MY FILMS

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ “అల వైకుంఠపురములో” ‘రాములో… రాముల’ గీతం

*స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ “అల వైకుంఠపురములో”  ’రాములో… రాముల’ గీతం
*విడుదలైన కొద్దీ సేపటికే సంగీత ప్రియులను ఉర్రూతలూగిస్తున్నవైనంస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ సినీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అల వైకుంఠపురములో…’ వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న హ్యాట్రిక్ సినిమా ఇది కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పలు విజయవంతమైన చిత్రాల్ని అందించిన భారీ నిర్మాణ సంస్థలు ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’, ‘గీతాఆర్ట్స్’ కాంబినేషన్ లో ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల అవుతోందని చిత్ర బృందం ప్రకటించింది. ఇటీవల విడుదల చేసిన ‘సామజవరగమన’ పాట ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. తెలుగులో ఒక పాటకు  800K కు పైగా లైక్స్ రావడం ఇదే ప్రధమం. థమన్ తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేసాడనే చెప్పాలి. ఇక ఇప్పుడు థమన్ స్వరపరచిన ‘రాములో రాముల’ అనే పాట విడుదలైంది. విడుదలైన కొద్దీ సేపటికే సంగీత ప్రియులను ఉర్రూతలూగిస్తున్నవైనం ఈ గీతం సొంతం. ఈ మధ్య వరుసగా మాస్ సాంగ్స్ రాస్తూ సూపర్ ఫామ్ లో ఉన్న కాసర్ల శ్యామ్ ఈ పాట రాసారు. ఈ మాస్ సాంగ్ ను అనురాగ్ కులకర్ణి, మంగ్లీ అద్భుతంగా పాడారు. ఈ పాటకు శేఖర్ మాష్టర్ నృత్య రీతులు సమకూర్చారు.ఈ చిత్రం సంక్రాంతి కానుకగా 2020 జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
అల్లు అర్జున్,త్రివిక్రమ్ …. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన రెండు చిత్రాలు పెద్ద విజయాలు సాధించటంతో ఈ హ్యాట్రిక్ కాంబినేషన్ కు భారీ క్రేజ్ నెలకొంది. సంక్రాంతి బరిలో దిగుతున్న ఈ చిత్రం చక్కటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

నటీనటులు
‘అల వైకుంఠపురములో” ని తారలు:
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్,పూజ హెగ్డే,టబు,రాజేంద్రప్రసాద్,సచిన్ ఖేడ్ కర్,తనికెళ్ళ భరణి,మురళీ శర్మ, సముద్ర ఖని,జయరాం,సునీల్,నవదీప్,సుశాంత్,నివేతా పేతురాజ్,గోవిందా పద్మసూర్య,రోహిణి,ఈశ్వరీరావు,కల్యాణి నటరాజన్,శిరీష,బ్రహ్మాజీ,హర్షవర్ధన్,అజయ్,
పమ్మిసాయి,రాహుల్ రామకృష్ణ నటిస్తున్నారు.
సాంకేతిక నిపుణులు:
డి.ఓ.పి: పి.ఎస్.వినోద్, సంగీతం: థమన్.ఎస్, ఎడిటర్: నవీన్ నూలి: ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్,
ఫైట్స్: రామ్ – లక్ష్మణ్; పీఆర్వో : లక్ష్మీ వేణుగోపాల్, ఏలూరు శ్రీను
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : పి.డి.వి.ప్రసాద్
నిర్మాతలు: అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు)

Let’s all dance to the tune of #RamulooRamulaa!! #DiwaliWithRamulooRamulaa
▶️ https://youtu.be/wFAj0pW6xX0#AlaVaikunthapurramuloo @alluarjun #Trivikram @hegdepooja @MusicThaman @haarikahassine @geethaarts

 STILL 02

Here’s #RamulooRamulaa song teaser from #AlaVaikunthapurramuloo.

HD STILL PHOTO-2019-10-22-15-55-36The wait is over. Here’s #RamulooRamulaa song teaser from #AlaVaikunthapurramuloo. Full foot tapping number will be out on 26th Oct! Stay tuned.

▶️ https://youtu.be/w7Nm_RHOCT8

@alluarjun #Trivikram @hegdepooja @MusicThaman @haarikahassine @geethaarts @vamsi84

‘AlaVaikunthapurramuloo’ will be arriving at the theatres on 12th January, 2020

For all the fans and movie lovers who have been waiting to see the hattrick combo again.
#AlaVaikunthapurramuloo will be arriving at the theatres on 12th January, 2020. Let’s Celebrate Sankranthi like an extended family at theatres, ONLY@alluarjun #Trivikram @hegdepooja
The shooting has been going on at a rapid pace and the team is getting ready with many more surprises for all who are eagerly waiting for every update from this team.date copy STILLCast: Stylish Star AlluArjun, Pooja Hegde,
Tabu,Rajendra Prasad, Sachin Kedkar, Muralisharma, Samudrakhani, jayaram,Sunil,Navadeep, Sushant, Nivetha pethuraj,Govinda padma soorya, Brahmaji,,Harshavardhan, Ajay, Pammi sai, Rahul Ramakrishna,Crew:
Editor: Navin Nooli
Art Director: A.S. Prakash
Cinematography: P.S Vinod
Stunt Director’s: Ram – Lakshman
Music: Thaman S
Executive Producer: PDV Prasad
Producers: Allu Aravind – S. Radha Krishna(Chinababu)
Banners: Haarika & Hassine Creations and Geetha Arts
 సంక్రాంతి కానుకగా  ’అల వైకుంఠపురంలో’  జనవరి 12 -2020 న విడుదల 
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా,మాటల మాంత్రికుడు,సుప్రసిద్ధ సినీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అల వైకుంఠపురంలో…’  వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న హ్యాట్రిక్ సినిమా ఇది కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పలు విజయవంతమైన చిత్రాల్ని అందించిన బారీ నిర్మాణ సంస్థలు ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’, ‘గీతాఆర్ట్స్’ కాంబినేషన్ లో ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12 న విడుదల అవుతోందని చిత్ర బృందం ప్రకటించింది. దీనికి సంబంధించిన ప్రచార చిత్రాన్ని విడుదల చేసింది.
‘అల వైకుంఠపురంలో’ ని విడుదల అయిన మొదటిపాట ‘సామజవరగమన’, దసరా పండగ సందర్భంగా చిత్ర యూనిట్ విడుదల చేసిన ప్రచార చిత్రం, వీటికి ముందు చిత్రం పేరును వీడియో రూపంలో విడుదల చేసిన తీరు ప్రశంసలందుకుంది. చిత్రం పై అంచనాలు మరింత పెరిగేలా అవి చేశాయన్నది ప్రేక్షకాభిమానులు మాట. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా 2020 జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అల్లు అర్జున్,త్రివిక్రమ్ …. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన రెండు చిత్రాలు పెద్ద విజయాలు సాధించటం తో ఈ హ్యాట్రిక్ కాంబినేషన్ కి మంచి క్రేజ్ వచ్చింది.. సంక్రాంతి బరిలో దిగుతున్న ఈ చిత్రం చక్కటి ఫామిలీ ఎంటర్ టైనర్ గా శరవేగం గా షూటింగ్ జరుపుకుంటోంది. ..ప్రస్తుతం ప్రధాన తారాగణంపై పాత చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించి  మరిన్ని విషయాలను, విశేషాలను  వరుసగా తెలియపరుస్తాము.
సౌత్ ఇండియన్ క్రేజీ స్టార్ అల్లు అర్జున్,పూజ హెగ్డే,టబు,రాజేంద్రప్రసాద్,సచిన్ ఖేడ్ కర్,తనికెళ్ళ భరణి,మురళీ శర్మ, సముద్ర ఖని,జయరాం,సునీల్,నవదీప్,సుశాంత్,నివేతా పేతురాజ్,గోవిందా పద్మసూర్య,కల్యాణి నటరాజన్,రోహిణి,ఈశ్వరీ రావు,శిరీష,బ్రహ్మాజీ,హర్షవర్ధన్,అజయ్,రాహుల్ రామకృష్ణ నటిస్తున్నారు.డి.ఓ.పి: పి.ఎస్.వినోద్,  సంగీతం: థమన్.ఎస్, ఎడిటర్: నవీన్ నూలి:  ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్,
ఫైట్స్: రామ్ – లక్ష్మణ్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : పి.డి.వి.ప్రసాద్
నిర్మాతలు: అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు)

The ultra stylish “Ala Vaikunthapurramuloo” Poster is here !

 స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్, హారిక హాసిని క్రియేషన్స్, గీత ఆర్ట్స్, ల చిత్రం
 ‘అల వైకుంఠపురములో’…తొలి ప్రచార చిత్రం విడుదల స్టైలిష్ స్టార్ ‘అల్లు అర్జున్’ మాటల మాంత్రికుడు,సుప్రసిద్ధ సినీ దర్శకుడు ‘త్రివిక్రమ్’ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో పలు విజయవంతమైన చిత్రాల్ని అందించిన బారీ నిర్మాణ సంస్థలు ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’, ‘గీతాఆర్ట్స్’ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ‘అల వైకుంఠపురములో…’

ఈరోజు ఉదయం చిత్రం తొలి ప్రచార చిత్రాన్ని స్టైలిష్ స్టార్ ‘అల్లు అర్జున్’ తన అధికారిక సామాజిక మాధ్యమం అయినా ట్విట్టర్ ఖాతా ద్వారా విడుదలచేశారు.  హీరోగా అల్లు అర్జున్ కు ఇది 19 వ చిత్రం కాగా, అల్లు అర్జున్,త్రివిక్రమ్ ల  కాంబినేషన్ లో మూడో చిత్రం. ‘జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్ర విజయాల నేపథ్యంలో ముచ్చటగా మూడోసారి తెరకెక్కనున్న ఈ చిత్రంపై ఇటు సినీ వాణిజ్య రంగాల్లో, అటు ప్రేక్షక వర్గాల్లోనూ అంచనాలు ఉన్నత స్థాయిలో ఉన్నాయి. వీటిని నిజం చేసే దిశగా సుప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థలు ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ‘గీతాఆర్ట్స్’ అధినేతలు అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ (చినబాబు) లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు.

‘అల… వైకుంఠపురములో’ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. ఇటీవలే చిత్రం పేరును వీడియో ద్వారా ప్రకటించటం జరిగింది..అందులో  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ కు అద్భుతమైన స్పందన లభించింది. ఈరోజు విడుదల అయిన తొలి ప్రచార చిత్రం లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కనిపిస్తున్న తీరు ప్రేక్షకాభిమానులను కనువిందు చేయటంతో పాటు, చిత్రం పై అంచనాలు మరింత పెరిగేలా చేసింది. ప్రస్తుతం హైదారాబాద్ లో  షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా చిత్రం విడుదల కానుంది.

తారాగణం:
సౌత్ ఇండియన్ క్రేజీ స్టార్ అల్లు అర్జున్,పూజ హెగ్డే,టబు,రాజేంద్రప్రసాద్,సచిన్ ఖేడ్ కర్, మురళీ శర్మ, సముద్ర ఖని, జయరాం,సునీల్,నవదీప్,సుశాంత్,నివేతా పేతురాజ్ ,గోవిందా పద్మసూర్య, బ్రహ్మాజీ,హర్షవర్ధన్,అజయ్, రాహుల్ రామకృష్ణ నటిస్తున్నారు.

సాంకేతిక వర్గం:
డి.ఓ.పి: పి.ఎస్.వినోద్,  సంగీతం: థమన్.ఎస్, ఎడిటర్: నవీన్ నూలి:  ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్, ఫైట్స్: రామ్ – లక్ష్మణ్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : పి.డి.వి.ప్రసాద్
నిర్మాతలు: అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు)

1567265546408_FL copy STILL
 
The ultra stylish “Ala Vaikunthapurramuloo” Poster is here !
Stylish Star Allu Arjun and the Wizard of words Trivikram Srinivas coming together for third time for “Ala Vaikunthapurramuloo”. Two crazy production houses Geetha Arts and Haarika & Hassine Creations producing this project. Their previous combinations  ‘Julayi’ and ‘Son of Sathyamurthi’ are commercial super hits at the box office. Heavy expectations are pinned on this project as previous movies in this combination are super successful.
Makers unvieled a ultra stylish poster from the movie in which Bunny wore a classy suite outfit and sat like mass hero with a servant lighting cigar for Bunny.
Allu Aravind and  Radha Krishna (Chinababu) of Geetha Arts and Haarika & Hassine Creations are investing in this project without compromising on production values.
Stylish Star Allu Arjun will be romancing with dusky beauty Puja Hegde and vintage beauty Tabu will be playing an important role in this project. Navdeep, Sushanth, Nivetha pethuraj, and a few others are also be playing prominent roles in the film. Makers are planning to bring this during 2020 Sankranthi.
Cast: Stylish Star AlluArjun, Pooja Hegde,
Tabu,Rajendra Prasad, Sachin Kedkar, Muralisharma, Samudrakhani, jayaram,Sunil,Navadeep, Sushant, Nivetha pethuraj,Govinda padma soorya, Brahmaji,,Harshavardhan,Ajay,Rahul Ramakrishna,Crew:
Editor: Navin Nooli
Art Director: A.S. Prakash
Cinematography: P.S Vinod
Stunt Director’s: Ram – Lakshman
Music: Thaman S
Executive Producer: PDV Prasad
Producers: Allu Aravind – S. Radha Krishna(Chinababu)
Banners: Haarika & Hassine Creations and Geetha Arts

*RanaRangam is steadily gaining momentum – Sharwanand*

నా సినిమాల్లో ‘రణరంగం’ బెస్ట్ లవ్ స్టోరీ అంటున్నారు
- హీరో శర్వానంద్

“ఈ సినిమాలో కల్యాణి, నాకూ మధ్య లవ్ స్టోరీ ఇప్పటివరకు నేను చేసిన లవ్ స్టొరీలన్నింటి కంటే బెస్ట్ అంటున్నారు. మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయ్యిందంటున్నారు” అన్నారు శర్వానంద్. ఆయన కథానాయకుడిగా నటించిన ‘రణరంగం’ సినిమా గురువారం(15-8-19)  విడుదలై, అనూహ్యమైన ఓపెనింగ్స్ సాధించింది. సుధీర్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బేనర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. సినిమా మంచి వసూళ్లు సాధిస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని శుక్రవారం ఉదయం యూనిట్ సభ్యులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

చిత్ర సమర్పకుడు పి.డి.వి. ప్రసాద్ మాట్లాడుతూ “కలెక్షన్లు చాలా బాగున్నాయి. మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే రూ. 7.50 కోట్ల గ్రాస్, రూ. 4.45 కోట్ల షేర్ వచ్చింది. 1985లో గిరిబాబుగారి డైరెక్షన్‌లో వచ్చిన ‘రణరంగం’ను కూడా మేమే నిర్మించాం. అది మంచి సక్సెసయింది. ఆ సినిమా ఆడిన అనేక థియేటర్లలో ఇప్పుడు ఈ ‘రణరంగం’ విడుదలవడం చక్కని అనుభవం. సినిమాలో గ్యాంగ్‌స్టర్‌గా శర్వానంద్ చాలా బాగా చేశాడని అంతా ప్రశంసిస్తున్నారు. అలాగే హ్యూమన్ రిలేషన్స్‌ను బాగా చూపించారనే పేరొచ్చింది” అన్నారు.

నటుడు రాజా మాట్లాడుతూ “జెన్యూన్ ఎఫర్ట్ పెట్టి ఈ సినిమా చేశాం. ప్రేక్షకులు ఆదరిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముప్పై ఏళ్ల క్రితం వచ్చిన ‘శివ’ తరహాలో ‘రణరంగం’ ఆడుతుందని ఆశిస్తున్నాం” అని చెప్పారు.

సినిమాటోగ్రాఫర్ దివాకర్ మణి మాట్లాడుతూ “సినిమాకి రెస్పాన్స్ చాలా బాగుంది. విజువల్‌గా సినిమా చాలా క్వాలిటీగా ఉందని మెచ్చుకుంటుంటే ఆనందంగా ఉంది. ఈ సినిమాకి పని చేయడాన్ని నిజంగా ఎంతో ఆస్వాదించాను” అన్నారు.

డైరెక్టర్ సుధీర్ వర్మ మాట్లాడుతూ “ఇది శర్వానంద్ సినిమా అని విడుదలకు ముందే చెప్పాను. ఇంత మంచి ఓపెనింగ్స్ రావడానికి కారణం శర్వానే. ఇప్పటి దాకా నేను డైరెక్ట్ చేసిన సినిమాల్లో దేనికీ రానన్ని ఫోన్లు ఈ సినిమా విడుదలయ్యాక వస్తున్నాయి. నిన్న సెకండ్ షో టికెట్లు దొరకలేదని ఫ్రెండ్స్ ఫోన్ చేసి చెప్పారు. ప్రశాంతి పిళ్లై మ్యూజిక్, దివాకర్ మణి సినిమాటోగ్రఫీ సూపర్బ్. నిర్మాతలు చాలా రిచ్‌గా సినిమాని నిర్మించారు. ఓపెనింగ్స్ ట్రెండ్ ఇలాగే కొనసాగితే నా కెరీర్‌లోనే బిగ్గెస్ట్ సక్సెస్ ఫిల్మ్ అవుతుంది” అని తెలిపారు.

హీరో శర్వానంద్ మాట్లాడుతూ “నిర్మాతలు నాపై పెట్టిన నమ్మకానికి రుణపడి ఉంటా. రణరంగం’కు మంచి ఓపెనింగ్స్ వచ్చినందుకు హ్యాపీగా ఉంది.  ప్రేక్షకులకు ఒక స్క్రీన్‌ప్లే బేస్డ్ సినిమా ఇవ్వాలనుకొని, ఒక ప్రోపర్ యాక్షన్ ఫిల్మ్ తియ్యాలనుకొని ‘రణరంగం’ చేశాం. ఆ విషయంలో 200 శాతం సక్సెస్ అయ్యాం. ఇటీవల తెలుగులో వచ్చిన బెస్ట్ క్వాలిటీ ఫిల్మ్ అని ప్రశంసిస్తుంటే ఆనందంగా ఉంది. సినిమాటోగ్రఫీ, ఆర్ట్ వర్క్ సూపర్బ్ అనే పేరొచ్చింది. ఫైట్ సీన్స్‌ని వెంకట్ మాస్టర్ చాలా నేచురలిస్టిగ్గా కంపోజ్ చేశారు. నా ఫ్రెండ్స్‌గా నటించిన రాజా, ఆదర్శ్, సుదర్శన్లకు మంచి పేరొచ్చింది. తనది చిన్న రోల్ అయినా.. చేసినందుకు కాజల్‌కు థాంక్స్ చెప్పుకోవాలి. సినిమా రిలీజైనప్పుడు మార్నింగ్ షోకి డివైడ్ టాక్ వచ్చింది. మ్యాట్నీకి ఫర్వాలేదన్నారు. సెకండ్ షోకు వచ్చేసరికి ఎబోవ్ యావరేజ్ అనే టాక్ వచ్చింది. మున్ముందు మరింత పాజిటివ్ టాక్ వచ్చి బాగా ఆడుతుందని నమ్ముతున్నా. ఇప్పటివరకూ ఈ సినిమాలో చేసినటువంటి మాస్ కేరెక్టర్ చేయలేదు. ఇందులో నాకు నేనే నచ్చాను. రెండు దశలున్న కేరెక్టర్‌ను చేసేప్పుడు బాగా ఎంజాయ్ చేశాను. స్క్రీన్‌ప్లే పరంగా కొత్తగా ఉండే సినిమా ఇది” అని వివరించారు.

ఈ చిత్రానికి మాటలు: అర్జున్ – కార్తీక్, సంగీతం : ప్రశాంత్ పిళ్ళై , ఛాయాగ్రహణం :దివాకర్ మణి, పాటలు: రామజోగయ్య శాస్త్రి, కృష్ణ చైతన్య,ఎడిటర్: నవీన్ నూలి,  ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్, పోరాటాలు:వెంకట్, నృత్యాలు: బృంద, శోభి,శేఖర్, ప్రొడక్షన్ కంట్రోలర్: సి.హెచ్. రామకృష్ణారెడ్డి,
సమర్పణ: పి.డి.వి.ప్రసాద్.
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
రచన-దర్శకత్వం: సుధీర్ వర్మ
*RanaRangam is steadily gaining momentum – Sharwanand*
batch_SAM_4268 batch_SAM_4270 batch_SAM_4285 batch_SAM_4293
Sharwanand’s latest film RanaRangam hit the big screens yesterday amidst sky-high expectations. The film was directed by Sudheer Varma and also stars Kalyani Priyadarshan and Kajal Agarwal in lead roles. The movie unit held a success meet today and here’s what they had to say.

Sharwanand thanked the producer for not backing down in terms of budget. He further added that Sudheer Varma’s screenplay is another big asset to the film. Stupendous work from the cinematographer and music composer added a whole new layer to the film. RanaRangam is gaining more momentum, he said.

The director, Sudheer Varma said that RanaRangam opened to the best reports when compared to his previous films. He added that the film has rich production and technical values. He further said that mass audience are lapping up the film

The producer PDV Prasad said that audience are enjoying the film. He said that Sharwanand is seen in a mass role for the first time after Prasthanam. The film garnered good collections on its opening day and is expected to gain more support going forward, he said.

Actor Raja thanked the director Sudheer Varma for giving him a strong role in the film. He further added that everyone in his circle liked the film.

Starring:
Sharwanand, Kajal Aggarwal, Kalyani Priyadarshan

Crew:
Written & Directed by – Sudheer Varma
Cinematographer – Divakar Mani
Music Director – Prashant Pillai
Editor – Navin Nooli
Production Designer – Raveender
Sound Designer – Renganaath Ravee
Publicity Designs – Anil & Bhanu
Lyrics – Krishna Chaitanya, Ramajogayya Shastry
Stunts – Venkat
Dialogues – Arjun-Carthyk
Choreography – Brinda, Shobi, Sekhar
Production Controller – Ch. Rama Krishna Reddy
Presents – PDV Prasad
Producer – Suryadevara Naga Vamsi
Banner – Sithara Entertainments.