‘OMG Daddy’ from ‘Ala Vaikunthapurramlo’ out now

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్  ”అల వైకుంఠపురములో”‘ … “ఓ డాడీ”  సాంగ్ విడుదల
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ సినీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అల వైకుంఠపురములో…’  వీరిద్దరి కాంబినేషన్ లో  రాబోతున్న హ్యాట్రిక్ సినిమా ఇది కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పలు విజయవంతమైన చిత్రాల్ని అందించిన భారీ నిర్మాణ సంస్థలు ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’, ‘గీతాఆర్ట్స్’ కాంబినేషన్ లో ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల అవుతోందని చిత్ర బృందం ఇప్పటికే  ప్రకటించింది. ఇటీవలే విడుదల చేసిన ‘సామజవరగమన’, “రాములో రాముల” పాటలు చిత్రం పై అంచనాల్ని తారాస్థాయికి చేర్చాయి. ఈ పాటలు ఎంతటి సంచలనం సృష్టించాయో తెలిసిందే.ఇప్పుడు సంగీత దర్శకుడు థమన్ స్వరపరచిన చిత్రం లోని మరోగీతం ‘ఓ డాడీ’ ఈరోజు విడుదలైంది. సాహిత్య విలువలతో కూడిన,ఎన్నో విజయవంతమైన గీతాలను రచించిన గీత రచయిత  కృష్ణ చైతన్య ఈ పాట రాసారు. ఈ పాటలో వచ్చే తెలుగు ర్యాప్ కూడా ఆయనే రాయడం విశేషం. తెలుగు ర్యాప్ ని బిగ్ బాస్ ఫేమ్ రోల్ రైడా పాడగా, ఇంగ్లీష్ ర్యాప్ ని ‘రాహుల్ నంబియార్’ పాడారు. ఫిమేల్ ర్యాప్ ని లేడీ కాష్ పాడింది. గాయకుడు  ’రాహుల్ సిప్లిగంజ్’ ఈ పాటను తన స్టయిల్ లో పాడి ఉర్రూతలూగించారు.. బ్లాజీ ఈ పాటకు గాత్ర సాయం చేశారు.’ఓ డాడీ’ గీతం విడుదలైన కొద్ది సమయానికే  అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. సోషల్ మీడియాలో మరో ఫేవరేట్ సాంగ్ గా  చార్ట్ బస్టర్స్ లో టాప్ లో నిలుస్తోంది.మరో అద్భుతమైన పాటను అందించి, మరొక సూపర్ హిట్ ఆల్బమ్ ను తన ఖాతాలో థమన్ వేసుకున్నారన్న ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్,పూజ హెగ్డే,టబు,రాజేంద్రప్రసాద్,సచిన్ ఖేడ్ కర్,తనికెళ్ళ భరణి,మురళీ శర్మ, సముద్ర ఖని,జయరాం,సునీల్,నవదీప్,సుశాంత్,నివేతా పేతురాజ్,గోవిందా పద్మసూర్య,రోహిణి,ఈశ్వరీరావు,కల్యాణి నటరాజన్,శిరీష,బ్రహ్మాజీ,హర్షవర్ధన్,అజయ్,
పమ్మిసాయి,రాహుల్ రామకృష్ణ నటిస్తున్నారు.

డి.ఓ.పి: పి.ఎస్.వినోద్, సంగీతం: థమన్.ఎస్, ఎడిటర్: నవీన్ నూలి: ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్,
ఫైట్స్: రామ్ – లక్ష్మణ్, పి.ఆర్.ఓ.: లక్ష్మి వేణుగోపాల్, ఏలూరు శ్రీను
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : పి.డి.వి.ప్రసాద్
నిర్మాతలు: అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు)

 
531A0412 531A0341 531A9408
Starring stylish star Allu Arjun in the lead role, ‘Ala Vaikunthapurramlo’ is gearing up for its release on January 12th. The family entertainer is the third collaboration between Allu Arjun and ace filmmaker, Trivikram.The first two songs from the audio album namely, ‘Samajavaragamana’ and ‘Ramuloo Ramulaa’ are already topping the music charts. The third song, ‘OMG Daddy’ is out now. Thaman, who has been in fine form lately, has given yet another impressive peppy song.Krishna Chaitanya penned the lyrics for ‘OMG Daddy’. Rahul Sipligunj is the lead singer while Roll Rida and Nambiar crooned the rap portions.

The teaser of ‘OMG Daddy’ was released recently and it has already received a very good response from Allu Arjun’s fans and cine enthusiasts, in general. Thaman seems to have hit the bullseye again with ‘OMG Daddy’.

Produced jointly by Geetha Arts and Haarika & Hassine Creations, this movie, which will hit the screens on 12th January, 2020, has been riding high on expectations.

Cast: Stylish Star AlluArjun, Pooja Hegde, Tabu,Rajendra Prasad, Sachin Kedkar, Muralisharma, Samudrakhani, jayaram,Sunil,Navadeep, Sushant, Nivetha pethuraj,Govinda padma soorya, Brahmaji,,Harshavardhan,Ajay,Rahul Ramakrishna, Pammi sai.

Crew:
Editor: Navin Nooli
Art Director: A.S. Prakash
Cinematography: P.S Vinod
Stunt Director’s: Ram – Lakshman
Music: Thaman S
Executive Producer: PDV Prasad
Producers: Allu Aravind – S. Radha Krishna(Chinababu)
Banners: Haarika & Hassine Creations and Geetha Arts