చిటపట చినుకులు… గుర్తుచేస్తుంటారు

‘‘నేనెక్కడ కనిపించినా తెలుగు ప్రేక్షకులు ‘చిటపట చినుకులు పడుతూ ఉంటే…’ పాటని గుర్తు చేస్తుంటారు. ‘కృష్ణార్జునయుద్ధం’లో నేను ఎన్టీఆర్‌ని చిన్నన్నయ్యా అంటుంటాను. ఆ సంభాషణని గుర్తు చేసి ఒకసారి చెప్పండని అడుగుతుంటారు. మరోసారి ఈ వేదికపై ఆ విషయాన్ని గుర్తు చేసుకోవడం ఆనందంగా ఉంద’’న్నారు ప్రముఖ నటి బి.సరోజాదేవి. ఆమెకి టి.సుబ్బరామిరెడ్డి లలిత కళాపరిషత్‌ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి విశాఖపట్నంలో ‘విశ్వనట సామ్రాజ్ఞి’ బిరుదుని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘‘టి.సుబ్బరామిరెడ్డికి కళలన్నా, కళాకారులన్నా ఎంతో గౌరవం. శివరాత్రి రోజున ఈ పురస్కారం అందుకోవడం ఆనందంగా ఉంద’’న్నారు.‘‘ఆ రోజుల్లో హీరోల్ని మించి పారితోషికం అందుకొన్న కథానాయిక బి.సరోజాదేవి. ఆమెకి తెలుగు ప్రజల తరఫున ప్రదానం చేసిన బిరుదు… ‘విశ్వనట సామ్రాజ్ఞి’’ అన్నారు టి.సుబ్బరామిరెడ్డి. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, ద్రోణంరాజు శ్రీనివాస్‌, పడాల అరుణ, నటుడు, ఎంపీ మురళీమోహన్‌ నటీమణులు జమున, వాణిశ్రీ, గీతాంజలి, గాయని పి.సుశీల తదితరులు పాల్గొన్నారు.

4tollywood-7a

నాగసౌర్య,మాళవిక నాయర్ జంటగా శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ,దాసరి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం

Srinivas Avasarala - Naga Shourya Filmవిజయవంతమైన చిత్రాలలోని నాయకా,నాయికలు అలాగే దర్శకులు…వీరి కాంబినేషన్ ను రిపీట్ చేస్తూ రూపొందే చిత్రాలపై ఇటు ప్రేక్షక వర్గాలలోనూ, అటు సినీ వ్యాపార వర్గాలలోనూ ఆసక్తి రేకెత్తుతుంది.

ప్రస్తుతం అలా ఆసక్తిని కలిగించే చిత్రం ఒకటి త్వరలో ప్రారంభం కాబోతోంది.దీనిని,  ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మరో నూతన చలన చిత్ర నిర్మాణ సంస్థ ‘దాసరి ప్రొడక్షన్స్’ తో కలసి నిర్మించబోతోంది.
వివరాల్లోకి వెళితే…
ఆమధ్య యువ కథానాయకుడు నాగసౌర్య ,మాళవిక నాయర్ జంటగా రూపొందిన ‘కళ్యాణ వైభోగమే’ చిత్రం ఎంతటి విజయం సాధించిందో ప్రేక్షకులకు విదితమే. అలాగే ‘నాగసౌర్య, దర్శకుడు అవసరాల శ్రీనివాస్ ల కాంబినేషన్ లో రూపొందిన ఊహలు గుస గుస లాడే, జో అచ్యుతానంద చిత్రాల విజయాలు తెలిసిందే.
ఇప్పుడు వీరి కాంబినేషన్లో అంటే.. కథానాయకుడిగా నాగసౌర్య, ఆయనకు జోడీగా మాళవిక నాయర్, దర్శకునిగా అవసరాల శ్రీనివాస్ లను టీమ్ గా చేసుకుని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. ఇలాంటి విజయ వంతమైన చిత్రాల నాయక,నాయికలు, దర్శకుడు, ప్రతిభ కలిగినవారితో ఈ చిత్రాన్ని నిర్మించటం ఎంతో ఆనందంగా ఉంది. మార్చి రెండవ వారంలో చిత్రం షూటింగ్ ప్రారంభమవుతుంది. చిత్రంలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు కొద్ది రోజులలోనే ప్రకటిస్తామని ఈ చిత్ర నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, దాసరి పద్మజ, సహ నిర్మాత వివేక్ కూచి భొట్ల తెలిపారు.
Naga Shaurya & Malavika Nair paired up in a film under the direction of Avasarala Srinivas, produced jointly by People Media Factory and Dasari Productions.Young hero Naga Shaurya and talented actress Malavika Nair are yet again paired up in the forthcoming film which will be directed by multifaceted persona Avasarala Srinivas. Noted production house People Media Factory and Dasari Productions are set to bankroll this movie jointly.

Earlier, the duo Naga Shaurya & Malavika Nair appeared onscreen together in Kalyana Vaibhogame and won huge accolades. Also, the director Avasarala Srinivas has directed Naga Shaurya in Oohalu Gusagusalade & Jyo Achyutananda. So, now the successful combination is set to repeat and entertain the audience the most. It’s very overwhelming and happy to produce a film with such a talent. The shooting will begin in march 2nd week. Soon we will unveil the details of other cast and crew, says producer’s TG Vishwa Prasad, Dasari Padmaja and Co- Producer Vivek Kuchibotla

 

TSR honours B.Saroja Devi with ‘Viswanata Samragni’

బి.సరోజాదేవికి టి.సుబ్బరామిరెడ్డి ‘విశ్వనటసామ్రాజ్ఞి’ 
*మార్చి 4 మహాశివరాత్రి పర్వదినాన విశాఖలో లో వేడుక 
 
సుప్రసిద్ధ నటీమణి శ్రీమతి బి,సరోజాదేవి కి టి.ఎస్.ఆర్.లలితకళాపరిషత్ ‘విశ్వనట సామ్రాజ్ఞి’ బిరుదు తో సత్కారం. ప్రముఖ నిర్మాత, రాజకీయనాయకులు, పారిశ్రామిక వేత్త, కళాబంధు, డా:టి.సుబ్బరామిరెడ్డి మార్చి 4 మహాశివరాత్రి పర్వదినాన విశాఖలో లో వైభవంగా జరిగే వేడుక లో ఈ బిరుదు తో సత్కరించనున్నట్లు తెలిపారు. సుబ్బరామి రెడ్డి  మహాశివభక్తుడు అన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పర్వదినాన్ని ఆయన వైజాగ్ లో జరుపుకుంటూ వస్తున్నారు. పాతికేళ్ళుగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది. టీఎస్సార్ నిర్వహించే మహాశివరాత్రి లింగార్చనకు దేశవిదేశాలవాసులు సైతం హాజరవుతూ ఉంటారు. విశాఖ రామకృష్ణా బీచ్ లో మార్చి 4 సాయంత్రం ఐదు గంటల నుండి ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. లక్షలాదిగా తరలివచ్చే ప్రజలచేతనే కోటి శివలింగాల ప్రతిష్ఠాపన, మహాకుంభాభిషేకం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం టీఎస్సార్ కళాపీఠం ఆధ్వర్యంలో సాగుతుంది.  ఈ సందర్భంగా ప్రతి మహాశివరాత్రి నాడు కళాకారులను సన్మానించడం విధిగా నిర్వర్తిస్తున్నారాయన. ఈ యేడాది మహాశివరాత్రి నాడు మహానటి పద్మభూషణ్ బి.సరోజాదేవికి “విశ్వనటసామ్రాజ్ఙి  ” బిరుదుతో సుబ్బరామిరెడ్డి ఆమెను సత్కరించనున్నారు. టి.ఎస్.ఆర్.లలితకళాపరిషత్ ఆధ్వర్యంలో జరిగే బి.సరోజాదేవి సన్మాన కార్యక్రమంలో ప్రముఖ నటీనటులు జమున, వాణిశ్రీ, గీతాంజలి, సుమన్, మీనా, మధురగాయని పిసుశీల వీరితో పాటు పలువురు సినీరాజకీయ ప్రముఖులు  పాల్గొననున్నారు. సాలూరి వాసూరావు సంగీతావిభావరి నిర్వహించనున్నారు. 
బి.సరోజాదేవిగారు కన్నడ నాట జన్మించినా, తెలుగువారికి సుపరిచితులు. మహానటుడు యన్టీఆర్ తమ ‘పాండురంగ మహాత్మ్యం’ ద్వారా బి.సరోజాదేవిని తెలుగుతెరకు పరిచయం చేశారు. ఆ తరువాత యన్టీఆర్ సరసన “సీతారామకళ్యాణం, జగదేకవీరుని కథ, దాగుడుమూతలు, ఇంటికి దీపం ఇల్లాలే, మంచి-చెడు, మాయని మమత, భాగ్యచక్రము, ఉమాచండీ గౌరీశంకరుల కథ, విజయం మనదే, మనుషుల్లో దేవుడు, దానవీరశూర కర్ణ” వంటి చిత్రాల్లో నటించారు. 
మరో మహానటుడు అక్కినేని సరసన కూడా బి.సరోజాదేవి నటించి అలరించారు. ఆయనతో “పెళ్ళికానుక, ఆత్మబలం, అమరశిల్పి జక్కన్న, వసంతసేన, రహస్యం” వంటి చిత్రాల్లో నటించారు. 
తెలుగునాటనే కాకుండా, మాతృభాష కన్నడలోనూ, తమిళ, మళయాళ, హిందీ భాషల్లోనూ సరోజాదేవి అపూర్వమైన విజయాలను సాధించారు. 
బి.సరోజాదేవి అభినయవైభవానికి ఎన్నెన్నో అవార్డులు రివార్డులు లభించాయి. పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులను సైతం సరోజాదేవి అందుకున్నారు.

IMG_5484

Yester years lovable heroine and great actress B.Saroja Devi is going to get another jewel in her crown, this time noted Politician and film producer ‘Kalabandhu’ Dr.T.Subbarami Reddy honours her with ‘Viswanata Samragni’ on March 4th, on the occasion of Mahasiva Ratri. Every year, T.Subbarami Reddy, he’s well known Sivabhakta, celebrates ‘Mahasiva Ratri’ in Vizag along with tens of millions of devotees from all over the globe. This time he performs ‘Koti Sivalingarchana’ and ‘Mahakubhamela’ at Ramakrishna beach of Vizag. The service will start at 5 PM on Mahasivaratri and noted music director Saluru Vasu Rao will entertain the audiences with his musical night. Noted film personalities Jamuna, Vanisri, Geetanjali, Meena, Suman and well known singer P.Suseela will participate in this great occasion along with some other prominent persons of film and political fields.

B.Saroja Devi has been in the hearts of Telugus for decades, who was introduced by legendary actor NTR with his ‘Panduranga Mahatyam’ to Telugu cinema and she got many memorable roles and paired to NTR and ANR, mesmarized the masses with her unforgettable smile.  

 

 

4 LETTERS HEROINES Anketa Maharana , Tuya

 

 ”I play the role of a bold, joel and pretenseless fashion designing student in the movie. Thanks to the director, my dialogues were very causal and were very relatable to the conversations of college students. I portrayed myself as a glamourous girl because of my character and role. And i believe this movie and my performance in it will be a turning point for me in tollywood.”
నా పేరు అంకిత మహారాణా,నేను మిస్ బెంగుళూరు..4 లెటర్స్ చిత్రం ద్వార తెలుగు చిత్రసీమకు హీరోయిన్ గా పరిచయమవుతున్నాను..నేను ఈ చిత్రంలో ప్యాషన్ డిజైనర్ స్టూడెంట్ అనుపమ గా నటించాను..లైఫ్ లో ఏదైనా ఈజీగా తీసుకునే ఓపెన్ అండ్ బాబ్లీ క్యారెక్టర్,చాల గ్లామర్ గా ఉంటుంది..నాక్యారెక్టర్ ని డైరెక్టర్ రఘురాజ్ సార్ చక్కగా డిజైన్ చేశారు..సినిమాలో డైరెక్టర్ సార్ వ్రాసిన డైలాగ్స్ నిజజీవితంలో కాలేజ్ స్టూడెంట్స్ ఎలా మాట్లాడుకుంటారో అలానే ఉంటాయి..అనుపమ క్యారెక్టర్ నా పర్సనల్ లైఫ్ కు దగ్గరగా ఉండడంవల్ల నాకు నటించడానికి ప్లస్ అయ్యింది..తెలుగులో నాకు మంచి పేరు తెచ్చి పెడుతుందని గట్టిగా నమ్ముతున్నాను..
_ Anketa Maharana
 ”I have acted in Bengali movies and have also performed in various stage dramas. This is my first telugu movie. My character is homely and is scared of everything including her mother. I play a very anxious and exaggerating violin student. I was able to perform well since my role had so much depth and transitions in the movie. It was challenging for me and i was able to pull this of because of the director’s deliberate training. I am very happy to be a part of this movie and i was fed the chance to become a successful actress.
నా పేరు తువా చక్రబోర్తి నేను బెంగాల్ లో స్టేజి ఆర్టిస్ట్ ని..నాకు ఈ ఫోర్ లెటర్స్ సినిమా కథ బాగా నచ్చింది..నేను ఈ చిత్రంలో మ్యూజిక్ స్టూడెంట్ గా నటించాను..ప్రతి దానికి భయపడే క్యారెక్టర్ చాల హోమ్లీగా ఉంటుంది..అన్నిటికి భయపడే నా క్యారెక్టర్ హీరో ని లవ్ చేస్తుంది,నాలో ఉన్న భయాన్ని పోగొట్టి లైఫ్ లో ఉన్నత శిఖరాలకు ఎలా చేరుకోవాలో హీరో చెప్పే విధానం చాల అద్భుతంగా ఉంటుంది..నటించడానికి స్కోప్ ఉన్న క్యారెక్టర్..నాలో ఉన్న యాక్టింగ్ టాలెంట్ ని డైరెక్టర్ రఘురాజ్ సార్ బయటకు తీసి చక్కగా నటించేలా చేశారు..యూత్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ చిత్రం అందరికి నచ్చుతుంది.
Tuya Chakravarthy  ANB_1065 ANB_1080 ANKETA MAHARANA1 ANKETA MAHARANA2 ANKETA MAHARANA3 ANKETA MAHARANA4 ANKETA MAHARANA5 ANKETA MAHARANA6 ANKETA MAHARANA7 anketa1 anketa2 anketa4 TUYA CHAKRABORTHY1 TUYA CHAKRABORTHY2 TUYA CHAKRABORTHY3 TUYA CHAKRABORTHY4 TUYA CHAKRABORTHY5

Heroine Tuya chakravarthy in ’4Letters’ with Eswar

ANB_1032 ANB_1065 ANB_1080 ANB_1375 ANB_1423 ANB_1507 TUYA CHAKRABORTHY1 TUYA CHAKRABORTHY2 TUYA CHAKRABORTHY3 TUYA CHAKRABORTHY4 TUYA CHAKRABORTHY5