‘Dandupalyam-4′ First Look launched

వెంక‌ట్ మూవీస్ బ్యాన‌ర్‌పై కె.టి.నాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో వెంక‌ట్ నిర్మిస్తున్న చిత్రం `దండుపాళ్యం 4`. ఈ సినిమా షూటింగ్ మార్చి 8న ప్రారంభం కానుంది. ఈ సంద‌ర్భంగా బుధ‌వారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో..
నిర్మాత వెంక‌ట్ మాట్లాడుతూ – “దండుపాళ్యం పార్ట్ 1, పార్ట్‌2ల‌ను తెలుగు ప్ర‌జ‌లు ఆద‌రించారు. వారిచ్చిన స్ఫూర్తితో దండుపాళ్యం 4ను ప్రారంభించాం. దండుపాళ్యంపై క్రేజ్ రోజు రోజుకీ పెరుగుతుంది. ఇప్పుడు దండుపాళ్యం 3కి డైరెక్ట‌ర్ ఎవ‌ర‌నేది తెలియ‌దు. ఆర్టిస్టుల గురించి పెద్ద‌గా తెలియ‌దు. ప్రేక్ష‌కుల ఆశీర్వాదం, నా కృషితో రెండు సినిమాలు ప్ర‌జ‌ల‌కు బాగా రీచ్ అయ్యాయి. ద‌ర్శ‌కుడు కె.టి.నాయ‌క్ మంచి ఇంటెలిజెంట్‌.. హార్డ్‌వ‌ర్క‌ర్‌. ఈయ‌న‌కు క్రైమ్ జోన‌ర్‌లో సినిమాలు చేయాలంటే చాలా ఇష్టం. ఆయ‌న ఎలా దండుపాళ్యం 4 చేయ‌వ‌చ్చో చెప్పిన తీరు నాకు న‌చ్చింది. దండుపాళ్యం, బాహుబ‌లి రెండు సినిమాల రేంజ్ వేరైనా ఈ రెండు సినిమాల సీక్వెల్స్‌కి మంచి క్రేజ్ క్రియేట్ అయ్యాయి. కొంద‌రి వ్య‌క్తిగ‌త అహాల కార‌ణంగా దండుపాళ్యం 2 నేను అనుకున్న‌ట్లుగా రాలేదు. ఆడియెన్స్‌ను ఏమైతే సినిమాలో ఉండాలనుకుని థియేట‌ర్‌కి వ‌చ్చారో అది సినిమాలో లేదు. దాంతో ఓ క‌సితో దండుపాళ్యం 4ను స్టార్ట్ చేశాను. ప‌క్కా స్క్రిప్ట్ వ‌ర్క్‌తో సినిమాను స్టార్ట్ చేస్తున్నాం. మార్చి 8న సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంది. దండుపాళ్యం4 లో రెండు గ్యాంగ్‌లుంటాయి. మొద‌టి మూడు పార్ట్స్‌లో న‌టించిన నటీన‌టుల‌తో పాటు వేరే గ్యాంగ్ కూడా ఇందులో క‌న‌ప‌డుతుంది. దండుపాళ్యం రీసెర్చ్‌లో మాకు దొరికిన స‌మాచారంతో ప‌ది సీక్వెల్స్ తీయ‌వ‌చ్చు. నిజ‌మైన ఘ‌ట‌న‌ను ఆధారంగా చేసుకుని సినిమాను తెర‌కెక్కిస్తున్నాం. ఆస‌క్తిక‌రమైన స్క్రీన్‌ప్లేతో సినిమా సాగుతుంది“ అన్నారు.
ద‌ర్శ‌కుడు కె.టి.నాయ‌క్ మాట్లాడుతూ – “నేను నిజామాబాద్ ఆర్మూర్‌లో పుట్టి పెరిగాను. కానీ త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క‌ల్లో స్థిర‌ప‌డ్డాను. నాకు ఇచ్చిన ప‌నిని 100 శాతం నేర‌వేరుస్తాను. ప్రొడ్యూస‌ర్‌గారికి థాంక్స్‌. ప్రేక్ష‌కుల అంచ‌నాల‌కు ధీటుగా ఈ సీక్వెల్ ఉంటుంది“ అన్నారు.
వోల్గా బాబ్జీ మాట్లాడుతూ “వెంక‌ట్‌గారికి అత‌ని టీంకు అభినంద‌న‌లు“ అన్నారు.
హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ – “నా సినిమాల్లో కూడా మ‌హాత్మ 2. పెళ్లి సంద‌డి 2 వంటి సినిమాలు చేయాల‌ని చాలా మంది అనుకున్నారు కూడా. ఇక దండుపాళ్యంకు ఉన్న క్రేజ్ తెలిసింది. ముందు విడుద‌లైన సినిమాలు ఎంత పెద్ద స‌క్సెస్‌ను సాధించాయో అంద‌రికీ తెలిసిందే. ఇందులో విష‌యాన్ని ఆధారంగా చేసుకుని ఎన్ని పార్టులైనా షూటింగ్ చేయ‌వ‌చ్చు. నిజంగా జ‌రిగిన ఘ‌ట‌న‌ల ఆధారంగా చేసిన సినిమాలు ఇవి. దండుపాళ్యం 4 పెద్ద విజ‌యాన్ని సాధించాలని కోరుకుంటున్నాను“ అన్నారు.
నటీనటులు:మకరంద్ దేశ్ పాండే, పూజాగాంధీ,రవికాలే,పెట్రోల్ ప్రసన్న,ముని,జయదేవ,కరిసుబ్బు,రవిశంకర్, స్నేహ, సంజీవ్, అరుణ్ బచ్చన్, సోము తదితరులు.
ఈ చిత్రాణికి కెమెరా: ఆర్.గిరి, ఆనంద్ రాజా విక్రమ్, ఎడిటర్: బాబు.ఎ.శ్రీవాత్సవ, ప్రీతి మోహన్; నేపధ్య సంగీతం: అర్జున్ జన్య,
నిర్మాత: వెంకట్
దర్శకత్వం: కె.టి. నాయక్

 

‘Dandupalyam-4′ First Look launched 
The First Look of ‘Dandupalyam-4′ was launched on Wednesday by hero Srikanth.Srikanth said, “I am happy for the entire team.  The first two parts were really hard to make.  And we all know what kind of big hits they were in Karnataka.  Many suggest to me that I should do sequels to my hits like ‘Pelli Sandadi’ and ‘Mahatma’.  But it didn’t happen.  In the case of Dandupalyam, not four but much more can be done because of the nature of the subject.  I wish the team all the best.”Producer Venkaat said, “The craze for the brand Dandupalyam has only increased over the years.  The director of the first three parts was someone else.  Even though the audience didn’t know much about the director and the artists, they lapped up the first part in a big way.  Our efforts didn’t go waste.  The brand has stood the test of time.  People remember the first part to this day.  As for ‘Dandupalyam-4′, our director KT Nayak garu is a very intelligent person.  As a technician, he is special.  He is a hard-worker and a lover of the crime genre.  The craze for the second part was more than that for the first part, just as is the case with the ‘Baahubali’ movies.  But in Telugu, the second part couldn’t be as great as the first one.  We are keeping this in mind and are going to work extra hard on the fourth part.  The film will be shot from March 8 onwards.”

The producer added that the element of criminal gangs and police investigations is like an ocean that can be explored repeatedly.  “The story of ‘Dandupalyam-4′ is not entirely imaginary.  The basic story is inspired by real events.  The film tells the story of a new gang and an old gang.  It’s commercial, unlike the first three movies,” he adds.

Director KT Nayak said, “As the producer said, I love the crime genre a lot.  Although people tell me I look very soft, I can make a raw film.  I will do the talking after we shoot the movie.”
DSC_2158 DSC_2168 DSC_2175 DSC_2165 DSC_2162
To be produced on Venkaat Movies, the film will star Makarand Deshpande, Pooja Gandhi, Ravi Kale, Petrol Prasanna, Muni, Jaya Deva, Karisubbu, Ravi Shankar, Sneha, Sanjeev, Arun Bachchan, Somu, etc.

Dandupalyam – 4 posters

01 02 03 04 Verti Final

‘ఛల్ మోహన్ రంగ’ తొలి గీతం విడుదల

“గ ఘ మేఘ .. నింగే మనకు నేడు పాగ” అంటూ మన యువ కథానాయకుడు నితిన్ కథానాయిక మేఘా ఆకాష్ తో కలసి తన ప్రయాణం మొదలు పెట్టాడు.
వీళ్లిద్దరు నటిస్తున్న చిత్రం “ఛల్ మోహన్ రంగ”. కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తుండగా, శ్రీమతి నిఖితా రెడ్డి సమర్పణలో, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్, త్రివిక్రమ్ మరియు శ్రేష్ఠ్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఇంతకు ముందే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్ మరియు టీజరుకు మంచి స్పందన రావడంతో చిత్ర బృందం చాలా ఆనందంగా ఉన్నారు.
మెలోడీల విషయంలో థమన్ ది ప్రత్యేక బాణి. ఆయన స్వరపరచిన ఈ పాట తన ముందు మెలోడీలలాగే ఎంతో వినసొంపుగా ఉంటుంది.
ఎంతో సరదాగా, చలాకీగా సాగిపోయే హీరో, హీరోయిన్ల ప్రయాణం లాగే, కె.కె. సాహిత్యం అందించిన ఈ పాట శ్రోతలను ఆకట్టుకుంటుంది.
యు.ఎసలో గల కీవెస్ట్, ఆమిష్ విలేజ్ లాంటి అందమైన ప్రదేశాలలో ఈ పాటను చిత్రీకరించారు. ఈ చిత్రానికి  ఎన్. నటరాజన్ సుబ్రహ్మణ్యన్ సినీమాటోగ్రఫీ అందిస్తున్నారు. చిత్ర నిర్మాత ఎన్. సుధాకర్ రెడ్డి చిత్రాన్ని ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్టు ప్రకటించారు.
‘నితిన్, మేఘా ఆకాష్’ జంటగా శ్రేష్ట్ మూవీస్, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం. ఇది నితిన్ కు 25 వ చిత్రం కావటం విశేషం. మాటల మాంత్రికుడు ,దర్శకుడు త్రివిక్రమ్ ఈ చిత్రానికి కథను అందిస్తుండగా,శ్రీమతి నిఖితారెడ్డి సమర్పణ లో ప్రముఖ నిర్మాత ఎన్. సుధాకర్ రెడ్డి ఈ చిత్రాన్ని కృష్ణ చైతన్య దర్శకత్వం లో నిర్మిస్తున్నారు.
చిత్రం లోని ఇతర ప్రధాన తారాగణం: డా.కె.వి.నరేష్, లిజి,రోహిణి హట్టంగడి, రావురమేష్,సంజయ్ స్వరూప్, ప్రభాస్ శ్రీను, నర్రాశ్రీను, మధునందన్, ప్రగతి, సత్య, పమ్మి సాయి, రాజశ్రీ నాయర్, ఆశు రెడ్డి, వెన్నెల రామారావు, కిరీటి, రణధీర్, నీలిమ భవాని, బేబి హాసిని, బేబి కృతిక, మాస్టర్ జాయ్, మాస్టర్ లిఖిత్, మాస్టర్ స్నేహిత్, మాస్టర్ స్కందన్.
సంగీతం: థమన్.ఎస్,
కెమెరా: ఎన్.నటరాజ సుబ్రమణియన్,
కూర్పు: ఎస్.ఆర్.శేఖర్,
నృత్యాలు:శేఖర్.వి.జె,
పోరాటాలు: స్టంట్ సిల్వ, రవివర్మ;
సమర్పణ: శ్రీమతి నిఖిత రెడ్డి
నిర్మాత: ఎన్.సుధాకర్ రెడ్డి
స్క్రీన్ ప్లే,మాటలు,దర్శకత్వం: కృష్ణ చైతన్య
SAI_1273 2c78dc67-e219-42ce-a2e0-aed295e2366d 9ebba404-d83d-4771-8178-cbdf1f159729 863270da-fd3b-45c1-b586-74fa8ee6810d
With so much buzz around and heaps of praise for the first look posters and teaser, the makers of “Chal Mohan Ranga” are launching their first single “Ga Gha Megha” on February 24th at 10a.m. While Smt.Nikitha Reddy is presenting the film, Pawan Kalyan Creative Works along with Trivikram have combined with Sreshth Movies to produce Nithiin’s 25 directed by Krishna Chaitanya. Nithiin and Megha Akash are pairing up once again for this beautiful seasonal love story.
S Thaman has his own flavour in every melody he composes, and this number is no exception. This breezy melody is going to be in tune with the film’s theme and gives us a glimpse of what the director Krishna Chaitanya of “Rowdy Fellow” fame has in store for the audience.
The lyrics penned by K.K. are catchy and simple just like the situation which is about the journey of hero and heroine exploring different things on their way back home enjoying each other’s company like no one is seeing.
Rahul Nambiar has pumped up the song even more with his vocals which has been set in US in some of the exotic locations like Seven miles drive, Key West, Amish Village etc. And N Nataraja Subramanian(Natty) of “A Aa” fame has captured every location at its best giving us some breath-taking visuals.
N Sudhacar Reddy who has given us some beautiful love stories like “Ishq”, “Gunde Jaari Gallanthayindhe” and “Chinnadhana Ne Kosam” has produced this film. The film is all set to release on April 5th.
Casting includes: Dr. K.V Naresh, Lissy, Rohini Hattangadi, Rao Ramesh, Sanjay Swaroop, Prabhas Srinu, Narra Srinu, Madhunandan, Pammi Sai, Pragathi, Satya, Ashu Reddy, Kireeti, Vennela Ramarao, Rajasri Nair, Ranadhir, Neelima Bhavani, Master Joy, Master Likith, Baby Krithika, Master Snehith, Master Skandan.

Cinematography: N. Nataraja Subrahmanian
Music: Thaman S.
Editing: S.R. Sekhar
Choreography: Sekhar V.J.
Fights: Stunt Silva, Ravi Verma
Story: Trivikram
Presenter: Smt. Nikitha Reddy
Producer: N. Sudhacar Reddy
Screenplay, Dialogues, Direction: Krishna Chaitanya

 

హీరో శ్రీకాంత్ చిత్రం ‘రా.రా…’ ప్రీ రిలీజ్ వేడుక

 

Natural Star Nani graced Raa Raa Pre-release event

Horror-Comedy entertainer film ‘Raa Raa’ is all set for release on 23rd February. Srikanth, Naziya, Seetha Narayana played the main lead roles. The film is being made under Vizi Charish Vision banner with Sreemithra Chowdary as presenter. Vizi Charish units handled the camera department. The film has completed all formalities and is all set for release on 23rd February.
A Pre-release event was held yesterday and Natural Star Nani and Tharun graced this event as chief guest. Hero Srikanth’s website, mobile App and ‘Raa Raa’ Theatrical Trailer was launched on this occasion.
Speaking on this occasion, Hero Nani said “I respect Hero Srikanth garu, I worked as a Asst.director for his film ‘Radha Gopalam’. I am happy to launch his Website and Mobile App. ‘Raa Raa’ is a Horror comedy film and I wish for grand success. Srikanth is as young as he was at ‘Radha Gopalam’ time. I wish him to do more films and stay young. All the best to whole unit”.
Hero Tharun said “Srikanth, Chowdary and Vijay are close friends to me. This Pre-release function looks like a family function to me. Srikanth did 125 films but he never did a Horror genre film. Now, he is doing this horror flick and I wish for movie success”.
Hero Srikanth said “Raa Raa is my first Horror flick. I liked the subject. Though it is a Horror comedy film, it is a different subject film and we enjoyed doing it. I wish this film will be hit film in my career. Producers Vijay and Chowdary were very supportive. Rap Rock Shakeel composed music for this film and will be doing music for my next film too. I Thank Nani and Tarun for gracing this occasion. Raa Raa film is releasing on 23rd February”.
Producers said “Srikanth and we are friends from 24 years. After a long time, we are doing film together. It is horror comedy film but a new genre film. Story and concept will be very different and fresh. This film is releasing on 23rd February”.
Pratap, Girish Reddy, Subba Rao, Ashok, Sadhanand, Raghu Babu, Kaayum, Bhupal, Hema, Chammak Chandra and others graced this event.
Ali, Raghu Babu, Posani Krishna Murali, Prudhvi, Jeeva, Hema, Shakalaka Shankar, Nalla Venu, Giribabu and others played important roles. Music by Rap Rock Shakeel, Camera by Poorna, Editing by Shankar and Fights by Gilli Shankar.

DSC_9393

DSC_9397 DSC_9400 DSC_9412 DSC_9413హీరో శ్రీకాంత్ , నాజియా హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘రా రా’. . శ్రీమిత్ర చౌదరి సమర్పణలో విజి చెర్రీస్ విజన్స్ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 23న విడుద‌ల‌వుతుంది. ఈ కార్య‌క్ర‌మంలో హీరో శ్రీకాంత్‌, నాని, త‌రుణ్‌, రఘుబాబు, అలీ, హేమ‌, సదానంద్, నిర్మాత అశోక్‌, ప్ర‌తాప్‌, ఖ‌య్యుమ్‌, భూపాల్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

స‌దానంద్ మాట్లాడుతూ – “ఎంటైర్ యూనిట్‌కు ఆల్ ది బెస్ట్‌. సినిమా పెద్ద స‌క్సెస్ సాధించిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు మంచి పేరు తేవాల‌ని కోరుకుంటున్నాను“ అన్నారు.

నాని మాట్లాడుతూ – “నాకు అష్టాచ‌మ్మా నుండి శ్రీకాంత్‌గారితో మంచి ప‌రిచ‌యం ఉంది. న‌టుడిగా ఆయ‌నేంటో అంద‌రికీ తెలుసు. ఇప్పుడు హార‌ర్ మూవీ రా.. రా చేస్తున్నారు. ఈ సినిమా ఆయ‌న‌కు మ‌రో పెద్ద హిట్ చిత్రంగా నిలవాల‌ని కోరుకుంటున్నాను“ అన్నారు.

త‌రుణ్ మాట్లాడుతూ – “శ్రీకాంత్‌గారి 125వ సినిమా ఇది. అంద‌రూ క‌మెడియన్స్ క‌లిసి ఈ సినిమాలో న‌టించారు. సినిమా పెద్ద స‌క్సెస్ సాధించాల‌ని కోరుకుంటున్నాను“ అన్నారు.

అలీ మాట్లాడుతూ – “శ్రీకాంత్ తొలిసారి హార‌ర్ సినిమా చేస్తున్నారు. సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌గారి చంద్ర‌ముఖి సినిమాలో రా..రా… అనే ప‌దం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ నెల 23న సినిమా విడుద‌ల‌వుతుంది“ అన్నారు.

ర‌ఘుబాబు మాట్లాడుతూ – “నిర్మాత విజ‌య్‌తో మంచి అనుబంధం ఉంది. ద‌క్షిణాది ఉన్న సినిమా ప‌రిశ్ర‌మ‌లో తెలుగులోనే ఎక్కువ మంది క‌మెడియ‌న్స్ ఉన్నారు. ప్ర‌తి స‌న్నివేశాన్ని ప్రేక్ష‌కులు ఎంజాయ్ చేస్తారు“ అన్నారు.

నిర్మాత శ్రీమిత్ర చౌద‌రి మాట్లాడుతూ – “శ్రీకాంత్‌గారితో 24 సంవ‌త్స‌రాల అనుబంధం ఉంది. నా స్వంత బ్ర‌ద‌ర్‌లాంటి వ్య‌క్తి. ఈ క‌థ విన్న త‌ర్వాత విజ‌య్ డైరెక్ట్ చేయాల‌ని అనుకున్నాం. శ్రీకాంత్‌గారి వంటి సీనియ‌ర్ హీరో ఇలాంటి సినిమా చేయ‌డం గొప్ప విషయం. సినిమా త‌ప్ప‌కుండా అంద‌రికీ న‌చ్చేలా ఉంటుంది“ అన్నారు.

నిర్మాత విజ‌య్ మాట్లాడుతూ – “శ్రీకాంత్‌గారితో ఉన్న అనుబంధ‌మే ఈ సినిమా చేయ‌డానికి మ‌మ్మ‌ల్ని ముందుకు న‌డిపించింది. సినిమా బాగా వ‌చ్చింది. ఈ నెల 23న సినిమా విడుద‌ల‌వుతుంది. త‌ప్ప‌కుండా ఎంటైర్‌టైనింగ్‌గా ఆక‌ట్టుకుంటుంది“ అన్నారు.

సంగీత ద‌ర్శ‌కుడు ష‌కీల్ మాట్లాడుతూ – “నాపై న‌మ్మ‌కంతో నాకు సినిమాకు సంగీతం అందించే అవకాశం ఇచ్చిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు, హీరో శ్రీకాంత్ అన్న‌య్య‌కు థాంక్స్‌“ అన్నారు.

శ్రీకాంత్ మాట్లాడుతూ – “నాని, త‌రుణ్‌ల‌కు నా స్పెష‌ల్ థాంక్స్‌. మ‌మ్మ‌ల్ని స‌పోర్ట్ చేయ‌డానికి ఇక్క‌డ‌కు వ‌చ్చిన అంద‌రికీ థాంక్స్‌.  ఇది హాస్యం తో కూడిన  హర్రర్ ధ్రిల్లర్ చిత్రం.  మనుషులకు, దెయ్యాలకు మధ్య సాగే సరదా ఆటలు సగ టు సినిమా ప్రేక్షకుడిని వినోదాల తీరంలో విహరింప చేస్తాయి. హర్రర్ కామెడీ ధ్రిల్లర్ చిత్రం నేను తొలిసారి చేస్తున్నాను. ‘రా..రా ‘చిత్రం ప్రేక్షకుల ఆదరణకు నోచుకుంటుదని ఆశిస్తున్నాను అన్నారు. హార‌ర్ జోన‌ర్‌లో నేను చేసిన తొలి సినిమా. హార‌ర్ సినిమాలు చాలానే ఉన్నా.. ఈ సబ్జెక్ట్ కొత్త‌గా ఉంటుంది. ఈ 23న విడుద‌ల‌వుతున్న ఈ సినిమా నాకు మంచి స‌క్సెస్ అవుతుందనే న‌మ్మ‌కం ఉంది. నిర్మాత‌లు విజ‌య్‌, శ్రీమిత్ర చౌద‌రిల‌కు థాంక్స్‌“ అన్నారు.

మా హీరో, మిత్రుడు  శ్రీకాంత్ తో రూపొందిస్తున్న ‘రా..రా’  చిత్రం విడుదలకు సిద్ధమైంది.  అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం ఆకట్టుకుంటుందని, ఈ నెల 23  న చిత్రంను  విడుదల  చేస్తున్నట్లు నిర్మాత విజయ్ తెలిపారు.

శ్రీకాంత్ హీరోగా, నాజియా కథానాయికగా ‘విజి చరిష్ విజన్స్’  పతాకంపై నిర్మితమవుతున్న ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రలలో గిరిబాబు,సీత,నారాయణ,ఆలీ,రఘుబాబు,పోసానికృష్ణమురళి, పృథ్వి, జీవ, చంద్రకాంత్, అదుర్స్ రఘు,హేమ, షకలక శంకర్, నల్లవేణు తదితరులు నటిస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం: రాప్ రాక్  షకీల్, ఫోటోగ్రఫి: పూర్ణ, పోరాటాలు: గిల్లె శేఖర్, ఎడిటర్: శంకర్, సమర్పణ: శ్రీమిత్ర చౌదరి  నిర్మాత: విజయ్:

దర్శకత్వం: విజి చరిష్ యూనిట్

 

లెజండ‌రి సింగ‌ర్ ఆశాభోస్లేకి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన య‌శ్ చోప్రా 5వ జాతీయ అవార్డు ప్ర‌దానం..!

లెజండ‌రి సింగ‌ర్ ఆశాభోస్లేకి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన య‌శ్ చోప్రా మెమురియ‌ల్ జాతీయ అవార్డు 2018ని టి.సుబ్బిరామిరెడ్డి ఫౌండేష‌న్  ఫిబ్ర‌వ‌రి 16న ముంబాయిలోని ఓ ప్ర‌ముఖ హోట‌ల్ లో ప్ర‌దానం చేసారు. ఈ కార్య‌క్ర‌మంలో టి.సుబ్బిరామిరెడ్డి, మ‌హారాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ విద్యాసాగ‌ర్ రావు, బాలీవుడ్ న‌టి రేఖ త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా రేఖ ఆశా భోస్లేకి త‌మ అభినంద‌న‌లు తెలియ‌చేస్తూ…పాదాభివంన‌దం చేసి త‌న అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి ప‌మ్ చోప్రా, అల్క య‌గ్నిక్, జాకీ షాఫ్ర్, ప‌రిణితి చోప్రా, పూన‌మ్ దిలాన్, జ‌య‌ప్ర‌ద త‌దిత‌ర బాలీవుడ్ సినీ ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు.
ఈ అవార్డ్ ను గ‌తంలో ల‌తా మంగేష్క‌ర్, అమితాబ్ బ‌చ్చ‌న్, రేఖ‌, షారుఖ్ ఖాన్ అందుకున్నారు. 84 సంవ‌త్స‌రాల ఆశా భోస్లే సుదీర్ఘ సినీ సంగీత ప్ర‌స్ధానంలో 7 ద‌శాబ్ధాలుగా 11వేల పాట‌ల‌ పాడారు. ఇప్ప‌టి వ‌ర‌కు 20 భాష‌ల్లో పాట‌లు పాడి ప్రేక్ష‌క హృద‌యాల్లో సుస్ధిర స్ధానం సంపాదించుకున్నారామె.
ఈ అవార్డ్ జ్యూరీలో యశ్ చోప్రా స‌తీమ‌ణి ప‌మేలా చోప్రా, బోనీక‌పూర్, మ‌ధుర్ భాండార్క‌ర్, సింగ‌ర్ అల్కా య‌గ్నిక్, న‌టుడు ప‌ద్మిని కోహ్ల‌పూర్, స్ర్కిప్ట్ రైట‌ర్ హ‌నీ ఇరానీ, అను, శ‌శి రంజ‌న్ స‌భ్యులుగా ఉన్నారు. 2012లో చ‌నిపోయిన య‌శ్ చోప్రా జ్ఞాప‌కార్ధం టి.సుబ్బిరామిరెడ్డి అను రంజ‌న్, శ‌శి రంజ‌న్ క‌ల‌సి ఈ అవార్డును నెల‌కొల్పారు. ఈ అవార్డ్ తో పాటు 10 ల‌క్ష‌లు న‌గ‌దును కూడా అంద‌చేసారు.
 2 3 6 DSC_2165 DSC_2284 DSC_2287 DSC_2296 DSC_2310 DSC_2324 DSC_2334 DSC_2355 IMG_6156 IMG_6204 IMG_6354 IMG_6414 IMG_6552 IMG_6561 IMG_6574 IMG_6582 IMG_6586 IMG_6669 1 4 5 7 8 9 10 12
Legendary playback singer Asha Bhosle was presented with the 5th Yash Chopra Memorial national Award 2018 by T Subbarami Reddy foundation on 16 February at a star hotel in Mumbai. The fifth recipient of the award, the singer was felicitated by TSR, Hon’ble Governor of Maharashtra Shr. Vidya Sagar Rao, Rekha etc.  Rekha kissed Asha and even touched the latter’s feet. Also present at the event were Pam Chopra, Alka Yagnik, Jackie Shroff, Parineeti Chopra, Poonam Dhillon and Jaya Prada and other bollywood celebrities.
Previous recipients of the award are Lata Mangeshkar, Amitabh Bachchan, Rekha, and Shah Rukh Khan.

Yash Chopra’s wife Pamela Chopra, filmmakers Boney Kapoor, Madhur Bhandarkar, singer Alka Yagnik, actor Padmini Kohlapure, scriptwriter Honey Irani, and Anu and Shashi Ranjan were part of the award jury panel.

Bhosle, 84, whose illustrious music career spans nearly seven decades and recorded over 11,000 songs in 20 different languages, was selected for the award instituted in the memory of the filmmaker.

The award has been instituted by MP Dr.T Subbarami Reddy in the memory of Chopra, who died in 2012, in association with Anu Ranjan and Shashi Ranjan. The award also carries a cash prize of Rs 10 lakh.