవితేజ-శ్రీలీల అందరి అంచనాలను అందుకునేలా, అద్భుతమైన కెమిస్ట్రీతో మరోసారి మ్యాజిక్ చేశారు. ప్రేక్షకులకు వెండితెరపై పూర్తి స్థాయి ట్రీట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు ఈ పాటతో చెప్పకనే చెప్పేశారు.
సంగీత సంచలనం భీమ్స్ సిసిరోలియో ‘తు మేరా లవర్’ గీతాన్ని అద్భుతంగా స్వరపరిచారు. భాస్కరభట్ల సాహిత్యం మాస్ మెచ్చేలా ఉంది. రవితేజ బ్లాక్‌బస్టర్ చిత్రం ‘ఇడియట్‌’లోని ఐకానిక్ చార్ట్‌బస్టర్ “చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే” పాటకు ట్రిబ్యూట్ గా మలిచిన ‘తు మేరా లవర్’ అభిమానులకు విందు భోజనంలా ఉంది. దీనిని ఒక ప్రత్యేకమైన సంగీత నివాళిగా మార్చడానికి నిర్మాతలు కృత్రిమ మేధస్సు(AI) ని ఉపయోగించి దివంగత సంగీత దర్శకుడు చక్రి స్వరాన్ని తిరిగి సృష్టించారు. రవితేజ శైలి ప్రత్యేక డ్యాన్స్ స్టెప్పులు, శ్రీలీల అద్భుతమైన నృత్య ప్రదర్శనతో ఈ గీతం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
దర్శకుడు భాను బోగవరపు రవితేజ అభిమానులతో పాటు, మాస్ ప్రేక్షకులు మెచ్చే విధంగా ‘మాస్ జాతర’ను మలుస్తున్నారు. ప్రముఖ ఛాయగ్రాహకుడు విధు అయ్యన్న తన ప్రభావవంతమైన విజువల్స్ తో పాటకి తగ్గట్టుగా మాస్ వైబ్‌ను అద్భుతంగా చూపించారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.
రవితేజ నుంచి అభిమానులు, ప్రేక్షకులు కోరుకునే విధంగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా ‘మాస్ జాతర’ రూపొందుతోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
తారాగణం & సాంకేతిక బృందం:
చిత్రం: మాస్ జాతర
తారాగణం: మాస్ మహారాజా రవితేజ, శ్రీలీల
దర్శకత్వం: భాను బోగవరపు
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
కూర్పు: నవీన్ నూలి
ఛాయాగ్రహణం: విధు అయ్యన్న
మాటలు: నందు సవిరిగాన
కళా దర్శకత్వం: శ్రీ నాగేంద్ర తంగాల
ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఫణి కె. వర్మ
సమర్పణ: శ్రీకర స్టూడియోస్
బ్యానర్స్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌,
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్
Tu Mera Lover Hits Hard – Whistles Guaranteed On the Big Screens
The much awaited first single Tu Mera Lover from Mass Jathara is out now and it’s already setting the charts on fire. The dynamic duo of Ravi Teja and Sreeleela have lived up to all expectations delivering electrifying chemistry once again. They’re all set to give audiences a full blown treat on the big screen!
Composed by the talented Bheems Ceciroleo & Source Vocals by Bheems Ceciroleo. Lyrics by Bhaskarabhatla who once again strikes the perfect chord with the mass pulse. Tu Mera Lover is a treat for fans as it pays tribute to Ravi Teja’s iconic chartbuster Choopultho Guchi Guchi Champake from his blockbuster film Idiot. The makers have recreated Chakri’s voice using AI making this a one of a kind musical tribute. The song showcases Ravi Teja’s signature dance moves and Sreeleela’s electrifying presence making it an instant hook for audiences.
Directed by Bhanu Bhogavarapu. Cinematographer Vidhu Ayyanna has nailed the mass vibe with his impactful visuals in the song matching exactly what it demanded. The edit will be handled by National Award winner Navin Nooli.
Film is a full on mass action entertainer produced by Naga Vamsi and Sai Soujanya under the renowned banners of Sithara Entertainments, Fortune Four Cinemas and Srikara Studios.
Song Name: Tu Mera lover
Lyrics : Bhaskarabhatla Ravi Kumar
AI Voice : ‘Late’ Sri. Chakri Gaaru
Source Vocals Sung by : Bheems Ceciroleo
Music Director : Bheems Ceciroleo
Cast: Ravi Teja, Sreeleela
Director: Bhanu Bhogavarapu
Producers: Naga Vamsi, Sai Soujanya
Music: Bheems Ceciroleo
Cinematography: Vidhu Ayyanna
Editor: Navin Nooli
Dialogues: Nandu Savirgama
Production Designer: Sri Nagendra Tangala
Executive Producer: Phani K Varma
Presenter: Srikara Studios
Banners: Sithara Entertainments & Fortune Four Cinemas
#MJ-TuMeraLover-OutNow MASS JATHARA Stills-1 MASS JATHARA Stills-2 MASS JATHARA Stills-3 MASS JATHARA Stills-4

Powerstar Pawan Kalyan’s Hari Hara Veera Mallu Gears Up For a Thundering Summer Release

వేసవిలో విడుదలకు సిద్ధమవుతోన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మక చిత్రం ‘హరి హర వీరమల్లు’

ఈ సంవత్సరం విడుదల కానున్న భారీ భారతీయ చిత్రాలలో ‘హరి హర వీరమల్లు’ ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. సినీ అభిమానులంతా ఈ చిత్రం కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. చిత్ర నిర్మాణం తుదిదశకు చేరుకుంది. ప్రస్తుతం రీ-రికార్డింగ్, డబ్బింగ్ మరియు వీఎఫ్ఎక్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రతి ఫ్రేమ్‌ను జాగ్రత్తగా రూపొందిస్తున్నారు, ప్రతి సౌండ్‌ను చక్కగా ట్యూన్ చేస్తున్నారు మరియు విజువల్ ఎఫెక్ట్స్ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. చిత్ర బృందం ఎక్కడా రాజీ పడకుండా, ప్రపంచం మెచ్చే గొప్ప చిత్రంగా మలచడానికి కృషి చేస్తోంది. ఈ వేసవిలో వెండితెరపై మునుపెన్నడూ చూడని అద్భుతమైన అనుభూతిని ప్రేక్షకులకు అందించడానికి చిత్ర బృందం సిద్ధమవుతోంది.

దర్శకుడు ఎ.ఎం. జ్యోతి కృష్ణ గత ఏడు నెలలుగా అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. ఎడిటింగ్ మరియు విఎఫ్ఎక్స్ మొదలుకొని మిగిలిన షూటింగ్ ను పూర్తి చేయడం వరకు ప్రతి విభాగాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని అనుకున్న సమయానికి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా చేయడంలో జ్యోతి కృష్ణ పాత్ర కీలకం.

చారిత్రాత్మక యోధుడు వీరమల్లు పాత్రలో పవన్ కళ్యాణ్ కనువిందు చేయనున్నారు. అగ్ని లాంటి ఆవేశం, న్యాయం చేయాలనే ఆలోచన ఉన్న యోధుడిగా.. మునుపెన్నడూ చూడని సరికొత్త అవతార్ లో పవర్ స్టార్ కనిపించనున్నారు. మొఘల్ రాజుల నుండి కోహినూర్ వజ్రాన్ని దొంగిలించడంతో పాటు, ప్రేక్షకుల మనసు దోచుకోవడానికి ఆయన సిద్ధమవుతున్నారు. ఇది కేవలం కథ కాదు.. ఇది ఒక విప్లవం. న్యాయం కోసం యుద్ధం చేయనున్న వీరమల్లు, మే 9వ తేదీన థియేటర్లలో అడుగు పెట్టనున్నారు.

‘హరి హర వీరమల్లు’ చిత్రం మే 9న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. ప్రేక్షకుల్లో నెలకొన్న భారీ అంచనాల నేపథ్యంలో ఈ చిత్రం సంచలన వసూళ్లు రాబడుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి క్రిష్ జాగర్లమూడి, ఎ.ఎం. జ్యోతి కృష్ణ దర్శకులు. కరోనా మహమ్మారి మరియు పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణం కారణంగా చిత్రీకరణ ఆలస్యమైనప్పటికీ.. చిత్ర దర్శకత్వ బాధ్యతలు తీసుకున్న ఎ.ఎం. జ్యోతి కృష్ణ, ఎక్కడా రాజీ పడకుండా వేగంగా ‘హరి హర వీరమల్లు’ సినిమాని పూర్తి చేస్తున్నారు.

ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘మాట వినాలి’, ‘కొల్లగొట్టినాదిరో’ గీతాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రముఖ ఛాయగ్రాహకుడు మనోజ్ పరమహంస కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ సినిమాకి, లెజెండరీ కళా దర్శకుడు తోట తరణి అద్భుతమైన సెట్ లను రూపొందించారు.

పవన్ కళ్యాణ్ తో పాటు పలువురు ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో భాగమయ్యారు. మొఘల్ చక్రవర్తిగా బాబీ డియోల్ నటిస్తున్నారు. యానిమల్, డాకు మహారాజ్ చిత్రాలతో ఆకట్టుకున్న బాబీ డియోల్.. ప్రతినాయక పాత్రలో మరోసారి తనదైన ముద్ర వేయనున్నారు. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్, జిషు సేన్‌గుప్తా కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్న ‘హరి హర వీరమల్లు’ చిత్రం, మే 9న బాక్సాఫీస్ దగ్గర గర్జించనుంది.

తారాగణం: పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్, బాబీ డియోల్, అనుపమ్ ఖేర్, సత్యరాజ్, జిషు సేన్‌గుప్తా, నాజర్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు, నరా ఫతేహి
దర్శకత్వం: క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ
నిర్మాత: ఎ. దయాకర్ రావు
సమర్పణ: ఎ. ఎం. రత్నం
బ్యానర్: మెగా సూర్య ప్రొడక్షన్స్
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
ఛాయాగ్రహణం: మనోజ్ పరమహంస, జ్ఞానశేఖర్ వి.ఎస్
కూర్పు: ప్రవీణ్ కె.ఎల్
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి, చంద్రబోస్, పెంచల్ దాస్
విజువల్ ఎఫెక్ట్స్: హరి హర సుతాన్, సోజో స్టూడియోస్, యూనిఫై మీడియా, మెటావిక్స్
కళా దర్శకుడు: తోట తరణి
నృత్య దర్శకత్వం: బృందా, గణేష్
స్టంట్స్: శామ్ కౌశల్, టోడర్ లాజారో జుజీ, రామ్ – లక్ష్మణ్, దిలీప్ సుబ్బరాయన్, విజయ్ మాస్టర్
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్

Powerstar Pawan Kalyan’s Hari Hara Veera Mallu Gears Up For a Thundering Summer Release

Hari Hara Veera Mallu is one of the biggest films to emerge from Indian cinema this year, carrying sky-high expectations and fan frenzy to match.

The final leg of production is firing on all cylinders, with re-recording, dubbing, and VFX work progressing at a breakneck pace. Every frame is being meticulously crafted, every sound fine-tuned, and every visual effect elevated to deliver a world that’s as grand as the legend of Veera Mallu himself. The team is leaving no stone unturned to ensure that this film doesn’t just meet expectations—it redefines them. The scale, the emotion, the action—it’s all coming together like never before, setting the stage for a truly unforgettable theatrical experience.

Director A.M. Jyothi Krishna has been working relentlessly over the past seven months, overseeing every department from editing and VFX to shooting the balance parts to bring this ambitious project to life. His hands-on approach and swift execution have been key in shaping the film’s final vision in record time.

The war for dharma has begun.
Powerstar Pawan Kalyan is back as the outlaw Veera Mallu, a warrior with fire in his soul and justice on his mind. In his most ferocious avatar yet, he’s ready to rip through the screen and steal the Koh-i-Noor diamond right from under the Mughal noses. This isn’t just a story—it’s a revolution, and on May 9th, we’re all signing up for it.

With a massive overseas release also in the cards, Hari Hara Veera Mallu is poised to dominate globally across Telugu, Hindi, Tamil, Kannada, and Malayalam.

Directed by A.M. Jyothi Krishna & Krish Jagarlamudi. A.M. Jyothi Krishna who took the reins amidst delays caused by the pandemic and Pawan Kalyan’s political commitments, the film is backed by a powerhouse crew:
M.M. Keeravani, the Oscar-winning maestro, is composing a soundtrack already whispered to be historic.
Manoj Paramahamsa handles the lens, capturing a world soaked in grandeur and grit.
Thota Tharani, the veteran art director, crafts an immersive backdrop fit for this epic tale.

Bobby Deol, SatyaRaj, and a cast that slaps:
While Pawan Kalyan is the blazing heart of the story, the supporting cast brings dynamite energy.
Bobby Deol as the Mughal emperor channels villainy with swagger we’ve missed since Animal and Daaku Maharaj.
Nidhhi Agerwal stuns, while Satyaraj and Jisshu Sengupta add depth and gravitas to this already electric lineup.

After years of delays, speculation, and anticipation, Hari Hara Veera Mallu is finally roaring to life—ready to explode on the big screens and take no prisoners.

Produced by A. Dayakar Rao
Presented by AM Rathnam under Mega Surya Productions

Hari Hara Veera Mallu releases in cinemas worldwide on May 9th, 2025.

New-poster still

NTR steals the show with his heartfelt praise for the MAD Square team

ఘనంగా ‘మ్యాడ్ స్క్వేర్’ విజయోత్సవ వేడుక

నవ్వించడం గొప్ప వరం.. ‘మ్యాడ్ స్క్వేర్’ లాంటి సినిమాలు మరిన్ని రావాలి : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

ఈ వేసవికి ప్రేక్షకులకు వినోదాల విందుని అందిస్తూ, సంచలన విజయం సాధించిన చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్’. బ్లాక్ బస్టర్ చిత్రం ‘మ్యాడ్’కి సీక్వెల్ గా రూపొందిన ఈ ‘మ్యాడ్ స్క్వేర్’లో నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్‌ ప్రధాన పాత్రలు పోషించారు. కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. శ్రీకర స్టూడియోస్ తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించారు. ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ సమర్పకులు. భీమ్స్ సిసిరోలియో పాటలను స్వరపరచగా, తమన్ నేపథ్య సంగీతం అందించారు. భారీ అంచనాల నడుమ ‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రం మార్చి 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్లలో నవ్వుల జల్లు కురిపిస్తున్న ఈ చిత్రం, భారీ వసూళ్లతో అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో విజయోత్సవ వేడుకను నిర్వహించారు నిర్మాతలు. ఈ వేడుకకు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అభిమానుల కోలాహలం నడుమ ఘనంగా జరిగిన ఈ వేడుకలో చిత్ర బృందం పాల్గొని తమ సంతోషాన్ని పంచుకుంది.

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మాట్లాడుతూ, “అభిమాన సోదరులందరికీ నమస్కారం. చాలాకాలం అయిపోయింది మిమ్మల్ని ఇలా కలిసి. ఈరోజు నాగవంశీ పుణ్యాన మనం ఇలా కలుసుకోగలిగాం. నవ్వించడం అనేది చాలా గొప్ప వరం. మనకు ఎన్నో బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా ఒక మనిషి వచ్చి మనల్ని నవ్వించగలిగితే ఈ కష్టాల నుంచి బయటకు వెళ్ళిపోదాం కదా అనే ఆలోచన మన అందరికీ ఉంటుంది. అలా నవ్వించగలిగిన మనిషి చాలా అరుదుగా దొరుకుతారు. ఈరోజు దర్శకుడు కళ్యాణ్ శంకర్ గా మనకు దొరికాడు ఇక్కడ. మ్యాడ్ 2 తో ఇంతటి భారీ విజయాన్ని అందుకున్న కళ్యాణ్ కి కంగ్రాచులేషన్స్. ఒక చిత్రాన్ని హిట్ చేసిన తర్వాత సీక్వెల్ గా అంతకంటే గొప్పగా ప్రేక్షకులను రంజింపజేయడం చాలా కష్టం. కానీ కళ్యాణ్ అది సాధించగలిగాడు. ఎందుకంటే ఆయనది స్వచ్ఛమైన హృదయం. మీ గుండె ఆ స్వచ్ఛతను ఎప్పటికీ కోల్పోవద్దు. నాకు తెలిసి ఒక దర్శకుడికి కావాల్సిన గొప్ప గుణం అది. చాలా ప్యూర్ గా కథను రాయగలగాలి. ఇలాంటి చిత్రాలు ఇంకెన్నో చేయాలని, మీ కెరీర్ లో అభివృద్ధి చెందాలని ఆ దేవుడిని మనసారా కోరుకుంటున్నాను. ఇలాంటి దర్శకుడికి అండగా నిలిచిన ఈ సినిమాకి పని చేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరికీ కంగ్రాట్స్. ముఖ్యంగా ఫాదర్ రోల్ చేసిన మురళీధర్ గారు అద్భుతంగా నటించారు. ఒక క్యారెక్టర్ ని దర్శకుడు ఊహించుకొని రాసుకున్నప్పుడు దానిని నిజమైన పర్ఫామెన్స్ యాక్టర్ ఇవ్వగలిగినప్పుడు ఆ కిక్ ఎంత ఉంటుందో ఒక యాక్టర్ గా నాకు తెలుసు. ఈ సినిమాకి పిల్లర్ లా నిలిచిన మురళీధర్ గారికి కంగ్రాట్స్. అలాగే ఆంథోనీ. సినిమా చూస్తూ, అతను ఎంటర్ అయినప్పుడు నేను కూడా చప్పట్లు కొట్టాను. మ్యాడ్-1 లో ఆంథోనీ అంటే దేంతోని అంటారు. నేను మరిచిపోలేని క్యారెక్టర్ అది. ఒక కామెడీ చేయగలిగిన క్యారెక్టర్ ని ఒక మాస్ హీరోలా ఎంట్రీ ఇవ్వడం బాగుంది. లడ్డు పాత్ర పోషించిన విష్ణు లేకపోతే ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయ్యేది కాదేమో అనిపించింది. నన్ను అందరూ అడుగుతుంటారు రాముడిగా చేయడం కష్టమా, రావణుడిగా చేయడం కష్టమా అని. రాముడిగా చేయడమే కష్టం. ఎందుకంటే ఇన్నోసెంట్ గా బిహేవ్ చేయడం మనం మర్చిపోయాం లైఫ్ లో. ఆ ఇన్నోసెన్స్ విష్ణు బాగా పర్ఫామ్ చేశాడు. ఆయనలో ఆ ఇన్నోసెన్స్ లేకపోతే ఈ సినిమాలో కామెడీ ఇంతలా వర్కౌట్ అయ్యేది కాదు. సంగీత్ ని, వాళ్ళన్నయ్య సంతోష్ ని చూస్తే.. నాకు వాళ్ళ గారు శోభన్ గారే గుర్తుకొస్తారు. నేను శోభన్ గారిని ఒకసారి కలిశాను. ఆయనంత హంబుల్ గా ఉండే మనిషిని నేను మళ్ళీ చూడలేదు. శోభన్ గారు మన మధ్యే ఉండి, సంగీత్ సక్సెస్ ని చూసి గర్వపడుతున్నారు అనుకుంటున్నాను. మీరు ఇలాగే మీ దర్శకుడిని నమ్ముకుంటూ ముందుకి వెళ్లిపోండి. సంగీత్ మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను. మ్యాడ్ 1లో రామ్ నితిన్ యంగ్ గా ఉన్నాడు, ఒకప్పుడు నేను ఎలా ఉన్నానో అలాగే ఉన్నాడు. కెమెరా ముందు నిల్చోవడం అంత తేలిక కాదు. మ్యాడ్ లో రామ్ నితిన్ అద్భుతంగా నటించాడు. కామెడీ పలికించడం యాక్టర్ కి చాలా కష్టం. అందుకే నేను అదుర్స్-2 చేయడానికి ఆలోచిస్తున్నాను. రామ్ నితిన్ కి మంచి భవిష్యత్ ఉంది. నాకు 2011 లో పెళ్లి అయింది. అప్పుడు నితిన్ చాలా చిన్న పిల్లోడు. మాట్లాడటానికి కూడా భయపడేవాడు. అలాంటి నితిన్ నాతో ధైర్యం చెప్పిన ఒకే ఒక్క మాట.. బావ నేను యాక్టర్ అవుతాను అని. నేను నీ మనసుకి నచ్చింది చేసుకుంటూ వెళ్ళు చెప్పాను. నా సపోర్ట్ లేకుండా తనే కథలు ఎంచుకుంటూ ముందుకి వెళ్ళాడు. ఈరోజు నితిన్ సక్సెస్ చూసి గర్వంగా ఉంది. మంచి దర్శకులు, మంచి నిర్మాతలతో పని చేశాడు కాబట్టే నటుడిగా విజయాలు అందుకుంటున్నాడు. అలాగే సినిమాలో సత్యం రాజేష్, కార్తికేయ కామెడీకి కూడా బాగా నవ్వుకున్నాను. బ్రహ్మానందం గారు, ఎం.ఎస్. నారాయణ గారు, ధర్మవరం గారి తర్వాత ఆ స్థాయిలో కామెడీ పండించగల నటుడు సునీల్. భాష మీద పట్టు ఉంది. అలాగే కింద స్థాయి నుంచి ఎదుగుకుంటూ ఇక్కడికి వచ్చాడు. చాలా కాలం తర్వాత సునీల్ కామెడీ చూసి మళ్ళీ నవ్వుకున్నాను. సునీల్ విభిన్న పాత్రలతో అలరిస్తున్నాడు. కానీ, నవ్వించడానికే అతను పుట్టాడని నేను నమ్ముతాను. సంగీత దర్శకుడు భీమ్స్ గారికి, గీత రచయిత కాసర్ల శ్యామ్ గారికి, అలాగే ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి కంగ్రాట్స్. అత్తారింటికి దారేదిలో ఒక డైలాగ్ ఉంటుంది. మీ వెనకాల కనబడని ఒక శక్తి ఉంది అని, వీళ్ళందరి వెనుక ఆ కనబడని శక్తే మా నాగవంశీ. సినిమా అంటే చాలా ప్యాషన్ తనకి. మాట కఠినంగా ఉంటుంది కానీ, మనసు చాలా మంచిది. ఆ మంచితనమే తనని కాపాడుతుంది. వంశీతో త్వరలో ఒక సినిమా చేయబోతున్నాను. మా చినబాబు గారి చిన్నితల్లి హారిక నిర్మాతగా మరిన్ని మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. మ్యాడ్ టీం అందరికీ కంగ్రాట్స్. ఈ జన్మ అభిమానులకు అంకితం అని నాన్నగారితో చెప్పాను. మిమ్మల్ని ఆనందపరిచే సినిమాలు చేస్తూ ఉంటాను.” అన్నారు.

ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ, “అందరికీ నమస్కారం. ముందుగా మ్యాడ్ టీంకి యాక్టర్లకి, టెక్నీషియన్స్ కి అందరికీ పేరుపేరునా కంగ్రాచులేషన్స్. మన ఇంటి ఫంక్షన్ లో మన వాళ్ళని మనమే పొగొడుకోవడం అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అందుకే నేను ఎక్కువగా మాట్లాడట్లేదు. నేను ఒకే ఒక విషయం చెప్పి, ఈ ఉపన్యాసం ముగిస్తాను. నాకు ఇందాకటి నుంచి జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ అని చూస్తూ ఉంటే ‘జైంట్’(Jaint) గుర్తొస్తుంది. ఆయన నిజంగానే జైంట్.” అన్నారు.

చిత్ర కథానాయకుడు నార్నె నితిన్ మాట్లాడుతూ, “మా ఈవెంట్ కి వచ్చిన బావ(ఎన్టీఆర్) గారి అభిమానులు థాంక్యూ సో మచ్. నాకు జనతా గ్యారేజ్ లోని ఒక డైలాగ్ చెప్పాలని ఉంది. ఫర్ ఏ చేంజ్.. ఆ బలహీనుడి పక్కన ఒక బలముంది. ఈ మాట నేను ఊరికే చెప్పట్లేదు. మా మ్యాడ్-1 షూటింగ్ పూర్తయింది. కానీ అప్పటికి సినిమాపై బజ్ లేదు. అప్పుడు బావగారు ట్రైలర్ లాంచ్ చేశారు. కావాల్సినంత బజ్ వచ్చింది. మా సినిమాకి జనాలు వచ్చారు. ఆ తర్వాత మీకు తెలిసిందే. సినిమా పెద్ద హిట్ అయింది. ఇప్పుడు మ్యాడ్-2 తో వచ్చాము. థాంక్యూ సో మచ్ బావ(ఎన్టీఆర్). మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. మ్యాడ్ స్క్వేర్ సినిమా చూసి నటనలో పరిణితి కనబరిచావని బావగారు అన్నారు. దానికి కారణం మా దర్శకుడు కళ్యాణ్ శంకర్ గారు. షూట్ లో ఒక మెంటర్ గా ఉన్నారు. అలాగే నా సహ నటులు నాకెంతో సపోర్ట్ చేశారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన చినబాబు గారికి, నాగవంశీ గారికి, హారిక గారికి థాంక్స్.” అన్నారు.

చిత్ర కథానాయకుడు సంగీత్ శోభన్ మాట్లాడుతూ, “ఈ వేడుకకు విచ్చేసిన ఎన్టీఆర్ గారికి థాంక్యూ సో మచ్. మ్యాడ్ ట్రైలర్ ఆయన చేతుల మీదుగా లాంచ్ అయినప్పుడు ప్రపంచాన్ని గెలిచినంత ఆనందం కలిగింది. ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ మీట్ కి వచ్చినందుకు మళ్ళీ థాంక్స్. మాకు ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతఙ్ఞతలు.” అన్నారు

చిత్ర కథానాయకుడు రామ్ నితిన్‌ మాట్లాడుతూ, “నేను సినీ పరిశ్రమకు వచ్చిన తర్వాత మొదట కలిసిన స్టార్ ఎన్టీఆర్ గారు. మా మ్యాడ్ ట్రైలర్ లాంచ్ ఎన్టీఆర్ గారి చేతుల మీదుగా జరిగింది. అది ఎప్పటికీ మరిచిపోలేను. ఇప్పుడు మళ్ళీ మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ మీట్ కి ఆయన చీఫ్ గెస్ట్ గా వచ్చారు. ఇంతకన్నా ఆనందం ఏముంటుంది. మాకు ఇంత సపోర్ట్ చేస్తున్న ఎన్టీఆర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. తెలుగు చిత్ర పరిశ్రమకు ఎన్నో గొప్ప సినిమాలు అందించిన త్రివిక్రమ్ గారికి థాంక్స్. మమ్మల్ని ఇంతగా ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు పాదాభివందనాలు.” అన్నారు.

చిత్ర దర్శకుడు కళ్యాణ్ శంకర్ మాట్లాడుతూ, “ఈ వేడుకకు విచ్చేసిన ఎన్టీఆర్ గారికి, త్రివిక్రమ్ గారికి థాంక్స్. నేను ముగ్గురికి ప్రత్యేకంగా కృతఙ్ఞతలు తెలపాలి. నాగవంశీ గారు లేకపోతే నేను లేను, చినబాబు గారు లేకపోతే మ్యాడ్ లేదు, ఎడిటర్ నవీన్ నూలి గారు లేకపోతే ఇంత పెద్ద హిట్ లేదు. అలాగే, ఈ సినిమాలో భాగమై ఇంతటి విజయానికి కారణమైన నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరికీ పేరు పేరునా థాంక్స్.” అన్నారు.

సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో మాట్లాడుతూ, “మ్యాడ్ ని పెద్ద హిట్ చేశారు. మ్యాడ్ స్క్వేర్ ఇంకా పెద్ద హిట్ అవుతుందని విడుదలకు ముందు చెప్పాను. మా నమ్మకాన్ని నిజం చేసిన ప్రేక్షకులకు కృతఙ్ఞతలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు కళ్యాణ్ శంకర్ గారికి, నిర్మాతలు హారిక గారికి, నాగవంశీ గారికి, చినబాబు గారికి, త్రివిక్రమ్ గారికి థాంక్యూ సో మచ్. ప్రతి మనిషి బాగు కోరే ఎన్టీఆర్ గారు ఈ వేడుకకి రావడం సంతోషంగా ఉంది.” అన్నారు.

ప్రముఖ నటుడు సునీల్ మాట్లాడుతూ, “ఈ సినిమాలో నేను పోషించిన మ్యాక్స్ పాత్ర మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ చిత్రం ద్వారా ఈ జనరేషన్ ని కూడా నవ్వించే అవకాశాన్ని నాకు ఇచ్చిన దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు.” అన్నారు.

ఈ వేడుకలో నటీనటులు ప్రియాంక జవాల్కర్, రెబా మోనికా జాన్, విష్ణు ఓఐ, సత్యం రాజేష్, కార్తికేయ, ఆంథోనీ రవి, రామ్ ప్రసాద్, గీత రచయిత కాసర్ల శ్యామ్ తదితరులు పాల్గొని మ్యాడ్ స్క్వేర్ చిత్రానికి ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతఙ్ఞతలు తెలిపారు.

NTR steals the show with his heartfelt praise for the MAD Square team

*MAD Square Success Celebrations: A Night of Laughter, Gratitude and Glory

The MAD Square gang gathered at Shilpakala Vedika in Hyderabad for a grand success bash celebrating the film’s triumph…. Blockbuster MAXX Success Celebrations was a star studded affair. Man of Masses NTR graced the occasion as the chief guest.

The highlight of the evening was Jr. NTR’s appearance which sent the crowd into a frenzy. While addressing the audience, he was full of praise for the team and extended his best wishes to each and every member.
Blockbuster Director Trivikram also graced the event.

NTR Said:
It’s been a long time since I met you like this and today, thanks to Nagavamsi, we’re all together again. Making people laugh is a true blessing. No matter how many struggles or hardships we face, when someone makes us laugh, we feel like we can forget our pain and move forward. People who can do that are rare. Today, we have one such person with us director Kalyan Shankar.

Congratulations to all the actors and technicians who stood by such a wonderful director. Murali who played the father’s role was outstanding.

And Anthony! While watching the film, I found myself clapping when he entered. In MAD 1, they used to say ‘Deentoni’ about Anthony that character is unforgettable. Giving a comedy character a mass hero style entry was so well done.

Coming to Vishnu, who played Laddu — I don’t think the film would’ve been such a hit without him.

When I see Sangeeth and his brother Santosh, I’m reminded of their father, the late Sobhan garu. I met him once — I’ve never seen someone as humble as him. I believe Sobhan garu is with us today proud of his son’s success.

Ram Nithin in MAD 1 reminded me of myself when I was younger. It’s not easy to perform in front of a camera but he did it so well. Comedy timing is very hard for an actor which is why I’m thinking of doing Adhurs 2! Ram Nithin has a bright future.

I got married in 2011 and back then, Nithin was just a little kid. He was so shy, he was scared to even talk to me. But the only line he ever boldly told me was, ‘Bava, I want to become an actor.’ I told him go ahead and follow your heart.

I also thoroughly enjoyed Satyam Rajesh and Kartikeya’s comedy in the film.

After Brahmanandam garu, MS Narayana garu, and Dharmavarapu garu, the actor who can make us laugh on that level is Sunil.
Congrats to music director Bheems garu, lyricist Kasarla Shyam garu and everyone who worked on this film.

There’s a famous dialogue in Attarintiki Daredi — ‘There’s always an unseen force behind you.’ That unseen force behind everyone here is Nagavamsi. He has an immense passion for cinema. His words may be tough, but his heart is kind. And it’s that kindness that will always protect him.

Trivikram Srinivas:

Congratulations to the entire MAD team — the actors and technicians each and every one of them.

It always feels a bit awkward to praise our own family during a family function and that’s why I won’t speak much today. I’ll just say one thing and wrap this up.

Hearing everyone chant ‘Jai NTR’ reminded me of the word ‘Giant’ and truly, he is a giant.”

Hero Narne Nithiin:

Thank you so much to all the fans of my bava who came to this event.
There’s a dialogue from Janatha Garage that I want to say — ‘For a change… there’s strength beside the weak.’

I’m not just saying this casually. After we wrapped MAD-1 there was no buzz around the film. It was Jr. NTR who launched the trailer and that brought all the buzz we needed. People showed up in theaters and the rest is history and movie became a big hit.

Now we’re back with MAD Square. Thank you so much bava. We’ll always be indebted to you.

Sangeeth Shoban:: A big thank you to NTR garu for attending this event.
When he launched the trailer of MAD it felt like we had conquered the world.
Now having him here for the MAD Square success meet is another dream come true.

Ram Nithin: NTR garu was the first star I met after entering the film industry.
The trailer launch of MAD happened through him and I’ll never forget that.
Now, he’s here again as the Chief Guest for the MAD Square success meet. What more could I ask for?

Thank you to Trivikram garu for giving Telugu cinema so many great films.

Kalyan Shankar:: Thank you to NTR garu and Trivikram garu for attending this celebration.
I must especially thank three people:
Without Nagavamsi garu I wouldn’t be here.

Without Chinnababu garu MAD wouldn’t have happened.
Without editor Naveen Nooli garu, we wouldn’t have had such a big hit.

And of course, thank you to each and every actor and technician who contributed to this success.

Music Director Bheems, Sunil, Priyanka Jawalkar, Reba Monica John, Vishnu Oi, Satyam Rajesh, Kartikeya, Anthony Ravi, Ram Prasad, lyricist Kasarla Shyam and many others also attended the event and expressed their heartfelt thanks to the audience for the massive success of MAD Square.

This was the event fans had been eagerly waiting for to finally see and hear their hero. His words turned the evening into a true CELEBRATION.

 GANI1286 GANI1285 GANI0689 GANI0676 GANI0655 GANI0663 GANI0648 (1) GANI0566 GANI0648 GANI0646 GANI0592 DSC_1177