MY FILMS

‘భీష్మ’ సక్సెస్ గ్యారంటీ..! – ప్రి రిలీజ్ ఈవెంట్ లో సుప్రసిద్ధ దర్శకుడు త్రివిక్రమ్


‘భీష్మ’ సక్సెస్ గ్యారంటీ..!
- ప్రి రిలీజ్ ఈవెంట్ లో సుప్రసిద్ధ దర్శకుడు త్రివిక్రమ్

యువ కథానాయకుడు నితిన్ టైటిల్ రోల్ పోషించిన ‘భీష్మ’ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ సోమవారం యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో అభిమానులు, శ్రేయోభిలాషుల సమక్షంలో కన్నుల పండువగా జరిగింది. ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రంలో రష్మికా మందన నాయిక. ‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకుడు.

ఈ వేడుకలో ముందుగా  చిత్రంలోని ‘సింగిల్ యాంథం’ గీత రచయిత  శ్రీమణి మాట్లాడుతూ, “అందరు సింగిల్స్ లైఫ్ లో జరిగే ఇన్సిడెంట్సే ఈ పాటలో రాశాను. నితిన్‌కు లాస్ట్ బ్యాచిలర్ సాంగ్ నేనే రాశాను. ఆయనకు కంగ్రాట్స్. సింగిల్ గా నాలోని ఫ్రస్ట్రేషన్, ఎమోషన్ అంతా పాటలో చూపించాను. ఈ మధ్య కాలంలో నాకు చాలా మంచి పేరు తీసుకొచ్చింది. ‘జులాయి’తో నాకు బ్రేక్ ఇచ్చింది హారిక అండ్ హాసిని క్రియేషన్స్. అప్పట్నుంచీ నాగవంశీ గారితో ట్రావెల్ చేస్తూనే వస్తున్నా” అని చెప్పారు.

మరో గేయరచయిత కాసర్ల శ్యామ్ మాట్లాడుతూ, “వెంకీ కుడుముల మొదటి సినిమా ‘ఛలో’లో రెండు పాటలు రాశాను. ఆ రెండూ మంచి పేరు తీసుకొచ్చాయి. ‘భీష్మ’లో ‘వాటే వాటే బ్యూటీ’ పాట రాశాను. మణిశర్మ గారబ్బాయి మహతి సాగర్ ఈ పాటను నాచేత బాగా రాయించుకున్నారు. ఈ పాట అందర్నీ ఆకట్టుకున్నందుకు సంతోషంగా ఉంది” అన్నారు.

‘తొలిప్రేమ’ డైరెక్టర్ వెంకీ అట్లూరి మాట్లాడుతూ, “వెంకీ కుడుముల, నేను దాదాపు ఒకేసారి ఎంట్రీ ఇచ్చాం. ఆయన ‘ఛలో’, నా ‘తొలిప్రేమ’ రెండూ మంచి విజయం సాధించాయి. అప్పట్నుంచీ మేమిద్దరం మంచి ఫ్రెండ్స్. ఇదే బ్యానర్లో నితిన్ తో ‘రంగ్ దే’ చేస్తున్నా. నితిన్ ఒక ఇంటివాడు కాబోతున్నందుకు కంగ్రాట్స్. ‘భీష్మ’తో వెంకీ పెద్ద హిట్టు కొట్టబోతున్నాడు” అన్నారు.

మంచి ఫీల్ గుడ్ మూవీ!
నటుడు బ్రహ్మాజీ మాట్లాడుతూ, “ఈ సినిమాలో చిన్న క్యారెక్టర్ చేశాను. చాలా క్యూట్ గా ఉంటుంది. ఈ బ్యానర్లో తీసే ప్రతి సినిమాలో నాకో మంచి క్యారెక్టర్ ఇస్తున్నారు. వెంకీ కుడుముల ఈ సినిమాతో బాగా కుదిపేస్తాడని అనుకుంటున్నా. డబ్బింగ్ చెప్పేటప్పుడు చాలా సీన్లు చూశాను. మంచి ఫీల్ గుడ్ మూవీ. నితిన్ ను మంచి కమర్షియల్ హీరోగా ఈ సినిమాలో చూడబోతున్నారు. రష్మిక బ్యూటిఫుల్ గాళ్. ఫెంటాస్టిక్ యాక్ట్రెస్. త్రివిక్రమ్ తర్వాత నన్ను ఎక్కువగా నవ్వించింది వెంకీ కుడుముల. ‘భీష్మ’ కచ్చితంగా హిట్టవుతుంది” అని చెప్పారు.

నితిన్ డాన్సులు ఇరగదీశాడు!
నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ, “వెంకీ తీసిన ‘ఛలో’ చూసినప్పుడే అతని ఎంటర్టైన్మెంట్ స్కిల్, అతని విజన్ అర్థమైంది. ‘శ్రీనివాస కల్యాణం’ చేసేటప్పుడు నితిన్ ఈ కథ చెప్పాడు. అప్పుడే కచ్చితంగా ఒక మంచి సినిమా తీస్తారని అర్థమైంది. మొన్న సినిమా చూశాక చాలా హ్యాపీగా ఫీలయ్యా. ఎంత నవ్వించాలో అంత నవ్వించారు. ఆడియెన్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తారు. నితిన్ డాన్సులు ఇరగదీశాడు. సినిమా అంతా నితిన్ ను రష్మిక ఆడుకుంటూనే ఉంది. స్వరసాగర్ ఇచ్చిన మ్యూజిక్ అద్భుతం. అన్ని పాటలూ బాగున్నాయ్. అతను మణిశర్మగారి పేరు నిలబెడుతున్నందుకు ఆనందంగా ఉంది. ఈ సినిమా ఒక విజువల్ ట్రీట్. ‘అల.. వైకుంఠపురములో’ ఎంత పెద్ద హిట్టయ్యిందో మనకు తెలుసు. ఆ సినిమాతో పోటీపడేలా ఈ సినిమాలో విజువల్స్ ఉన్నాయి. ఫిబ్రవరి 21న వస్తున్న ఈ సినిమా డెఫినెట్ గా హిట్టవుతుంది” అని చెప్పారు.

నితిన్, రష్మిక కెమిస్ట్రీ అమేజింగ్!
సంగీత దర్శకుడు మహతి స్వరసాగర్ మాట్లాడుతూ, “నిర్మాతలు రాధాకృష్ణ గారు, వంశీగారు ఇచ్చిన గ్రేట్ సపోర్టుకు చాలా థాంక్స్. నితిన్ అమేజింగ్. ఆయనకు ఊపొస్తే తట్టుకోలేం. అంత బాగా యాక్ట్ చేశారు, డాన్సులు చేశారు. వేరే లెవల్లో ఆయన చేశారు. నాకు కూడా అది చూసి మరింత ఉత్సాహం వచ్చింది. వెంకీ కుడుముల లేకపోతే నేనిక్కడ ఉండేవాడ్ని కాదు. స్క్రీన్ పై రష్మిక అద్భుతంగా ఉంది. నితిన్, రష్మిక కెమిస్ట్రీ అమేజింగ్” అన్నారు.

ప్రేక్షకుల్ని డిజప్పాయింట్ చెయ్యం
డైరెక్టర్ వెంకీ కుడుముల మాట్లాడుతూ, “త్రివిక్రమ్ గారికి నేను భక్తుడ్ని. ఆయన దగ్గర ఎప్పట్నుంచే పనిచేద్దామని అనుకుంటున్నప్పుడు ‘అ ఆ’ సినిమాకు ఆయన దగ్గర నన్ను చేర్పించింది నిర్మాత చినబాబు గారే. వాళ్లిద్దరికీ థాంక్స్. ఈ సినిమా కథకు సమయం పట్టింది. అందువల్లే నితిన్ ఫ్యాన్స్ ను వెయిట్ చేయించాల్సి వచ్చింది. అయితే వెయిట్ చేసినందుకు సినిమా చాలా బాగా వచ్చింది. సినిమాపై నేను చాలా నమ్మకంగా ఉన్నాను. సినిమాటోగ్రాఫర్ సాయి శ్రీరామ్ మంచి విజువల్స్ ఇచ్చారు. పాటలకు సాగర్ ఎంత మంచి బాణీలిచ్చాడో, రీరికార్డింగ్ కూడా అంత అసాధారణంగా ఇచ్చాడు. రష్మిక ఈ సినిమా కథ వినగానే ఓకే అని చేసినందుకు థాంక్స్. ప్రేక్షకుల్ని మేం డిజప్పాయింట్ చెయ్యం” అని చెప్పారు.

నిర్మాతలకు ‘భీష్మ’తో భారీ లాభాలు రావాలి!
హీరోయిన్ రష్మికా మందన్న మాట్లాడుతూ, “ఈ తరంలో నిజమైన ఫ్రెండ్స్ ఉండటం చాలా కష్టమైపోతోంది. కానీ ఈ సినిమాకి పనిచేసేటప్పుడు నేను జెన్యూన్ పీపుల్ ని కలిశాను. వెంకీ కుడుముల అలాంటి వ్యక్తి. ఈరోజు టాలీవుడ్ లో నేనిక్కడ ఉన్నానంటే ఒక ప్రధాన కారణం ఆయనే. ‘భీష్మ’ స్క్రిప్టును ఆర్గానిక్ వ్యవసాయం నేపథ్యంతో ఆయన రాసుకున్నారు. ఈ సినిమాని ఆయన తీస్తున్న విధానం చూసి నేను సరెండర్ అయిపోయా. పాటలు, టీజర్, ట్రైలర్ అన్నీ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి. ఆయనకు  జీవితాంతం ఒక మంచి ఫ్రెండుగా ఉంటాను. నేను కాలేజీలో ఉన్నప్పుడు ‘అ ఆ’ చూశాను. నేను సినిమాలు చేస్తే, ఇలాంటి సినిమా చెయ్యాలని అప్పుడే అనుకున్నా. ఇప్పుడు అదే నితిన్ తో ‘భీష్మ’ చేశాను. తెర బయట ఆయన ఒక జెన్యూన్ పర్సన్. ఆయనను బెస్ట్ కో-స్టార్ అని చెప్పను, బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తాను. సందర్భానికి తగ్గట్లు సాగర్ మంచి సాంగ్స్ ఇచ్చారు. టాలీవుడ్ లో నాకు మొదట ‘చూసీ చూడంగానే’ అనే బిగ్గెస్ట్ సాంగ్ ఇచ్చారు. ఇప్పుడు ఈ సినిమాలోనూ ‘వాటే బ్యూటీ’, ‘సరాసరి’ పాటలతో పాటు సింగిల్స్ యాంథం ఇచ్చారు. రీరికార్డింగ్ సూపర్బ్ అని వింటున్నా. ప్రేక్షకులతో పాటు నేనూ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. నిర్మాతలకు ఈ సినిమాతో భారీ లాభాలు రావాలని కోరుకుంటున్నా. టాలీవుడ్ లో నేను చూసిన మంచి సినిమాల్లో ‘అ ఆ’ ఒకటి. నన్ను కూడా ఆయన సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా” అని చెప్పారు.

‘దిల్’, ‘సై’ తర్వాత ‘భీష్మ’!
హీరో నితిన్ మాట్లాడుతూ, “నా మునుపటి సినిమాకూ, ఈ సినిమాకూ దాదాపు ఒక సంవత్సరం గ్యాప్ ఉంది. స్క్రిప్ట్ మొత్తం పక్కాగా రెడీ అయ్యేవరకు సినిమా మొదలుపెట్టకూడని అనుకున్నాను. వెంకీ ఫుల్ స్క్రిప్ట్ చెప్పేవరకు ఆగి అప్పుడు మొదలుపెట్టాం. ఫిబ్రవరి 21న సినిమా వస్తోంది. వెంకీ ‘దిల్’ సినిమాకు, నాకూ పెద్ద అభిమాని అంట. ఒక ఫ్యాన్ బాయ్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో ఈ సినిమా అలా ఉంటుందని చెప్పాడు. చెప్పినట్లే అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ పెట్టి, ‘దిల్’, ‘సై’ తర్వాత  మళ్లీ అలాంటి యాంగిల్లో నన్ను చూపించాడు. నా ఫ్యాన్స్ అందరూ ఎప్పుడూ ‘డ్యాన్సన్నా.. డ్యాన్సన్నా’ అని అడుగుతున్నారు. ఈ సినిమాలో నేను చేసిన డ్యాన్స్ చూసి అభిమానుల ఆకలి తీరుతుందని అనుకుంటున్నా. కానీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ నా బెండు తీసేశాడు. శేఖర్ మాస్టర్ కూడా బాగా చేయించారు. సెకండాఫ్ లో వచ్చే ఫైట్ ను ఫైట్ మాస్టర్ వెంకట్ అదరకొట్టేశారు. ఆ ఫైట్ లో ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ గ్యారంటీ. ఆ ఫైట్ కు స్వరసాగర్ ఇచ్చిన రీరికార్డింగ్ ఫోన్ లో చూస్తుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఈ సినిమాకు లైఫ్ లాగా నిలిచే సాంగ్స్ ఇచ్చాడు. భవిష్యత్తులో తండ్రికి తగ్గ తనయుడిగా తను పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నా. కాసర్ల శ్యాం, శ్రీమణి, కృష్ణచైతన్య చాలా మంచి లిరిక్స్ ఇచ్చారు. నవీన్ నూలి బాగా ఎడిటింగ్ చేశాడు. నన్నూ, రష్మికను సినిమాటోగ్రాఫర్ సాయి శ్రీరామ్ చాలా అందంగా చూపించారు. నాకు బ్యూటీ టిప్స్ ఇచ్చేది బ్రహ్మాజీ గారైతే, రష్మిక ఇంత ఫిట్ గా, ఇంత బ్యూటీగా ఉండటానికి కారణం తను తీసుకొనే ఆహారం. అది సీక్రెట్. తను మంచి నటి. అవార్డులు కూడా వచ్చాయి. ఈ సినిమాలో ‘వాటే బ్యూటీ’ సాంగ్ లో తను చేసిన డ్యాన్స్ చూసి షాకయ్యా. చాలా బాగా చేసింది. హార్డ్ వర్క్, డెడికేషన్ తో ఇంకా పెద్ద స్థాయికి వెళ్తుంది. నాకు మంచి ఫ్రెండయ్యింది. మా నిర్మాతలు చినబాబు, వంశీ గార్లతో మొదట ‘అ ఆ’ చేసి, ఇప్పుడు ఈ సినిమా చేశాను. మూడో సినిమా ‘రంగ్ దే’ ఇప్పటికే చేస్తున్నా. నాలుగో సినిమా కోసం నాగవంశీ స్కెచ్ గీస్తున్నారు. నా లైఫ్ లో పంచ ప్రాణాలు.. మా అమ్మానాన్నలు, మా అక్క, పవన్ కల్యాణ్ గారు, త్రివిక్రమ్ గారు. ఇప్పుడు పెళ్లవబోతోంది కాబట్టి నాకాబోయే భార్య ఆరో ప్రాణం కాబోతోంది. త్రివిక్రమ్ గారితో పరిచయం కావడం, ‘అ ఆ’ సినిమా చెయ్యడం, నా జీవితంలో ఆయన ఉండటం నా అదృష్టంగా భావిస్తాను. ఆయన నా ముందుంటే నా దారి, నా పక్కనుంటే నా అండ, నా వెనకాల ఉంటే నా ధైర్యం. ఒక్క మాటలో చెప్పాలంటే నాకు మార్గదర్శకుడు. ఇక పవన్ కల్యాణ్ గారి గురించి చెప్పేదేముంది. ఆయన మేలో మనముందుకు రాబోతున్నారు. అందరం అప్పుడు చొక్కాలు చింపుకొని సినిమా చూద్దాం” అని చెప్పారు.

‘భీష్మ’ సక్సెస్ గ్యారంటీ-  సుప్రసిద్ధ దర్శకుడు త్రివిక్రమ్

మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ దర్శకుడు త్రివిక్రమ్ మాట్లాడుతూ, “నితిన్ కు వాళ్లన్నయ్య పవన్ కల్యాణ్ ఆశీస్సులెప్పుడూ ఉంటాయ్. ఆయన తరపునా, ఆయన అభిమానులందరి తరపునా నితిన్ కు ఆల్ ద బెస్ట్. డైరెక్టర్ వెంకీ కుడుముల, సినిమాటోగ్రాఫర్ సాయి శ్రీరామ్, మ్యూజిక్ డైరెక్టర్ మహతి.. మిగతా అందరికీ అభినందనలు చెబుతున్నా. ఇప్పటికే నేను సినిమా చూశాను. చాలా చాలా బాగుంది. 21న అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారని నమ్మకంగా చెబుతున్నా. రష్మిక ‘సరిలేరు నీకెవ్వరు’తో మంచి సక్సెస్ మార్గంలో ఉంది. ఇప్పుడు ‘భీష్మ’ వస్తోంది. ఆమెకు మరిన్ని విజయాలు రావాలి. బెంగళూరు నుంచి 50 నిమిషాలే ప్రయాణం కాబట్టి ఆమె వర్రీ అవ్వాల్సిన పనిలేదు. మీరెప్పుడూ మాకు బాగా దగ్గరిగానే ఉంటారు. ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన అంశాలు సెకండాఫ్ లో రెండున్నాయి. ఒకటి వెంకట్ మాస్టర్ చేసిన ఫైట్. చాలా బాగా దాన్ని డిజైన్ చేశారు. రెండు.. జానీ మాస్టర్ చేసిన లాస్ట్ సాంగ్ ‘వాటే బ్యూటీ’.  మా ‘బుట్టబొమ్మ’ సాంగ్ ఎంత బాగా చేశాడో, దాన్ని అంత బాగా చేశాడు. ‘జెర్సీ’ తర్వాత నిర్మాత వంశీ మరో మంచి సినిమాని మీ ముందుకు తీసుకు వస్తున్నారు. మంచి సక్సెస్ తో 2020లోకి అడుగుపెట్టబోతున్నారు. 21 సాయంత్రం పెద్ద పార్టీ ఇవ్వాలని, దానికి నన్ను పిలవడం మర్చిపోవద్దని కోరుకుంటున్నా” అని చెప్పారు.

ఈ వేడుకలో నిర్మాత ఎన్.సుధాకర్ రెడ్డి, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, ఫైట్ మాస్టర్ వెంకట్, సుచిర్ ఇండియా కిరణ్, గ్రీన్ మెట్రో ప్రతినిధులు అశోక్, ఆదిత్య, బాలనటుడు రాకేష్ కూడా చిత్ర విజయాన్ని ఆకాంక్షిస్తూ ప్రసంగించారు.

 

 Bheeshma ‘Success Guarantee ..!
- Trivikram, a well known director in a pre-release event

The ‘Bheeshma’ Movie Pre-Release event, played by the young protagonist Nithiin in the title role, was held on Monday in the presence of fans and well wishers at Yousufguda Police Grounds. Suryadevara Nagavamsi is the producer  and  Rashmika Mandana is the heroine in the film under the banner of famous film production company Sithara Entertainment venky kudumula, Director of ‘Chalo’ fame .

Earlier in the film, the song’s
single anthem ,song writer Srimani said, “I wrote the  song singles anthem where I took incidents from  every single life
. I wrote the last Bachelor Song for Nithiin.
Frustration and emotion in me  as a single are shown in this song…
In the meantime, I had a very good reputation for this song…
Harika hassine creations gave me a break with ‘Julayi’, Since then I have been travelling with Nagavamsi…

Another songwriter, Kasarla Shyam, said, “I wrote two songs in the first film ‘Chalo’ of Venky Kudumula. Both of them made a good name.
I wrote the song ‘What a  Beauty’ song in Bheeshma. This song was written by me  by sagar mahati  very well. I am happy  this song got good response….

Director Venky Atuluri said, “Venky Kudumula, I made an entry almost at the same time. His ‘Chalo’ and my ‘debute film tholi Prema’ were good hits. We have been good friends since then. Congrets venky…. This film is going to big hit

Good Feel Good Movie!
Actor Brahmaji said,
“I have done a little character in this film. It is very cute. I am getting good characters in  every movie  under Harika hassine banner.
I think Venky Kudumula will definitely shake  with this movie.
I have seen so many scenes when iam doing  dubbing . It’s a feel  good Movie. Nithiin will be seen as a good commercial hero in the movie.
Rashmika is a  Beautiful Girl and Fantastic Actress.
Venki Kudumula is the one that made me laugh the most after Trivikram

Nithiin did fantastic  dance in this movie
-dil raju

Producer Dil Raju said, “When I saw Venky’s ‘Chalo’, his entertainment skills and his vision came to mind. Nithiin told this story to me  while doing ‘Srinivasa Kalyanam’. I liked the story a lot and thought it wil become a big hit. Nithin danced very well…
I felt very happy after watched the film…
I enjoyed a lot…
Audience also definitely enjoyed this film.
Rashmika is playing with  Nithiin throughout the film.
The music given by Swarasagar is amazing. All the songs are good.
I  Glad to see that  Swarasagar makes manisharma  name stand out…
The movie is a visual treat. We know how big  ala  Vaikuntapuram lo was’. The film has visuals to match with that film. The film is coming out on February 21 and will be a big hit

Nithiin, Rashmika Chemistry Amazing!
- Music director Mahati Swarasagar

Music director Mahati Swarasagar said, “Thank you very much for the great support given by the producers Radha krishna sir and vamsi sir
Nithiin is a  AMAZING performer and dancer ….
He did it on a next level.
I was even more excited to see it.
Today I am in this position  because of Venky kudumula….
Rashmika looks great on screen. Nithiin, Rashmika Chemistry is Amazing.

We don’t disappoint audience
- director Venky kudumula

Director Venky Kudumula said
I am a devotee of Trivikram. When I thought of working with him, Chinna babu sir  joined me for the film ‘Aa’ Aa
Thank you to both of them.

The story of the film took some time. That’s why Nithiin Fans had waited little …. But the film got a lot better for Waiting. I am very confident for this film. Cinematographer Sai Sriram gave good visuals. Sagar was well-versed in the songs, and even the re- recording was extraordinary. Thanks to Rashmika for making the story of the film okay. “We don’t disappoint audience…

Producers must make huge profits with ‘Bheeshma’!
Rashmika Mandanna

Rashmika Mandanna said it is becoming  difficult to have true friends in this generation. But while working on this film, I met the Genuine Person. Venky kudumula….   He is the main reason I am here today in Tollywood.
He wrote the Bhishma script with the theme of organic farming. Seeing his approach to the film, I became surrendered. The songs, teaser, trailer are all captivating audiences. He’ll be a good friend for the rest of my life. I saw ‘aa’  aa when I was in college. If I make films, then I want to make a movie like this. Now I have done ‘Bheeshma’ with the same Nithiin. Behind the scenes he is a Genuine Person. I wouldn’t call him a best co-star, I’d say best friend…
Sagar gave good songs to ease the occasion. In Tollywood, I was first given the Biggest Song
‘Choosi choodangaane’.
Now this  film also has singles song  along with songs like ‘What a  Beauty’ and ‘Sarasari’. I am Listening Re-recording is Superb. Along with the audience, I am also looking forward to see the film. Producers want to make huge profits with this film. ‘Aa aa’ is one of the best films I have seen in Tollywood.
I hope producers chinna babu sir  will support me too. ”

Bheeshma’ after  dil ‘and’ Sye’
Hero Nithiin

Hero Nithiin said,
“There is a gap of almost a year for my previous film and this film.
. I thought that the film should not
start until the whole script is ready. We started when venky was told me full script . The movie is coming on February 21st.

Venky is a big fan of ‘Dil’ movie. He said that this is how a fan boy would make a movie. After  ‘Dil’ and ‘Sye, he showed me in such an angle again with all commercial elements. All my fans are always asking ‘danceanna .. danceanna’. I think the dancing I did in the movie will satisfy  the hunger of my fans…But choreographer johnny master  steps was so tough but it’s good and I enjoyed a lot
Shekhar Master has done well too. The fight in the second half was made by Fight Master Venkat. Goose bumps guarantee to fans in that fight.
Goose bumps are coming when iam watching swara sagar re recording of the fight…
He gave life long memorable songs in this film….
In future  i wish he wil be so popular just like his dad..
Kasarla Shyam, Shreemani and Krishna chaitanya gave very good lyrics.
Navin nooli did editing well…
Cinematographer Sai Sriram showed me and rashmika very beautiful in this film…. Brahmaji gives me beauty tips in this film …
Rashmika is so fit …The reason why she is so fit is because the food she takes…
It’s secret
She’s a good actress. She also received awards for her acting…
I shocked when I saw her dance in  what a beauty song… she did so good
Her hard work dedication takes her to next level… she became  a good friend to me in this film
Our producers Chinnababu and Vamsi Gaaru have done ‘Aa’ Aa first and now I have made this film. The third movie ‘Rang De’ is already doing. Nagavamsi is sketching for the fourth movie.
In my life five important persons are there (pancha pranalu)my mother and father my sister Pawan kalyan Sir Trivikram sir…
I am going to married and wife become sixth important person
I feel very fortunate to have been introduced to Trivikram sir, to make ‘Aa’aa and to be part in my life. If he is in front of me..It’s my way… To my side my support. To my back my courage….
In one word he’s  a guide to me…

What I say about  Pawan Kalyan sir? He’s coming to us in May. We all are ready to make Shredding the shirts and watch the movie.

Bheeshma ‘Success Guarantee
Famous Director Trivikram

well-known director Trivikram said, “Pawan Kalyan’s blessings will always be on Nithin’s side…
All the best for him
Director Venky Kudumula, Cinematographer Sai Sriram,
Music Director Mahathi …..Congratulations to everyone else.
I have already seen the movie. Very, very nice. Iam  confident that everyone will enjoy it well on this  21st.
Rashmika is on good path with salirelu meekevaaru success . Now ‘Bheeshma’ is coming. She needs more success. It is just  a 50-minute drive to  Bangalore…. so she need not to  be worried.
You are always very close to us…
My favorite aspects of the film are the “two” in the second half. One is the fight made by the Venkat Master. Very well designed it. Two .. The Last Song ‘What a  Beauty’ by Johnny Master.
He made our butta bomma very well…
This song also made very well…

After the Jersey, producer Vamsi is bringing you another good movie .
He is entering 2020 with good success. I hope he Want to give a big party on the 21st evening and don’t forget to call me for it.

producer sudhaakarreddy, Choreographer Johnny Master, Fightmaster Venkat, Suchir India Kiran and Green Metro representatives Ashok, Aditya and child actor Rakesh also addressed the film’s success

 

09678 (74) 09678 (100)

డబ్బింగ్ చెప్తున్నంతసేపూ ‘భీష్మ’ చాలా క్యూట్ ఫిల్మ్ అనిపించింది – రష్మికా మందన్న

“డబ్బింగ్ చెప్పేటప్పుడు సినిమా కనిపించిన విధానం కానీ, నితిన్ కూ, నాకూ మధ్య కెమిస్ట్రీ కానీ చాలా బాగున్నాయనిపించింది. వెరీ క్యూట్ ఫిల్మ్ అనిపించింది. ప్రేక్షకులు కూడా కచ్చితంగా అదే ఫీలవుతారు. సాంగ్స్ కూడా బాగా నచ్చాయ్. సినిమా మొత్తం ఒక విజువల్ ట్రీట్ లా ఉంటుంది” అన్నారు రష్మికా మందన్న. నితిన్ కథానాయకుడిగా సితార ఎంటర్టైన్మెంట్శ్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన సినిమా ‘భీష్మ’లో ఆమె నాయికగా నటించారు. వెంకీ కుడుముల డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఫిబ్రవరి 21న విడుదలవుతోంది. ఈ సందర్భంగా రష్మికతో మీడియా ప్రతినిధుల మాటామంతీ…

‘సింగిల్ ఫరెవర్’ అనే ట్యాగ్ లైన్ మీకు యాప్ట్ ఏమో ఇప్పుడు?
అవును కదూ.. నితిన్ ఎంగేజ్ అయిపోయారు.. డైరెక్టర్ వెంకీ, నేను కూర్చొని ఈ సినిమాని మన కోసం చేసుకున్నాం అని సరదాగా అనుకున్నాం.

సినిమా చూశారా?
లేదు. డబ్బింగ్ చెప్పేటప్పుడు నా పోర్షన్ మాత్రం చూశాను. సినిమా కోసం ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నా. ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్స్ ని ఎంజాయ్ చేస్తున్నా.

‘భీష్మ’లో ఎలాంటి రష్మికను ఆశించవచ్చు?
మంచి వినోదాన్ని మీరు ఆశించవచ్చు. అయితే నా సినిమాని నేను జడ్జ్ చెయ్యలేను. ఇందులో నేను చైత్ర అనే క్యారెక్టర్ చేశాను. నైస్ క్యారెక్టర్. భీష్మ ఆర్గానిక్స్ కంపెనీలో పని చేస్తుంటా. నా పాత్ర నుంచి మీకు అది లభిస్తుంది, ఇది లభిస్తుంది.. అని చెప్పలేను. జనరల్ గా చెప్పాలంటే సినిమా మాత్రం సూపర్ గా నవ్విస్తుంది. ఒక్కటి మాత్రం చెప్పగలను. ఈ సినిమాతో రష్మిక బాగా నటిస్తుందనీ, బాగా డాన్సులు చేస్తుందనీ, బాగా పాడుతుందని కూడా అందరూ అనుకుంటారు.

అనంత్ నాగ్ గారితో కలిసి పనిచెయ్యడం ఎలా ఉంది?
ఆయన ఫాదర్ ఫిగర్ లాంటివారు. ఆయన కాంబినేషన్ లో నాలుగైదు రోజులు పనిచేశాను. ఆయన కూడా కర్ణాటక నుంచి వచ్చినవాళ్లు కాబట్టి ఇద్దరం ఎప్పుడూ కన్నడలో మాట్లాడుకొనేవాళ్లం. నా సినిమాల గురించి అడిగేవారు. ఆయన నటన అంటే నాకు చాలా ఇష్టం. ఆయనతో కలిసి పనిచెయ్యడాన్ని బాగా ఆస్వాదించాను.

ఈ సినిమాలో ఆర్గానిక్ వ్యవసాయం గురించి చెప్పడం ఎలా అనిపించింది?
మా ఫ్రెండ్స్ తో ఈ కథ చెప్పినప్పుడు, ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి ఏం చెప్తారే?.. అని అన్నారు. కానీ ‘భీష్మ’లో తన స్క్రీన్ ప్లేతో ఆ టాపిక్ గురించి వెంకీ చాలా బాగా చెప్పాడు. ఇందులో ఎక్కడా దాని గురించి లెక్చర్స్ ఉండవు. ‘భీష్మ’ అనేది ఆర్గానిక్ వ్యవసాయం గురించిన కథ కాదు. ఇది ఒక వ్యక్తి ప్రయాణం. ఆర్గానిక్ వ్యవసాయం అనేది అతని జర్నీలో ఒక భాగం. ఒక్క మాటలో చెప్పాలంటే ‘భీష్మ’ చాలా మంచి ఫిల్మ్.
వ్యవసాయం గురించిన యథార్థ ఘటనలను కూడా ఈ సబ్జెక్టులో జోడించారా?
రైతులు ఇవాళ ఎన్ని కష్టాలు పడుతున్నారో మనకు తెలుసు. అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నవాళ్లనూ, పిల్లల స్కూళ్లు ఫీజు చెల్లించడానికి కూడా నానా కష్టాలు పడుతున్నవాళ్లనూ మనం చూస్తున్నాం. వాటిని సూచనప్రాయంగా ఈ కథలో డైరెక్టర్ చెప్పాడు. నాకు కథ చెప్పినప్పుడు ఆర్గానిక్ వ్యవసాయం అనేది ఒక అంతర్లీన సందేశంగానే ఉంటుందనీ, ప్రధానంగా ఇది ఫన్ ఫిల్మ్ అనీ చెప్పాడు. నేను డబ్బింగ్ చెప్పేప్పుడు అదే ఫీలయ్యాను. వ్యవసాయం అనేది చాలా సున్నిత అంశం. దాన్ని ప్రేక్షకులు ఆమోదించేలాగా వెంకీ తీశాడు.
నితిన్.. పవన్ కల్యాణ్ అభిమాని అని మీకు తెలుసా?
మాటల మధ్యలో ఒకసారి తాను పవన్ కల్యాణ్ గారికి వీరాభిమానినని నితిన్ చెప్పారు. చిన్నప్పట్నుంచీ ఆయన పవన్ కల్యాణ్ గారికి ఫ్యాన్. ఇప్పుడు తను యాక్టర్ అయినా కూడా ఇంకా ఆయన ఫ్యాన్ గానే ఉండటం ముచ్చటగా అనిపించింది. ‘పవన్ గారిని ఎప్పుడైనా కలిశారా?’ అనడిగాను. రెండు మూడుసార్లు పవన్ కల్యాణ్ గారిని కలిశానని చెప్పారు. మొత్తానికి నితిన్ ఒక ఫ్యాన్ బాయ్.

నితిన్ తో పనిచెయ్యడం ఎలా అనిపించింది?
నేను సరదాగా చెప్పడం లేదు. ‘అ ఆ’లో నితిన్, సమంతను చూసినప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వెళ్తే, ఇలాంటి సినిమా చెయ్యాలి అనుకొన్నాను. వాళ్లిద్దరూ అంత చక్కగా అనిపించారు ఆ సినిమాలో. ఇప్పుడు  నితిన్ తోటే ఈ సినిమా చేశా. మొదటిరోజు సెట్స్ మీదకు వెళ్లినప్పుడు.. తను చాలా సినిమాలు చేశారు కదా, తనతో చెయ్యడం సౌకర్యంగా ఉంటుందా, లేదా అనుకున్నా. కానీ తను ఒక కాలేజ్ బాయ్ లా కనిపించారు. కూర్చొని ఫోన్ చూసుకుంటూ, వెంకీతో మాట్లాడుతూ నవ్వుతూ ఉంటారు. దాంతో నేను సౌకర్యంగా ఫీలయ్యా. కాలేజ్ ఫ్రెండ్స్ ఎలా ఉంటారో అలా అయిపోయాం.

మీకు నితిన్ లవ్ స్టోరీ గురించి ఎప్పుడు తెలిసింది?
నిశ్చితార్థానికి రెండు రోజుల ముందే తెలిసింది. అప్పటిదాకా తను నాకూ ఈ విషయం చెప్పలేదు.

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ గురించి ఏం చెబుతారు?
ఈ సినిమా చేసేటప్పుడు నాలుగైదు సార్లు నిర్మాత నాగవంశీ గారిని కలిశాను. చాలా ప్రశాంతంగా ఉంటారు. ఈ సినిమా చూసినవాళ్లు ప్రొడక్షన్ విలువల గురించి కూడా మాట్లాడుకుంటారు. అంత క్వాలిటీతో నాగవంశీ గారు ‘భీష్మ’ను నిర్మించారు.

‘ఛలో’ నుంచి చూసుకుంటే మూడేళ్లలోనే మీకు స్టార్ డం రావడాన్ని ఎలా ఫీలవుతున్నారు?
నాకు వచ్చిన స్క్రిప్ట్స్ లో నాకు నచ్చినవి చేసుకుంటూ పోతున్నానంతే. ఇందులో లక్ ఫ్యాక్టర్ ఎంత ఉందో నాకు తెలీదు.

వేలంటైన్స్ డేని ఎలా గడిపారు?
వేలంటైన్స్ డేకి ఫుల్ వర్క్ ఉంటుందని మార్నింగ్ జిమ్ కు వెళ్లొచ్చా. కానీ అన్ని వర్క్స్ కేన్సిల్ అయ్యాయి. అలా నా వేలంటైన్స్ డే ఎప్పుడూ లేనంత బోరింగ్‌గా గడిచింది. ఎవరూ ఎప్పుడూ అలాంటి బోరింగ్ వేలంటైన్స్ డేని గడిపి ఉండరు.

పాత్రల ఎంపికలో ఇప్పుడు వేటికి ప్రాధాన్యమిస్తున్నారు?
కథకు ప్రాధాన్యమున్న పాత్రల్ని, మనసుకు నచ్చిన పాత్రల్ని ఎంచుకుంటున్నా. ఇది చేస్తే కొత్తగా ఉంటుంది అనిపించినా చేస్తున్నా. ఇప్పుడు పాత్రల విషయంలో మరింత కొత్తదనం కోసం చూస్తున్నా. ఇది ప్రయోగాలు చెయ్యడమే. తర్వాత ఏమవుతుందనే ఉత్కంఠ కలిగించే సబ్జెక్టులు ఎంచుకుంటున్నా. రెండు విషయాలు నేను నమ్ముతాను. థియేటర్ కు వచ్చిన ప్రేక్షకులు మంచి సినిమా చూశామనే అనుభూతిని పొందాలి.. అది ఎమోషనల్ కావచ్చు, మరొకటి కావచ్చు. లేదంటే వాళ్లు సరదాగా ఎంజాయ్ చేసేటట్లయినా ఉండాలి.  కడుపు నొప్పి పుట్టేంతగా వాళ్లు నవ్వాలి. ‘భీష్మ’ ఈ రెండో రకానికి చెందిన సినిమా. డబ్బింగ్ చెప్పేప్పుడు నేనే నవ్వలేక పొట్టచేత్తో పట్టుకున్నా.

అల్లు అర్జున్ తో చేస్తున్న సినిమాలో ఎప్పుడు జాయిన్ అవుతున్నారు?
మార్చి మధ్యలో జాయినవుతాను. అందులో పూర్తిగా మరో రష్మికను మీరు చూస్తారు.

*While I was dubbing…. I feel ‘Bheeshma’ seemed to be quite a cute film, – Rashmika Mandanna*

Rashmika Mandanna said: “The dubbing is what the film looks like, but the chemistry between Nithiin and me is very good. Very cute film. She is the heroine of the film ‘Bheeshma’ produced by Suryadevara Naga vamsi under the banner of Sithara Entertainment directed by Venky Kudumula, the movie is releasing on February 21st. Rashmika spoke with media representatives…
Tag line ‘single Forever’ What do you want to do now?
Yes, Nithiin is Engaged .. Director Venky and I sat down and made fun of this movie.
Have you seen the movie?
No. I saw my portion while dubbing. Looking forward to the film. Now I am enjoying the promotions of the film.
What kind of role Rashmika can be expected in ‘Bheeshma’?
You can expect good entertainment. But I can’t judge my film. In this I have played a character named Chaitra. Nice character. I work at Bheeshma Organics Company. I can’t say that you get it that and this.. from my character. Generally speaking, the movie is super funny….people wil say Rashmika performs well, dances and sings well with this film.

How is working with Ananth Nag?
He was like a Father figure. I worked in his combinations for four days. Since he too hails from Karnataka, we two have always spoken in Kannada. Who cares about my movies. I like his performance. I really enjoyed working with him.
How did you feel about telling organic farming in this movie?
When we tell this story to our friends, they said “what can we say about organic farming? But Venky said very well about that topic with his screenplay in ‘Bheeshma’. There are no lectures about it anywhere. ‘Bheeshma’ is not a story about organic farming. It’s a one person journey. Organic farming is part of his journey. In a word ‘Bheeshma’ is a very good film.
Are the real events about agriculture included in this subject?
We all know how hard the farmers lives are today. We see people committing suicides, and children are struggling to pay their school fees. The director told them as the story. When I was told the story, organic farming was an underlying message, basically a fun film. When I say dubbing it is the same file. Agriculture is a very delicate subject. Venky made it so that the audience would accept it .
Did you know that Nithiin is Pawan Kalyan’s fan?
Nithiin once said that he was a fan of Pawan Kalyan. From childhood,He is a fan of Pawan Kalyan. Even though he is now an actor, he still seems to be a fan.i asked him ‘Have you ever met Pawan?’. He said he had met Pawan Kalyan twice and thrice. To sum up, Nithiin is a fan boy.

How did it feel to work with Nitin?
I’m not saying this in a fun manner . When I saw Nithiin and Samantha in ‘Aa’ aa, I thought that if you go into the film industry, you should do something like this. They both looked so good in the movie. Now with Nithiin I did the film. On the first day of going of the sets .. I thought he make a lot of films, whether he was comfortable with it or not. But he looked like a college boy. Sitting down, looking at the phone, talking to Venky and smiling. I am comfortable with it. College friends are like that.
When did you know about the Nitin Love Story?
It was reported two days before the engagement. He did not say this to me until then.
What does Sitara Entertainment say about the banner?
I met producer Nagavamsi about four times while making this film. Quite calm. Audience also talk about production values when they watched the movie . Nagavamshi built ‘Bheeshma’ with such quality.
How do you feel getting Stardom in three years from ‘Chalo’?
The scripts that I got were doing what I liked. I do not know how much luck factor in this.
How did you spend Valentine’s Day?
I went to Gym in the morning thinking that I have full day work on Valentine’s Day. But all the works were cancelled. My Valentine’s Day was so boring as ever. No one has ever spent such a boring Valentine’s Day.

What is now preferred in the selection of characters?
Choosing the characters that interest the story and the characters you like. Doing this seems new. Now looking for something more new in terms of characters. It’s about experimenting. Selecting subjects that will inspire what happens next. Two things I believe. Audiences who come to the theater should feel that they have seen a good movie .. It can be emotional, it can be another. Or else they should have fun. They should laugh. ‘Bheeshma’ is the second type of film. I smiled at the dubbing, I couldn’t help stop laugh at the dubbing…
When did Allu Arjun join the movie?
Join in mid-March. You will see another Rashmika in it.

6R3B4389 6R3B4394 6R3B4401 6R3B4416 6R3B4442 6R3B4453 6R3B4462

First ever Telugu film with Hockey backdrop is getting ready to hit the screens this summer.

విడుదలకు ముస్తాబవుతున్న సందీప్ కిష‌న్ `A1 ఎక్స్‌ప్రెస్‌`
* హాకీ బ్యాక్ డ్రాప్‌లో రూపొందుతున్న తొలి తెలుగు చిత్రం 

`నిను వీడ‌ని నీడ‌ను నేనే` చిత్రంతో మంచి విజయం సాధించిన యువ క‌థానాయకుడు సందీప్ కిష‌న్ హీరోగా న‌టిస్తున్న కొత్త చిత్రం `A1 ఎక్స్‌ప్రెస్‌`. ‘లావణ్య త్రిపాఠి’ నాయిక. హాకీ బ్యాక్ డ్రాప్‌లో రూపొందుతున్న తొలి తెలుగు చిత్ర‌మిది. న్యూ ఏజ్ స్పోర్ట్స్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు ముగింపు దశలో ఉంది. ఈ చిత్రానికి ‘డెన్నిస్ జీవ‌న్ క‌నుకొలను’ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ‘హిప్ హాప్ త‌మిళ’  సంగీత సార‌థ్యం వ‌హిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్‌, వెంక‌టాద్రి టాకీస్ ప‌తాకాల‌పై టి.జి.విశ్వ‌ప్ర‌సాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్, సందీప్ కిష‌న్‌, ద‌యా ప‌న్నెం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వేసవి కానుకగా ఈ చిత్రాన్ని విడుద‌ల చేసేలా స‌న్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు.
కాగా ఈ చిత్రానికి సంబంధించిన తొలి గీతాన్ని ఈరోజు చిత్రం అధికారిక మాధ్యమం అయినా యు ట్యూబ్ ద్వారా విడుదల చేశారు. ‘సింగిల్ కింగులం’ అనే పేరుతో విడుదల అయిన ఈ గీతానికి రచయిత సామ్రాట్ సాహిత్యం అందించగా, సంగీత దర్శకుడు హిప్ హాప్ త‌మిళ’ అందించిన స్వరాలు యువతను ఉర్రూతలూగిస్తున్నాయి. గాయకుడు రాహుల్ సిప్లి గంజ్ గాత్రంలో కదం తొక్కిన ఈ గీతానికి, శేఖర్ మాస్టర్ నృత్యాలు యువతను అలరిస్తాయని దర్శకుడు తెలిపారు. కథానాయకుడు సందీప్ కిషన్ నాయిక లావణ్య త్రిపాఠి తో కలసి ఆడి పాడిన ఈగీతం ప్రేక్షకులను మెప్పిస్తుంది.

`A1 ఎక్స్‌ప్రెస్‌` లో సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి నాయకా,నాయికలు కాగా ఇతర ప్రధాన పాత్రలలో రావు రమేష్, మురళీశర్మ, పోసాని కృష్ణ మురళి, ప్రియదర్శి, సత్య, మహేష్ విట్టా, పార్వతీశం, అభిజిత్, భూపాల్, ఖయ్యూమ్, సుదర్శన్, శ్రీ రంజని, దయ, గురుస్వామి తదితరులు నటిస్తున్నారు.

ఈ చిత్రానికి కెమెరా: కవిన్ రాజ్; సంగీతం: హిప్ హాప్ త‌మిళ; ఎడిటర్: చోటా.కె.ప్రసాద్; సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి,సామ్రాట్; ఆర్ట్: అలీ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: శివ చెర్రీ, సీతారాం, దివ్య విజయ్, మయాంక్ సింఘానియా.
స‌హ నిర్మాత‌:  వివేక్ కూచిభొట్ల
నిర్మాత‌లు: టి.జి.విశ్వ‌ప్ర‌సాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్, సందీప్ కిష‌న్‌, ద‌యా ప‌న్నెం
ద‌ర్శ‌క‌త్వం: డెన్నిస్ జీవ‌న్ క‌నుకొలను

First ever Telugu film with Hockey backdrop is getting ready to hit the screens this summer.

After spine chilling hit #NinuVeedaniNeedanuNene Talented hero Sundeep Kishan coming with “A1Express“, Lavanya Tripati as a lead pair. First ever Hockey backdrop in Telugu. This film coming as a New Age sports entertainer, final stage of shooting is in progress. Director:Dennis Kanukolanu, Music by Hiphop Tamizha. PeopleMediaFactory,Abhishek Aggarwal Arts, Venkatadri Talkies banners combinely presents. T.G.Vishwa Prasad,Abhishek Aggarwal, Sundeep Kishan, Daya Pannem producing the film. Planning to release the film this summer.
First Lyrical #SingleKingulam is on air now. 
The First lyrical ‘Single Kingulam’  released through official youtube channel. Director stated that, The foot tapping mass number is picturised on Lead pair Sundeep Kishan & Lavanya Tripati. This song is penned by Samrat, music composed by HipHop Tamizha from the vocals of Rahul Sipligunj in Shekar master choreography now trending everywhere.

Cast & Crew
Sundeep Kishan,Lavanya Tripati,Rao Ramesh,Murali Sharma,Posani Krishna Murali
Priyadarshi,Satya,Mahesh Vitta,Parvateesham,Abhijith,Bhupal,Khayyum,Sudharshan
SriRanjani,DayaGuru Swamy etc.
Music by HipHop Tamizha;Editor – Chota K Prasad;Cinematography – Kavin Raj; Lyricists: Ramajogayya Shastry, Samrat ; Art: Ali;

Executive Producers – Siva Cherry, Seetharam, Divya Vijay & Mayank Singhaniya
Co Producer – Vivek Kuchibhotla
Producers:T.G Vishwaprasad, Abhishek Agarwal & Sundeep Kishan, Daya Pannem,
Directed by ‘Dennis Jeevan Kanulolanu
A1X PRESS (1) A1X PRESS (2) (1) A1X PRESS (3) A1X PRESS (4) (1)

WHATTEY WHAYYEY SONG OUT FROM ‘BHEESHMA’ TEAM .

 ’భీష్మ’ నుంచి ‘వాటే వాటే వాటే బ్యూటీ’  గీతం విడుదల

* నిర్మాణ కార్యక్రమాలు ముగింపు దశలో ‘భీష్మ’
* ఫిబ్రవరి 21 న విడుదల
‘భీష్మ’
నితిన్,రష్మిక మందన,వెంకీ కుడుముల కాంబినేషన్ లో ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై యువ నిర్మాత సూర్యదేవర నాగ వంశి నిర్మిస్తున్న చిత్రం ‘భీష్మ’.
ఈ చిత్రంలోని మరో గీతం ఈరోజు అధికారికంగా సామాజిక మాధ్యమం అయిన ‘యు ట్యూబ్’ ద్వారా విడుదల అయింది. హీరో నితిన్, నాయిక రష్మిక మందన బృందంపై చిత్రీకరించిన ఈ గీతానికి జానీ మాస్టర్ నృత్య రీతులు సమకూర్చారు. పలు అందమైన సెట్స్ లో ఈ పాట చిత్రీకరణ జరిగింది. గీత  రచయిత కాసర్ల శ్యామ్ సాహిత్యానికి, సంగీత దర్శకుడు మహతి స్వర సాగర్ స్వరాలూ సమకూర్చగా, గాయకుడు ధనుంజయ్, గాయని అమల చేబోలు ల  గాత్రంలో ప్రాణం పోసుకుందీ పాట. ‘వాటే వాటే వాటే బ్యూటీ’ పేరుతో విడుదలయిన ఈ గీతానికి సంగీత ప్రియులనుంచి, అభిమానులనుంచి విశేష స్పందన లభించింది.
ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదల అయిన  వీడియో దృశ్యాలు, ‘సింగిల్స్ యాంధం’ గీతం వంటి  వీటికి ప్రేక్షకాభిమానులనుంచే కాక, సామాజిక మాధ్యమాలలో సైతం విశేషమైన ప్రాచుర్యం లభించింది. చిత్రం షూటింగ్ పూర్తయింది. నిర్మాణ కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్న ఈ  చిత్రం  ఫిబ్రవరి 21 న విడుదల కానుంది.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు వెంకీ కుడుముల మాట్లాడుతూ …ఈ చిత్రం లోని మరో గీతం ఈరోజు విడుదల అయింది. ‘వాటే బ్యూటీ’ పేరుతో విడుదల అయిన ఈ గీతానికి  ప్రేక్షకాభిమానులనుంచి అద్భుతమైన స్పందన లభించింది. జానీ మాస్టర్ సమకూర్చిన నృత్య రీతులు అభిమానులను అలరిస్తాయి. నితిన్,రష్మిక జంట చూడ ముచ్చటగా ఉందన్న ప్రశంసలు వెల్లువెత్తాయి. ఇప్పటికే విడుదల అయిన ఈ చిత్రం లోని వీడియో దృశ్యాలు, సింగిల్స్ యాంధం’ గీతం  వైరల్ అయ్యాయి. అలాగే భీష్మ ప్రచార చిత్రాలకు కూడా ప్రేక్షకాభిమానులనుంచి విశేషమైన స్పందన లభిస్తోంది అన్నారు. ‘భీష్మ’ చిత్ర కధ,కధనాలు,సన్నివేశాలు,సంభాషణలు చాలా కొత్తగా ఉంటాయి. ప్రతి అబ్బాయి నితిన్ గారి క్యారెక్టర్ కి కనెక్ట్ అయ్యేవిధంగా డిజైన్ చెయ్యబడింది. అలాగే ప్రతి యువతి కూడా రష్మిక క్యారెక్టర్ కి కనెక్ట్ అవుతుంది. ఇది ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్. వినోద ప్రధానంగా సాగుతుంది అని తెలిపారు దర్శకుడు వెంకీ కుడుముల.నటీ,నటులు :
నితిన్,రష్మిక మండన,నరేష్,సంపత్,రఘుబాబు,బ్రహ్మాజీ,నర్రా శ్రీనివాస్,వెన్నెల కిషోర్,అనంత నాగ్,శుభలేఖ సుధాకర్,జస్సెన్ గుప్త, సత్యన్, మైమ్ గోపి, సత్య, కల్యాణి నటరాజన్,రాజశ్రీ నాయర్,ప్రవీణ  తదితరులు నటిస్తున్నారు.
మ్యూజిక్ : మహతి స్వర సాగర్ , డి .ఓ .పి : సాయి శ్రీరామ్ , ఆర్ట్ డైరెక్టర్ : సాహి సురేష్,
ఎడిటర్ : నవీన్ నూలి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్. వెంకటరత్నం(వెంకట్ ),
సమర్పణ : పి.డి .వి. ప్రసాద్ ,
ప్రొడ్యూసర్: సూర్యదేవర నాగ వంశి ,
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం : వెంకీ కుడుముల.

 SITHARA ENTERTAINMENTS ‘BHEESHMA’

WHATTEY WHAYYEY SONG OUT FROM ‘BHEESHMA’ TEAM .
*GRAND RELEASE WAS PLANNED ON FEB 21 
Nithiin & Rashmika Mandanna  starring  “BHEESHMA”  film  written  & directed  by  VENKY KUDUMULA , Produced  by SURYA DEVARA NAGA VAMSI  under  SITHARA  ENTERTAINMENTS. Another song  ‘whattey whattey beauty’ released Today THROUGH YOUTUBE .. SONG WAS DONE IN BEAUTIFUL SETS AND STYLISH CHOREOGRAPHED BY JANI MASTER..
KASRALA SHYAM GAVE  LYRICS AND MAHATI SWARA SAGAR Gave catchy tunes..
sung by Dhanunjay and Amala Chebolu, this  song  got great response from audience..
along with song teaser and singles anthem song received huge response not only from audinece but also trending in youtube..Presently  team wrapped up shooting & busy  in post production works..Speaking to media director Venky kudumula  said we are releasing another song whattey
whattey beauty from our movie, this song was already released in youtube and gained great response..,Along with this , already released songs and teaser were heading viral in social media.. Adding to this he said JANI master gave super choreography & hero heroine has cute chemistry between them.
And he thanked our  handsome hero and cute heroine and  technical team  for their support in every situation.
And this song will entertain you to core and  I hope definitely you will like it.

Other Cast: NARESH, SAMPATH, ANANTH  NAG , JISSHU  SENGUPTA, ,  RAGHU BABU, BRAHMAJI, VENNELA KISHORE,                                      SUBHALEKHA SUDHAKAR,
NARRA SRINIVAS,  KALYANI  NATARAJAN , RAJSHRI  NAIR ,  SATHYAN ,  MIME GOPI , SATYA .
Music: MAHATI  SWARA SAGAR,
D.O.P: SAI  SRIRAM
Art director: SAHI  SURESH,
Editor:  NAVIN NOOLI
Co.director: SRI VASTAVA
Executive  Producer :  S.VENKATA RATHNAM (VENKAT)
stunts : VENKAT
Presents: P.D.V. PRASAD
PRODUCER: SURYADEVARA NAGA VAMSI
Story, Screenplay,  Dailogues,  Direction :  VENKY KUDUMULA

MIB_4588 (1) Bheeshma--video promo tomorrow --open psd Bheeshma--lyrical video tomorrow  1--open psd (1) Bheeshma--lyrical video today --open psd (1) bheeshma 2nd  song promo posters 3hrs

* ‘అల.. వైకుంఠపురములో’ రికార్డు ఎంత త్వరగా బద్దలు కొడితే ఇండస్ట్రీ అంత ముందుకు వెళ్లినట్టు! * తెలుగు సినిమా మరో మెట్టు ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను – స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్

* ‘అల.. వైకుంఠపురములో’ రికార్డు ఎంత త్వరగా బద్దలు కొడితే ఇండస్ట్రీ అంత ముందుకు వెళ్లినట్టు!
* తెలుగు సినిమా మరో మెట్టు ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను
- స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్

“రికార్డ్స్ కొట్టినందుకు చాలా ఆనందంగా ఉంది. అయితే ఇదొక దాటుకుంటూ వెళ్ళిపోయే దశ. ఒక్కొక్కళ్ళు ఒక్కో టైంలో రికార్డ్ కొడతారు. ఈ రికార్డు ఎంత త్వరగా బద్దలు కొడితే ఇండస్ట్రీ అంత ముందుకు వెళ్లినట్టు. తెలుగు సినిమా మరో మెట్టు ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను” అన్నారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. మాటల మాంత్రికుడుగా పేరుపొందిన సుప్రసిద్ధ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన చిత్రం ‘అల.. వైకుంఠపురములో’. హారిక అండ్ హాసిని క్రియేషన్స్,గీతా ఆర్ట్స్ బ్యానర్లపై అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ (చినబాబు) సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీ ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ (నాన్-బాహుబలి) సాధించిన సందర్భంగా శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ లో జరిగిన థాంక్స్ మీట్ లో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లను షీల్డులతో సత్కరించారు.

ఈ వేడుకలో నటుడు హర్షవర్ధన్ మాట్లాడుతూ, “ప్రేక్షకులందరికీ హత్తుకొన్నట్లే ఈ సినిమాలోని డైలాగ్స్ నాకు హత్తుకున్నాయి. పండగ పూట ఈ సినిమా రిలీజ్ చేశారు అని అనుకున్నాను కానీ, నా జీవితంలో ఈ సినిమాతో పండగ స్టార్ట్ అవుతుంది అని నాకు తెలియదు. ఈ సినిమా రిలీజ్ అయిన వెంటనే నాకు రెండు పెద్ద సినిమాలు వచ్చాయి. చాలా థాంక్స్” అన్నారు.
నటుడు మురళీ శర్మ మాట్లాడుతూ, “మా నాన్నగారు పోయి ఇంకా ఒక సంవత్సరం కాలేదు. అప్పటినుంచి చూసుకుంటే ఈ సినిమాతో నాకు, నా ఫ్యామిలీకి ఎంత ఆనందం ఇచ్చారో మాటల్లో చెప్పలేను. త్రివిక్రమ్ గారూ.. థాంక్యూ సో మచ్. ఈ సినిమాతో చాలా కలలు నావి నిజమయ్యాయి. . ఈ చిత్రంలో అల్లు అర్జున్ తండ్రిగా చేయడం ఒక పెద్ద కల. అది నెరవేరింది. గీతాఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ లాంటి పెద్ద బ్యానర్లలో పెద్ద క్యారెక్టర్ చేసి పేరు తెచ్చుకోవాలి అన్నది ఇంకో కల. అది కూడా నిజమైంది. త్రివిక్రమ్ ను మాటల మాంత్రికుడు అంటారు. కానీ ఆయన నా జీవితానికి ప్రేమ. ‘అల వైకుంఠపురంలో’ అనే కథ రాసినందుకు, అందులో వాల్మీకి అనే పాత్రను సృష్టించి దానికి నన్ను తీసుకున్నందుకు థాంక్స్. నాకు నిజంగా మాటల్లేవు. తమన్ రాక్ స్టార్. బన్నీ ఐ లవ్ యు. నేను సెట్లో బన్నీని చూడలేదు, బంటూని మాత్రమే చూశాను. అద్భుతమైన సహనటుడు. సినిమాకు ఈ రకమైన స్పందన ఇచ్చినందుకు ప్రేక్షకులకు థాంక్స్” అన్నారు.

నటుడు సుశాంత్ మాట్లాడుతూ, “ఎవరిమైనా సినిమా బాగా ఆడాలని కోరుకుంటాం. అయితే ఇంత హిట్టవుతుందని నాకు తెలియదు. ఈ సినిమాలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాకి అందరూ ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. నేను చూశాను. ఫలితం ఇలా వచ్చినందుకు చాలా హ్యాపీ. టీం మొత్తానికి నా అభినందనలు. ప్రేక్షకులు ఈ సినిమాని ఈ స్థాయి హిట్ చేసినందుకు థాంక్స్. ఆల్ టైం ఇండస్ట్రీ హిట్.. నాన్ బాహుబలి రికార్డ్స్ ఈ చిత్రం సొంతం. బన్నీ అనగానే మనకు మొదట గుర్తొచ్చేది డాన్స్. ఇందులో గొప్పగా నటించాడు. త్రివిక్రమ్ గారితో పని చేసేటప్పుడు చాలా నేర్చుకున్నాను. నా తర్వాతి సినిమాకి వాటిని అమలుచేయడానికి ప్రయత్నం చేస్తాను. అల్లు అరవింద్ గారు, చినబాబు గారు చాలా హ్యాపీగా ఉన్నారని అనుకుంటున్నాను. తమన్ చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. ‘రాములో రాములా’ వంటి మంచి పాటలో నేను కూడా డ్యాన్స్ చేసినందుకు సంతోషంగా ఉంది” అని చెప్పారు.

మ్యూజిక్ డైరెక్టర్ తమన్ నుంచి షీల్డ్ అందుకున్న ఆదిత్య మ్యూజిక్ డైరెక్టర్ ఆదిత్య మాట్లాడుతూ, “తమన్ ఎక్సలెంట్ మ్యూజిక్ ఇచ్చారు. ఇవి మేము గర్వపడే క్షణాలు. సంగీత పరంగా ఈ సినిమా ఆల్ టైం హిట్ అయింది. సినిమా కూడా అన్ని రికార్డ్స్ ని బ్రేక్ చేయాలని కోరుకుంటున్నాను” అన్నారు.

తమన్ మాట్లాడుతూ, “క్రికెట్లో హ్యాట్రిక్ అంటే ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో ఇక్కడ కూడా హ్యాట్రిక్ కి అంత ఇంపార్టెన్స్ ఉంది. త్రివిక్రమ్ కు, బన్నీకి హ్యాట్రిక్. నాకు, బన్నీకి ‘రేసుగుర్రం’, ‘సరైనోడు’ తర్వాత ఇది హ్యాట్రిక్. అందుకే మొత్తం ఎనర్జీ ఈ సినిమాకి పని చేసింది. మా టెక్నీషియన్స్ అందరూ 100 శాతం బెస్ట్ వర్క్ ఇచ్చారు. కలెక్షన్స్ కూడా హండ్రెడ్ పర్సెంట్ వచ్చాయి. ఇండస్ట్రీ హిట్ కావటం వెరీ వెరీ హ్యాపీ. ఇది చాలా అరుదుగా జరిగే విషయం. ఇండస్ట్రీకి, సినిమాకి చాలా మంచిది. ‘అల వైకుంఠపురములో’ ఈ రికార్డ్స్ క్రియేట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఒక ఆల్బమ్ హిట్టయితే మ్యూజిషియన్స్ కు చాలా హెల్ప్ అవుతుంది. కచేరీల్లో పాటలు పాడుకోవచ్చు. సీతారామశాస్త్రి గారు, రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్ చాలా బాగా పాటలు రాశారు. ఇప్పటిదాకా నేను పనిచేసిన టీమ్స్ లో ఇది బెస్ట్ టీం. కొంతమంది హీరోలు పాటల్ని ఇంకో స్థాయికి తీసుకెళ్తారు. బన్నీ అలాంటి హీరో. త్రివిక్రమ్ గారితో పని చేయటం ఒక మ్యాజిక్. నా జీవితంలో అలాంటి వ్యక్తిని ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. నా హృదయంలో నా మనసులో ఆయన చాలా మార్పులు తీసుకువచ్చారు. నాలో ఒక కొత్త నరం వేశారు. అల్లు అరవింద్ గారు, రాధాకృష్ణ గారు ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కాకుండా మంచి సినిమా ఇచ్చారు. ఈ సక్సెస్ నా జీవితంలో ధైర్యాన్ని ఇచ్చింది. ఇంకా కొంచెం ప్రయోగాలు చేయొచ్చు అనే శక్తినిచ్చింది. ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ముందు ముందు మరింత కష్టపడి మరింత మంచి మ్యూజిక్ ఇవ్వడానికి కృషి చేస్తాను” అని చెప్పారు.

నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ, “మేము తీశాము, మీరు చూశారు. మేము తీయటానికి మీరు చూడటానికి మధ్య డిస్ట్రిబ్యూటర్లు అనే వారధులు ఉన్నారు. సినిమాని మీకు (ప్రేక్షకులకు) చూపించడానికి మాకు డబ్బులు ఇచ్చిన డిస్ట్రిబ్యూటర్స్ ని, ఎగ్జిబిటర్స్ ని గౌరవించుకోవడం మా విధి. నేను ‘విజేత’ సినిమా నుంచి పదుల సంఖ్యలో చిరంజీవి గారి సినిమాలకు పెద్ద పెద్ద ఫంక్షన్లు చేసి, షీల్డులు ఇస్తూ వచ్చాను. ఇప్పుడు సినిమా ఆడే రోజులు తగ్గిపోయి, లెక్కలు కలెక్షన్ల కింద, రెవెన్యూ కింద మారిపోయాక ఈ ఫంక్షన్ లు లేకుండా పోయాయి. కానీ మళ్లీ ఈ రోజుకి ఇంత ఆల్ టైం రికార్డు కొట్టడం చాలా సంతోషంగా ఉంది” అని తెలిపారు.

దర్శకుడు త్రివిక్రమ్ మాట్లాడుతూ, “ఇంత ప్రేమగా మమ్మల్ని దగ్గరకు తీసుకొని పాటల దగ్గర్నుంచి ఇక్కడిదాకా నడిపించి ఆశీర్వదించిన ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా మా అందరి తరపున కృతజ్ఞతలు, నా పాదాభివందనం” అన్నారు.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ, “గీతా ఆర్ట్స్ లో ప్రొడక్షన్ కంపెనీయే కాకుండా డిస్ట్రిబ్యూషన్ కంపెనీ కూడా ఉంది. ఎప్పుడైనా ఆఫీసు వైపు వెళ్ళినప్పుడు ‘ఏవండీ ఎప్పుడూ సెలబ్రేషన్ మీరేనా చేసుకునేది, మమ్మల్ని జనం దగ్గరికి తీసుకెళ్ళరా, మమ్మల్ని పట్టించుకోరా, మాకు షీల్డ్స్ ఇచ్చి సత్కరించరా?’ అని అడిగేవాళ్లు. ‘అంత సినిమా వచ్చినప్పుడు కచ్చితంగా చేస్తాను’ అని చెప్పేవాడిని. నిజంగా అలాంటి సినిమా ఇప్పుడు వచ్చింది. మాకు ఆ అవకాశం ఇచ్చింది ప్రేక్షకులు. మా టీం కలిసి చేసింది 50 శాతం అయితే ప్రేక్షకుల దగ్గరకు సినిమాని తీసుకువచ్చింది 50 శాతం డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు. వాళ్లందరికీ చాలా కృతజ్ఞతలు. నాతో పని చేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరి తరఫున ప్రేక్షకులకు థాంక్స్ చెబ్తున్నా. నిర్మాతలు రాధాకృష్ణ గారికి, అల్లు అరవింద్ గారికి నా ధన్యవాదాలు. మా నాన్నను ఎలా సంబోధించాలా అని ఒక్కోసారి నాకు కన్ఫ్యూజన్ వస్తుంటుంది. మా నాన్న నన్ను పరిచయం చేస్తూ ‘గంగోత్రి’, తర్వాత ‘బన్నీ’, ఇంకా ఎన్నో హిట్లిచ్చారు. రాధాకృష్ణ గారితో మొదటిసారి ‘జులాయి’ చేశాను. అది సక్సెస్ ఫుల్ ఫిలిం. తర్వాత ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చేశాను. వీళ్ళిద్దరూ నాకు బెస్ట్ ప్రొడ్యూసర్లు. ఇద్దరితో సూపర్ హిట్స్ కొట్టాను కానీ ఇద్దరూ కలిస్తే ఆల్ టైం రికార్డ్ హిట్ వచ్చింది. ఇద్దరికీ చాలా థ్యాంక్స్. నేను ప్రత్యేకించి థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది.. బన్నివాసు, వక్కంతం వంశీకి. ఎప్పటి నుంచో నేను త్రివిక్రమ్ తో సినిమా చేయాలనుకుంటున్నా కానీ ఆయనతో చేస్తే బాగుంటుంది అని నాకు బూస్ట్ ఇచ్చింది, త్రివిక్రమ్ గారిని తీసుకొచ్చింది వాళ్ళిద్దరు. వాళ్లకి థాంక్స్. అలాగే నేను ఎక్కువగా గడిపే నా పర్సనల్ స్టాఫ్ కు థాంక్స్. ఇంత పెద్ద హిట్ వచ్చినప్పుడు డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ తో సెలబ్రేషన్స్ చేసుకోవడం మా బాధ్యత. ఇక రికార్డ్స్ కొట్టినందుకు చాలా ఆనందంగా ఉంది. అయితే ఇదొక దాటుకుంటూ వెళ్ళిపోయే దశ. ఒక్కొక్కళ్ళు ఒక్కో టైంలో రికార్డ్ కొడతారు. ఈ రికార్డు ఎంత త్వరగా బద్దలు కొడితే ఇండస్ట్రీ అంత ముందుకు వెళ్లినట్టు. తెలుగు సినిమా మరో మెట్టు ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను. ఇంకో విషయం.. ‘సిత్తరాల సిరపడు’ సాంగ్ చాలా పెద్ద హిట్ అయింది. అందులో నేను సిగరెట్ తాగుతాను. అది సినిమాలో ఆ క్యారెక్టర్ ని బట్టి చేసింది. నిజజీవితంలో అది మంచిది కాదు. పిల్లలు స్మోక్ చేయవద్దు. పిల్లలే కాదు పెద్దలు కూడా స్మోక్ చెయ్యొద్దని కోరుకుంటున్నాను. అది ఆరోగ్యానికి హానికరం. దయచేసి పొగ తాగకండి. మరోసారి నా అభిమానులకు, నా ఆర్మీకి థాంక్స్ చెప్పుకుంటున్నాను. కేవలం మీ ప్రేమ వల్లే ఇంత దూరం వచ్చాను. ఈ సినిమా చూసి మమ్మల్ని ఆశీర్వదించిన తెలుగు ప్రేక్షకులకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని భాషల ప్రేక్షకులకు చాలా థ్యాంక్స్” అని చెప్పారు.
ఈ ఈవెంట్ లో డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు అల్లు అర్జున్, సుశాంత్, త్రివిక్రమ్ షీల్డులను బహూకరించారు. అలాగే చిత్ర నటీ,నటులకు, సాంకేతిక నిపుణులకు షీల్డ్స్ బహుకరించారు. ఈ చిత్రం నైజాం, వైజాగ్, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, సీడెడ్ ఏరియాల్లో ‘అల వైకుంఠపురములో’ ఇండస్ట్రీ హిట్ (నాన్-బాహుబలి) అయిందని డిస్త్రి బ్యూటర్స్ తెలిపారు. సుమతో పాటు నటుడు బ్రహ్మాజీ కూడా ఈ ఈవెంట్ కు యాంకర్ గా వ్యవహరించి కార్యక్రమాన్ని రక్తి కట్టించారు.

 If Ala Vaikunthapurramuloo record is broken soon, it would mean Tollywood is progressing at a brisk pace: Allu Arjun
“I feel happy to have scored a blockbuster, which went on to become an industry hit. If Ala Vaikunthapurramuloo record is broken soon, it would mean that Tollywood is progressing at a brisk pace.” Allu Arjun said.

Directed by Trivikram, Ala Vaikunthapurramuloo is the biggest Non-Bahubali hit in the Telugu film industry. The film was bankrolled by Haarika Hassine creations and Geetha Arts. The makers held a grand success meet event in which distributors and exhibitors took part.

Speaking at the event, actor Harshavardhan said, “The dialogues in the film are close to my heart and I am really happy that even the audience felt the same way. I got the opportunity to work in two big films after Ala Vaikunthapurramuloo and I couldn’t be more excited. This film marks a key change of fortunes in my career.”

Murali Sharma said, “It has been less than a year since my father passed away. Incidentally, this film spread happiness to me and my family for the past year or so. I would like to thank Trivikram for the same for fulfilling many of my dreams. He truly is a word Wizard. Also, I feel honored to have worked with top production houses like Geetha Arts and Haarika Hassine creations. I have to thank Trivikram for writing a story like Ala Vaikunthapurramuloo and giving me the role of Valmiki. Thaman is a rock star. I absolutely love Bunny. I never saw Bunny on sets as he transformed himself into Buntu.”

Sushanth said, “In general, we all hope our films fare well, but I never knew Ala Vaikunthapurramuloo was such a huge hit. I know how hard we all worked for the film. It eventually became a Non-Bahubali hit and I am elated. I learnt a lot while working with Trivikram. The first thing that comes to my mind while I hear the name Bunny is dance. But he delivered a super strong performance in Ala Vaikunthapurramloo. I think Allu Aravind garu and Chinnababu garu are very happy now. I feel happy to have danced for a song like Ramuloo Ramulaa.

Aditya Music MD, Aditya said Thaman delivered a blockbuster album for the film and this is a proud moment for him. He wished Ala Vaikunthapurramuloo breaks more such records.

Thaman said, “Trivikram, Bunny, and I have scored a hat-trick with Ala Vaikunthapurramuloo after Race Gurram and Sarrainodu. This gave me more energy while working on Ala Vaikunthapurramloo album and even my technicians gave their 100% for it. Moreover, the fact that Ala Vaikunthapurramuloo is a industry hit gives me more happiness. Seetharama Sastry garu, and Ramajogayya Sastry garu gave very good lyrics for the songs. Allu Aravind garu and Chinnababu garu never compromised with the quality of the product. I can experiment around more, after Ala Vaikunthapurramuloo album became a raging hit. I wish to deliver more such albums now.”

Allu Aravind said the distributors play a key role in a film’s exhibition and he respects them a lot. “I have been giving shields to many movie units right from my first production venture, Vijetha. I took part in many such events along with Chiranjeevi garu. It has been a long time since I attended an event like this, given the change in revenue system and I am again doing it now for Ala Vaikunthapurramuloo.”

Trivikram thanked the audience for receiving Ala Vaikunthapurramuloo so very well right from the day the songs were released.

Stylish star Allu Arjun said, “Geetha Arts is not just a production house, it is also a distribution company. Many distributors previously asked me why they weren’t being invited to success meets. I used to say I would invite them after I scored a blockbuster of such huge magnitude. Ala Vaikunthapurramuloo is one such film and I have to thank the audience for the same. Ala Vaikunthapurramuloo movie unit’s efforts would account to 50% of the success and the remaining 50% would belong to the distributors who took this film closer to the audience. Also, I would like to thank my producers Allu Aravind and S Radhakrishna for their support. My father, Alli Aravind introduced me with Gangothri and later gave a blockbuster to me with Bunny. My first film with Chinnababu is Julayi and it was a big hit. Later, we worked on Son of Sathyamurthy. Ala Vaikunthapurramuloo was jointly bankrolled in their combination and it is a industry hit now. I have to especially thank Bunny Vasu and Vakkantham Vamsi as they were the ones who bought Trivikram on board. And also, I have to thank my personal staff, with whom I spend most of my time. It is our responsibility to celebrate the success of Ala Vaikunthapurramuloo along with the distributors and exhibitors. I feel happy to have scored a blockbuster, which went on to become an industry hit. If Ala Vaikunthapurramuloo record is broken soon, it would mean that Tollywood is progressing at a brisk pace. I am personally happy with the success of Ala Vaikunthapurramuloo but it is a passing phase. Another disclaimer to be noted here is that I smoked a cigarette in ‘Sittharala Sirapadu’ song. It became a huge hit. But I urge youngsters and adults not to imitate me by smoking cigarettes. Even I don’t smoke in real life. I am completely against it as it is injurious to health. Also, I have to thank my army who have been by my side all along. I would like to thank Telugu audience for making Ala Vaikunthapurramuloo such a huge hit and also other language audience.”

321 (1) 321 (2) 321 (3) 321 (4) 321 (5) 321 (6) 321 (7) 321 (8)