May 31 2013
May 18 2013
తెలుగు,తమిళ భాషలలో ‘లలితశ్రీ కంబైన్స్ రూపొందిస్తున్న ‘శ్రీ త్యాగరాజు’ పాటల రికార్డింగ్
ప్రఖ్యాత వాగ్గేయకారుడు ‘త్యాగయ్య’. ఆయన జీవితకధ ఆధారంగా లలితశ్రీ కంబైన్స్ పతాకంపై స్వీయ నిర్మాణ దర్శకత్వంలో ఆర్.వి.రమణమూర్తి రూపొందిస్తున్న చిత్రం ‘శ్రీ త్యాగరాజు’.ఈ సంగీత ప్రధానమైన చిత్రంలో త్యాగరాజు పాత్రను ప్రఖ్యాత నృత్య సంకీర్తనా చార్యులు జె.ఈశ్వరప్రసాద్ పోషిస్తున్నారు.
‘శ్రీ త్యాగరాజు’ చిత్రం పాటల రికార్డింగ్ ఈ నెల 16వ తేది రాత్రి ప్రణతి ఆడియో ల్యాబ్ లో జరిగింది.పద్మభూషణ్ డా: నూకల చినసత్యన్నారాయణ సీతారాముల విగ్రహాలకు పూజాకార్యక్రమాలు నిర్వహించారు.అనంతరం సంగీత జగద్గురు శ్రీ త్యాగరాజు కృతులు రెండింటిని ‘కనుగొంటిని శ్రీరాముని నేడు’, ‘రారా మా ఇంటిదాకా’ ను రికార్డ్ చేయటం జరిగింది. సుప్రసిద్ధ కర్నాటక సంగీత విద్వాంసుడు శ్రీ వైజర్స్ ఈ చిత్రం ద్వారా సంగీత దర్శకునిగా పరిచయం అవుతున్నారు,చిత్ర రంగంలో సీనియర్ సంగీత విద్వాంసుడు పూర్ణచందర్ ఈ చిత్ర సంగీత పర్యవేక్షణ చేస్తున్నారు,
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత,దర్శకుడు ఆర్.వి.రమణమూర్తి మాట్లాడుతూ..’ప్రఖ్యాత వాగ్గేయ కారుడు త్యాగయ్య’. ఆయన అసలు పేరు కాకర్ల త్యాగ బ్రహ్మం.తమిళనాడులోని తిరువాయూర్ లో ఆయన జన్మించారు.ఆయనకు చిన్నతనం నుంచి ‘రామభక్తి’ మెండు.కుటుంబ సభ్యులు ఆయన కవిత్వాన్ని రాజులకు ధారాదత్తం చేయమన్నా ‘నిది చాల సుఖమా..రామును సేవా సన్నిధి సుఖమా’ అంటూ తిరస్కరించి,ఎన్ని ఒడిదుడుకులు జీవితంలో ఎదురైనా రామనామ స్మరణ చేస్తూ రామ భక్తీ కే అంకితమై ఎన్నో కీర్తనలు రచించారు.త్యాగరాజు రచించిన కీర్తనలే కర్నాటక సంగీతానికి ఆధారం అయ్యాయి.ఈనాటికీ దక్షిణాదిన సంప్రదాయ సంగీతం అభ్యసించే ప్రతి ఒక్కరూ త్యాగరాజ స్వామి కీర్తనలతోనే సంగీతంలో ఓనమాలు దిద్దుకుంటారు.’ అలాంటి వాగ్గేయ కారుని జీవిత చరిత్రను తెరకెక్కించటం అదృష్టం గా భావిస్తున్నట్లు రమణమూర్తి తెలిపారు.
సంకీర్తనాచార్యుడనైన తాను త్యాగరాజు పాత్రను పోషించటం శ్రీరామకృప అని ఈశ్వరప్రసాద్ అన్నారు.
‘శ్రీత్యాగారాజు’లోని ఇతర ప్రధాన పాత్ర దారులు, సాంకేతిక నిపుణుల ఎంపిక వేగంగా జరుగుతోంది.ఇందులో మొత్తం 16గీతాలు ఉంటాయి. జూన్,జులై నెలల్లో వీటి రికార్డింగ్ పూర్తవుతుంది.డిసెంబరు నాటికి చిత్ర నిర్మాణం పూర్తి చేసి 2014 జనవరిలో ‘శ్రీ త్యాగరాజు’ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని నిర్మాత,దర్శకుడు ఆర్.వి.రమణమూర్తి తెలిపారు.
మహానటుడు చిత్తూరు వి.నాగయ్య 1946లో ‘త్యాగయ్య’ను రూపొందించగా,1981లో బాపు ‘త్యాగయ్య’కు దర్శకత్వం వహించారు. 2013 లో మూడవసారి ‘శ్రీ త్యాగరాజు’ చిత్రం రూపొందటం విశేషం.
May 16 2013
ఈ నెల 25న ‘అంతకుముందు ఆ తరువాత’ ఆడియో విడుదల
ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ ‘శ్రీ రంజిత్ మూవీస్’ రూపొందిస్తున్న యువతరం ప్రేమ కధా చిత్రం ‘అంతకుముందు ఆ తరువాత’. సుమంత్ అశ్విన్,ఈషా జంటగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నిర్మాత కె.ఎల్.దామోదర్ ప్రసాద్. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకుడు.త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం… ఆడియో వేడుక ఈ నెల 25న హైదరాబాద్ లో చలనచిత్ర ప్రముఖుల సమక్షంలో వైభవంగా జరుగుతుందని నిర్మాత కె.ఎల్.దామోదర్ ప్రసాద్ తెలిపారు.
సంగీత దర్శకుడు ‘కల్యాణి కోడూరి’ ఈ చిత్రానికి వీనుల విందైన సంగీతాన్ని సమకూర్చారు.’అలా మొదలైంది’ లానే ఈ చిత్రం ఆడియో కూడా సంగీత ప్రియులను ఆకట్టుకుంటుందనే ఆశా భావాన్ని వ్యక్తం చేసారు చిత్ర దర్శక,నిర్మాతలు. సుప్రసిద్ధ గీత రచయితలు సిరివెన్నెల సీతారామశాస్త్రి, అనంతశ్రీరాంలు ఈ గీతాలను రచించారు.తన సంగీత ప్రయాణంలో ఇదో మంచి చిత్రంగా నిలుస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేసారు సంగీత దర్శకుడు కల్యాణి కోడూరి.
‘అంతకుముందు ఆ తరువాత’ ఓ ఉద్వేగభరిత ప్రేమ కధా చిత్రం’ అని దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి తెలిపారు. వాస్తవికత ఉట్టిపడే సన్నివేశాలు, హృదయాన్ని స్పృశించే భావోద్వేగాలు, అనుభవాల సమ్మిళితమే ఈ చిత్రం అన్నారాయన.
చిత్రంలోని ఇతరప్రధానపాత్రలలో..రవిబాబు,రావురమేష్, ఉప్పలపాటినారాయణరావు,అవసరాలశ్రీనివాస్,తాగుబోతు రమేష్, కల్యాణిమాలిక్,పమ్మసాయి,సోహైల్, కె.ఎల్.ప్రసాద్, రోహిణి,మధుబాల,ప్రగతి,ఝాన్సీ,సు దీప,మాధవి,స్నిగ్ధ,అర్చన,అపర్ణ శర్మ నటిస్తున్నారు
.
సంగీతం: కల్యాణి కోడూరి, పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, అనంతశ్రీరాం, గాయనీ గాయకులు: సునీత,హేమచంద్ర,కల్యాణి కోడూరి,స్రవంతి,శ్రీకృష్ణ,కాలభై రవ,కోగంటిదీప్తి, కెమెరా:పి.జి.వింద:ఎడిటింగ్; మార్తాండ్.కె.వెంకటేష్: ఆర్ట్;ఎస్.రవీందర్:నృత్యాలు;నో బుల్,సుచిత్ర,పాపి, కాస్ట్యూమ్ డిజైనర్స్:రాజేష్,భరత్:మేకప్;మో హన్: పబ్లిసిటి డిజైనర్:ఆర్.విద్యాసాగర్: ఫైనాన్స్ కంట్రోలర్: మాకినేని సర్వేశ్వరరావు: ప్రొడక్షన్ కంట్రోలర్:కె.శ్రీనివాసరాజు: ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: ముప్పాల హరికృష్ణ:: ఛీఫ్ కో డైరక్టర్: కొల్లి రాంగోపాల్ చౌదరి:
సహనిర్మాతలు: వివేక్ కూచిభొట్ల, జగన్ మోహన్ రెడ్డి.వి
నిర్మాత: కె.ఎల్.దామోదర్ ప్రసాద్
కధ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి
1 2
Follow Us!