YASH CHOPRA NATIONAL MEMORIAL AWARD FOR ASHA BHOSLE

 

tsr
T Subbarami Reddy Foundation Instituted National Yeah Chopra National Memorial  Award 2017 which carries Rs 10.00 lakhs cash with swarna kankanam.
T Subbarami Reddy said that Asha Bhosle is best known as a playback singer in Hindi cinema, has done playback singing for over a thousand Bollywood movies.
 
Asha Bhosle was officially acknowledged by the Guinness Book of World Records as the most recorded artist in music history ,The Government of India honoured her with the Dadasaheb Phalke Award in 2000 and the Padma Vibhushan in 2008.
T Subbarami Reddy held a meeting of Jury Members on January 27th 2018 consisting of T. Subbarami Reddy as the chairman and Boney Kapoor, Madhu Bhandarkar, Honey Irani and Padmini kolhapure as members. Under his chairmanship they had long discussions and declared legandary singer Asha Bhousle to be given this year the Yash Chopra National Memorial Award.
Earlier Shri Lata Mangeshkar, Shri Amitabh Bachchan, Shri Rekha, Shri Shahrukh Khan have received the Yash Chopra National Memorial Award.
He has also decided that the award celebration will be held on February 16th 2018 at mumbai in a glittering function. The Governer of Maharastra C.H. Vidyasagar Rao and Lata Mangeshkar will be honoring her with the award. The entire film fraternity which include Amitabh Bachchan, Shahrukh Khan, Amir Khan, Sridevi, Jayaprada and other dignitaries will participate in the function and will cherish the memories of Yash Chopra.
ప్రముఖ నేపథ్య గాయని శ్రీమతి ఆశాభోస్లేకు 
టి. సుబ్బరామిరెడ్డి ఫౌండేషన్ నేషనల్ యశ్ చోప్రా మెమోరియల్ అవార్డ్
 
భారతీయ కళలను, సంస్కృతిని ప్రోత్సహించే కళాబంధు శ్రీ టి. సుబ్బరామిరెడ్డి జాతీయ స్థాయిలో ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రముఖ దర్శకనిర్మాత యశ్ చోప్రాతో ఆయనది ఎనలేని బంధం. ఆ అనుబంధం తోనే యశ్ చోప్రా తనువు చాలించిన తర్వాత సుబ్బరామిరెడ్డి ఫౌండేషన్ తరఫున 2013 నుండీ నేషనల్ యశ్ చోప్రా మెమోరియల్ అవార్డ్ ను సినీ ప్రముఖులకు అందచేస్తున్నారు. ఈ సారి 2017కి గానూ ఈ అవార్డును ప్రముఖ నేపథ్య గాయని, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, పద్మ విభూషణ్ ఆశాభోస్లేకు అంద చేయబోతున్నారు. శనివారం ముంబైలో సమావేశమైన టి. సుబ్బరామిరెడ్డి ఫౌండేషన్ జ్యూరీ సభ్యులు సర్వశ్రీ బోనీకపూర్, మాధుర్ భండార్కర్, హనీ ఇరానీ, పద్మినీ కొల్హాపురి, సుబ్బరామిరెడ్డి… శ్రీమతి ఆశాభోస్లే పేరును నేషనల్ యశ్ చోప్రా మెమోరియల్ అవార్డుకు ఎంపిక చేశారు.
గతంలో ఈ అవార్డును శ్రీమతి లతా మంగేష్కర్, శ్రీ అమితాబ్ బచ్చన్, శ్రీమతి రేఖ, శ్రీ షారుక్ ఖాన్ అందుకున్నారు. ఎప్పటిలానే ఈ సారి కూడా ఈ అవార్డు ప్రదానోత్సవం ముంబైలో ఫిబ్రవరి 16న ఘనంగా జరుగుబోతోంది. మహారాష్ట్ర గవర్నర్ శ్రీ సిహెచ్. విద్యాసాగర్ రావుతో పాటు లతామంగేష్కర్ చేతుల మీదుగా ‘నేషనల్ యశ్ చోప్రా మెమోరియల్ అవార్డు -2017′ను ఆశాభోస్లే అందుకోబోతున్నారు. ఈ కార్యక్రమంలో అమితాబ్ బచ్చన్, ఆమీర్ ఖాన్, షారుక్ ఖాన్, శ్రీదేవి, జయప్రద తదితరులు పాల్గొనబోతున్నారు. 
1933లో జన్మించిన ఆశాభోస్లే పదేళ్ళ ప్రాయంలోనే నేపథ్య గాయనిగా తన కెరీర్ ను ప్రారంభించారు. గడిచిన 75 సంవత్సరాల్లో వందల చిత్రాలలో వేలాది గీతాలు ఆలపించిన ఆశాభోస్లే రెండు సార్లు ఉత్తమ గాయనిగా జాతీయ అవార్డును అందుకోవడంతో పాటు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోనూ చోటు సంపాదించుకున్నారు. ఆమె కీర్తి కిరీటంలో ‘నేషనల్ యశ్ చోప్రా మెమోరియల్ అవార్డ్’ మరో కలికితురాయిగా నిలువబోతోంది.

Nagachaitanya sithara ents production no: 3

Shooting of Sithara Entertainments, Production No 3 has been started today morning in hyderabad.
The film features Naga Chaitanya & Anu Emmanuel in lead roles, Directed by Maruthi & Produced by Suryadevara Naga Vamsi under Sithara Entertainments.
Artists
  1. 002 003Naga Chaitanya
  2. Anu Emmanuel
  3. Ramya Krishna
  4. Vennela Kishore
  5. Kalyani Natarajan
  6. Sharanya
  7. Prudhvi
  8. Raghubabu
  9. Rahul Ramakrishna
Technicians
 
Editor: Kotagiri Venkateswara Rao
Production Designer: Raveendar
Cinematographer: Nizar Shafi
Music: Gopi Sunder
Producer: Suryadevara Naga Vamsi
Presents: PDV Prasad
Writer & Director: Maruthi

Agnyaathavaasi sankranti greetings posters

Design-50 Design-51 Still-61 Still-62

ఈ నెల 17న టీఎస్సార్ ‘కాకతీయ కళా వైభవ మహోత్సవం’

 2018-01-13-PHOTO-00000012 DSC_2371 DSC_2375ఈ నెల 17న టీఎస్సార్ ’కాకతీయ కళా వైభవ మహోత్సవం’
ఎప్పుడూ కళలను, కళాకారులను గౌరవిస్తూ, ప్రోత్సహించే మంచి మనసున్న మనిషి ’కళాబంధు’ టి. సుబ్బరామిరెడ్డి. టీఎస్సార్ లలిత కళా పరిషత్ ఆధ్వర్యంలో హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, బెంగళూరు, విశాఖపట్టణం నగరాల్లో పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఆయన నిర్వహించారు. ఇప్పుడు కాకతీయుల వైభవాన్ని చాటి చెప్పే విధంగా ‘కాకతీయ కళా వైభవ మహోత్సవం’ నిర్వహించనున్నట్టు తెలిపారు. టీఎస్సార్ కాకతీయ లలిత కళా పరిషత్ ఆధ్వర్యంలో ఈ నెల 17న హైదరాబాద్ లో జరగనున్న ఈ వేడుక వివరాలు తెలియజేయడం కోసం శనివారం పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు.
టి. సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ- “కాకతీయుల పరిపాలన స్వర్ణయుగం. 600 ఏళ్ల క్రితమే తెలుగు సంస్కృతి, నాగరికతలు ఘనంగా చాటారు. కళల్ని పోషించారు. ఎన్నో గొప్ప దేవాలయాలను శిల్పకళా నైపుణ్యం, చాతుర్యంతో నిర్మించారు. శ్రీకృష్ణదేవరాయల కంటే ముందు నుంచి తెలుగుజాతికి వారసత్వాన్ని అందించారు.  వరంగల్ రాజధానిగా 300 ఏళ్లు తెలుగువారిని పరిపాలించారు. వాళ్ల  పేరు మీద ‘కాకతీయ కళా వైభవ మహోత్సవం’ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఈ నెల 17న హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో ఈ వేడుక నిర్వహిస్తాం. మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు చేతుల మీదుగా వేడుక ప్రారంభమవుతుంది. ఈ వేడుకలోనే సుమారు 560 చిత్రాల్లో నటించి, చిత్రపరిశ్రమలో 42 ఏళ్లు పూర్తి చేసుకున్న మోహన్ బాబును ‘విశ్వ నట సార్వభౌమ’ బిరుదుతో సత్కరిస్తున్నాం. పలువురు ఆధ్యాత్మిక, రాజకీయ, సినీ, సాంస్కృతిక  ప్రముఖులు ఈ మహోత్సవానికి హాజరు కానున్నారు. తర్వాత తెలంగాణలోని వరంగల్, ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్, మహబూబ్ నగర్ తదితర ప్రాంతాల్లో రెండు మూడు నెలలకు ఒకసారి కాకతీయ సాంస్కృతిక మహోత్సవాలు నిర్వహిస్తాం” అన్నారు.
మోహన్ బాబు మాట్లాడుతూ- “కళాకారులను, కళలను గౌరవించే వ్యక్తుల్లో టి. సుబ్బరామిరెడ్డిగారు ముందుంటారు.   కాకతీయుల కళా వైభోగాన్ని ప్రజలకు చాటి చెప్పాలనుకోవడం అభినందనీయం. ఇక, నాకు ఇవ్వనున్న ‘విశ్వ నట సార్వభౌమ’ బిరుదు గురించి ముందు చెప్పగానే… ‘బిరుదులు నాకు ఎందుకు?’ అన్నాను. వద్దని విశాఖలో చెప్పాను. మళ్లీ  ఇప్పుడు ఇస్తున్నట్టు చెప్పారు.  దాంతో ఆయన అభీష్టాన్ని కాదనలేకపోయా” అన్నారు.
ఈ కార్యక్రమంలో రచయిత-నటుడు పరుచూరి గోపాలకృష్ణ, ‘లయన్ క్లబ్’ సభ్యులు, ‘కాకతీయ కళా వైభవ మహోత్సవం’ ఉత్సవ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ్ కుమార్, కూచిపూడి నృత్య కళాకారిణిలు పద్మజ, సుజాతలు పాల్గొన్నారు.

Agnyaathavaasi : victory Venkatesh’s Vibrant Cameo

33x25  - NMTG Half page-2 AJ Half page DC Full page FINAL Still001 Still002 Still003