Sep 26 2013
తెలుగు,తమిళ భాషలలో ఏకకాలంలో రూపొందుతున్న’నిఖిల్, స్వాతి’ జంటగా ‘మాగ్నస్ సినీ ప్రైమ్ ‘ చిత్రం. ‘కార్తికేయ’
’మాగ్నస్ సినీ ప్రైమ్’ సంస్థ రూపొందిస్తున్న చిత్రం ‘కార్తికేయ’
యువకదానాయకుడు నిఖిల్ తో తాము నిర్మిస్తున్న ’కార్తికేయ’ చిత్రం తెలుగు, తమిళ భాషలలో ఏక కాలంలొ రూపొందుతోందని నిర్మాత వెంకట శ్రీనివాస్ బొగ్గరం తెలిపారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ చెన్నై పరిసర ప్రాంతాలలో జరుగుతోందని ఆయన అన్నారు. ఏవీయం స్టూడియో లో ఈ షూటింగ్ జరుగుతోంది. ప్రముఖ హీరో జయం రవి, నిర్మాతలు ఎడిటర్ మోహన్, మాదేష్, సుభాష్ చంద్రబోస్ లు విచ్చేశారు. పాండిచ్చేరి, కుంభకోణం తదితర ప్రాంతాలలో చిత్రం షూటింగ్ జరుగుతుందని నిర్మాత తెలిపారు. తొలిచిత్రమే ద్వి భాషా చిత్రంగా రూపొందిచటం ఎంతో ఆనందంగా ఉందని ఆయన అన్నారు. శిరువూరి రాజేష్ వర్మ సమర్పణలో నిర్మాత వెంకట శ్రీనివాస్ బొగ్గరం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా చందు మొండేటి దర్శకునిగా పరిచయం అవుతున్నారు.
కార్తికేయ ద్విభాషా చిత్రంగా రూపొందటం పట్ల తన సంతోషాన్ని వ్యక్తం చేసారు హీరో నిఖిల్.
ధ్రిల్లర్ తో కూడిన వినొదాత్మక చిత్రం గా దీనికి రూపకల్పన చేస్తున్నట్లు చిత్ర దర్శకుడు చందు మొండేటి తెలిపారు. చిత్ర నాయకా,నాయికలు వైద్య విద్యార్ధులుగా కనిపిస్తారీ చిత్రంలో..ఈ ప్రపంచంలో సమాధానం దొరకని ప్రశ్న అంటూ ఉండదు..ఒక వేళ సమాధానం దొరకలేదు అంటే ఆ లోపం ప్రశ్న ది కాదు, ప్రయత్నానిదే అని నమ్మే మనస్తత్వం చిత్ర కధానాయకుడు ‘నిఖిల్’ది .ఈ నేపధ్యంలో అతనికి ఎదురైన సంఘటనలు, సన్నివేశాల సమాహారమే ఈ ‘కార్తికేయ’ చిత్రం.
వచ్చే ఏడాది ప్రారంభంలో విడుదల అయ్యే దిశగా చిత్ర నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయని చిత్ర నిర్మాత తెలిపారు.కధానాయకుడు నిఖిల్ గత చిత్రాలకన్నా అధిక బడ్జెట్ లో రూపొందుతున్న ఈ చిత్రం విజయం పై ఎంతో నమ్మకముందని నిర్మాత తెలిపారు
ఇతర ప్రధాన పాత్రలలో తనికెళ్ళభర ణి, నాజర్, రావు రమేష్,ప్రవీణ్,తులసి,కిషోర్, స్వామిరారా సత్య, జోగినాయుడు,శివన్నారాయణ, మీనాకుమారి,చంద్రశేఖర్ గిరి, కృష్ణంరాజు,వేణుగోపాలరావు, ఐ,కె. త్రినాధ్, అప్పారావు ఐ పేట,లు నటిస్తున్నారు.
ఈ చిత్రానికి కెమేరా: కార్తీక్ ఘట్టమనేని. ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్, సంగీతం: శేఖర్ చంద్ర, పాటలు: కృష్ణ చైతన్య, కొరియో గ్రఫీ : రఘు, ఆర్ట్: సాహి సురేష్, కో డైరెక్టర్ :అను కె రెడ్డి, ఎగ్జిక్యుటివ్ నిర్మాత: గునకల మల్లికార్జున
Follow Us!