You’ll come with heavy hearts and a big smile on your face after watching Lucky Baskhar – Trivikram Srinivas

తడిసిన కళ్ళతో, నవ్వుతున్న పెదాలతో థియేటర్ నుంచి బయటకు వస్తారు : ‘లక్కీ భాస్కర్’ ప్రీ రిలీజ్ వేడుకలో త్రివిక్రమ్ శ్రీనివాస్

- ఘనంగా ‘లక్కీ భాస్కర్’ ప్రీ రిలీజ్ వేడుక
- ఈ మధ్య కాలంలో నేను చూసిన బెస్ట్ ట్రైలర్ : విజయ్ దేవరకొండ

వైవిద్యభరితమైన సినిమాలు, పాత్రలతో దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్. తెలుగులోనూ “మహానటి”, “సీతా రామం” వంటి ఘన విజయాలను సొంతం చేసుకున్న ఆయన, ఇప్పుడు “లక్కీ భాస్కర్” అనే మరో వైవిధ్యమైన చిత్రంతో అలరించడానికి సిద్ధమవుతున్నారు. ప్రతిభగల దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి కథానాయిక. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 31వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 27న సాయంత్రం హైదరాబాద్ లోని జె.ఆర్.సి. కన్వెన్షన్ లో ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా నిర్వహించారు. ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. “ఈ తరం గొప్ప నటులు దుల్కర్ సల్మాన్ మరియు విజయ్ దేవరకొండ. వాళ్ళిద్దరినీ ఒకేసారి చూడటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా గురించి చెప్పాలంటే.. ఏ సినిమా అయినా మనం చూసేటప్పుడు మనకి అందులో ఉన్న కథానాయకుడు నెగ్గుతూ ఉండాలని కోరుకుంటాం. ఈ సినిమా చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, భాస్కర్ లక్కీ అవ్వాలని మనం సినిమా మొత్తం కోరుకుంటూనే ఉన్నాం. ఫైనల్ గా అతను లక్కీ గానే బయటకు వస్తాడు. ఈ సినిమాకు లక్కీ భాస్కర్ అనే టైటిల్ యాప్ట్. ఈ సినిమాలో చిన్న చిన్న పాత్రలను కూడా వెంకీ తీర్చిదిద్దిన విధానం బాగుంది. కథని ప్రభావితం చేయకుండా సినిమాలో ఒక్క పాత్ర కూడా లేదు. బ్యాంక్ లో బయట నిలబడే సెక్యూరిటీతో సహా ప్రతి ఒక్కరూ మనకొక ఎమోషన్ క్రియేట్ చేసి వెళ్తారు ఈ సినిమాలో. దుల్కర్ సల్మాన్ వేరే లెవెల్ లో యాక్ట్ చేశాడు. అంటే ఎఫర్ట్ లెస్ గా చేశాడు. అంటే నిజంగా ఒక బ్యాంక్ లోకి వెళ్ళిపోయి, క్లర్క్ జీవితంలోకి ఎంటరైతే ఎంత ఈజీ ఉంటుందో అంత ఈజీగా చేశాడు. మనల్ని కూడా చేయి పట్టుకొని తనతో పాటు బ్యాంక్ లోకి తీసుకెళ్లిపోయాడు. దుల్కర్ మామూలు నటుడు కాదు. అతను చేసిన ప్రయత్నం మనకి కనపడకుండా ఉండటానికి అతను చేసిన ప్రయత్నానికి హ్యాట్సాఫ్. మమ్మూట్టి లాంటి మర్రిచెట్టుకి పుట్టాడు. మర్రిచెట్టు కింద మొక్కలు బ్రతకవని చెబుతుంటారు. కానీ దాని నుంచి బయటకు వచ్చి తన ప్రయాణాన్ని తను మొదలుపెట్టడం, తన రోడ్డు తను వేసుకోవడం అంటే చిన్న విషయం కాదు. మమ్మూట్టి గారు చాలా గొప్ప నటుడు. ఆయన దుల్కర్ కెరీర్ చూసి తండ్రిగా గర్వపడతారు. ఈ సినిమాలోని ప్రతి పాత్ర నా మనసుకు దగ్గరైంది. ఈ సినిమాలో నేను అందరికంటే ఎక్కువ ఫ్యాన్ అయిపోయింది అంటే రాంకీ గారి పాత్ర. సినిమా మొత్తం చూసిన తర్వాత నాకు అనిపించిన ఫీలింగ్ ఏంటంటే, ఒక మిడిల్ క్లాస్ వాడు ఒక అడ్వెంచర్ చేస్తే నెగ్గాలని మనకి ఖచ్చితంగా అనిపిస్తుంది. ఎందుకంటే మనలో చాలామంది అక్కడినుండే వచ్చాము కదా. అడ్వెంచర్ చేసి, దాని నుంచి సక్సెస్ ఫుల్ గా బయటపడటం అనేది హోప్. ఆ హోప్ సినిమా చూసిన తర్వాత ఫైనల్ గా కంప్లీట్ అవుతుంది. తడిసిన కళ్ళతో, నవ్వుతున్న పెదాలతో థియేటర్ లోనుంచి మీ అందరూ బయటకు వస్తారు. ఈ దీపావళి వెంకీకి, ఈ సినిమాకి పని చేసిన అందరికీ చాలా ఆనందాన్ని ఇస్తుందని నాకు తెలుసు. నేను నమ్ముతూ, ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను. అలాగే విజయ్ గురించి రెండు మాటలు చెప్పాలి. నాకు బాగా ఇష్టమైన నటుల్లో ఒకడు. ఎంతో ప్రేమను చూశాడు విజయ్, అంతకంటే రెట్టింపు ద్వేషం కూడా చూశాడు. ఆ రెండూ చాలా తక్కువ టైంలో చూడటమంటే.. చాలా గట్టోడు. దేవరకొండ బాలగంగాధర్ తిలక్ అమృతం కురిసిన రాత్రిలో ఒక కవిత రాశారు. మా వాడే మహా గట్టివాడే అని.. మా విజయ్ మహా గట్టోడు, ఏం భయంలేదు. దుల్కర్ గారిని నేను పెద్దగా కలవలేదు. షూటింగ్ కి వెళ్ళడం కంటే, ఒక ప్రేక్షకుడిగానే సినిమా చూడటానికి ఇష్టపడతాను నేను. సినిమాలో దుల్కర్ నటన చూసి ప్రేమలో పడిపోయాను. ఇండియన్ సినిమాకి మలయాళం సినిమా ఒక కొత్త యాంగిల్ క్రియేట్ చేసింది. అలాంటి ఒక న్యూ వేవ్ మలయాళం సినిమాలో ఒక మైల్ స్టోన్ దుల్కర్ సల్మాన్. ఈ సినిమా నాగవంశీకి, వెంకీకి మంచి విజయాన్ని అందించాలి. అందరికీ దీపావళి శుభాకాంక్షలు.” అన్నారు.

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. “అభిమానులను కలిసి చాలారోజులు అవుతుంది. మీరందరూ సంతోషంగా, బాగున్నారని కోరుకుంటున్నాను. నా సోదరుడు దుల్కర్ నటించిన లక్కీ భాస్కర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రావడం ఆనందంగా ఉంది. పెళ్లిచూపులు హిట్ అయిన తర్వాత నాకు ఫస్ట్ చెక్ వచ్చింది సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచే. త్రివిక్రమ్ గారు నన్ను ఆఫీస్ కి పిలిపించి, కూర్చోబెట్టి నాతో మాట్లాడి, నాకు నా ఫస్ట్ చెక్ ఇప్పించారు. ఏడేళ్లవుతుంది అనుకుంటా. చాలారోజులు పట్టింది సినిమా చేయడం. రాసిపెట్టుందేమో ‘VD12′ నేను, గౌతమ్ సితారలో చేయాలని. త్వరలోనే మీ ముందుకు తీసుకువస్తాం. ఆరోజు త్రివిక్రమ్ గారిని కలవడం నా లైఫ్ లో ఒక బిగ్ మూమెంట్. మన జనరేషన్ కి తెలుసు మన్మథుడు, నువ్వు నాకు నచ్చావ్, జల్సా, నాకు వ్యక్తిగతంగా బాగా నచ్చిన సినిమాలు అతడు, ఖలేజా. అలాంటి సినిమాలు చేసిన ఆయన మనల్ని ఆఫీస్ కూర్చోబెట్టి నువ్వు స్టార్ అవుతావురా చెక్ తీసుకో అంటే.. అప్పుడు ఎంత ఆనందంగా అనిపించిందో మాటల్లో చెప్పలేను. ఆయన నా అభిమానుల్లో దర్శకుల్లో ఒకరు. ఆ తర్వాత ఆయనను చాలాసార్లు కలిశారు. సినిమా గురించి, జీవితం గురించి, రామాయణ, మహాభారతాల గురించి త్రివిక్రమ్ గారు చెబుతూ ఉంటే అలా వింటూ కూర్చోవచ్చు. ఇక లక్కీ భాస్కర్ విషయానికొస్తే, ఈ మధ్య కాలంలో నేను చూసిన బెస్ట్ ట్రైలర్స్ లో ఒకటి. లక్కీ భాస్కర్ తో వెంకీ ఒక కొత్త లెవెల్ అన్ లాక్ చేశాడు. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. వెంకీ సినిమాల్లో హీరోయిన్ పాత్రలకు ప్రాముఖ్యత ఉంటుంది. మీనాక్షి చౌదరికి కూడా ఇందులో మంచి పాత్ర లభించిందని అర్థమవుతోంది. నేను నటుడు కాకముందు నుండే దుల్కర్ సినిమాలు చేస్తుండేవాడిని. మేము మహానటి, కల్కి సినిమాలు కలిసి చేశాను. నా సోదరుడు దుల్కర్ సినిమా వేడుకకు రావడం సంతోషంగా ఉంది. దుల్కర్ కి, సితారకి, వెంకీకి ఈ సినిమా మంచి విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాను. ” అన్నారు.

కథానాయకుడు దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ.. “తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. హైదరాబాద్ నా సెకండ్ హోమ్. ఇదొక కొత్త జానర్ సినిమా. ఇదొక కొత్త ప్రయత్నం. ఇలాంటి సినిమా నిర్మించడానికి ముందుకు రావాలంటే ఎంతో ధైర్యం ఉండాలి. అలాంటి ధైర్యం వంశీ గారికి ఉంది. వెంకీ గారు చూడటానికి కాలేజ్ స్టూడెంట్ లా ఉంటారు. కానీ ఆయన రాసే సన్నివేశాలు, మాటలు గొప్పగా ఉంటాయి. ఆయన దర్శకత్వంలో నటించడం నటీనటులకు చాలా తేలికగా ఉంటుంది. తేలికగా ఆ పాత్రలలోకి, ఆ సన్నివేశాల్లోకి వెళ్ళిపోతాము. అందరం కలిసి ఒక కుటుంబంలా ఈ సినిమా చేశాము. అందరితో మంచి అనుబంధం ఏర్పడింది. మీనాక్షి అందంగా ఉండటమే కాదు, అంతే అందంగా నటించింది. ఈ సినిమాకి నేను మూడు భాషల్లో డబ్ చేశాను. ఈ సినిమాలో మీనాక్షి పాత్ర అందరికీ గుర్తుంటుంది. రిత్విక్ చాలా బాగా నటించాడు. త్రివిక్రమ్ గారికి నేను పెద్ద అభిమానిని. అల వైకుంఠపురములో సినిమా అంటే నాకు చాలా ఇష్టం. త్రివిక్రమ్ గారి రచనలో ఎంతో లోతు ఉంటుంది. ఒక కమర్షియల్ సినిమాలో కూడా లోతైన మాటలు రాయడం ఆయనకే చెల్లుతుంది. రాంకీ గారితో కలిసి పనిచేయడం గౌరవంగా భావిస్తున్నాను. విజయ్ దేవరకొండ నా తమ్ముడు. నా మహానటి, సీతారామం సినిమాలకు విజయ్ వచ్చాడు. ఆ రెండు సినిమాలు విజయం సాధించాయి. ఇప్పుడు లక్కీ భాస్కర్ కి వచ్చాడు. ఇది విజయం సాధిస్తుంది. విజయ్ నా లక్కీ చార్మ్. లక్కీ భాస్కర్ ఒక కామన్ మ్యాన్ స్టోరీ. ఇది మీ అందరికీ నచ్చుతుంది. ” అన్నారు.

కథానాయిక మీనాక్షి చౌదరి మాట్లాడుతూ.. “ఈ వేడుకకు విచ్చేసిన త్రివిక్రమ్ గారికి, విజయ్ గారికి ధన్యవాదాలు. నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన చినబాబు గారు, వంశీ గారికి కృతఙ్ఞతలు. సితార ఎంటర్టైన్మెంట్స్ నన్ను కుటుంబసభ్యురాలిలా చూస్తారు. ఇంత మంచి టీంతో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను. సుమతి అనేది ఇప్పటివరకు నేను చేసిన పాత్రల్లో నాకు ఇష్టమైన పాత్ర. ఇలాంటి పాత్రను నాకు ఇచ్చిన వెంకీ గారికి ధన్యవాదాలు. దుల్కర్ గారి లాంటి గొప్ప నటుడితో, మంచి మనిషితో కలిసి నటించడం ఆనందంగా ఉంది. మంచి కథలు, పాత్రలతో మిమ్మల్ని ఇలాగే అలరిస్తానని తెలుగు ప్రేక్షకులకు మాట ఇస్తున్నాను. అక్టోబర్ 31న థియేటర్లలో కలుద్దాం. లక్కీ భాస్కర్ మీ అందరికీ నచ్చుతుంది. సుమతి పాత్ర ఇంకా బాగా నచ్చుతుంది.” అన్నారు.

దర్శకుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ..”విజయ్ గారిని, దుల్కర్ గారిని ఇలా చూస్తుంటే ముచ్చటేస్తుంది. మీ ఇద్దరు కలిసి మల్టీస్టారర్ చేస్తే చూడాలని ఉంది. ఈ వేడుకకు విజయ్ గారు, మా గురువు గారు త్రివిక్రమ్ గారు రావడం సంతోషంగా ఉంది. ‘సార్’ సినిమా విజయం తర్వాత ఒక విభిన్న సినిమా చేయాలనుకున్నాను. వెండితెర మీద ఇప్పటివరకు బ్యాంకింగ్ నేపథ్యంలో ఇలాంటి సినిమా రాలేదు. అందుకే ఈ కథ ఎంచుకున్నాను. ఈ సినిమా చేయడానికి అంగీకరించిన దుల్కర్ గారికి మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు. మనందరికీ డబ్బంటే ఇష్టం. డబ్బంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరికీ ఈ సినిమా నచ్చుతుంది. అది నేను గ్యారెంటీగా చెబుతున్నాను. సినిమా అనేది వినోదాన్ని పంచాలి, ఆశని కలిగించాలి. ఈ సినిమా అలాంటి ఆశని కలిగిస్తుంది. ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణమైన నా దర్శకత్వ విభాగానికి, సాంకేతిక నిపుణులకు, నటీనటులు అందరికీ పేరుపేరునా కృతఙ్ఞతలు. అక్టోబర్ 31 న విడుదలవుతున్న ఈ చిత్రం అందరికీ నచ్చుతుంది. ఈ సినిమా చూసి దుల్కర్ గారి అభిమానులు కాలరెగరేసుకొని తిరుగుతారు.” అన్నారు.

నటుడు హైపర్ ఆది మాట్లాడుతూ.. “డబ్బు విలువ తెలిసిన ప్రతి ఒక్కరికీ, మధ్యతరగతి జీవితాన్ని అనుభవంచిన ప్రతి ఒక్కరికీ లక్కీ భాస్కర్ నచ్చుతుంది. వెంకీ అట్లూరి గారు ఈ సినిమాని అద్భుతంగా రూపొందించారు. విజయ్ దేవరకొండ గారు, త్రివిక్రమ్ గారు ఈ వేడుకకు రావడం సంతోషంగా ఉంది. లక్షల్లో ఒకడిగా వచ్చి, లక్షల మంది అభిమానులను విజయ్ దేవరకొండ గారు సొంతం చేసుకున్నారు. నాతో సహా ఎందరికో సినీ పరిశ్రమకు రావడానికి త్రివిక్రమ్ గారు స్ఫూర్తి. ఆయన తన మాటలతో ఎందరిలోనో స్ఫూర్తి నింపారు.” అన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత ఎస్. రాధాకృష్ణ (చినబాబు), గీత రచయిత రామజోగయ్య శాస్త్రి, నటీనటులు రాంకీ, మానస చౌదరి, రాజ్‌కుమార్ కసిరెడ్డి, రంగస్థలం మహేష్, అనన్య, గాయత్రి భార్గవి, శ్రీనాథ్ మాగంటి, మాణిక్ రెడ్డి తదితరులు పాల్గొని చిత్రం ఘన విజయం సాధించాలని ఆకాక్షించారు.

Lucky Baskhar is an International Level film – Vijay Deverakonda at the grand pre – release event


You’ll come with heavy hearts and a big smile on your face after watching Lucky Baskhar – Trivikram Srinivas
Lucky Baskhar starring Dulquer Salmaan, Meenakshi Chaudhary directed by Venky Atluri and produced by Suryadevara Naga Vamsi and Sai Soujanya of Sithara Entertainments and Fortune Four Cinemas, respectively, is releasing on 31st October and the movie team conducted a grand pre-release event with The Rowdy Vijay Deverakonda and wizard of words Trivikram Srinivas.

Speaking at the event, Vijay Deverakonda wished luck to the team. He remembered his occasion with Dulquer Salmaan in his previous direct Telugu films – Mahanati and Sita Ramam. He stated that he introduced Dulquer at Mahanati event and they both became friends after their first ever meeting.

He continued to remember his association with Triviram Srinivas. He shared that after watching Pelli Choopulu, the director called him to Sithara Entertainments office and gave him the first check as producer. He remarked that after 7 years, they are doing VD12 and soon, the film will entertain everyone.

Later he said, “Venky Atluri is one of the most talented writer and director of Telugu Cinema. He has hits and flops but Lucky Baskhar is on a different level. I believe this is an International Level film and I wish my producers all the success with this film.”

Director Trivikram Srinivas once again won hearts with his mesmerizing speech. He said, “I loved the film Lucky Baskhar and speaking after watching it. You’ll see a different Dulquer Salmaan and he carried us into a bank as Baskhar and we feel like third wheeling him.”

He continued to say, “Dulquer Salmaan’s performance mesmerised me as he effortlessly carried such a complicated character. No one can continue the legacy of a legend like Mammotty, it is very very difficult. But Dulquer has paved a path for himself and he is already a modern-day great actor. Director Venky Atluri gave every small character a memorable scene and they will stay with us. I loved everyone’s performance and became a fan of Ramky sir. The film gives every middle class person hope to take on an adventure and win. Your heart will be heavy after and there will be a smile on your lips after watching the film. This Diwali will be big for everyone in the team.”

Director Venky Atluri stated that he wanted to do something big and uniquely heroic post a film like Sir/Vaathi. He thanked Trivikram Srinivas for always being his inspiration and producing this movie, as well. He thanked Dulquer Salmaan and every cast, crew member for working tirelessly to bring his vision to life. He concluded by saying the movie will be give hope to everyone and it will connect with every audience member who wants, needs, desires and loves money, which is everyone.

Meenakshi Chaudhary thanked makers for a strong role and senior actor Ramky stated that he loved his character and narration of Venky Atluri. He praised Dulquer Salmaan’s performance and wished for the movie to be a grand success.

Dulquer Salmaan won hearts by speaking in Telugu. He shared that he always felt Vijay Deverakonda as his Lucky charm and he wished for it to work third time as well with Lucky Baskhar. He continued to state that director Venky Atluri looks like a college going person but he wrote a matured and lovely script, scenes in the film.

He remembered how his entire family are big fans of director Trivikram Srinivas and tried to get an autograph of the director for his kids. He thanked and praised guts producer Naga Vamsi for believing in such an untouched genre in Indian Cinema. He further praised Composer GV Prakash Kumar’s music and score for the film. He complemented cinematographer Nimish Ravi and Production designer Bangalan for their meticulous work and extensive research in recreating 80′s Bombay.

Finally, Dulquer Salmaan requested Telugu audiences to watch Lucky Baskhar in theatres as it is going to give them an unique and memorable theatrical experience for Diwali. The movie is going to have early premieres on 30th October from 6 PM onwards in Telugu states.

GANI8180