About Venugopal L

http://www.venugopalpro.com

I have been in this profession for 21 years. I started my career as a film journalist in SUPRABATAM (socio political weekly – 1990-1993) BULLITERA (TV & Film magazine – 1993-1994) after that I worked for SUPERHIT FILM WEEKLY from 1994 to 1996 and then I moved to DASARI NARAYANA RAO’s film weekly MEGHASANDESHAM for 3 years after that I worked the same film journalist for well known Telugu daily ANDHRA JYOTHI from 1999 to 2000 and I have been working for well known Telugu Weekly INDIA TODAY since 2001(as a freelancer

Posts by Venugopal L:

రచనామౌర్య తో ఆడి,పాడిన ‘సుడిగాడు’

 రచనామౌర్య’  తో ఆడి,పాడిన  ’సుడిగాడు’



వినోదం ప్రధానంగా రూపొందుతున్న ఈ  చిత్రానికి సంభందించి ఇటీవల  ’నరేష్, రచనామౌర్య’ ల పై 

పసందైన గీతాన్ని హైదరాబాద్  లోని ఓ పబ్ లో చిత్రీకరించారు. వాటి వివరాల్లోకి వెళితే…గీతరచయిత  రామజోగయ్య  శాస్త్రి  రచించిన  ఈ గీతానికి భాను నృత్య దర్శకత్వం వహించారు. ‘ గజిబిజి గతుకుల  రోడ్డులో’ అంటూ సాగే ఈ గీతంలో నాయిక ‘మోనాల్ గుజ్జర్’ తో పాటు ప్రధాన పాత్రలు కూడా కనిపిస్తాయని దర్శకుడు తెలిపారు. దాదాపు పదిహేను కు మంది పైగా నృత్య తారలు, యాభై కి మంది పైగా జూనియర్ ఆర్టిస్ట్ లు ఈ పాటలో పాల్గొన్నారు.
హాస్య చిత్రాల కధానాయకుడు నరేష్ , మొనాల్ గజ్జర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘సుడిగాడు’ షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం  నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ‘అరుంధతి’  మూవీస్ పతాకం పై నిర్మాత చంద్రశేఖర్.డి.రెడ్డి , భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ‘ఒకే టిక్కెట్ పై 100 సినిమాలు’ అన్నది ఉప శీర్షిక. 

 ’సుడిగాడు’ నాన్ స్టాప్ ఎంటర్ టైన్మెంట్ 

 నరేష్ చిత్రాలన్నీ వినోదాన్నిఅందిస్తాయి.. అయితే  ఈ ‘సుడిగాడు’ నాన్ స్టాప్ ఎంటర్ టైన్మెంట్  అందిస్తాడు. అది ఎంతో కొత్త తరహాలో ఉంటుంది. విజయ వంతమైన చిత్రాలలోని పలు ఆసక్తి కరమైన సన్నివేశాలను పేరడీ చేస్తూ, చిత్ర కధనాన్ని వినోదంతో మేళవించి ప్రేక్షకుల్ని నవ్వుల్లో ఓల లాడించటం ఈ చిత్రం ప్రత్యేకత.
అదే ఈ ‘సుడిగాడు’ ను నరేష్ చిత్రాలలో  ఘన విజయం సాధించేదిగా ఉంటుందని దర్శక,నిర్మాతలు అంటున్నారు.

ఆడియో జూన్  రెండవ వారంలో విడుదల:

షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆడియో జూన్  రెండవ వారంలో ఉంటుంది. అదే నెలాఖరులోగా చిత్రాన్ని విడుదల చేయాలన్న దిశగా  నిర్మాణ కార్య క్రమాలు జరుగు తున్న్నాయని నిర్మాత చంద్రశేఖర్.డి.రెడ్డి అన్నారు.

‘సుడిగాడు’ కు మూలకధ: అముదన్; రచనా సహకారం: అనిల్,నారాయణ,హరి,గోపి; సంగీతం: శ్రీవసంత్; పాటలు: సిరివెన్నెల సీతారామ శాస్త్రి, చంద్రబోస్, రామ జోగయ్య శాస్త్రి, అనంత శ్రీరాం, భీమనేని రోశితా సాయి; కెమేర: విజయ్ ఉలఘనాధన్; ఎడిటింగ్: గౌతంరాజు; ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వివేక్ కూచిభొట్ల, నిర్మాత: చంద్రశేఖర్.డి.రెడ్డి; కధ-మాటలు-స్క్రీన్ ప్లే – దర్శకత్వం; భీమనేని శ్రీనివాసరావు.

ఏవీయస్ " బ్లాగ్ బస్టర్ అవార్డ్స్ " కు ఆసియా రికార్డు

                        ఏవీయస్ ” బ్లాగ్  బస్టర్ అవార్డ్స్ “  కు ఆసియా రికార్డు 

      నటుడు, దర్శకుడు, రచయిత ఏవీయస్ ఇటివల బ్లాగ్ బస్టర్ అవార్డ్స్ పేరిట ఆన్ లైన్ వోటింగు 
      విధానం ప్రవేశ పెట్టారు.. ప్రపంచ వ్యాప్తంగా వున్న తెలుగు సినిమా అభిమానులు ఈ సైట్ లో 
      ఆన్ లైన్ లో వోటింగ్ చేస్తున్నారు…  “ avsfilm.in ” అనే తన బ్లాగు ద్వారా ఏవీయస్ ఈ సినిమా 
      అవార్డుల ఎంపిక విధానాన్ని మొట్ట మొదటి సారిగా పరిచయం చేసి కొద్ది రోజుల క్రితం 
     వీక్షకుల ముందుంచారు… అప్పటినుంచి ఈ బ్లాగులో వోటింగ్ మొదలయింది… పదకొండు 
     క్యాతగిరిలా నుంచి అవార్డులను ఈ విధానం ద్వారా వ్యుయర్స్ తమ అభిమాన నటినటులను, 
     సాంకేతిక నిపుణులను ఎంచుకుంటారు. ఇలా ఒక కాన్సెప్ట్ ను ప్రవేశ పెట్టటం ఇదే మొదటి సారి 
     అని పలువురు ఏవీయస్ ప్రయత్నాన్ని అభినందించారు. ఇందుకు బలాన్ని చేకూరుస్తూ 
     ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు ఈ కాన్సెప్టు కు తమ రికార్డులలో చోటు కల్పించారు…
     కొద్ది రోజుల్లోనే ఆసియా రికార్డులలో కూడా ఈ కాన్సేప్టును రికార్డు లలో నమోదు చేస్తామని 
     వారు ఏవీయస్ కు పంపిన లేఖలో పేర్కొన్నారు… ఆసియా రికార్డు కూడా సాధించిన 
    తరువాత అమేజింగ్ వరల్డ్ రికార్డులలో కూడా తన కాన్సెప్ట్ స్థానం సంపాదించు కోగలదన్న
    ఆశాభావాన్ని వ్యక్తం చేశారు… ఇటువంటి రికార్డు సాధించిన మొదటి తెలుగు వాడిగా తన
    పేరు నమోదు కావటం ఆనందకరంగా వుందని ఏవీయస్ పేర్కొన్నారు

‘సుడిగాడు’ షూటింగ్ పూర్తి; జూన్ లో విడుదల

 ‘సుడిగాడు’ షూటింగ్ పూర్తి : జూన్ లో విడుదల 
హాస్య చిత్రాల కధానాయకుడు నరేష్ , మొనాల్ గజ్జర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘సుడిగాడు’ షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం  నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ‘అరుంధతి’  మూవీస్ పతాకం పై నిర్మాత చంద్రశేఖర్.డి.రెడ్డి , భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ‘ఒకే టిక్కెట్ పై 100 సినిమాలు’ అన్నది ఉప శీర్షిక. 

వినోదం లక్ష్యం గా ‘సుడిగాడు’
 సాధారణంగా నరేష్ చిత్రాలన్నీ వినోదాన్ని పునాదిగా చేసుకునే రూపొందుతాయి. ఈ ‘సుడిగాడు’ కూడా వినోదాన్నే అందిస్తాడు. కానీ అది ఎంతో కొత్త తరహాలో ఉంటుంది. విజయ వంతమైన చిత్రాలలోని పలు ఆసక్తి కరమైన సన్నివేశాలను పేరడీ చేస్తూ, చిత్ర కధనాన్ని వినోదంతో పరుగెత్తిస్తూ ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచెత్తటం ఈ చిత్రం ప్రత్యేకత.
అదే ఈ ‘సుడిగాడు’ ను నరేష్ చిత్రాలలో వైవిధ్యాన్ని సంతరించు కునేలా చేస్తోందని దర్శక,నిర్మాతలు అంటున్నారు.
జూన్ లో విడుదల:
షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆడియో జూన్ ప్రధమార్ధం లో ఉంటుంది. అదే నెలాఖరులోగా చిత్రాన్ని విడుదల చేయాలన్న దిశగా  నిర్మాణ కార్య క్రమాలు జరుగు తున్న్నాయని నిర్మాత చంద్రశేఖర్.డి.రెడ్డి అన్నారు.

‘సుడిగాడు’ కు మూలకధ: అముదన్; రచనా సహకారం: అనిల్,నారాయణ,హరి,గోపి; సంగీతం: శ్రీవసంత్; పాటలు: సిరివెన్నెల సీతారామ శాస్త్రి, చంద్రబోస్, రామ జోగయ్య శాస్త్రి, అనంత శ్రీరాం, భీమనేని రోశితా సాయి; కెమేర: విజయ్ ఉలఘనాధన్; ఎడిటింగ్: గౌతంరాజు; ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వివేక్ కూచిభొట్ల, నిర్మాత: చంద్రశేఖర్.డి.రెడ్డి; కధ-మాటలు-స్క్రీన్ ప్లే – దర్శకత్వం; భీమనేని శ్రీనివాసరావు.

సుడిగాడు పోస్టర్ డిజైన్

Romeo: First Look