*Unveiling the Thrills: Exploring the Intriguing Trailer of Siddharth’s bilingual action romance ‘Takkar’*

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ మెచ్చిన సిద్ధార్థ్ ‘టక్కర్’ ట్రైలర్
 
* సాయి ధరమ్ తేజ్ చేతుల మీదుగా ‘టక్కర్’ ట్రైలర్ విడుదల
 
అంచనాలను అమాంతం పెంచేసిన సిద్ధార్థ్ ‘టక్కర్’ ట్రైలర్ 
చార్మింగ్ హీరో సిద్ధార్థ్ అంటే తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక అభిమానం ఉంటుంది. ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘బొమ్మరిల్లు’ వంటి సినిమాలతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న సిద్ధార్థ్ నుంచి కొత్త సినిమా వస్తుందంటే అందరిలోనూ ఆసక్తి నెలకొనడం సహజం. ఇప్పుడు ఈ చార్మింగ్ హీరో ‘టక్కర్’ అనే సినిమాతో సరికొత్తగా అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ జి. క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పాషన్ స్టూడియోస్ తో కలిసి నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్ కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 9న తెలుగు, తమిళ భాషల్లో భారీ స్థాయిలో విడుదల కానుంది.
తాజాగా చిత్ర బృందం ఈ మూవీ ట్రైలర్ ను విడుదల చేసింది. రొమాన్స్, కామెడీ, యాక్షన్ సంగమంగా రూపొందిన ట్రైలర్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసేలా ఉంది.
ఈరోజు(మే 21) సాయంత్రం 5 గంటలకు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియా వేదికగా ‘టక్కర్’ ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మా నిర్మాతలు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న టక్కర్ సినిమా ట్రైలర్ విడుదల చేయడం సంతోషంగా ఉందన్నారు. అలాగే ఈ ట్రైలర్ ఉత్కంఠభరితంగా, వినోదాత్మకంగా ఉందని కొనియాడారు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
విడుదలైన ‘టక్కర్’ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. “ఆశే ఈ లోకాన్ని నడిపిస్తుంది. అదే ఆశ మన లైఫ్ ని నిర్ణయిస్తుంది. ఆ ఆశని నెరవేర్చుకోడానికి ధనమే ఇంధనం. దానిని సంపాదించుకోడానికి ఒక్కొక్కరిది ఒక్కో దారి. ఆ దారి అందరికీ ఒకటైనప్పుడు” అంటూ సిద్ధార్థ్ చెప్పే డైలాగ్ తో ట్రైలర్ ఆసక్తికరంగా ప్రారంభమైంది. డబ్బు సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకున్న సాధారణ యువకుడిగా కథానాయకుడు కనిపిస్తుండగా, బాగా డబ్బున్న యువతిగా కథానాయిక కనిపిస్తోంది. వారి మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు మెప్పిస్తున్నాయి. తనని ఎంతగానో నమ్మిన కథానాయికని డబ్బు కోసం కిడ్నాప్ చేయాల్సిన పరిస్థితి కథానాయకుడికి ఎందుకు వచ్చింది? వారిని ప్రతినాయకులు ఎందుకు వెంటాడుతున్నారు? కథానాయిక ఆత్మహత్యాయత్నానికి కారణం కథానాయకుడేనా? అనే ప్రశ్నలతో ఉత్కంఠను రేకెత్తిస్తూ ట్రైలర్ ఆద్యంత ఆసక్తికరంగా సాగింది. ఇక ట్రైలర్ లో యోగిబాబు హాస్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే “డబ్బు సంపాదిస్తానని చెప్పు.. కానీ డబ్బున్నోడిని అవుతానని అనకురా.. నాకు భయంగా ఉంది”, “నా దగ్గర డబ్బుల్లేవు.. నీకు ఇడ్లీలు కొనివ్వాలంటే, నా కిడ్నీలు అమ్ముకోవాలి”, “నూడుల్స్ తినే నీకే ఇంతుంటే.. చేపల పులుసు తినే నాకెంత ఉంటుందిరా” వంటి సంభాషణలు అలరిస్తున్నాయి. విజువల్స్, యాక్షన్ సన్నివేశాలు చూస్తుంటే.. ఖర్చు విషయంలో వెనకాడకుండా భారీ స్థాయిలో నిర్మించారని అర్థమవుతోంది. మొత్తానికి ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమాతో సిద్ధార్థ్ మరో భారీ విజయాన్ని అందుకోవడం ఖాయమనే అభిప్రాయం కలుగుతోంది.
ఇప్పటికే విడుదల అయిన ప్రచార చిత్రాలతో ‘టక్కర్’పై రోజురోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. సాధారణంగా సిద్ధార్థ్ సినిమాలలో ప్రేమ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అయితే ఈ సినిమాలో ప్రేమ సన్నివేశాలతో పాటు ఉత్కంఠను రేపేలా అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలు కూడా ఉండనున్నాయి. ఇప్పటికే విడుదలైన ‘టక్కర్’ టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అలాగే ఈ సినిమా నుంచి విడుదలైన ‘కయ్యాలే’, ‘పెదవులు వీడి మౌనం’ పాటలు కూడా విశేష ఆదరణ పొందాయి.
ఈ రొమాంటిక్ యాక్షన్ రైడ్ ప్రేక్షకులను ఆకట్టుకొని ఘన విజయం సాధించి, సిద్ధార్థ్ కెరీర్ లో మరో గుర్తుండిపోయే సినిమా అవుతుందని చిత్ర బృందం ఎంతో నమ్మకంగా ఉంది. ఈ సినిమాలో అభిమన్యు సింగ్, యోగి బాబు, మునీశ్ కాంత్, ఆర్జే విజ్ఞేశ్ కాంత్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. నివాస్ కె. ప్రసన్న సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా వాంచినాథన్ మురుగేశన్, ఆర్ట్ డైరెక్టర్ గా ఉదయ కుమార్ కె, ఎడిటర్ గా జీఏ గౌతమ్ వ్యవహరిస్తున్నారు.
తారాగణం: సిద్ధార్థ్, దివ్యాంశ కౌశిక్, అభిమన్యు సింగ్, యోగి బాబు, మునీశ్ కాంత్, ఆర్జే విజ్ఞేశ్ కాంత్
రచన, దర్శకత్వం: కార్తీక్ జి. క్రిష్
సంగీతం: నివాస్ కె ప్రసన్న
సినిమాటోగ్రాఫర్: వాంచినాథన్ మురుగేశన్
ఎడిటర్: జీఏ గౌతమ్
ఆర్ట్ డైరెక్టర్: ఉదయ కుమార్ కె
స్టంట్స్ కోరియోగ్రఫీ: దినేష్ కాశి
పబ్లిసిటీ డిజైన్స్: 24AM
నిర్మాత: టీజీ విశ్వ ప్రసాద్
సహా నిర్మాత: వివేక్ కూచిభొట్ల
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మయాంక్
బ్యానర్స్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పాషన్ స్టూడియోస్
*Supreme Hero Sai Dharam Tej launches the trailer of Siddharth’s bilingual action romance ‘Takkar’*
 
*Unveiling the Thrills: Exploring the Intriguing Trailer of Siddharth’s bilingual action romance ‘Takkar’*
Siddharth, known for his successful films such as Bommarillu and Nuvvostanante Nenoddantana, is all set to mesmerize the audience once again with his upcoming Tamil-Telugu action romance titled Takkar. Directed by Karthik G Krish and written by the same, the film features Divyansha as the female lead. Takkar is a joint production venture by TG Vishwa Prasad and Abhishek Agarwal, in collaboration with People Media Factory, Abhishek Agarwal Arts, and Passion Studios.
The makers have announced that Takkar will hit the theaters on June 9, much to the anticipation of fans. The teaser of the film, along with two songs titled Kayyale and Pedhavulu Veedi Maunam, both composed by Nivas K Prasanna, has received an overwhelming response and added to the buzz surrounding the film.
Supreme Hero Sai Dharam Tej has launched Takkar’s trailer today. “Happy to launch the Trailer of #Takkar for my producers @peoplemediafcy. Very Intriguing & Entertaining. All the best #Siddharth bro, @Karthik_G_Krish @itsdivyanshak @AAArtsOfficial @PassionStudios_ @nivaskprasanna @editorgowtham and the whole team,” tweeted Sai Dharam Tej.
Takkar’s trailer released today delivers an exhilarating mix of action, drama, and romance that promises to captivate audiences. It delves into the lives of diverse individuals and their strategies to amass wealth swiftly. With its intricate plot, the film takes viewers on a rollercoaster ride filled with unexpected twists, turns, and a gripping kidnapping drama. Moreover, the movie doesn’t shy away from infusing ample doses of humor, adding an extra layer of entertainment.
In Takkar, Siddharth showcases a fresh look with a beard under his chin, while Divyansha, who is familiar to Telugu cinema enthusiasts through films like Majili and Ramarao on Duty, sizzles the screen and delivers a promising performance as the female lead. The film is expected to redefine Siddharth’s image as an action hero and unveil a new dimension to his acting abilities. Takkar will be released in both Tamil and Telugu languages on June 9, offering a thrilling and captivating experience to the audience.
Apart from Siddharth and Divyansha, Takkar boasts a talented ensemble cast including Abimanyu Singh, Yogi Babu, Munishkanth, and RJ Vigneshkanth in significant roles. The music for the film is composed by Nivas K Prasanna, while Vanchinathan Murugesan handles the cinematography, and GA Gowtham takes charge of the editing. People Media Factory and Abhishek Agarwal Arts have previously delivered noteworthy hits like Karthikeya 2 and Dhamaka, further raising expectations for the success of Takkar.
Casts: Siddharth, Divyansha, Abimanyu Singh, Yogi Babu, Munishkanth, RJ Vigneshkanth.
Written and directed by Karthik G Krish
Cinematographer: Vanchinathan Murugesan
Editor: GA Gowtham
Art Direction: Udaya Kumar K
Stunts Choreography: Dinesh Kasi
Publicity Designs : 24AM
Teaser cut – Pradeep E Ragav
Producers: T G Vishwa Prasad, Abhishek Agarwal
Co-producer: Vivek Kuchibhotla
Executive producer : Mayank Agarwal

Takkar 22