Sithara Entertainments, Fortune Four Cinemas join hands for #VD12, starring Vijay Deverakonda, directed by Gowtam Tinnanuri

సితార నిర్మాణంలో విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఆసక్తికరమైన చిత్రం

విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కనున్న #VD12 కోసం సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ చేతులు కలిపాయి.

యువ సంచలనం విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌తో కలిసి ఓ చిత్రాన్ని రూపొందించనుంది. విజయ్ కెరీర్ లో 12వ సినిమాగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ఎస్. నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గతంలో గౌతమ్ తిన్ననూరి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ‘జెర్సీ’ చిత్రం కోసం జతకట్టారు. నాని, శ్రద్ధా శ్రీనాథ్ నటించిన ఈ నేషనల్ అవార్డు విన్నింగ్ స్పోర్ట్స్ డ్రామా విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్ళు రాబట్టి ఘన విజయం సాధించింది.

తెలుగు, హిందీ పరిశ్రమలలో ప్రతిభగల దర్శకుడిగా గౌతమ్ తిన్ననూరి నిరూపించుకున్నారు. 2019లో ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ సినిమా ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డు గెలుచుకుంది. ఎంతో ప్రతిభగల గౌతమ్ ఇప్పుడు మరో ప్రతిభావంతుడు, యువ సంచలనం విజయ్ దేవరకొండతో చేతులు కలిపారు. వీరి కలయికలో సినిమా అంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఆ అంచనాలను అధిగమించి, అందరినీ అలరించే చిత్రం అందిస్తామని చిత్ర నిర్మాతలు నమ్మకంగా ఉన్నారు. ఇది భూమి బద్దలై పోయేది, అత్యంత భారీగా ఉంటుందని తాము చెప్పట్లేదు.. కానీ అద్భుతమైన విషయం అని మాత్రం చెప్పగలమని నిర్మాత నాగవంశీ అన్నారు.

అర్జున్ రెడ్డి, గీత గోవిందం, పెళ్లి చూపులు వంటి చిత్రాలలో తన అద్భుతమైన నటనతో ఆకట్టుకొని విజయ్ దేవరకొండ తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఈ చిత్రంతో ఆయనలోని ఓ కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తానని దర్శకుడు అంటున్నారు. ఎందరో నటీనటులతో పనిచేస్తూ ఎన్నో నాణ్యమైన చిత్రాలను అందిస్తున్న సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మొదటిసారి విజయ్‌తో జత కట్టడంతో ఈ చిత్రంపై అందరిలో ఆసక్తి నెలకొంది.

చిత్ర ప్రకటన సందర్భంగా మేకర్స్ కాన్సెప్ట్ పోస్టర్ ను విడుదల చేశారు. అందులో ఓ వ్యక్తి పోలీసు దుస్తుల్లో ముఖానికి ముసుగు ధరించి గూఢచారి ని తలపిస్తున్నాడు. పోస్టర్ మీద “I don’t know where I belong, to tell you whom I betrayed – Anonymous Spy” అని రాసుండటం గమనించవచ్చు. ఇదొక స్పై ఫిల్మ్ అని పోస్టర్ ని బట్టి అర్థమవుతోంది. అలాగే సముద్రతీరంలో యుద్ధ సన్నివేశాన్ని తలపించేలా మంటల్లో దగ్ధమవుతున్న పడవలతో పోస్టర్ ను ఆసక్తి రేకెత్తించేలా రూపొందించారు.

ఈ సినిమా చిత్రీకరణ త్వరలో ప్రారంభం కానుంది. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.

Sithara Entertainments, Fortune Four Cinemas join hands for #VD12, starring Vijay Deverakonda, directed by Gowtam Tinnanuri

Leading production house Sithara Entertainments is teaming up with Fortune Four Cinemas, for #VD12, starring young sensation Vijay Deverakonda, a film written and directed by one of Telugu cinema’s finest storytellers Gowtam Tinnanuri. Srikara Studios will present the film jointly bankrolled by Naga Vamsi S and Sai Soujanya. The last time Gowtam teamed up with Sithara Entertainments, they came up with the National-award winning sports drama Jersey, the Nani, Shraddha Srinath starrer that won over critics and performed well at the box office.

The makers announced the project with a poster featuring an anonymous quote that reads ‘I don’t know where I belong, to tell you whom I betrayed’ With a silhouette of a cop covered with a cloth on his face, it hints that #VD12 will be a periodic cop drama. With this project, Vijay Deverakonda is expected to don the khaki on-screen for the first time in his career. The image of a burning ship in the middle of a water body contributes to a viewer’s curiosity.

Prior to the project announcement, the producer S Naga Vamsi wrote, “We are not going to say that this is earth-shattering or MASSive or HUUUGE but this is something spectacular.” Gowtam Tinnanuri, as a filmmaker, needs little introduction, having proved his worth across Telugu and Hindi industries. His Jersey, that released in 2019, won in the Best Feature Film in Telugu and Best Editing categories respectively. When this exciting talent teams up with an equally capable performer like Vijay Deverakonda, there’s bound to be immense curiosity and the makers are confident that the director-actor combo will surpass the expectations of film buffs.

Vijay Deverakonda’s versatility is well known, with pathbreaking performances in films like Arjun Reddy, Geetha Govindam, Pelli Choopulu, and the director promises to unveil a new dimension to the star here as well. Sithara Entertainments has consistently churned out quality films with a bevvy of actors and it’ll be interesting to see how their first collaboration with Vijay turns out. The shoot is expected to commence soon and more details about the cast and crew will be announced shortly.

photos Post-#VD12_Announcement