Mad Square

Press Note: #MADSquare Trailer Out Now – The Madness is Back with a Bang

‘మ్యాడ్ స్క్వేర్’ చిత్ర ట్రైలర్ విడుదల.. రెట్టింపు వినోదం గ్యారెంటీ!

తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్’. బ్లాక్ బస్టర్ చిత్రం ‘మ్యాడ్’కి సీక్వెల్ గా వస్తున్న ‘మ్యాడ్ స్క్వేర్’పై ప్రకటనతోనే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రచార చిత్రాలు, పాటలు విశేషంగా ఆకట్టుకొని సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. ముఖ్యంగా టీజర్, అందులోని సంభాషణలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ఇక ఇప్పుడు ‘మ్యాడ్ స్క్వేర్’పై అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లేలా ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది.

బుధవారం ఉదయం హైదరాబాద్ లోని ఏఎంబీ మాల్ లో ‘మ్యాడ్ స్క్వేర్’ ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. సినీ అభిమానుల సమక్షంలో ట్రైలర్ ను విడుదల చేశారు. ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ట్రైలర్ నవ్వులు పూయించింది. మొదటి భాగంతో పోలిస్తే రెట్టింపు వినోదాన్ని మ్యాడ్ స్క్వేర్ లో చూడబోతున్నామని ట్రైలర్ తో మరోసారి రుజువైంది.

ట్రైలర్ ను గమనిస్తే, మ్యాడ్ విజయానికి కారణమైన ప్రత్యేక శైలి హాస్యం, ప్రధాన పాత్రల అల్లరిని మ్యాడ్ స్క్వేర్ లో కూడా చూడబోతున్నామని అర్థమవుతోంది. హాస్యాస్పదమైన సంభాషణలు మరియు విచిత్రమైన పరిస్థితులతో మ్యాడ్ స్క్వేర్ వినోదాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్తుంది. అలాగే తమన్ అద్భుతమైన నేపథ్య సంగీతం ట్రైలర్ కు ప్రధాన బలాలలో ఒకటిగా నిలిచింది. విడుదలైన నిమిషాల్లోనే ఈ ట్రైలర్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమంలో నిర్మాత హారిక సూర్యదేవర మాట్లాడుతూ, “మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన మీడియాకి ముందుగా కృతఙ్ఞతలు. గత వారం నుంచి చూస్తున్నాను.. ట్రైలర్ ఇంకా రాలేదని అందరూ అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు చాలా స్ట్రాంగ్ గా వచ్చామని నమ్ముతున్నాను. ఈ సినిమాలో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. మార్చి 28న థియేటర్ కి వెళ్ళి చూసి ఎంజాయ్ చేయండి. ఇది పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రం. ఈ వేసవి సెలవుల్లో పెద్ద విజయాన్ని అందుకుంటామనే నమ్మకం ఉంది.” అన్నారు.

నిర్మాత సూర్యదేవర నాగ వంశీ మాట్లాడుతూ, “సినిమా చాలా బాగా వచ్చింది. ప్రేక్షకులు మనస్ఫూర్తిగా నవ్వుకుంటారు. టికెట్ కొని థియేటర్ కి వచ్చిన ప్రతి ఒక్కరూ తాము పెట్టిన ప్రతి రూపాయికి న్యాయం జరిగిందని భావిస్తారు.” అన్నారు.

కథానాయకుడు నార్నే నితిన్ మాట్లాడుతూ, “ఏడాదిన్నర క్రితం మ్యాడ్ సినిమాతో మీ ముందుకు వచ్చాము. మేము కొత్తవాళ్ళం అయినప్పటికీ మాకు మంచి విజయాన్ని అందించారు. ప్రేక్షకులకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్ తో వస్తున్నాం. ఈసారి వినోదం రెట్టింపు ఉంటుంది. మార్చి 28న సినిమా చూసి ఆనందించండి.” అన్నారు.

కథానాయకుడు సంగీత్ శోభన్ మాట్లాడుతూ, “ట్రైలర్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సినిమా కూడా మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది.” అన్నారు.

కథానాయకుడు రామ్ నితిన్ మాట్లాడుతూ, “మ్యాడ్ సమయంలో మీడియా ఎంతో సపోర్ట్ చేసింది. మ్యాడ్ 2 కి అలాగే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ సినిమా అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది.” అన్నారు.

‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రానికి సంగీత సంచలనం భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘లడ్డు గానీ పెళ్లి, ‘స్వాతి రెడ్డి’, ‘వచ్చార్రోయ్’ పాటలు చార్ట్‌బస్టర్‌ లుగా నిలిచాయి.

ప్రముఖ ఛాయగ్రాహకుడు శామ్‌దత్ అద్భుత కెమెరా పనితనం, జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటింగ్ ప్రతిభ తోడై.. వెండితెరపై భారీ వినోదాన్ని అందించడానికి మ్యాడ్ స్క్వేర్ సిద్ధమైంది.

మ్యాడ్ సినిమాతో థియేటర్లలో నవ్వుల వర్షం కురిపించిన దర్శకుడు కళ్యాణ్ శంకర్, సీక్వెల్ తో మరోసారి నవ్వుల విందుని అందించబోతున్నారు. ప్రధాన పాత్రలు పోషించిన నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ త్రయం మొదటి భాగానికి మించిన అల్లరి చేయబోతున్నారు.

మ్యాడ్ స్క్వేర్ ను శ్రీకర స్టూడియోస్ తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ప్రేక్షకులు ఊహించిన దానికంటే ఎక్కువ వినోదాన్ని మ్యాడ్ స్క్వేర్ లో చూడబోతున్నారని చిత్ర బృందం తెలిపింది.

భారీ అంచనాల నడుమ 2025, మార్చి 28న థియేటర్లలో అడుగు పెట్టనున్న మ్యాడ్ స్క్వేర్, ఈ వేసవికి ప్రేక్షకులకు మరిచిపోలేని వినోదాన్ని పంచనుంది.

చిత్రం: మ్యాడ్ స్క్వేర్
విడుదల తేదీ: మార్చి 28, 2025
బ్యానర్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ & ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకరా స్టూడియోస్

తారాగణం: సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్‌, విష్ణు ఓఐ
దర్శకత్వం: కళ్యాణ్ శంకర్
సమర్పణ: సూర్యదేవర నాగ వంశీ
నిర్మాతలు: హారిక సూర్యదేవర, సాయి సౌజన్య
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
నేపథ్య సంగీతం: తమన్
ఛాయాగ్రహణం: శామ్‌దత్ ISC
కూర్పు: నవీన్ నూలి
ప్రొడక్షన్ డిజైనర్: శ్రీ నాగేంద్ర తంగాల
అదనపు స్క్రీన్ ప్లే: ప్రణయ్ రావు తక్కళ్లపల్లి
కళ: పెనుమర్తి ప్రసాద్ M.F.A
ఫైట్ మాస్టర్: కరుణాకర్
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్

Press Note: #MADSquare Trailer Out Now – The Madness is Back with a Bang

The much anticipated theatrical trailer for MAD Square is out now and it’s everything audience have been craving and more! Trailer promises double the laughter, chaos and entertainment setting the stage for a grand theatrical release on March 28, 2025.

The trailer showcases the signature quirky humor and high energy vibe that made the original a hit amplified by Thaman’s electrifying background score. From hilarious one liners to whacky situations MAD Square is going to take the entertainment game to the next level.

Bheems Ceciroleo has already set the vibe with chartbusters like Laddu Gaani Pelli” “Swathi Reddy “ and “Vaccharroi” songs that are already ruling playlists and reels.

With Shamdat Sainudeen’s vibrant lens capturing the madness and Navin Nooli’s slick cuts keeping the pace tight Mad Square is all set to explode on the big screens with massive entertainment.

Directed by Kalyan Shankar and produced by Haarika Suryadevara and Sai Soujanya under Sithara Entertainments, Fortune Four Cinemas and Srikara Studios MAD Square brings back the beloved MAD gang – Narne Nithiin, Sangeeth Shobhan and Ram Nithin for a rollercoaster ride of youthful fun. Presented by Suryadevara Naga Vamsi. The film has already created a massive buzz with its teaser and songs.

Title: Mad Square
Release Date: March 28, 2025
Genre: Comedy Drama
Banner: Sithara Entertainments & Fortune Four Cinemas
Presented by: Srikara Studios

Cast: Narne Nithin, Sangeeth Shobhan and Ram Nithin
Director: Kalyan Shankar
Presenter: Suryadevara Naga Vamsi
Producers: Haarika Suryadevara & Sai Soujanya
Music: Bheems Ceciroleo
BGM: Thaman S
Editor: Navin Nooli
DOP: Shamdat (ISC)
Production Designer: Sri Nagendra Tangala
Additional Screenplay: Pranay Rao Takkallapalli
Art Director: Penumarty Prasad M.F.A
Fight Master: Karunakar

trailer-out-now still (1) IMG_2355 IMG_2352 IMG_2353 IMG_2354

‘మ్యాడ్ స్క్వేర్’లో ‘మ్యాడ్’ని మించిన కామెడీ ఉంటుంది: మ్యాడ్ గ్యాంగ్

బ్లాక్ బస్టర్ చిత్రం ‘మ్యాడ్’కి సీక్వెల్ గా రూపొందుతోన్న ‘మ్యాడ్ స్క్వేర్’ కోసం సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. మార్చి 28న విడుదల కానున్న ‘మ్యాడ్ స్క్వేర్’పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రచార కార్యక్రమాల్లో భాగంగా తాజాగా మీడియాతో ముచ్చటించిన మ్యాడ్ గ్యాంగ్ నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.మీ ముగ్గురి కాంబినేషన్ బాగుంది. ఇతర సినిమాల్లో కూడా కలిసి నటిస్తారా?
రామ్ నితిన్: మ్యాడ్ అనేది మాకు ఎంతో స్పెషల్ మూవీ. మ్యాడ్ వరకే ఆ ప్రత్యేకత ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది.
సంగీత్ శోభన్: ఇప్పటిదాకా అయితే దాని గురించి ఆలోచించలేదు.

ఈ చిత్రానికి మెయిన్ హీరో ఎవరంటే ఏం చెప్తారు?
వినోదమే ఈ సినిమాకి మెయిన్ హీరో. ఆ వినోదమే మ్యాడ్ స్క్వేర్ ని నడిపిస్తుంది.

మ్యాడ్ స్క్వేర్ తో ఎంత మ్యాడ్ క్రియేట్ చేయబోతున్నారు?
రామ్ నితిన్: మ్యాడ్ తో పోలిస్తే మ్యాడ్ స్క్వేర్ లో కామెడీ ఎక్కువ ఉంటుంది. ఈసారి అశోక్(నార్నె నితిన్), మనోజ్(రామ్ నితిన్) పాత్రలు కూడా ఎక్కువ వినోదాన్ని పంచుతాయి. ప్రేక్షకులు ఈ కామెడీని బాగా రిసీవ్ చేసుకుంటారని నమ్ముతున్నాము.

మ్యాడ్ స్క్వేర్ కోసం ఎలాంటి కసరత్తులు చేశారు?
రామ్ నితిన్: మ్యాడ్ నా మొదటి సినిమా. ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనే భయం కాస్త ఉండేది. మ్యాడ్ స్క్వేర్ కి ఎలాంటి భయం లేదు. చాలా కాన్ఫిడెంట్ గా చేశాము. దాంతో పర్ఫామెన్స్ ఇంకా బెటర్ గా వచ్చింది.
నార్నె నితిన్: మ్యాడ్ లో ప్రతి పాత్రకు ఒక ట్రాక్ ఉంటుంది. నా పాత్ర మొదట కాస్త సీరియస్ గా ఉంటుంది. చివరికి వచ్చేసరికి మిగతా పాత్రల్లాగా కామెడీ చేస్తుంటాను. ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్ లో పూర్తి కామెడీ పాత్రలో కనిపిస్తాను. అందుకు తగ్గట్టు నన్ను నేను మలుచుకున్నాను.
సంగీత్ శోభన్: మ్యాడ్ విజయం ఇచ్చిన కాన్ఫిడెన్స్ తో మ్యాడ్ స్క్వేర్ ను ఆడుతూపాడుతూ చేశాము. ఇంకా ఎక్కువ నవ్వించాలనే ఆలోచన తప్ప, ప్రత్యేక కసరత్తులు చేయలేదు.

సీక్వెల్ చేద్దామని చెప్పినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు?
రామ్ నితిన్: చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. మ్యాడ్ షూటింగ్ పూర్తవుతున్న సమయంలో మంచి టీంని మిస్ అవుతున్నాను అనే బాధ ఉండేది. కానీ, సినిమా విడుదలై పెద్ద హిట్ అవ్వడం, వెంటనే సీక్వెల్ అనడంతో.. చాలా ఆనందించాము.

నిర్మాత నాగవంశీ గారు ఈ సినిమాలో కథ లేదు అన్నారు కదా?
నార్నె నితిన్: బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాల నుంచి కథ ఆశించాలి. ఇది నవ్వించడమే లక్ష్యంగా తీసిన సినిమా. అందుకే పెద్ద కథ ఉంటుందని ఆశించకండి, సరదాగా నవ్వుకోవడానికి రండి అనే ఉద్దేశంతో నాగవంశీ గారు చెప్పారు.
సంగీత్ శోభన్: ఒక సినిమా మనం ఏ ఉద్దేశంతో చేశామనేది ముందే ప్రేక్షకులకు తెలిసేలా చేస్తే మంచిది. ఇది నవ్వించడానికి తీసిన సినిమా కాబట్టి, ఆ అంచనాలతో ప్రేక్షకులు థియేటర్లకు రావాలనే ఉద్దేశంతో అలా చెప్పాము.

మ్యాడ్ విషయంలో నాగవంశీ గారి పాత్ర ఎంత ఉంది?
రామ్ నితిన్: నాగవంశీ గారి పాత్రే కీలకం. ఆయన ఎప్పుడూ సినిమా గురించే ఆలోచిస్తూ ఉంటారు. నన్ను కేవలం ఒక వెబ్ సిరీస్ లో చూసి, మనోజ్ పాత్రకు సరిపోతానని సూచించారంటే.. నాగవంశీ గారు సినిమా గురించి ఎంత ఆలోచిస్తారో అర్థం చేసుకోవచ్చు. అలాగే ఆయన దర్శకుడిని, నటీనటులను నమ్మి పూర్తి స్వేచ్ఛను ఇస్తారు.

సినిమాలో హీరోయిన్ పాత్రలు ఉంటాయా?
నార్నె నితిన్: మొదటి భాగానికి కొనసాగింపుగా వారి పాత్రలు మా జీవితాల్లో ఉంటాయి. కానీ, వారు తెర మీద కనిపించరు.

మ్యాడ్ స్క్వేర్ ఎలా ఉండబోతుంది?
సంగీత్ శోభన్: మ్యాడ్ విజయానికి కారణం వినోదం. అదే మా బలం. దానిని దృష్టిలో పెట్టుకొని పూర్తి వినోద భరిత చిత్రంగా మ్యాడ్ స్క్వేర్ ను మలచడం జరిగింది. అలాగే ఈ సినిమాలో కామెడీ పూర్తిగా కొత్తగా ఉంటుంది.

కుటుంబ ప్రేక్షకులు చూసేలా సినిమా ఉంటుందా?
సంగీత్ శోభన్: మొదటి పార్ట్ సమయంలో కూడా ఇలాంటి అనుమానాలే వ్యక్తమయ్యాయి. కానీ, సినిమా విడుదలైన తర్వాత కుటుంబ ప్రేక్షకులు ఎంతో ఆదరించారు. మ్యాడ్ స్క్వేర్ ను కూడా క్లీన్ కామెడీ ఫిల్మ్ గానే రూపొందించాము. వంశీ గారు చెప్పినట్టు ముఖ్యంగా పెళ్లి సీక్వెన్స్ అందరికీ నచ్చుతుంది.

లడ్డు పాత్ర ఎలా ఉండబోతుంది?
సంగీత్ శోభన్: మ్యాడ్ లో కంటే మ్యాడ్ స్క్వేర్ లో లడ్డు పాత్ర మరింత కామెడీగా ఉంటుంది. మేము ముగ్గురం కలిసి లడ్డుని ఫుల్ గా ఆడుకుంటాము.

నార్నె నితిన్ గారు మీ బావగారు జూనియర్ ఎన్టీఆర్ ఏమైనా సలహాలు ఇస్తారా?
నార్నె నితిన్: నా మొదటి సినిమా నుంచి సలహాలు ఇస్తూ ఉన్నారు. దానికి తగ్గట్టుగానే నన్ను నేను మలుచుకుంటున్నాను. భవిష్యత్ లో కూడా ఆయన సలహాలు తీసుకుంటాను.

మ్యాడ్ ఫ్రాంచైజ్ కంటిన్యూ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారా?
చేస్తే బాగుంటుంది. కానీ, వెంటనే కాకుండా కాస్త విరామం ఇచ్చి చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాము.

 GANI7550 GANI7539 GANI7537 GANI7554

#VACCHARROI Song Out Now from #MadSquare – An Electrifying Anthem for this Summer.

‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రం నుంచి ‘వచ్చార్రోయ్’ గీతం విడుదలబ్లాక్ బస్టర్ చిత్రం ‘మ్యాడ్’కి సీక్వెల్ గా రూపొందుతోన్న ‘మ్యాడ్ స్క్వేర్’ కోసం సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ విశేషంగా ఆకట్టుకొని సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. టీజర్ లోని సంభాషణలు సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. అలాగే ‘మ్యాడ్ స్క్వేర్’ నుంచి విడుదలైన ‘లడ్డు గానీ పెళ్లి’, ‘స్వాతి రెడ్డి’ పాటలు కూడా మారుమోగిపోతున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి మూడో గీతం ‘వచ్చార్రోయ్’ విడుదలైంది.

మ్యాడ్ గ్యాంగ్ కి తిరిగి స్వాగతం పలకడానికి సరైన గీతం అన్నట్టుగా ‘వచ్చార్రోయ్’ ఎంతో ఉత్సాహభరితంగా ఉంది. ‘లడ్డు గానీ పెళ్లి’, ‘స్వాతి రెడ్డి’ పాటల బాటలోనే.. ‘వచ్చార్రోయ్’ కూడా విడుదలైన నిమిషాల్లోనే శ్రోతల అభిమాన గీతంగా మారిపోయింది. సంగీత సంచలనం భీమ్స్ సిసిరోలియో స్వరపరచి, ఈ పాటను స్వయంగా ఆలపించగా.. ప్రతిభావంతులైన దర్శకుడు కె.వి. అనుదీప్ సాహిత్యం అందించడం విశేషం.

భీమ్స్ సిసిరోలియో తనదైన ప్రత్యేక శైలి సంగీతంతో మరోసారి కట్టిపడేశారు. భీమ్స్ సంగీతం, గాత్రం ఈ పాటను చార్ట్ బస్టర్ గా మలిచాయి. ఇక కె.వి. అనుదీప్ సాహిత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. “ఏసుకోండ్రా మీమ్స్, చేసుకోండ్రా రీల్స్, రాసుకోండ్రా హెడ్ లైన్స్.. ఇది మ్యాడ్ కాదు మ్యాడ్ మ్యాక్స్” వంటి పంక్తులతో అందరూ పాడుకునేలా గీతాన్ని రాశారు. యువత కాలు కదిపేలా ఉన్న ఈ గీతం, విడుదలైన కొద్దిసేపటిలోనే సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

మొదటి భాగంలో తమ అల్లరితో నవ్వులు పూయించిన నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ త్రయం.. ‘మ్యాడ్ స్క్వేర్’లో అంతకుమించిన అల్లరి చేయబోతున్నారు. మ్యాడ్ లో తనదైన ప్రత్యేక శైలి హాస్య సన్నివేశాలు, ఆకర్షణీయమైన కథనంతో ఎంతో పేరు తెచ్చుకున్న దర్శకుడు కళ్యాణ్ శంకర్, ఈ సీక్వెల్ తో మరోసారి నవ్వుల విందుని అందించబోతున్నారు. ఈ చిత్రంలో ప్రియాంక జవాల్కర్, మురళీధర్ గౌడ్, కె.వి. అనుదీప్ కీలక పాత్రలలో అలరించనున్నారు. అలాగే, రెబా మోనికా జాన్ ప్రత్యేక గీతంలో సందడి చేయనున్నారు.

‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రానికి ప్రముఖ ఛాయగ్రాహకుడు శామ్‌దత్ కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల సమిష్టి కృషితో.. మొదటి భాగానికి రెట్టింపు వినోదాన్ని ‘మ్యాడ్ స్క్వేర్’ అందించనుంది.

శ్రీకర స్టూడియోస్ తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. భారీ అంచనాల నడుమ 2025, మార్చి 28న ‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రం థియేటర్లలో అడుగు పెట్టనుంది.

చిత్రం: మ్యాడ్ స్క్వేర్
విడుదల తేదీ: మార్చి 28, 2025
బ్యానర్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ & ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకరా స్టూడియోస్

తారాగణం: సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్‌, విష్ణు ఓఐ
దర్శకత్వం: కళ్యాణ్ శంకర్
సమర్పణ: సూర్యదేవర నాగ వంశీ
నిర్మాతలు: హారిక సూర్యదేవర, సాయి సౌజన్య
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
ఛాయాగ్రహణం: శామ్‌దత్ ISC
కూర్పు: నవీన్ నూలి
ప్రొడక్షన్ డిజైనర్: శ్రీ నాగేంద్ర తంగాల
అదనపు స్క్రీన్ ప్లే: ప్రణయ్ రావు తక్కళ్లపల్లి
కళ: పెనుమర్తి ప్రసాద్ M.F.A
ఫైట్ మాస్టర్: కరుణాకర్
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్

#VACCHARROI Song Out Now from #MadSquare – An Electrifying Anthem for this Summer.

MAD Square third single VACCHARROI is out now and it’s already setting speakers ablaze! This high octane energetic track is a perfect welcome for the return of the beloved MAD gang Composed and sung by the dynamic Bheems Ceciroleo with lyrics penned by the talented KV Anudeep.

This song is a testament to Bheems Ceciroleo’s signature style known for delivering chartbusters that resonate with the masses. KV Anudeep’s lyrics add a playful yet fiery edge making VACCHARROI an instant earworm that’s bound to dominate playlists and dance floors alike. The track’s high energy composition aligns perfectly with the film’s youthful exuberance.

Bheems Ceciroleo has already created waves with earlier singles like Laddu Gaani Pelli and Swathi Reddy.

Mad square brings back the hilarious trio of Narne Nithiin, Sangeeth Shobhan and Ram Nithin as they navigate life with their trademark chaos and comedy. Directed by Kalyan Shankar who also helmed the original. This film is going to be double the entertainment with its quirky storytelling and laugh out loud moments. The ensemble cast includes Priyanka Jawalkar and Muralidhar Goud with special appearances by KV Anudeep and a sizzling dance number featuring Reba Monica John.

With Shamdat Sainudeen’s vibrant cinematography and National Award winning editor Navin Nooli shaping the film’s crisp narrative MadSquare is poised to be a theatrical treat for audiences everywhere.

Backed by Haarika Suryadevara and Sai Soujanya under Sithara Entertainments, Fortune Four Cinemas and Srikara Studios and presented by Suryadeva Naga Vamsi. MadSquare is gearing up for a grand theatrical release on March 28, 2025.

Mad vaccharroi Song OUT NOW WWM Mad vaccharroi Song PLAIN Mad vaccharroi Song PLAIN 2
 

#MADSquare – A Bombastic Entertainer Arrives a Day Earlier

*ఒకరోజు ముందుగానే నవ్వులు పంచనున్న ‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రం
 *మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదలవుతున్న ‘మ్యాడ్ స్క్వేర్’
 బ్లాక్ బస్టర్ చిత్రం ‘మ్యాడ్’కి సీక్వెల్ గా రూపొందుతోన్న ‘మ్యాడ్ స్క్వేర్’ కోసం సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేవలం ప్రకటనతోనే ఈ సినిమాపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఇక ఇటీవల విడుదలైన టీజర్ విశేషంగా ఆకట్టుకొని, ఆ అంచనాలను రెట్టింపు చేసింది. ‘మ్యాడ్ స్క్వేర్’ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించడం ఖాయమనే అభిప్రాయం అందరిలో నెలకొంది.
‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రం మార్చి 29 శనివారం నాడు విడుదల కావాల్సి ఉండగా, డిస్ట్రిబ్యూటర్ల కోరిక మేరకు ఒక రోజు ముందుగా మార్చి 28 శుక్రవారం నాడు విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించారు. తాజా నిర్ణయంతో ‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రం మొదటి వారాంతంలో భారీ వసూళ్ళను రాబడుతుందని అనడంలో సందేహం లేదు.
 ’మ్యాడ్ స్క్వేర్’ సినిమాని ఒకరోజు ముందుగా విడుదల చేస్తుండటంపై నిర్మాత సూర్యదేవర నాగవంశీ స్పందిస్తూ, “మా పంపిణీదారుల అభ్యర్థన మరియు మద్దతుతో ‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రం ఒక రోజు ముందుగా మార్చి 28వ తేదీన వస్తుంది. చివరి నిమిషంలో విడుదల తేదీ మార్చాలనే ఉద్దేశం ఎప్పుడూ లేదు. మార్చి 29న అమావాస్య కావడంతో, మా పంపిణీదారులు విడుదలను ముందుకు తీసుకెళ్లడం ఉత్తమమని అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయం పట్ల మేము కూడా సంతోషంగా ఉన్నాము. ‘మ్యాడ్ స్క్వేర్’తో పాటు మార్చి 28న విడుదల కానున్న ‘రాబిన్‌హుడ్’ చితం కూడా ఘన విజయం సాధించాలని మనస్ఫూరిగా కోరుకుంటున్నాను. ఈ వేసవికి నవ్వుల పండుగ రాబోతుంది.” అన్నారు.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. ‘మ్యాడ్ స్క్వేర్’ కూడా ‘టిల్లు స్క్వేర్’ బాటలో పయనించి, మరో ఘన విజయాన్ని అందించడానికి సిద్ధమవుతోంది. పైగా ‘లక్కీ భాస్కర్’, ‘డాకు మహారాజ్’ వంటి ఘన విజయాల తర్వాత వస్తున్న సినిమా కావడంతో ‘మ్యాడ్ స్క్వేర్’తో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ ను సాధిస్తామనే నమ్మకంతో సితార ఉంది.
 శ్రీకర స్టూడియోస్ తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.
మ్యాడ్ సినిమాలో తనదైన ప్రత్యేక శైలి హాస్య సన్నివేశాలు, ఆకర్షణీయమైన కథనంతో ఎంతో పేరు తెచ్చుకున్న దర్శకుడు కళ్యాణ్ శంకర్, ఈ సీక్వెల్ తో మరోసారి నవ్వుల విందుని అందించబోతున్నారు.
 మొదటి భాగంలో తమ అల్లరితో నవ్వులు పూయించిన నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ మరియు విష్ణు ఓఐ (లడ్డు).. ‘మ్యాడ్ స్క్వేర్’లో అంతకుమించిన అల్లరి చేయబోతున్నారు. రెబా జాన్ ప్రత్యేక గీతంలో సందడి చేయనున్నారు. కె.వి. అనుదీప్, ప్రియాంక జవాల్కర్ తదితరులు కీలక పాత్రలలో అలరించనున్నారు.
 ’మ్యాడ్ స్క్వేర్’ చిత్రానికి సంగీత సంచలనం భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు చార్ట్‌బస్టర్‌లుగా నిలిచాయి. ప్రముఖ ఛాయగ్రాహకుడు శామ్‌దత్ కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.
భారీ అంచనాల నడుమ 2025, మార్చి 28న థియేటర్లలో అడుగుపెట్టనున్న ‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రం, ఆ అంచనాలకు తగ్గట్టుగానే భారీ ఓపెనింగ్స్‌ ను రాబడుతుంది ఆనందంలో సందేహం లేదు. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని విశేషాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
చిత్రం: మ్యాడ్ స్క్వేర్ విడుదల తేదీ: మార్చి 29, 2025 బ్యానర్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ & ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకరా స్టూడియోస్ తారాగణం: సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్‌, విష్ణు ఓఐ దర్శకత్వం: కళ్యాణ్ శంకర్ సమర్పణ: సూర్యదేవర నాగ వంశీ నిర్మాతలు: హారిక సూర్యదేవర, సాయి సౌజన్య సంగీతం: భీమ్స్ సిసిరోలియో ఛాయాగ్రహణం: శామ్‌దత్ ISC కూర్పు: నవీన్ నూలి ప్రొడక్షన్ డిజైనర్: శ్రీ నాగేంద్ర తంగాల అదనపు స్క్రీన్ ప్లే: ప్రణయ్ రావు తక్కళ్లపల్లి కళ: పెనుమర్తి ప్రసాద్ M.F.A ఫైట్ మాస్టర్: కరుణాకర్ పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్
#MADSquare – A Bombastic Entertainer Arrives a Day Earlier
 Following the massive success of MAD, expectations for the sequel have skyrocketed. With every asset and especially the recently released teaser, #MADSquare has doubled the madness setting the stage for a BLOCKBUSTER openings at the box office.
 Initially scheduled for a March 29th release, the film is now hitting the big screens a day earlier on March 28th due to distributor requests. With an extended weekend and holiday advantage the film is set for a sensational start.
Producer Naga Vamsi’s Statement on the Date Change: “
With the request and support of our esteemed distributors, #MADSquare is arriving a day earlier – March 28th. Since March 29th falls on Amavasya, our distributors felt it was best to advance the release and we are happy to oblige.
Apart from that, there was never any intention to cause a last minute rescheduling. We wholeheartedly wish that March 28th will be a memorable day for Telugu cinema with both #Robinhood and #MADSquare lighting up the big screens! ❤️????
Best wishes to my hero, our dearest @actor_nithiin garu & director @VenkyKudumula for their big release…Ee summer ki navvula panduge! ????????
 Sithara Entertainments is on an unstoppable winning streak delivering back to back entertainers packed with quality With #MADSquare following the success of Tillu Square, Lucky Bhaskar and Daaku Maharaaj, the banner is eyeing a hattrick blockbuster!
Produced by Harika Suryadevara & Sai Soujanya with Naga Vamsi presenting the film, Produced by Sithara Entertainments in association with Fortune Four Cinemas & Srikara Studios.
Director Kalyan Shankar known for his strong grip on comedy and entertainment has already proven his mettle with MAD Part 1. Now with #MADSquare, he is set to deliver an even bigger laughter riot exuding full confidence in the film’s power packed entertainment quotient.
The film stars Narne Nithiin, Sangeeth Shoban and Ram Nithin in lead roles with Reba John featuring in a special song. The teaser also teased exciting glimpses of KV Anudeep and Priyanka Jawalkar adding to the fun.
Music is composed by Bheems Ceciroleo with cinematography handled by Shamdat Sainudeen National Award winning editor Navin Nooli is overseeing the film’s editing. With the hype skyrocketing, there’s no doubt that #MADSquare is gearing up for a massive openings at the box office. Stay tuned for more updates from the team!

MAD-MAR28-STILL MAD-MAR28

*’MAD Square’ is 10 Times the Fun of ‘MAD’: Director Kalyan Shankar*

థియేటర్లలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్’ : ప్రెస్ మీట్ లో చిత్ర బృందంబ్లాక్ బస్టర్ చిత్రం ‘మ్యాడ్’కి సీక్వెల్ గా రూపొందుతోన్న ‘మ్యాడ్ స్క్వేర్’ కోసం సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, విష్ణు ఓఐ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ పతాకాలపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. 2025, మార్చి 29న ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో ఈ చిత్రం విడుదల కానుంది. ఇటీవల విడుదలైన టీజర్ కు విశేష స్పందన లభించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం ఐటీసీ కోహినూర్ లో ప్రెస్ మీట్ నిర్వహించిన చిత్ర బృందం, సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.

నార్నే నితిన్ మాట్లాడుతూ, “మ్యాడ్-1 కి అద్భుతమైన స్పందన లభించింది. ఈసారి మ్యాడ్-2 దానికి మించి ఉంటుంది. థియేటర్లలో ఎవరూ సీట్లలో కూర్చొని ఉండరు. అంతలా నవ్వుతారు సినిమా చూస్తూ. ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను.” అన్నారు.

సంగీత్ శోభన్ మాట్లాడుతూ, “మీరు టీజర్ లో చూసింది చాలా తక్కువ. సినిమాలో అంతకుమించిన వినోదం ఉంటుంది. మ్యాడ్ స్క్వేర్ పై అంచనాలు, ఊహించిన దానికంటే ఎక్కువ ఉన్నాయి. మ్యాడ్ సినిమా సమయంలో నిర్మాత వంశీ గారు ఒక మాట చెప్పారు.. సినిమా నచ్చకపోతే టికెట్ డబ్బులు వెనక్కి ఇస్తామని. ఇప్పుడు ఆయన మాటగా నేను చెప్తున్నా.. ఎవరికైనా సినిమా నచ్చకపోతే టికెట్ డబ్బులకి డబుల్ ఇచ్చేస్తాం (నవ్వుతూ). మళ్ళీ సక్సెస్ మీట్ లో కలుద్దాం.” అన్నారు.

రామ్ నితిన్ మాట్లాడుతూ, “మ్యాడ్ సినిమా సమయంలో మాకు అందరూ ఎంతో సపోర్ట్ చేశారు. మొదటి సినిమాకి అంత ఆదరణ రావడం అనేది మామూలు విషయం కాదు. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు హృదయ పూర్వక ధన్యవాదాలు. అలాగే మీడియాకి, ప్రేక్షకులకు కృతజ్ఞతలు.” అన్నారు.

నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ, “మంచి సినిమా తీశాము. మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాము. రెండు గంటల పాటు మనస్ఫూర్తిగా నవ్వుకోవడానికి ఈ సినిమాకి రండి. స్నేహితులతో కలిసి మా సినిమా చూసి ఎంజాయ్ చేయండి.” అన్నారు.

దర్శకుడు కళ్యాణ్ శంకర్ మాట్లాడుతూ, “మ్యాడ్ సినిమాను మీరందరూ చూసి ఎంజాయ్ చేశారు. ‘మ్యాడ్ స్క్వేర్’ అయితే దానికి పది రెట్లు ఉంటుంది. ప్రతి సీనూ మిమ్మల్ని నవ్విస్తుంది. మార్చి 29న విడుదలవుతున్న మా సినిమాని చూసి ఆదరించండి. ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొడుతున్నాం అనే నమ్మకం ఉంది.” అన్నారు.

నిర్మాత హారిక సూర్యదేవర మాట్లాడుతూ, “మ్యాడ్ సినిమా సమయంలో మీడియా ఇచ్చిన సపోర్ట్ ను మర్చిపోలేము. మ్యాడ్ స్క్వేర్ కి కూడా అలాగే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇటీవల విడుదలైన టీజర్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మ్యాడ్ స్క్వేర్ పై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుంది. మ్యాడ్ స్క్వేర్ టైటిల్ కి తగ్గట్టుగానే రెట్టింపు వినోదం ఉంటుంది. మార్చి 29న థియేటర్లలో ఈ సినిమా చూసి హ్యాపీగా నవ్వుకోండి.” అన్నారు.

సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో మాట్లాడుతూ, “మ్యాడ్ ను పెద్ద హిట్ చేశారు. మ్యాడ్ స్క్వేర్ దానిని మించి ఉండబోతుంది. ఈ సినిమా ఘన విజయం సాధిస్తుందని బలంగా నమ్ముతున్నాను. కళ్యాణ్ గారు లాంటి దర్శకుడితో పని చేయడం సంతోషంగా ఉంది. మునుముందు మరిన్ని మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. వంశీ గారికి, చినబాబు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ సినిమాలో నటించిన ముగ్గురు హీరోలూ భవిష్యత్ లో పెద్ద స్టార్ లు అవుతారు. పాటలను పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు నా ధన్యవాదాలు. మార్చి 29న విడుదలవుతున్న మా మ్యాడ్ స్క్వేర్ సినిమాని చూడండి. మీ అందరికీ నచ్చుతుంది.” అన్నారు.

చిత్రం: మ్యాడ్ స్క్వేర్
విడుదల తేదీ: మార్చి 29, 2025
బ్యానర్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ & ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకరా స్టూడియోస్

తారాగణం: సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్‌, విష్ణు ఓఐ
దర్శకత్వం: కళ్యాణ్ శంకర్
సమర్పణ: సూర్యదేవర నాగ వంశీ
నిర్మాతలు: హారిక సూర్యదేవర, సాయి సౌజన్య
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
ఛాయాగ్రహణం: శామ్‌దత్ ISC
కూర్పు: నవీన్ నూలి
ప్రొడక్షన్ డిజైనర్: శ్రీ నాగేంద్ర తంగాల
అదనపు స్క్రీన్ ప్లే: ప్రణయ్ రావు తక్కళ్లపల్లి
కళ: పెనుమర్తి ప్రసాద్ M.F.A
ఫైట్ మాస్టర్: కరుణాకర్
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్

*’MAD Square’ is 10 Times the Fun of ‘MAD’: 

Director Kalyan Shankar*The highly anticipated MAD Square, boasting a vibrant and talented young cast, is set for a grand theatrical release worldwide on March 29. With filming wrapped and post-production in full swing, the team shared their enthusiasm at a press meet in Hyderabad. Producers Suryadevara Naga Vamsi and Harika Suryadevara, Music Director Bheems Ceciroleo, Director Kalyan Shankar, and actors Ram Nithin, Sangeet Sobhan, and Narne Nithin expressed unwavering confidence in the film’s blockbuster appeal.

Producer Suryadevara Naga Vamsi said, “We’ve crafted an exceptional film, and we’re hopeful it’ll strike a chord with all of you. Get ready for two hours of pure, hearty laughter—bring your friends and join us for an unforgettable joyride.”

Harika Suryadevara, producer, added, “We are overwhelmed by the incredible response to the teaser. MAD Square carries huge expectations, and we are committed to not only meeting but exceeding them. True to its title, this film will be a mad square.”

Music Director Bheems Ceciroleo stated, “I’m confident that MAD Square is going to be a massive blockbuster. The energy of the film is unmatched, and it’s poised to take the careers of all three leads to new heights.”

Actor Ram Nithin, reflecting on his journey, shared, “I’m forever grateful to the audience for the love they showed my previous film, MAD. I owe this opportunity to my director and producers, and I’m thrilled to be part of MAD Square.”

Director Kalyan Shankar promised a larger-than-life experience, stating, “I assure you, MAD Square is 10 times the fun of MAD. I’m confident that when the audience watches it on March 29, they’ll agree.”

Actor Sangeet Sobhan teased, “What you saw in the teaser is just 1% of what’s in store. MAD Square doubles the entertainment quotient, and we can’t wait for you to experience it.”

Rounding off the enthusiasm, Narne Nithin said, “MAD Square is a full-length laugh riot. I swear the audience won’t be able to stay seated—it’s that entertaining!”

With its high-energy vibe, stellar cast, and promise of non-stop entertainment, MAD Square is gearing up to take audiences by storm on its grand release date, March 29.

About MAD Square

MAD Square is the sequel to the blockbuster movie MAD, which was released in October 2023. A coming-of-age comedy-drama, the film revolves around the antics of three college friends and the hilarious situations surrounding them. The sequel promises to deliver double the fun and double the madness!

Title: Mad Square
Release Date: March 29, 2025
Banner: Sithara Entertainments, Fortune Four Cinemas & Srikara Studios

Cast: Narne Nithin, Sangeeth Shobhan, Narne Nithin, Ram Nithin
Director: Kalyan Shankar
Presenter: Suryadevara Naga Vamsi
Producers: Haarika Suryadevara & Sai Soujanya
Music: Bheems Ceciroleo
Editor: Navin Nooli
DOP: Shamdat (ISC)
Production Designer: Sri Nagendra Tangala
Additional Screenplay: Pranay Rao Takkallapalli
Art Director: Penumarty Prasad M.F.A
Fight Master: Karunakar

 GANI8914 GANI7961 GANI7966 GANI8912