Father Chitti Uma Kaarthik

FCUK (Father Chitti Uma Karthik) Movie Hey Hudiya Song released by media for media

ఎఫ్‌సీయూకే’ (ఫాద‌ర్‌-చిట్టి-ఉమా-కార్తీక్‌) లోని “హే హుడియా” పాట‌ను విడుద‌ల చేసిన మీడియా
జ‌గ‌ప‌తిబాబు ప్ర‌ధాన పాత్ర పోషించ‌గా శ్రీ రంజిత్ మూవీస్ ప‌తాకంపై కె.ఎల్‌. దామోద‌ర్ ప్ర‌సాద్ నిర్మించిన చిత్రం ‘ఎఫ్‌సీయూకే’ (ఫాద‌ర్‌-చిట్టి-ఉమా-కార్తీక్‌). రామ్ కార్తీక్‌, అమ్ము అభిరామి జంట‌గా, బేబి స‌హ‌శ్రిత మ‌రో కీల‌క పాత్ర‌ధారిగా న‌టించిన ఈ సినిమాకు విద్యాసాగ‌ర్ రాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

ఇదివ‌ర‌కు టాలీవుడ్‌లో ఎవ‌రూ చేయ‌ని విధంగా ఈ చిత్రంలోని పాట‌ల‌ను నిజ జీవిత హీరోల‌తో విడుద‌ల చేస్తూ వ‌స్తున్నారు. సినిమా వేడుక‌ల‌ను, ప్రెస్‌మీట్ల‌ను క‌వ‌ర్ చేయ‌డానికి వ‌చ్చే మీడియా సిబ్బందితో ఈ చిత్రంలోని నాలుగో పాట “హే హుడియా”ను విడుద‌ల చేయించ‌డం విశేషం.

కొవిడ్ 19 మ‌హమ్మారిపై మొద‌ట్నుంచీ ముందుండి పోరాటం చేస్తూ, అవిశ్రాంతంగా సేవ‌లందిస్తూ వ‌స్తోన్న వైద్య‌-ఆరోగ్య‌, మునిసిప‌ల్‌, పోలీస్ సిబ్బంది చేతుల మీదుగా మూడు పాట‌ల‌ను చిత్ర బృందం విడుద‌ల చేయించింది. ఆ పాట‌లు సంగీత ప్రియుల‌ను అమితంగా అల‌రిస్తున్నాయి.

శ్రీ రంజిత్ మూవీస్ అధినేత కె.ఎల్‌. దామోద‌ర్ ప్ర‌సాద్ మాట్లాడుతూ, త‌మ జీవితాల‌ను ప‌ణంగా పెట్టి, ఎదుటివాళ్ల జీవితాల‌ను కాపాడ్డం కోసం అమూల్య‌మైన సేవ‌లందిస్తూ వ‌స్తున్న కొవిడ్ ఫ్రంట్‌లైన్ వారియ‌ర్స్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలుపుకోవాల‌నే ఉద్దేశంతోటే ఈ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టామ‌న్నారు.

జ‌గ‌ప‌తిబాబు మాట్లాడుతూ, కొవిడ్ ఫ్రంట్‌లైన్ వారియ‌ర్స్‌గా మీడియాకు గుర్తింపు రాలేద‌నీ, అయితే కొవిడ్ మ‌హ‌మ్మారికి సంబంధించిన స‌మాచారాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు ఫీల్డ్‌లో ఉండి అందిస్తూ, అంద‌రినీ అప్ర‌మ‌త్తం చేస్తూ వ‌చ్చింది మీడియా సిబ్బందేన‌నీ అన్నారు. అలాంటి వారి చేతుల మీదుగా ఈ చిత్రంలోని పాట విడుద‌ల కావ‌డం త‌న‌కెంతో ఆనందాన్నిచ్చింద‌ని చెప్పారు.

భీమ్స్ సెసిరోలియో బాణీలు స‌మ‌కూర్చిన “హే హుడియా” పాట‌ను ఆవిష్క‌రించిన సీనియ‌ర్ ఫిల్మ్ జ‌ర్న‌లిస్టులు సాయిర‌మేశ్‌, నాగేంద్ర‌కుమార్‌.. ఆ పాట‌ను రాగ‌యుక్తంగా ఆల‌పిస్తూ ఆస్వాదించారు.

క‌రోనా మ‌హ‌మ్మారిపై పోరాటంలో మీడియా పాత్ర‌ను ప్ర‌శంసించిన హీరో రామ్ కార్తీక్‌, “హే హుడియా” పాట‌ను విడుద‌ల చేసిన జ‌ర్న‌లిస్టుల‌కు థాంక్స్ చెప్పారు.

డైరెక్ట‌ర్ విద్యాసాగ‌ర్ రాజు మాట్లాడుతూ, రొమాంటిక్ కామెడీగా రూపొంది, ఫిబ్ర‌వ‌రి 12న థియేట‌ర్ల‌లో విడుద‌ల‌వుతున్న‌ ‘ఎఫ్‌సీయూకే’ మూవీ క‌చ్చితంగా ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తుంద‌నే న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేశారు.


తారాగ‌ణం:
జ‌గ‌ప‌తిబాబు, రామ్ కార్తీక్‌, అమ్ము అభిరామి, బేబి స‌హ‌శ్రిత‌, అలీ, దగ్గుబాటి రాజా, కళ్యాణి నటరాజన్, బ్రహ్మాజీ, కృష్ణ భగవాన్, రజిత, జబర్దస్త్ రామ్ ప్రసాద్, నవీన్, వెంకీ, రాఘవ, భరత్‌.

సాంకేతిక బృందం:
మాటలు:ఆదిత్య, కరుణాకర్
ఛాయాగ్రహణం: శివ జి.
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
బ్యాక్ గ్రౌండ్ స్కోర్: జీవన్
పాటలు: ఆదిత్య,కరుణాకర్, భీమ్స్
ఎడిటింగ్: కిషోర్ మద్దాలి
ఆర్ట్: జె.కె.మూర్తి
పి.ఆర్.ఓ: యల్. వేణుగోపాల్
లైన్ ప్రొడ్యూస‌ర్: వాసు ప‌రిమి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్: శ్రీ‌కాంత్‌రెడ్డి పాతూరి
స‌హ‌నిర్మాత: య‌ల‌మంచిలి రామ‌కోటేశ్వ‌ర‌రావు
కథ-స్క్రీన్ ప్లే- కొరియోగ్రఫీ-దర్శకత్వం: విద్యాసాగర్ రాజు
నిర్మాత: కె.ఎల్. దామోదర్ ప్రసాద్
బ్యాన‌ర్‌: శ్రీ రంజిత్ మూవీస్.

 FCUK (Father Chitti Uma Karthik) Movie Hey Hudiya Song released by media for media
In a never before kind of event, media personnel released a song for the media personnel. ‘Hey Hudiya’ song from FCUK Movie was released by the media personnel who had come to cover the event. This is as part of the initiative by Sri Ranjith Movies to release the song by real heroes of the pandemic and the previous songs were released by health, muncipal and police personnel. Speaking on behalf of Sri Ranjith Movies producer K L Damodar Prasad said that this initiative was taken as a small token of gratitude to the invaluable services of the covid frontline workers who risked their lives to save others lives. Jagapati Babu Garu said that media was among the sections that didn’t get recognition though they played a pivotal role in keeping the information flowing when everyone was scared to step up. The media stalwarts who participated in the event thoroughly enjoyed singing the song ‘Hey Hudiya’ the music for which was composed by Bheems Ceciroleo. Hero Ram Karthik thanked the media for their role in fighting the pandemic and for releasing the song of FCUK Movie. Director Vidyasagar Raju said that he was confident that FCUK which is a Romantic Comedy will be releasing in the theatres on February 12th 2021.
 Jagapatibabu, Karthik, Ammu Abhirami, Ali, Daggubati Raja, Kalyani Natarajan, Brahmaji, Krishna Bhagavaan, Rajitha, Jabardast Ram Prasad, Naveen, Venky, Raghava, Bharat etc.
Dialogues: Aditya,Karunakar,
Cinematography: Shiva.G
Music Director: Bheems Ceciroleo
Songs: Aditya, Karunakar, Bheems
Editing: Kishore Maddali
Art Director: J.k. Murthy
PRO: L.Venugopal
Story-Screenplay-Choreography-Direction: Vidyasagar Raju
Producer: KL Damodar Prasad
V_R_6239 V_R_6131 V_R_5648 HUDIYA 1

Health &Municipal workers releasing FCUK movie 2nd vocal song “*Nenem Cheyya”

‘ఎఫ్‌సీయూకే’ (ఫాద‌ర్‌-చిట్టి-ఉమా-కార్తీక్‌)   లో రెండో పాట “నేనేం చెయ్య‌..”ను విడుద‌ల చేసిన ఆరోగ్య కార్య‌క‌ర్త‌లు, పారిశుద్ధ్య కార్మికులుజగ‌ప‌తిబాబు ప్ర‌ధాన పాత్ర‌ధారిగా, రామ్ కార్తీక్‌, అమ్ము అభిరామి యువ జంట‌గా న‌టించిన ‘ఎఫ్‌సీయూకే’ (ఫాద‌ర్‌-చిట్టి-ఉమా-కార్తీక్‌) చిత్రం అన్ని కార్య‌క్ర‌మాల‌నూ పూర్తి చేసుకొని ఫిబ్ర‌వ‌రి 12న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. శ్రీ రంజిత్ మూవీస్ బ్యాన‌ర్‌పై కె.ఎల్‌. దామోద‌ర్ ప్ర‌సాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి విద్యాసాగ‌ర్ రాజు ద‌ర్శ‌కుడు. బేబి స‌హ‌శ్రిత మ‌రో కీల‌క పాత్ర‌ధారి.

రీల్ హీరోల‌కు బ‌దులు రియ‌ల్ హీరోల‌తో ‘ఎఫ్‌సీయూకే’ పాట‌ల‌ను విడుద‌ల చేయించాల‌ని నిర్ణ‌యించుకున్న చిత్ర బృందం, అందులో భాగంగా కొవిడ్ 19 మ‌హ‌మ్మారిపై అవిశ్రాంతంగా పోరాడుతున్న ఫ్రంట్‌లైన్ వారియ‌ర్స్‌తో ఒక్కో పాట‌ను విడుద‌ల చేస్తూ వ‌స్తోంది. ఇప్ప‌టికే “ముఝ్‌సే సెల్ఫీ లేలో..” అంటూ సాగే తొలి పాట‌ను ప్ర‌ముఖ ఆర్థోపెడీషియ‌న్ డాక్ట‌ర్ ఎ.వి. గుర‌వారెడ్డి చేతులు మీదుగా విడుద‌ల చేశారు. ఈ పాట‌కు సంగీత ప్రియుల నుంచి మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తోంది.

లేటెస్ట్‌గా బుధ‌వారం “నేనేం చెయ్య‌..” అంటూ సాగే రెండో పాట‌ను ఆరోగ్య కార్య‌క‌ర్త‌లు, పారిశుద్ధ్య కార్మికులు విడుద‌ల చేయ‌డం గ‌మనార్హం. లాక్‌డౌన్ టైమ్‌లో కొవిడ్ నుంచి ప్ర‌జ‌ల‌ను కాపాడ‌టంలో నిరంత‌రాయంగా పనిచేసి, ఒక‌వైపు ప‌రిస‌రాల‌ను ప‌రిశుభ్రంగా ఉండేలా చూస్తూ, మ‌రోవైపు ఆరోగ్య‌సేవ‌లు అందిస్తూ వ‌చ్చిన ఆరోగ్య కార్య‌క‌ర్త‌లు, పారిశుద్ధ్య కార్మికుల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలుపుకోవాల‌నే చిరు ప్ర‌య‌త్నంతోటే “నేనేం చెయ్య..” పాట‌ను వారి చేత విడుద‌ల చేయించింది చిత్ర బృందం.

ఈ పాట‌ను సినిమాలో జగ‌ప‌తిబాబుపై చిత్రీక‌రించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, ఆరోగ్య కార్య‌క‌ర్త‌లు, పారిశుద్ధ్య కార్మికులు “నేనేం చెయ్య‌..” పాట‌ను విడుద‌ల చేయ‌డం ఎంతో గౌర‌వంగా భావిస్తున్నాన‌నీ, ఈ పాట‌ను అంద‌రూ ఎంజాయ్ చేస్తార‌నీ అన్నారు.

త్వ‌ర‌లో మ‌రో రెండు పాట‌ల‌ను పోలీసు, మీడియా సిబ్బంది చేతుల మీదుగా విడుద‌ల చేస్తామ‌ని నిర్మాత దామోద‌ర్ ప్ర‌సాద్, ద‌ర్శ‌కుడు విద్యాసాగ‌ర్ రాజు తెలిపారు.

తారాగ‌ణం:
జ‌గ‌ప‌తిబాబు, రామ్ కార్తీక్‌, అమ్ము అభిరామి, బేబి స‌హ‌శ్రిత‌, అలీ, దగ్గుబాటి రాజా, కళ్యాణి నటరాజన్, బ్రహ్మాజీ, కృష్ణ భగవాన్, రజిత, జబర్దస్త్ రామ్ ప్రసాద్, నవీన్, వెంకీ, రాఘవ, భరత్‌.

సాంకేతిక బృందం:
మాటలు:ఆదిత్య, కరుణాకర్
ఛాయాగ్రహణం: శివ జి.
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
బ్యాక్ గ్రౌండ్ స్కోర్: జీవన్
పాటలు: ఆదిత్య,కరుణాకర్, భీమ్స్
ఎడిటింగ్: కిషోర్ మద్దాలి
ఆర్ట్: జె.కె.మూర్తి
పి.ఆర్.ఓ: యల్. వేణుగోపాల్
లైన్ ప్రొడ్యూస‌ర్: వాసు ప‌రిమి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్: శ్రీ‌కాంత్‌రెడ్డి పాతూరి
స‌హ‌నిర్మాత: య‌ల‌మంచిలి రామ‌కోటేశ్వ‌ర‌రావు
కథ-స్క్రీన్ ప్లే- కొరియోగ్రఫీ-దర్శకత్వం: విద్యాసాగర్ రాజు
నిర్మాత: కె.ఎల్. దామోదర్ ప్రసాద్
బ్యాన‌ర్‌: శ్రీ రంజిత్ మూవీస్.

 *Health &Municipal workers never made us down in our tough times. Saluting them with a small gesture of releasing FCUK movie 2nd vocal song “*Nenem Cheyya”*by them.
As part of the praiseworthy initiative of FCUK (Father Chitti Uma Karthik) movie team to release the songs by real world stars of the pandemic instead of the reel world stars the second song is scheduled to be released tomm. After the ripples created by the release of first song vocal by acclaimed Covid Worrior Dr. Gurva Reddy, the second song is being released by health and muncipal workers who braved the lockdown to keep the essential services running and ensuring sanitation and health services were uninterrupted. They will be releasing the song ‘Nenem cheyya’. The poster announcing the same apart from showing the real Covid heroes also shows actor Jagapati Babu grooving to the song in the movie. This shows that the song is filmed on Jagapati Babu Garu and it is a song to look forward to.
Sri Ranjith Movies and its FCUK movie team took the initiative to release the songs vocals by covid warriors as a small token of gratitude. As part of this initiative health, muncipal, police and media personnel are being involved in the release of the movie songs.
Jagapatibabu, Karthik, Ammu Abhirami, Ali, Daggubati Raja, Kalyani Natarajan, Brahmaji, Krishna Bhagavaan, Rajitha, Jabardast Ram Prasad, Naveen, Venky, Raghava, Bharat etc.
Dialogues: Aditya,Karunakar,
Cinematography: Shiva.G
Music Director: Bheems Ceciroleo
Songs: Aditya, Karunakar, Bheems
Editing: Kishore Maddali
Art Director: J.k. Murthy
PRO: L.Venugopal
Story-Screenplay-Choreography-Direction: Vidyasagar Raju
Producer: KL Damodar Prasad
597A7621 NENEM CHEYYA (1) 597A6483

ఎఫ్‌సీయూకే’లో తొలి పాట “ముఝ్‌సే సెల్ఫీ లేలో..”ను విడుద‌ల చేసిన డాక్ట‌ర్ గుర‌వారెడ్డి

ఎఫ్‌సీయూకే’లో తొలి పాట “ముఝ్‌సే సెల్ఫీ లేలో..”ను విడుద‌ల చేసిన డాక్ట‌ర్ గుర‌వారెడ్డి


జ‌గ‌ప‌తిబాబు ప్ర‌ధాన పాత్ర‌ధారిగా, రామ్ కార్తీక్‌, అమ్ము అభిరామి జంట‌గా రూపొందుతున్న ‘ఎఫ్‌సీయూకే’ (ఫాద‌ర్-చిట్టి-ఉమా-కార్తీక్‌) చిత్రం ఫిబ్ర‌వ‌రి 12న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. శ్రీ రంజిత్ మూవీస్ బ్యాన‌ర్‌పై కె.ఎల్. దామోద‌ర్ ప్ర‌సాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి విద్యాసాగ‌ర్ రాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. టైటిల్‌లోని మ‌రో ప్ర‌ధాన పాత్ర చిట్టిగా బేబి స‌హ‌శ్రిత క‌నిపించ‌నున్న‌ది.

ఈ చిత్రంలోని తొలి పాట‌ను ప్ర‌ముఖ ఆర్థోపెడీషియ‌న్ డాక్ట‌ర్ ఎ.వి. గుర‌వారెడ్డి విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన పాత్ర‌ధారి జ‌గ‌ప‌తిబాబు మాట్లాడుతూ, త‌మ మూవీ ఫ‌స్ట్ సాంగ్‌ను కొవిడ్ 19 మ‌హ‌మ్మారిపై పోరాటం చేస్తున్న ఫ్రంట్‌లైన్ వారియ‌ర్స్‌లో ఒక‌రైన డాక్ట‌ర్ గుర‌వారెడ్డి విడుద‌ల చేయ‌డం గౌర‌వంగా భావిస్తున్నామ‌ని అన్నారు.

డాక్ట‌ర్ గుర‌వారెడ్డి మాట్లాడుతూ, ‘ఎఫ్‌సీయూకే’ చిత్రంలోని పాట‌లు చాలా బాగున్నాయ‌నీ, ఈ సినిమాను తిల‌కించేందుకు కుతూహ‌లంతో ఎదురుచూస్తున్నాన‌నీ అన్నారు. “ముఝ్‌సే సెల్ఫీ లేలో..” అంటూ సాగే ఫ‌స్ట్ సాంగ్‌ను రిలీజ్ చేసిన ఆయ‌న‌, ట్యూన్స్‌కు త‌గ్గ‌ట్టు ఆ పాట‌ను ఆల‌పించ‌డం గ‌మ‌నార్హం.

నిర్మాత కె.ఎల్‌. దామోద‌ర్ ప్ర‌సాద్ మాట్లాడుతూ, పాట‌ల‌ను సినీ స్టార్ల‌తో కాకుండా కొవిడ్ హీరోల చేతుల మీదుగా రిలీజ్ చేయించ‌డ‌మ‌నేది త‌మ ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టి వారు చేస్తున్న గొప్ప సేవ‌ల‌కు తాము తెలుపుతున్న‌ చిన్న‌పాటి కృత‌జ్ఞ‌త అని అన్నారు.

ఈ గీతాన్ని చిత్రంలోని యువజంట కార్తీక్, అమ్ము అభిరామి లపై చిత్రీకరించారు. నకాష్ అజీజ్, దివ్య భట్ లు ఆలపించిన ఈ గీతానికి ఆదిత్య సాహిత్యం అందించారు. మ్యూజిక్ డైరెక్ట‌ర్ భీమ్స్ సెసిరోలియో ఈ గీతానికి అందించిన సంగీతం ఆకట్టుకుంటుంది.

ఫిబ్ర‌వ‌రి 6న “ముఝ్‌సే సెల్ఫీ లేలో..” పూర్తి వీడియో సాంగ్‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు డైరెక్ట‌ర్ విద్యాసాగ‌ర్ రాజు ప్ర‌క‌టించారు. తొలి పాట‌ను విడుద‌ల చేసిన డాక్ట‌ర్ గుర‌వారెడ్డికి హీరో రామ్ కార్తీక్‌, మ్యూజిక్ డైరెక్ట‌ర్ భీమ్స్ సెసిరోలియో ధ‌న్య‌వాదాలు తెలిపారు.
 
తారాగ‌ణం:
జ‌గ‌ప‌తిబాబు, రామ్ కార్తీక్‌, అమ్ము అభిరామి, బేబి స‌హ‌శ్రిత‌, అలీ, దగ్గుబాటి రాజా, కళ్యాణి నటరాజన్, బ్రహ్మాజీ, కృష్ణ భగవాన్, రజిత, జబర్దస్త్ రామ్ ప్రసాద్, నవీన్, వెంకీ, రాఘవ, భరత్‌.
సాంకేతిక బృందం:
మాటలు:ఆదిత్య, కరుణాకర్
ఛాయాగ్రహణం: శివ జి.
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
బ్యాక్ గ్రౌండ్ స్కోర్: జీవన్
పాటలు: ఆదిత్య,కరుణాకర్, భీమ్స్
ఎడిటింగ్: కిషోర్ మద్దాలి
ఆర్ట్: జె.కె.మూర్తి
పి.ఆర్.ఓ: యల్. వేణుగోపాల్
లైన్ ప్రొడ్యూస‌ర్: వాసు ప‌రిమి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్: శ్రీ‌కాంత్‌రెడ్డి పాతూరి
స‌హ‌నిర్మాత: య‌ల‌మంచిలి రామ‌కోటేశ్వ‌ర‌రావు
కథ-స్క్రీన్ ప్లే- కొరియోగ్రఫీ-దర్శకత్వం: విద్యాసాగర్ రాజు
నిర్మాత: కె.ఎల్. దామోదర్ ప్రసాద్
బ్యాన‌ర్‌: శ్రీ రంజిత్ మూవీస్.

Sri Ranjith Movies F.C.U.K.(Father Chitti Uma Karthik) first vocal song was today released by acclaimed orthopedician Dr. A. V. Gurava Reddy. Speaking on the occasion the movies lead protagonist Jagapathi Babu said that it is a honour that one of the frontline warriors of the Covid 19 pandemic released the first vocal song of his new movie. Dr. Gurava Reddy said that he is very impressed with the songs of the movie and that he is looking forward to see the movie. He released the first vocal song ‘Mhujse selfie Leylo’ and even grooved to its tune. Producer Sri KL Dhamodhar Prasad said that the the decision to release the vocal song in the hands of Covid stars instead of celluloid stars is a small token of gratitude for the yeoman services they rendered. Director Sri. Vidyasagar Raju announced that the team is looking forward to releasing the full song on February 6th. Hero Karthik and Music Director Bheems Ceciroleo thanked Doctor Gurava Reddy for releasing the song.The song titled ’Selfie Lelo’ was sung by Nakash Aziz and Divya Bhatt. Lyrics are by Aditya while music was composed by Bheems Ceciroleo. The movie stars actor Ram Karthik as the hero and actress Ammu Abhirami as the heroine appear. The director of the movie Vidyasagar Raju who is an acclaimed choreographer himself choreographed this song.

Jagapatibabu, Karthik, Ammu Abhirami, Ali, Daggubati Raja, Kalyani Natarajan, Brahmaji, Krishna Bhagavaan, Rajitha, Jabardast Ram Prasad, Naveen, Venky, Raghava, Bharat etc.
Dialogues: Aditya,Karunakar,
Cinematography: Shiva.G
Music Director: Bheems Ceciroleo
Songs: Aditya, Karunakar, Bheems
Editing: Kishore Maddali
Art Director: J.k. Murthy
PRO: L.Venugopal
Story-Screenplay-Choreography-Direction: Vidyasagar Raju
Producer: KL Damodar Prasad
2U2A0119 2U2A0126 2U2A9981 2U2A9965 2U2A0118

NEWS: F.C.U.K. (FatherChittiUmaaKaarthik)

As per the announcement made by Jagapathi Babu, Sri Ranjith Movies has made arrangements for the release of its F.C.U.K. (FatherChittiUmaaKaarthik) movie songs not by celluloid stars but by real life stars who risked their life to save others during the pandemic. Accordingly the songs will be released by medical fraternity, police, municipal workers and media. The first song will be released by  noted doctor Sri. Gurva Reddy garu.

F.C.U.K. movie team led by producer Kl Damodar Prasad and director Vidyasagar Raju took this initiative as a small token of gratitude for the brave-hearts who were the frontline warriors against Covid 19.

- F.C.U.K. movie team

PHOTO-2021-01-24-09-00-11

‘ఎఫ్‌సీయూకే’ (ఫాద‌ర్-చిట్టి-ఉమా-కార్తీక్‌) పాట‌ల‌ను విడుద‌ల చేయ‌నున్న కొవిడ్ హీరోలు

 ’ఎఫ్‌సీయూకే’ (ఫాద‌ర్-చిట్టి-ఉమా-కార్తీక్‌) పాట‌ల‌ను విడుద‌ల చేయ‌నున్న కొవిడ్ హీరోలు 
జ‌గ‌ప‌తిబాబు ప్ర‌ధాన పాత్ర‌ధారిగా, రామ్ కార్తీక్‌, అమ్ము అభిరామి జంట‌గా రూపొందుతున్న ‘ఎఫ్‌సీయూకే’ (ఫాద‌ర్-చిట్టి-ఉమా-కార్తీక్‌) చిత్రం ఫిబ్ర‌వ‌రి 12న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. శ్రీ రంజిత్ మూవీస్ బ్యాన‌ర్‌పై కె.ఎల్. దామోద‌ర్ ప్ర‌సాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి విద్యాసాగ‌ర్ రాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

కాగా, ఈ సినిమా పాట‌ల‌ను విభిన్న త‌ర‌హాలో విడుద‌ల చేయ‌డానికి చిత్ర బృందం ప్లాన్ చేసింది. సాధార‌ణంగా సినిమా పాట‌ల‌ను సినిమా స్టార్ల‌తో రిలీజ్ చేస్తుంటారు. కానీ ‘ఎఫ్‌సీయూకే’ పాట‌ల‌ను కొవిడ్ హీరోలు రిలీజ్ చేయ‌నున్నారు. అవును. ఈ విష‌యాన్ని జ‌గ‌ప‌తిబాబు ఎనౌన్స్ చేశారు. అంద‌రినీ క్షేమంగా ఉంచ‌డానికి త‌మ జీవితాల్ని ప‌ణంగా పెట్టి, కొవిడ్‌పై అలుపెరుగ‌కుండా పోరాడుతూ వ‌స్తున్న ఫ్రంట్‌లైన్ వారియ‌ర్స్‌కు సెల్యూట్ చేయాల‌నే స‌దుద్దేశంతో పాట‌ల విడుద‌ల‌కు వారిని ఆహ్వానించిన‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు.

సోష‌ల్ మీడియా ద్వారా షేర్ చేసిన ఓ వీడియో సందేశంలో ఆయ‌న, దేశ‌మంతా లాక్‌డౌన్‌లో ఉన్న కాలంలో, అంద‌రూ ఇళ్ల‌ల్లో నుంచి బ‌య‌ట‌కు రావ‌డానికి భ‌య‌ప‌డుతున్న స‌మ‌యంలో ఒక్క‌రోజు కూడా వెనక‌డుగు వేయ‌కుండా నిరంత‌రాయంగా సేవ‌లు అందిస్తూ వ‌చ్చిన మెడిక‌ల్‌, పోలీసు, మునిసిప‌ల్, మీడియా సిబ్బంది కృషిని కొనియాడారు. వారి అసామాన్య సేవ‌ల‌కు గుర్తింపుగా ఒక్కో విభాగానికి చెందిన రియ‌ల్ హీరో చేతుల మీదుగా ‘ఎఫ్‌సీయూకే’ చిత్రంలోని ఒక్కో పాట‌ను విడుద‌ల చేయిస్తున్న‌ట్లు జ‌గ‌ప‌తిబాబు చెప్పారు.

ఇదివ‌ర‌కు ఈ వారం మొద‌ట్లో జ‌రిగిన ‘ఎఫ్‌సీయూకే’ టీజ‌ర్ రిలీజ్ కార్య‌క్ర‌మంలో ఆయ‌న మాట్లాడుతూ, తాను ప‌నిచేసిన అత్యంత విల‌క్ష‌ణ చిత్రాల్లో ఈ సినిమా ఒక‌ట‌ని తెలిపారు. ఇది పూర్తి రొమాంటిక్ కామెడీ మూవీ అనీ, ఇందులో తాను చేసిన‌ ఫాద‌ర్ క్యారెక్ట‌ర్ చాలా తృప్తినిచ్చింద‌నీ చెప్పారు. ప‌నిచేసిన ప్ర‌తి ఒక్క‌రికీ ఈ సినిమా మంచి పేరు తెస్తుంద‌ని ఆయ‌న‌న్నారు.

తారాగ‌ణం:
జ‌గ‌ప‌తిబాబు, రామ్ కార్తీక్‌, అమ్ము అభిరామి, బేబి స‌హ‌శ్రిత‌, అలీ, దగ్గుబాటి రాజా, కళ్యాణి నటరాజన్, బ్రహ్మాజీ, కృష్ణ భగవాన్, రజిత, జబర్దస్త్ రామ్ ప్రసాద్, నవీన్, వెంకీ, రాఘవ, భరత్‌.

సాంకేతిక బృందం:
మాటలు:ఆదిత్య, కరుణాకర్
ఛాయాగ్రహణం: శివ జి.
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
బ్యాక్ గ్రౌండ్ స్కోర్: జీవన్
పాటలు: ఆదిత్య,కరుణాకర్, భీమ్స్
ఎడిటింగ్: కిషోర్ మద్దాలి
ఆర్ట్: జె.కె.మూర్తి
పి.ఆర్.ఓ: యల్. వేణుగోపాల్
లైన్ ప్రొడ్యూస‌ర్: వాసు ప‌రిమి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్: శ్రీ‌కాంత్‌రెడ్డి పాతూరి
స‌హ‌నిర్మాత: య‌ల‌మంచిలి రామ‌కోటేశ్వ‌ర‌రావు
కథ-స్క్రీన్ ప్లే- కొరియోగ్రఫీ-దర్శకత్వం: విద్యాసాగర్ రాజు
నిర్మాత: కె.ఎల్. దామోదర్ ప్రసాద్
బ్యాన‌ర్‌: శ్రీ రంజిత్ మూవీస్.

 
COVID HEROES AND NOT CELLULOID HEROES TO RELEASE FCUK SONGS 
- Jagapatibabu

Jagapathi Babu, whose upcoming movie FCUK is scheduled to release on February 2021, announced that unlike traditional format of inviting reel life stars for songs release FCUK movie songs will be released by Covid Heroes. He said that Sri Ranjith Movies took this decision as a mark of salute to the frontline warriors who risked their lives to save everyone else. In a video Jagapathi Babu released through social media he praised the medical fraternity, police fraternity, muncipal fraternity and media fraternity for never stopping for a day while the entire nation was in lockdown and everyone quivered to step out. Asking a member of each fraternity to release one song of FCUK movie is a small tribute to recognise their yeoman service.

Earlier this week during the release of the FCUK teaser he said the FCUK movie was one of the most unique films that he was associated with. He squashed rumours about the genre of the movie and said that it is a pure romantic comedy and the name is the acronym of the full name ‘Father Chitti Umaa Kaarthik and should not be interrupted in any other manner.

Jagapatibabu, Karthik, Ammu Abhirami, Ali, Daggubati Raja, Kalyani Natarajan, Brahmaji, Krishna Bhagavaan, Rajitha, Jabardast Ram Prasad, Naveen, Venky, Raghava, Bharat etc.
Dialogues: Aditya,Karunakar,
Cinematography: Shiva.G
Music Director: Bheems Ceciroleo
Songs: Aditya, Karunakar, Bheems
Editing: Kishore Maddali
Art Director: J.k. Murthy
Story-Screenplay-Choreography-Direction: Vidyasagar Raju
Producer: KL Damodar Prasad
V_R_4062 V_R_7615 V_R_4171 V_R_2237