Dulquer Salmaan, Venky Atluri, Sithara Entertainments’ highly anticipated Lucky Baskhar to release on 27th September

దుల్కర్ సల్మాన్, వెంకీ అట్లూరి కాంబినేషన్ లో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ‘లక్కీ భాస్కర్’ సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలప్రఖ్యాత నటుడు, మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి వారసుడిగా కెరీర్‌ను ప్రారంభించిన దుల్కర్ సల్మాన్ అనతి కాలంలోనే తన ప్రత్యేకతను చాటుకొని, వివిధ భాషల ప్రేక్షకుల మనసు గెలుచుకొని తనకంటూ ప్రత్యేకమైన అభిమాన గణాన్ని సంపాదించుకున్నారు. మలయాళ చిత్ర సీమకే పరిమితం కాకుండా పాన్ ఇండియా నటుడిగా ఎదిగారు. తన వ్యక్తిత్వం, అణుకువతో కూడిన నటనా నైపుణ్యాలతో దుల్కర్ మలయాళం, తెలుగు, తమిళం అలాగే హిందీ భాషలలో అత్యంత డిమాండ్ ఉన్న నటులలో ఒకరిగా మారారు. ఇప్పుడు దుల్కర్ “లక్కీ భాస్కర్” అనే సాధారణ మనిషికి చెందిన అసాధారణ కథతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతున్నారు.ఈ “లక్కీ భాస్కర్” సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటి నుండి, మేకర్స్ రెగ్యులర్ అప్‌డేట్‌లను విడుదల చేస్తూనే ఉన్నారు. ఇక తాజాగా “లక్కీ భాస్కర్” చిత్రం సెప్టెంబర్ 27, 2024న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని అధికారికంగా ప్రకటించారు నిర్మాతలు.తొలిప్రేమ, సార్/వాతి వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల రచయిత-దర్శకుడు వెంకీ అట్లూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోన్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు.  ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ సరసన మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తోంది. ప్రముఖ స్వరకర్త జి.వి. ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ నిమిష్ రవి మెస్మరైజింగ్ విజువల్స్ అందిస్తున్నారు. ఈ చిత్రానికి నేషనల్ అవార్డ్ విన్నింగ్ ప్రొడక్షన్ డిజైనర్ బంగ్లాన్, ఎడిటర్ నవీన్ నూలి పనిచేస్తున్నారు.

1980- 1990 పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది.  నాటి బొంబాయి(ముంబై) నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోందని మేకర్స్ తెలిపారు. సాధారణ బ్యాంకు క్యాషియర్ లక్కీ భాస్కర్ యొక్క ఆసక్తికరమైన, అసాధారణమైన జీవిత ప్రయాణాన్ని వివరిస్తుంది. దుల్కర్ సల్మాన్ పుట్టినరోజు సందర్భంగా ఇటీవల విడుదలైన టీజర్ ఈ సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పింది. ఇక ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ చిత్రాన్ని తెలుగు, మలయాళం, హిందీ మరియు తమిళ భాషలలో ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో థియేటర్లలో విడుదల చేయనున్నారు. విభిన్న కథతో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించడానికి దుల్కర్ సల్మాన్, వెంకీ అట్లూరి శాయశక్తులా కృషి చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు.

తారాగణం: దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి
బ్యానర్స్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌
సమర్పణ: శ్రీకర స్టూడియోస్
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
రచన, దర్శకత్వం: వెంకీ అట్లూరి
సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్
ఛాయాగ్రాహకుడు: నిమిష్ రవి
కూర్పు: నవీన్ నూలి
పీఆర్ఓ: లక్ష్మీ వేణుగోపాల్

Dulquer Salmaan, Venky Atluri, Sithara Entertainments’ highly anticipated Lucky Baskhar to release on 27th September

Dulquer Salmaan has carved a niche for himself in Indian Cinema. Renowned for his charming personality and irreplicable acting skills, the actor has been one of the most sought after actors in Malayalam, Telugu, Tamil and Hindi languages. Now, he is set to charm the world with an extra-ordinary tale of a common man, “Lucky Baskhar”.

Ever since commencement of the film’s shoot, makers have been releasing regular updates and fans of the actor, movie-lovers have been entangled by each one of them. On 29th May, the makers have made official announcement regarding the release date of the film. The eagerly anticipated film, Lucky Baskhar will release worldwide on   September 27, 2024.

Venky Atluri, the writer-director of blockbuster films like Tholi Prema and Sir/ Vaathi, is directing the film. Suryadevara Naga Vamsi and Sai Soujanya of Sithara Entertainments and Fortune Four Cinemas, respectively, are producing the film on a lavish scale.  Srikara Studios is presenting it.

Meenakshi Chaudhary is playing the leading lady role opposite Dulquer Salmaan in the film. Renowned composer GV Prakash Kumar is composing music for the film and ace cinematographer Nimish Ravi is delivering mesmerizing visuals. National Award winning production designer Banglan and editor Navin Nooli are working on the film.

Set in late 1980′s and early 1990′s, the film will chronicle the interesting, turbulent and extra-ordinary life journey of a simple bank cashier, Lucky Baskhar. The recently released teaser of the film, on the occasion of Dulquer Salmaan’s birthday, has been able to set right expectations for this film.

Well, the film has now entered in to the final leg of shooting and it will release in Telugu, Malayalam, Hindi and Tamil languages worldwide, theatrically.

LuckyBaskhar-Still