Dec
31
2018
ఓం శ్రీ చక్ర క్రియేషన్స్ బ్యానర్ ప్రొడక్షన్ నెం.1గా రూపొందుతోన్న చిత్రం `4 లెటర్స్`.
‘కుర్రాళ్ళకి అర్ధమవుతుందిలే’ అన్నది ఉప శీర్షిక
ఈశ్వర్, టువ చక్రవర్తి, అంకిత మహారాణా హీరో హీరోయిన్లుగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని ఆర్.రఘురాజ్ దర్శకత్వంలో దొమ్మరాజు హేమలత, దొమ్మరాజు ఉదయ్‌కుమార్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది.
ఈ సందర్భంగా…నిర్మాతలు దొమ్మరాజు హేమలత, దొమ్మరాజు ఉదయ్‌కుమార్ మాట్లాడుతూ – “మా బ్యానర్‌లో నిర్మిస్తోన్న తొలి చిత్రం `4 లెటర్స్`. ఈ చిత్రం ద్వారా ఈశ్వర్‌ను హీరోగా పరిచయం చేయడం ఆనందంగా ఉంది. చాలా చక్కగా నటించాడు. సత్యానంద్‌గారి వద్ద శిక్షణ తీసుకున్న ఈశ్వర్.. ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశారు. రేపు థియేటర్‌లో సినిమా చూస్తే కొత్త హీరోలా కాకుండా అనుభవమున్న హీరో సినిమా చేసినట్లుగా నటించారు. అలాగే `కలుసుకోవాలని` వంటి బ్యూటీఫుల్, క్యూట్ లవ్ స్టోరీని తెరకెక్కించి అందరి మన్ననలు పొందిన దర్శకుడు రఘురాజ్‌గారు మా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కన్నడ, తెలుగు చిత్రాలకు దర్శకత్వం వహిస్తూ బిజీగా మారిన ఆయన చాలా గ్యాప్ తర్వాత తెలుగులో చేస్తున్న చిత్రమిది. అన్ని అంశాలతో.. కమర్షియల్ హంగులతో యూత్ సహా అన్నీ వర్గాలను ఆకట్టుకునే ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందించాం. చిత్రీకరణంతా పూర్తి చేశాం.సీనియర్ ప్రొడక్షన్ కంట్రోలర్ సి.భాస్కర రాజు గారి సహకారం ఈ చిత్ర నిర్మాణంలో మరువలేనిది. ఆయనకు కృతఙ్ఞతలు. త్వరలోనే పాటలు, సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం“ అన్నారు.
దర్శకుడు ఆర్.రఘురాజ్ మాట్లాడుతూ “`కలుసుకోవాలని` తర్వాత కన్నడ, తమిళ సినిమాలతో బిజీగా మారిపోయాను. చాలా గ్యాప్ తర్వాత తెలుగులో నేను డైరెక్ట్ చేసిన మూవీ. నేటి ట్రెండ్‌కు తగ్గట్లు సినిమాను తెరకెక్కించాను. ఒక రకంగా చెప్పాలంటే `4 లెటర్స్`: నేటితరం ప్రేమకథాచిత్రం. అందుకే ‘కుర్రాళ్ళకి అర్ధమవుతుందిలే’ అన్నది ఉప శీర్షిక గా పెట్టాము. ప్రేమ,పెళ్లి విషయాలలో నేటితరం యువత ఆలోచనలు,అభిప్రాయాలు,వాస్తవాలు ఏమిటన్నది విషయాలను వాస్తవానికి దగ్గరగా ఉండేలా చిత్రీకరించటం జరిగింది. చిత్ర కధ,కధనాలు,సంభాషణలు అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా సాగటం తో పాటు,ఆలోచన రేకెత్తించేలా ఉంటాయి అన్నారు. హీరో ఈశ్వర్ చక్కగా నటించాడు. తనకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. హీరోయిన్స్ టువ చక్రవర్తి, అంకిత మహారాణాలు చక్కగా నటించారు. హైదరాబాద్‌లో టాకీ పార్ట్‌ను, బ్యాంకాక్‌లో సాంగ్స్‌ను చిత్రీకరించాం. నిర్మాతలు మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సపోర్ట్ చేయడంతో సినిమాను అనుకున్న ప్రణాళిక ప్రకారం పూర్తి చేశాం“ అన్నారు.
నటీనటులు:
ఈశ్వర్, టువచక్రవర్తి, అంకిత మహారాణా హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రంలో కౌసల్య, అన్నపూర్ణ, సుధ, సత్యకృష్ణ, విద్యుల్లేఖా రామన్, సురేష్, పోసాని కృష్ణమురళి, కృష్ణభగవాన్, గౌతంరాజు, అనంత్, వేణు, ధనరాజ్, తడివేల్, విట్టా మహేశ్ ఇతర తారాగణంగా నటించారు.
సాంకేతిక నిపుణులు:
కో డైరెక్టర్: రాజశేఖర్ మారి శెట్టి, ప్రొడక్షన్ కంట్రోలర్: సి.భాస్కర్ రాజు, పాటలు: సురేశ్ ఉపాధ్యాయ, కొరియోగ్రఫీ: గణేష్, స్టిల్స్: అన్బు, డిజైన్స్: ఈశ్వర్, ఆర్ట్: వర్మ, మ్యూజిక్: భీమ్స్ సిసిరోలియో, సినిమాటోగ్రఫీ: చిట్టిబాబు.కె,
నిర్మాతలు: దొమ్మరాజు హేమలత, దొమ్మరాజు ఉదయ్‌కుమార్,
కథ, మాటలు, ఎడిటింగ్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఆర్.రఘురాజ్.
Up until now, you knew very little about the upcoming movie “4 letters” by Om Sri Chakra Creations, but the only thing you really need to know is that it’s the next movie from Kalusukovalani writer and director, R. Raghuraj. R. Raghuraj is the man behind the story, screenplay, dialogue and editing of the movie “4 letters”. The movie has been structured to grasp the attention of teenagers and grownups alike by Introducing Eswar, Tuya Chakraborthy and Anketa Maharana as the lead in this movie. These newcomers were given extensive training for 60 days to play their respective roles. The actors might seem new but their performances are going to take your breath away. Raghuraj took a break from the Telugu film industry until now. Meanwhile Raghuraj has directed 10 successful films in Kannada and Tamil. With his form intact Raghuraj has decided to give his major comeback with this movie and the highlights are the editing and screenplay of the movie. The director of photography is K. Chittibabu who is known for the movies, Bheemili Kabaddi Jattu and SMS. Although he was given the challenge of working with new artists, he has provided stunning, lustful and breathtaking visuals to capture the audience with this romantic movie. The movie is filled with active romance and twisted humor. But wait. That’s not all! Remember diyo diyo song by Bheems Ceciroleo from Garuda Vega? Well, Bheems has done far better than his previous best with his new movie “4 letters”. The beats have been fine tuned to keep the youth on their feet with their dance moves flowing. Bheems has composed all 4 songs for the movie and each of them being unique in their own way. Simply put, Bheems Ceciroleo has outdone himself and this will be his platform to reach a bigger form of greatness. Raghuraj added that all this wouldn’t have been possible without the liberty and complete support of the producers. The producers upheld their promises by providing maximum comfort for the director and his team which helped the creators produce such a marvelous movie. The movie is to be released 75 days from the first day of shooting.
INTRODUCING – ESWAR
INTRODUCING – TUYA CHAKRABORTHY & ANKETA MAHARANA
KAUSALYA, ANNAPURNA, SUDHA, SATYA KRISHNAN, VIDYU LEKHA RAMAN
SURESH, POSANI KRISHNA MURALI, KRISHNA BHAGAVAN, GOWTHAM RAJU, ANANTH VENU, DHANRAJ, TADIVEL, VITTA MAHES
CO-DIRECTOR RAJASEKHAR MAARISETTY
PRODUCTION CONTROLLER: C. BHASKAR RAJU
LYRICS – SURESH UPADHYAYA
CHOREOGRAPHY – GANESH
STILLS – ANBU
DESIGNS ESHWAR
ART – VARMA
MUSIC- BHEEMS CICEROLEO
DIRECTOR OF PHOTOGRAPHY – CHITTI BABU. K
PRODUCERS – DOMMARAJU HEMALATHA ,DOMMARAJU UDAYA KUMAR
STORY, SCREENPLAY, DIALOGUES, EDITING, DIRECTION – R. RAGHURAJ
By venupro •
4 LETTERS •
Follow Us!