Phalana Abbayi Phalana Ammaayi

Phalana Abbayi Phana Ammayi’s shoot progresses across picturesque locations in London

లండన్ లో “ఫలానా అబ్బాయి – ఫలానా అమ్మాయి”
*నాగశౌర్య,మాళవిక నాయర్ జంటగా శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ,దాసరి ప్రొడక్షన్స్  సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘ఫలానా అబ్బాయి – ఫలానా అమ్మాయి’
*లండన్ లోని పలు సుందరమైన ప్రదేశాలలో ప్రస్తుతం షూటింగ్
విజయవంతమైన చిత్రాలలోని నాయకా,నాయికలు అలాగే దర్శకులు…వీరి కాంబినేషన్ ను రిపీట్ చేస్తూ రూపొందే చిత్రాలపై ఇటు ప్రేక్షక వర్గాలలోనూ, అటు సినీ వ్యాపార వర్గాలలోనూ ఆసక్తి రేకెత్తుతుంది.
ప్రస్తుతం అలా ఆసక్తిని కలిగించే చిత్రం ఇది.  దీనిని ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మరో నూతన చలన చిత్ర నిర్మాణ సంస్థ ‘దాసరి ప్రొడక్షన్స్’ తో కలసి నిర్మిస్తోంది.. వివరాల్లోకి వెళితే…
ఆమధ్య యువ కథానాయకుడు నాగశౌర్య, మాళవిక నాయర్ జంటగా రూపొందిన ‘కళ్యాణ వైభోగమే’ చిత్రం ఎంతటి విజయం సాధించిందో ప్రేక్షకులకు విదితమే. అలాగే ‘నాగశౌర్య, దర్శకుడు అవసరాల శ్రీనివాస్ ల కాంబినేషన్ లో రూపొందిన ‘ఊహలు గుస గుస లాడే, జో అచ్యుతానంద చిత్రాల విజయాలు తెలిసిందే.
ఇప్పుడు వీరి కాంబినేషన్లో అంటే.. కథానాయకుడిగా నాగశౌర్య, ఆయనకు జోడీగా మాళవిక నాయర్, దర్శకునిగా అవసరాల శ్రీనివాస్ లను టీమ్ గా చేసుకుని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ,దాసరి ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం లండన్ లో జరుపుకుంటోంది. నాయక, నాయిక లతోపాటు ప్రధాన తారాగణం పాల్గొనగా చిత్రీకరణ జరుగుతోంది.
ఇలాంటి విజయ వంతమైన చిత్రాల నాయక,నాయికలు, దర్శకుడు, ప్రతిభ గల సాంకేతిక వర్గంతో ఈ చిత్రాన్ని నిర్మించటం ఎంతో ఆనందంగా ఉంది అని తెలిపారు ఈ చిత్ర నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, దాసరి పద్మజ, సహ నిర్మాత వివేక్ కూచి భొట్ల తెలిపారు.
Phalana Abbayi Phana Ammayi’s shoot progresses across picturesque locations in London
There’s always curiosity among audiences, fraternity and trade circles when actors and directors with a successful track record reunite for a new film. Eminent production house People Media Factory is joining hands with another new banner, Dasari Productions, for an exciting project Phalana Abbayi Phalana Ammayi. The film brings back Naga Shaurya and Malavika Nair together after their hit-collaboration Kalyana Vaibhogame.
Actor, writer and director Srinivas Avasarala, who associated with Naga Shaurya for quality films like Oohalu Gusagusalade, and Jyo Achyutananda in the past, is wielding the megaphone for Phalana Abbayi Phana Ammayi. There’s immense buzz and excitement all around that names who enjoy such credibility like Naga Shaurya, Malavika Nair and Srinivas Avasarala are collaborating to tell another refreshing story.
Phalana Abbayi Phana Ammayi is currently being shot across picturesque locations in London. Apart from the lead pair, a bulk of the supporting cast too will take part in the schedule. “We’re happy to team up with such a talented cast, crew who’ve proved their worth in the past,” said producers TG Vishwa Prasad, Dasari Padmaja and co-producer Vivek Kuchibhotla.
papa movie - 01 PXL_20220702_120000706 PXL_20220702_120018762 PXL_20220702_120022699 PXL_20220702_120028892

నాగసౌర్య,మాళవిక నాయర్ జంటగా శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ,దాసరి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం

విజయవంతమైన చిత్రాలలోని నాయకా,నాయికలు అలాగే దర్శకులు…వీరి కాంబినేషన్ ను రిపీట్ చేస్తూ రూపొందే చిత్రాలపై ఇటు ప్రేక్షక వర్గాలలోనూ, అటు సినీ వ్యాపార వర్గాలలోనూ ఆసక్తి రేకెత్తుతుంది.

ప్రస్తుతం అలా ఆసక్తిని కలిగించే చిత్రం ఒకటి త్వరలో ప్రారంభం కాబోతోంది.దీనిని,  ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మరో నూతన చలన చిత్ర నిర్మాణ సంస్థ ‘దాసరి ప్రొడక్షన్స్’ తో కలసి నిర్మించబోతోంది.
వివరాల్లోకి వెళితే…
ఆమధ్య యువ కథానాయకుడు నాగసౌర్య ,మాళవిక నాయర్ జంటగా రూపొందిన ‘కళ్యాణ వైభోగమే’ చిత్రం ఎంతటి విజయం సాధించిందో ప్రేక్షకులకు విదితమే. అలాగే ‘నాగసౌర్య, దర్శకుడు అవసరాల శ్రీనివాస్ ల కాంబినేషన్ లో రూపొందిన ఊహలు గుస గుస లాడే, జో అచ్యుతానంద చిత్రాల విజయాలు తెలిసిందే.
ఇప్పుడు వీరి కాంబినేషన్లో అంటే.. కథానాయకుడిగా నాగసౌర్య, ఆయనకు జోడీగా మాళవిక నాయర్, దర్శకునిగా అవసరాల శ్రీనివాస్ లను టీమ్ గా చేసుకుని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. ఇలాంటి విజయ వంతమైన చిత్రాల నాయక,నాయికలు, దర్శకుడు, ప్రతిభ కలిగినవారితో ఈ చిత్రాన్ని నిర్మించటం ఎంతో ఆనందంగా ఉంది. మార్చి రెండవ వారంలో చిత్రం షూటింగ్ ప్రారంభమవుతుంది. చిత్రంలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు కొద్ది రోజులలోనే ప్రకటిస్తామని ఈ చిత్ర నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, దాసరి పద్మజ, సహ నిర్మాత వివేక్ కూచి భొట్ల తెలిపారు.
Naga Shaurya & Malavika Nair paired up in a film under the direction of Avasarala Srinivas, produced jointly by People Media Factory and Dasari Productions.Young hero Naga Shaurya and talented actress Malavika Nair are yet again paired up in the forthcoming film which will be directed by multifaceted persona Avasarala Srinivas. Noted production house People Media Factory and Dasari Productions are set to bankroll this movie jointly.

Earlier, the duo Naga Shaurya & Malavika Nair appeared onscreen together in Kalyana Vaibhogame and won huge accolades. Also, the director Avasarala Srinivas has directed Naga Shaurya in Oohalu Gusagusalade & Jyo Achyutananda. So, now the successful combination is set to repeat and entertain the audience the most. It’s very overwhelming and happy to produce a film with such a talent. The shooting will begin in march 2nd week. Soon we will unveil the details of other cast and crew, says producer’s TG Vishwa Prasad, Dasari Padmaja and Co- Producer Vivek Kuchibotla