Varudu Kaavalenu – Kola Kalle Ila… Song Press Release and Stills

*ప్రేమికుల దినోత్సవం కానుకగా ‘వరుడు కావలెను‘ నుంచి ‘నాగ శౌర్య , రీతువర్మ’ ల ప్రేమ గీతం విడుదల చేసిన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్

*ప్రఖ్యాత గాయకుడు సిద్ శ్రీరామ్ ఆలపించిన మరో సుమధురమైన గీతం 
*  సంగీత, సాహిత్యాల కలబోత  ఈ వీడియో చిత్రం 
ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్  యువ కథానాయకుడు నాగ శౌర్య , నాయిక ‘రీతువర్మ’ జంటగా ‘లక్ష్మీ సౌజన్య’ ను దర్శకురాలిగా పరిచయం చేస్తూ రూపొందిస్తున్న చిత్రం  ‘వరుడు కావలెను‘
ప్రేమికుల దినోత్సవం సందర్భంగా నేడు (14-2-2021) ‘వరుడు కావలెను‘ చిత్రం యూనిట్ చిత్రం లోని ఓ గీతాన్ని విడుదల చేశారు. ఈ వీడియో చిత్రాన్ని వీక్షిస్తే సంగీత, సాహిత్యాల కలబోత అనిపిస్తుంది. వివరాల్లోకి వెళితే….
‘‘కోలకళ్ళే ఇలా గుండే గిల్లే ఎలా
నీలి మబ్బుల్లో నేనే తేలేంతలా
కొంటె నవ్వే అలా చంపుతుంటే ఎలా
కొత్త రంగుల్లో ప్రాణమే తడిసేంతలా
మళ్ళీ మళ్ళీ రావే పూలజల్లు తేవే‘‘ అనే సాహిత్యం తో సాగే ఈ గీతాన్ని గీత రచయిత రాంబాబు గోసల రచించారు. ప్రఖ్యాత గాయకుడు సిద్ శ్రీరామ్ మరోసారి వీనుల విందుగా ఆలపించిన ఈ గీతానికి విశాల్ చంద్రశేఖర్ స్వరాలు ప్రాణం పోశాయి. చిత్ర నాయకా నాయికలు మధ్య ప్రేమ కు తెర రూపం గా  ఈ గీతం కనిపిస్తుంది. సంగీతం, సాహిత్యం, స్వరం ఈ పాటలో పోటీ పడ్డాయనిపిస్తుంది. వీటికి తోడు ‘నాగ శౌర్య, రీతువర్మ‘ లు అభినయం కట్టిపడేస్తుంది.
గీతాన్ని ఆలపించిన గాయకుడు సిద్ శ్రీరామ్ మాట్లాడుతూ..‘ చిత్ర సంగీత దర్శకులు విశాల్ చంద్రశేఖర్ స్వరాలు సమ కూర్చిన ఈ శ్రావ్య మైన గీతాన్ని ఆలపించటం ఎంతో ఆనందంగా ఉంది. ప్రేమికుల దినోత్సవం రోజున ఈ గీతం సంగీత ప్రియులకు చేరువ కావటం మరెంతో సంతోషం గా ఉందన్నారు.
ఇంతకుముందు చిత్రం పేరును అధికారిక ప్రకటన చేస్తూ ఓ వీడియో, ఆ తరువాత 2021 నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ.. ఓ  ప్రచారచిత్రం, కథానాయకుడు నాగ శౌర్య పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన వీడియో వంటి ప్రచారాలకు ప్రేక్షకాభిమానులనుంచి ఎన్నో ప్రశంసలు కూడా లభించాయి. సామాజిక మాధ్యమాలలో కూడా వీటికి ప్రాచుర్యం లభించింది .. ప్రస్తుతం చిత్ర నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి.  ‘వరుడు కావలెను‘ చిత్ర కథ, కథనం, మాటలు, పాటలు, సన్నివేశాలు, భావోద్వేగాలు,నటీ నటుల అభినయాలు చిత్ర కథా నుగుణంగా సాగి  అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తాయి అన్న నమ్మకాన్ని వ్యక్తం  చేస్తున్నారు చిత్ర దర్శక నిర్మాతలు.
నాగశౌర్య, రీతువర్మ నాయకా,నాయికలు కాగా  నదియా, మురళీశర్మ, వెన్నెలకిషార్, ప్రవీణ్, అనంత్, కిరీటి దామరాజు, రంగస్థలం మహేష్, అర్జున్ కళ్యాణ్, వైష్ణవి చైతన్య, సిద్దిక్ష ఇతర ప్రధాన పాత్రలు.
ఈ చిత్రానికి మాటలు: గణేష్ కుమార్ రావూరి, ఛాయాగ్రహణం: వంశి పచ్చి పులుసు, సంగీతం: విశాల్ చంద్రశేఖర్,ఎడిటర్: నవీన్ నూలి; ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్, పి.ఆర్.ఓ. లక్ష్మీవేణుగోపాల్     సమర్పణ: పి.డి.వి.ప్రసాద్
 
నిర్మాత: సూర్య దేవర నాగవంశి
 
కథ- స్క్రీన్ ప్లే- దర్శకత్వం: లక్ష్మీసౌజన్య
 
*a valentines day gift ‘Varudu  Kaavalenu’ from Naga Shaurya and Ritu Varma’s love song released by production company Sitara Entertainments
*Famous singer Sid Sriram sung another melodious song
*a great combination of music and lyrics
an prestigious production banner Sitara Entertainments producing a movie with young hero Naga Shaurya, gorgeous heroine Ritu Varma introducing debutant director Lakshmi Sowjanya with a title ‘Varudu Kaavalenu’
On a valentine’s day occassion today (14-2-2021) ‘Varudu Kaavalenu’ movie unit released a melodious song. This video seems an elegant combination of music and lyrics going into details….
“kolakalley ila
gundey gilley ela
neeli mabbullo neney telenthala
kontey navvey ala
champutuntey ela
kotta rangullo pranamey tadisenthala
malli malli raavey poola jallu thevey” written by an lyric writter Rambabu Gosala. Famous singer Sid Sriram another time sung a melodious song, Vishal Chandrashekhar gave a beautiful music to this song like all songs in the album. It stands out to show the love between hero and heroine in the movie. Music and lyrics gave a competetive feel to entertain us. Along with this ‘Naga Shaurya and Ritu Varma’s performance is a great addition to this song.
Sid sriram said he was super excited to announce about this beautiful love song which he feels honoured to work with Vishal Chandrashekhar on this melody song. He extended his love to all on this Valentines day …
Already a video introducing the title, new year wishes video, and on our hero Naga Shaurya’s birthday another video has been released and got humoungous response from the audience. Shooting is still in progress. ‘Varudu Kaavalenu’ story, screenplay, dialogues, songs, scenes, emotions, all cast performances are taking this to a whole new level and entertains all types of audiences, said producer and director.
Naga Shourya and Ritu Varma as a leading pair, Nadiya, Murali Sharma, Vennela Kishore, Praveen, Ananth, Kiriti Damaraju, Rangasthalam Mahesh, Arjun Kalyan, Vaishnavi Chaitanya, Siddiksha are the main leads.
For this movie
Dialogues: Ganesh Kumar Ravuri,
Cinematographer: Vamsi Patchipulusu,
Music : Vishal Chandrashekhar
Editor: Navin Nooli
Art: A.S Prakash
PRO: Lakshmivenugopal
Presents by: P.D.V Prasad
 
Produced by: Surya Devara NagaVamsi
 
Story – Screenplay – Direction: Lakshmi Sowjanya
vk copy Out Now-1a 30X40-013 copy ACS_8565-1 ACS_9463 copy 6 copy