Panja Vaisshnav Tej and Sithara Entertainments’ PVT04 Fiery Glimpse to release on Monday, 15th May!

పంజా వైష్ణవ్ తేజ్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ‘PVT04′ నుంచి మే 15న పవర్ ఫుల్ గ్లింప్స్ విడుడల
తన తొలి చిత్రం ‘ఉప్పెన’తో సంచలన విజయాన్ని అందుకుని, అందరినీ ఆకట్టుకున్న పంజా వైష్ణవ్ తేజ్.. అరంగేట్రం నుండి కథల ఎంపికలో వైవిధ్యం చూపిస్తున్నారు. తన తదుపరి చిత్రంగా ఓ అదిరిపోయే మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో అలరించడానికి సిద్ధమవుతున్నారు.
అద్భుతమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచిన ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి ‘PVT04′ రూపంలో ఓ భారీ యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్‌టైనర్‌ను అందించనుంది. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది.
మే 15వ తేదీన, సోమవారం సాయంత్రం 4:05 గంటలకు ‘PVT04′ ప్రపంచాన్ని పరిచయం చేస్తూ అత్యంత శక్తిమైన గ్లింప్స్ ని విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.
జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ మలయాళ నటుడు జోజు జార్జ్ ఈ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి ఆయన పాత్రకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు. క్రూరత్వంతో కూడిన ఆయన పవర్ ఫుల్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. పంజా వైష్ణవ్ తేజ్‌కి, జోజు జార్జ్ కి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయని చిత్రబృందం చెబుతోంది. వైష్ణవ్ తేజ్‌ పాత్రను పరిచయం చేస్తూ ఇప్పటికే విడుదల చేసిన అనౌన్స్ మెంట్ వీడియో విశేషంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ లుక్ ఇంకా విడుదల చేయాల్సి ఉందని, అది ప్రేక్షకుల అంచనాలకు మించేలా ఉంటుందని మూవీ టీమ్ తెలిపింది.
ఈ సినిమాలో శ్రీలీల అందరి మనసులు దోచుకునే అందమైన ‘చిత్ర’ పాత్ర పోషిస్తున్నారు. వజ్ర కాళేశ్వరి దేవి అనే కీలక పాత్రలో అపర్ణా దాస్ నటిస్తున్నారు. ఈ పాత్రలను పరిచయం చేస్తూ చిత్రబృందం విడుదల చేసిన పోస్టర్లు సినిమాపై అంచనాలను పంచేశాయి.
శ్రీకాంత్ ఎన్ రెడ్డి ఈ సినిమాతో రచయితగా, దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సంచలన సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ కుమార్ ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ కి సంగీతం అందిస్తున్నారు. ఆయన నేపథ్య సంగీతం యాక్షన్ సన్నివేశాలను మరోస్థాయికి తీసుకెళ్తుంది అనడంలో సందేహం లేదు. ఈ సినిమాకి ఆర్ట్ డైరెక్టర్ గా ఏఎస్ ప్రకాష్, ఎడిటర్ గా నవీన్ నూలి వ్యవహరిస్తున్నారు.
తారాగణం: పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల, అపర్ణా దాస్, జోజు జార్జ్ తదితరులు
రచన, దర్శకత్వం: శ్రీకాంత్ ఎన్ రెడ్డి
సంగీత దర్శకుడు:  జి.వి. ప్రకాష్ కుమార్
నిర్మాతలు: ఎస్. నాగ వంశీ, ఎస్. సాయి సౌజన్య
బ్యానర్స్: సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్
సమర్పణ: శ్రీకర స్టూడియోస్
డీఓపీ: డడ్లీ
ఆర్ట్: ఏఎస్ ప్రకాష్
ఎడిటర్: నవీన్ నూలి
పీఆర్ఓ: లక్ష్మీ వేణుగోపాల్
Panja Vaisshnav Tej and Sithara Entertainments’ PVT04 Fiery Glimpse to release on Monday, 15th May!
Panja Vaisshnav Tej has been making smart script choices from his debut. He has decided to take on a high octane action entertainer for his next.
Sithara Entertainments and Fortune Four Cinemas, who have been synonymous with content oriented entertaining films have come up with high adrenaline rush inducing action packed entertainer with PVT04. Srikara Studios is presenting the film.
The movie team has announced the release of a fiery and fiesty glimpse that delves into the world of PVT04 on Monday, the 15th of May, at 4:05 PM.
Joju George, national award winning actor from Malayalam Cinema, is making his debut with this film in Telugu. His look from movie looks devilishly evil. The character poster of the actor indicated it already.  We are in for a treat with confrontational scenes between him and Panja Vaisshnav Tej, as the team already introduced Vaisshnav Tej’s character in the announcement video.
First look of the actor is yet to be unveiled and it will be one beyond imagination, promises the team.
Sreeleela as Chitra is beautiful and charming as ever. Aparna Das as Vajra Kaleswari Devi is pretty and gorgeous on the eye. Their character posters released by the team have created very positive buzz for the film.
BGM by sensational music director, GV Prakash Kumar is expected to give right pump to the mighty action spectacle. Srikanth N Reddy is debuting with the film as writer and director.
AS Prakash is doing the art work and Navin Nooli is editing the film.
Cast: Panja Vaisshnav Tej, Sreeleela, Aparna Das, Joju George and others.
Technical Crew:
Writer, Director: Srikanth N Reddy
Music Director: G.V. Prakash Kumar
Producers: S Naga Vamsi, S Sai Soujanya
Banners: Sithara Entertainments, Fortune Four Cinemas
Presenter: Srikara Studios
DOP: Dudley
Art: A.S. Prakash
Editor: Navin Nooli
#PVT04-FirstGlimpse-Announcement-Still