Jul 28 2013
Jul 15 2013
ఉద్వేగభరిత ప్రేమకధాచిత్రం ‘అంతకుముందు ఆ తరువాత’ : త్వరలో విడుదల
ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ ‘శ్రీ రంజిత్ మూవీస్’ రూపొందిస్తున్న యువతరం ప్రేమ కధా చిత్రం ‘అంతకుముందు ఆ తరువాత’. సుమంత్ అశ్విన్,ఈషా జంటగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నిర్మాత కె.ఎల్.దామోదర్ ప్రసాద్. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకుడు. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్నాయని, త్వరలోనే చిత్రం విడుదల తేదీని ప్రకటిస్తామని నిర్మాత కె.ఎల్.దామో దర్ ప్రసాద్ తెలిపారు.
ఈ చిత్రానికి సంగీత దర్శకుడు ‘కల్యాణి కోడూరి’ వీనుల విందైన సంగీతాన్ని సమకూర్చారు.’అలా మొదలైంది’ లానే ఈ చిత్రం ఆడియో కూడా సంగీత ప్రియులను ఆకట్టుకుంది అన్నారు , చిత్ర దర్శక,నిర్మాతలు. సుప్రసిద్ధ గీత రచయితలు సిరివెన్నెల సీతారామశాస్త్రి, అనంతశ్రీరాంలు ఈ గీతాలను రచించారు. తన సంగీత ప్రయాణంలో ఇదో మంచి చిత్రంగా నిలుస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేసారు సంగీత దర్శకుడు కల్యాణి కోడూరి.
‘అంతకుముందు ఆ తరువాత’ ఓ ఉద్వేగభరిత ప్రేమ కధా చిత్రం’ అని దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి తెలిపారు. వాస్తవికత ఉట్టిపడే సన్నివేశాలు, హృదయాన్ని స్పృశించే భావోద్వేగాలు, అనుభవాల సమ్మిళితమే ఈ చిత్రం అన్నారాయన.
చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రలలో..రవిబాబు,రావురమేష్, ఉప్పలపాటి నారాయణరావు,అవసరాల శ్రీనివాస్,తాగుబోతు రమేష్, కల్యాణిమాలిక్, పమ్మి సాయి,సోహైల్,కె.ఎల్.ప్రసా ద్, రోహిణి,మధుబాల,ప్రగతి,ఝాన్సీ,సు దీప,మాధవి,స్నిగ్ధ,అర్చన,అపర్ణ శర్మ నటిస్తున్నారు
.
సంగీతం: కల్యాణి కోడూరి, పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, అనంతశ్రీరాం, గాయనీ గాయకులు: సునీత,హేమచంద్ర,కల్యాణి కోడూరి,స్రవంతి,శ్రీకృష్ణ,కాలభై రవ,కోగంటిదీప్తి, కెమెరా:పి.జి.వింద:ఎడిటింగ్; మార్తాండ్.కె.వెంకటేష్: ఆర్ట్;ఎస్.రవీందర్:నృత్యాలు;నో బుల్,సుచిత్ర,పాపి, కాస్ట్యూమ్ డిజైనర్స్:రాజేష్,భరత్:మేకప్;మో హన్: పబ్లిసిటి డిజైనర్:ఆర్.విద్యాసాగర్: ఫైనాన్స్ కంట్రోలర్: మాకినేని సర్వేశ్వరరావు: ప్రొడక్షన్ కంట్రోలర్:కె.శ్రీనివాసరాజు: ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: ముప్పాల హరికృష్ణ:: ఛీఫ్ కో డైరక్టర్: కొల్లి రాంగోపాల్ చౌదరి:
సహనిర్మాతలు: వివేక్ కూచిభొట్ల, జగన్ మోహన్ రెడ్డి.వి
నిర్మాత: కె.ఎల్.దామోదర్ ప్రసాద్
కధ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి
1 2
Follow Us!