Lala Bheemla song from Bheemla Nayak launched, Trivikram’s brilliance as a lyricist shines through

“లాలా భీమ్లా

అడవి పులి

గొడవ పడి
ఒడిసి పట్టు
దంచి కొట్టు
కత్తి పట్టు
అదరగొట్టు”
*‘భీమ్లా నాయక్‘ పోరాట గీతం
*సాహిత్యం అందించిన త్రివిక్రమ్
పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ల కాంబినేషన్ లో  సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం
‘భీమ్లా నాయక్’. స్క్రీన్ ప్లే- సంభాషణలు సుప్రసిద్ధ దర్శకుడు, రచయిత ‘త్రివిక్రమ్’ అందిస్తుండగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు సాగర్ కె చంద్ర.
‘భీమ్లా నాయక్‘ చిత్రం నుంచి మరో గీతం విడుదల అయింది. ఈ చిత్రానికి సంభాషణలు, స్క్రీన్ ప్లే సమకూరుస్తున్న త్రివిక్రమ్, ఈ గీతాన్ని రచించటం విశేషం. మాటల్లో మాత్రమే కాదు పాటలో సైతం తనదైన శైలిని పలికించారన్నది స్పష్టం చేస్తుందీ గీతం.
“పది పడగల పాము పైన పాదమెట్టిన సామి తోడు…
పిడుగులొచ్చి మీద పడితే కొండగొడుగు నెత్తినోడు…” పాటలోని ఈ పదాలు వింటే నిజమనిపించక మానదు.
‘భీమ్లా నాయక్‘ పోరాట సన్నివేశాల్లో భాగంగా ఈ గీతం కనిపిస్తుంది. తమన్ స్వరాలు, అరుణ్ కౌండిన్య గాత్రం ఆవేశాన్ని రగిలిస్తే, రెండు నిమిషాల ముప్ఫై సెకన్లు ఉన్న ఈ పాటలో కనిపిస్తున్న దృశ్యాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తాయి.
‘భీమ్లా నాయక్‘ చిత్ర నిర్మాణ కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్నాయి.
పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ల కాంబినేషన్ లో నిర్మితమవుతున్న ఈ చిత్రంలో నిత్య మీనన్, సంయుక్త మీనన్ నాయికలు. ప్రముఖ నటులు, రావు రమేష్, మురళీశర్మ, సముద్ర ఖని, రఘుబాబు, నర్రా శ్రీను , కాదంబరికిరణ్, చిట్టి, పమ్మి సాయి, చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
సంభాషణలు, స్క్రీన్ ప్లే: త్రివిక్రమ్
ఛాయాగ్రాహకుడు: రవి కె చంద్రన్ ISC
సంగీతం: తమన్.ఎస్
ఎడిటర్:‘నవీన్ నూలి
ఆర్ట్ : ‘ఏ.ఎస్.ప్రకాష్
వి.ఎఫ్.ఎక్స్. సూపర్ వైజర్: యుగంధర్ టి
పి.ఆర్.ఓ: లక్షీవేణుగోపాల్
సమర్పణ: పి.డి.వి. ప్రసాద్
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
దర్శకత్వం: సాగర్ కె చంద్ర
Lala Bheemla song from Bheemla Nayak launched, Trivikram’s brilliance as a lyricist shines through
Pawan Kalyan and Rana Daggubati’s action entertainer Bheemla Nayak, produced by Suryadevara Naga Vamsi under Sithara Entertainments, is one of the most anticipated Telugu films this season. Saagar K Chandra is directing the film for which Trivikram has penned the screenplay and dialogues. The third single from Bheemla Nayak, Lala Bheemla, launched on Sunday, has Trivikram wielding his magic as a lyricist as well.
The song, which comes with an irresistible rustic twist, has all the makings of a chartbuster. Trivikram’s lyrical brilliance comes to the fore with powerful lines like ‘Padi Padagala Paamu Paina Paadamettina Saami Thodu, Pidgulochhi Meeda Kodithe Kondagodugu Netthinodu’ truly bowling the audiences over.
Lala Bheemla, sung by an energetic Arun Kaundinya, set to an intense composition by S Thaman, will appear during key action sequences in the film. The singer, composer and a group of dancers make an appearance in the arresting lyrical video where we get to see a few sparkling glimpses of Pawan Kalyan as the powerful cop Bheemla Nayak. Lasting nearly two-and-half minutes, the number leaves you in a trance.
Bheemla Nayak is in its last leg of filming. Nithya Menen and Samyuktha Menon play the female leads in the film whose ensemble cast comprises Rao Ramesh, Murali Sharma, Samuthirakani, Raghubabu, Narra Srinu, Kadambari Kiran, Chitti and Pammi Sai, to name a few.
Cast & Crew
Starring – Pawan Kalyan, Rana Daggubati, Nithya Menen, Samyuktha Menon
Banner – Sithara Entertainments
Producer – Suryadevara Naga Vamsi
Art – A S Prakash
DOP – Ravi K Chandran(ISC)
Music – Thaman S
Screenplay & Dialogues – Trivikram
Director – Saagar K Chandra
Presenter – PDV Prasad
Editor – Navin Nooli
PRO – LakshmiVenugopal
LALA_OUT-NOW LALA_STILL