Feb
25
2013
‘శ్రీకాంత్’ హీరోగా దండుపాళ్యం దర్శకుని
ద్వి భాషా చిత్రం
యదార్ధ సంఘటన ఆధారంగా రూపొంది అటు కన్నడ, ఇటు తెలుగునాట కూడా విజయం సాధించిన ‘దండుపాళ్యం’
చిత్ర దర్శకుడు ‘శ్రీనివాసరాజు’ దర్శకత్వంలో శ్రీకాంత్ హీరోగా ఓ చిత్రం రూపొందనుంది. గతంలో శ్రీకాంత్ హీరోగా గోల్డెన్ లయన్
ఫిలిమ్స్ పతాకంపై ‘మహాత్మ’ చిత్రాన్ని నిర్మించిన సి.ఆర్.మనోహర్,‘ఇ స్క్వేర్ ‘ సంస్థ విజయ్ లు సంయుక్తంగా కలసి ఈ చిత్రాన్ని
నిర్మించనున్నారు, తెలుగు, కన్నడ భాషలలో భారీ వ్యయం తో రూపొందే ఈ చిత్రాన్ని మిత్రుడు ‘శ్రీకాంత్’ హీరోగా
నిర్మించటం ఎంతో ఆనందంగా ఉన్నదని నిర్మాతలు సి.ఆర్.మనోహర్,విజయ్ లు తెలిపారు. జూన్ నెలలో ఈ చిత్రం సెట్స్ పైకి
వెళ్లనుందని, ఇతర నటీ నట సాంకేతికవర్గం వివరాలు త్వరలోనే తెలియపరుస్తామన్నారు.
శ్రీకాంత్ మాట్లాడుతూ.వైవిధ్యమైన కధాంశంతో రూపొందే ఈ చిత్రం తెలుగు,కన్నడ భాషలో .’దండుపాళ్యం’ లానే విజయం
సాధిస్తుందనే నమ్మకముందని అన్నారు. మిత్రులు నిర్మిస్తున్న ఈ చిత్రంలో నటించటం సంతోషం గా ఉందని శ్రీకాంత్ అన్నారు.
చిత్ర కధ,కధనాలు కొత్తదనాన్ని కలిగి ఉంటాయని దర్శకుడు శ్రీనివాసరాజు తెలిపారు.
బ్యానర్: ‘గోల్డెన్ లయన్ ఫిలిమ్స్, ఇ స్క్వేర్ ‘
నిర్మాతలు : సి.ఆర్.మనోహర్, విజయ్ కధ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం: శ్రీనివాసరాజు
By venupro •
FILM STILS, news •
Follow Us!