అనుష్క‌, మాధ‌వ‌న్, కిల్ బిల్ ఫేమ్ మైఖేల్ మ్యాడ‌స‌న్ న‌టిస్తోన్న ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ” సైలెన్స్” షూటింగ్ ఏప్రిల్ లో ప్రారంభం..!

ead7f8d6-12be-46f4-bf08-92e0ac9884d7 73938d82-0937-4aa6-882f-66faada4ad0f 9442bcad-df2d-4cae-ab6a-fd57849d0ce1 c17c53a3-9636-46e7-a472-390460b280d0

అనుష్క‌, మాధ‌వ‌న్, కిల్ బిల్ ఫేమ్ మైఖేల్ మ్యాడ‌స‌న్ న‌టిస్తోన్న ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్  ” సైలెన్స్”  షూటింగ్ ఏప్రిల్ లో ప్రారంభం..!
అనుష్క‌, మాధ‌వ‌న్ కాంబినేష‌న్ లో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందుతోన్న ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్  ” సైలెన్స్”. దాదాపు 100కి పైగా సినిమాల్లో న‌టించిన కిల్ బిల్ ఫేమ్ మైఖేల్ మ్యాడ‌స‌న్ తొలిసారి ఈ ఇండియ‌న్ మూవీలో న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ్, హిందీ భాష‌ల్లో నిర్మిస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, కోన ఫిలిం కార్పోరేష‌న్ సంస్థ‌తో క‌లిసి.. టాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ న‌టీన‌టుల‌తో ఈ సినిమాని నిర్మిస్తోంది.
క్వింటిన్ టార‌న‌టినోస్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన‌ సినిమాలు కిల్ బిల్, హేట్ ఫుల్ ఎయిట్ మ‌రియు రిస‌ర్వోయ‌ర్ డాగ్స్ చిత్రాల్లో న‌టించిన హాలీవుడ్ స్టార్ మైఖేల్ మ్యాడ‌స‌న్, బాహుబ‌లి ఫేమ్ సౌతిండియా లేడీ సూప‌ర్ స్టార్ అనుష్క‌, పాన్ ఇండియా స్టార్ ఆర్.మాధ‌వ‌న్, సుబ్బ‌రాజు, అంజ‌లి, షాలిని పాండే, అవ‌స‌రాల శ్రీనివాస్ త‌దిత‌రులు ఈ చిత్రంలో న‌టిస్తున్నారు.
పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ సిఈవో విశ్వప్ర‌సాద్ మాట్లాడుతూ….ఈ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్ష‌కులంద‌ర్నీ త‌ప్ప‌కుండా ఎంట‌ర్ టైన్ చేస్తుంది. అలాగే ఓ వినూత్న‌మైన సినిమా చూసామ‌నే ఫీలింగ్ క‌లిగిస్తుంది. ధియేట‌ర్ లో సినిమా పూర్తైన త‌ర్వాత స్టాండింగ్ వోవేష‌న్ ఇస్తార‌ని..అలాగే బాక్సాఫీస్ వ‌ద్ద మంచి క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేస్తుంద‌ని ఆశిస్తున్నాం. ఈ చిత్రానికి హేమంత్ మ‌ధుక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. యు.ఎస్.ఎ లోని సీయోట‌ల్ లో ఏప్రిల్ నుంచి జూన్ వ‌ర‌కు షూటింగ్ చేయ‌నున్నాం. ఇంట‌ర్నేష‌న‌ల్ స్టాండ‌ర్డ్స్ తో టాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ న‌టీన‌టుల‌తో ఈ సినిమాని రూపొందిస్తున్నాం. ఈ మూవీ టీజ‌ర్ ను మేలో గ్రాండ్ గా యు.ఎస్. ఎ లో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం అని తెలియ‌చేసారు.
ఈ చిత్రానికి డివోపి – షానియ‌ల్ కుమార్ డియో, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ – నాథ‌న్ బేక్స్, మ్యూజిక్ – గోపీ సుంద‌ర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ – మైఖేల్ మ్యాడ‌స‌న్, దేవ్ పిన్న్, లైన్ ప్రొడ్యూస‌ర్ – ప‌త్స నాగ‌రాజ్, దుజాత ప్ర‌భు, కాస్టింగ్ డైరెక్ట‌ర్ – రేనీ గార్సియ‌, ఎంట‌ర్ టైన్మెంట్ అట‌ర్నీ – బ్రాండ‌న్ బ్లేక్, లోకేష‌న్ స‌ర్వీస‌స్ – నికోలే మిల్ స్టీడ్, ఎస్ఎజి కన్సుల్ టెంట్ – పాల్ రాయ్, కో – ప్రొడ్యూస‌ర్ – వివేక్ కూచిభొట్ల
 పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ…
పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ సీయోటెల్ హెడ్ క్వార్ట‌ర్స్ గా స్ధాపించిన ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌. ప్రీ ప్రొడ‌క్ష‌న్, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్, కో – ప్రొడ‌క్ష‌న్, ఈవెంట్స్ లో స్పెష‌లైజేష‌న్ తో ముందుకు దూసుకెళుతుంది. అంత‌ర్జాతీయ స్ధాయి క‌లిగిన ఫ్రొఫెష‌న‌ల్ టీమ్ తో ప్రపంచ వ్యాప్తంగా ఉనికి క‌లిగి ఉంది. ఈ సంస్థ టాలీవుడ్, కోలీవుడ్,శాండిల్ వుడ్,బాలీవుడ్ మ‌రియు హాలీవుడ్  ఇండ‌స్ట్రీల‌లో సినిమాలు నిర్మిస్తోంది.
 

Most awaited International film Silence casting Kill Bill Actor Michael Madsen, Anushka Shetty and R Madhavan to begin next month.

 

Seattle, WA, March 12, 2019 – It’s Official now, Kill Bill Actor Michael Madsen is joining Anushka Shetty & R Madhavan for the International film “Silence”. Silence will be shot in Telugu, Tamil and English simultaneously.

 

Seattle based People Media Factory is Producing an International Film ” Silence” with stars from Hollywood, Bollywood and Tollywood in association with Kona Film Corporation. It’s stellar cast includes Hollywood star Micheal Madsen who played key roles in Quentin Tarantino’s movies kill Bill, Hate full Eight and Reservoir Dogs. Micheal Madsen appeared in more than 100 Hollywood movies and for the first time he is doing an Indian International film.Bahubali Fame, South Indian Female super star Anushka Shetty, Pan India star R Madhavan, Subbaraju, Anjali, Shalini Pandey, Avasarala Srinivas and others.

 

Speaking on the occasion People Media Factory, CEO Vishwa Prasad said “This is a kind of film that will entertain, engage and cheer the audience across continents. Every screening of the film to a global audience will end up in a standing ovation and we expect the film to perform well all over.”

 

The Film which will be directed by Hemanth Madhukar will be shot in and around Seattle, USA during April – June 2019, at Global standards with International crew. The makers, People Media Factory will host ” Silence” grand teaser release event in May 2019 in USA.

 

 

DOP:  Shaneil Kumar Deo, Production Designer:  Nathan Bakes, Music:  Gopi Sundar.  Executive Producers: Micheal Madsen, Dev Pinn. Line Producers:  Pasta Nagaraj, Dujatha Prabhu. Casting Director:  Renee Garcia, Entertainment Attorney:  Brandon Blake. Location Services: Nicole Milstead. SAG Consultant:  Paula Ray. Co-Producer: Vivek Kuchibhotla.

 

About People Media Factory:

 People Media Factory is a Seattle based Production Company specialized in pre-production, post production, co-production, and events. People Media Factory has a global presence with a world class team which has mix and match of top-notch professionals across the world. People Media Factory is producing continuous films in Tollywood, Sandalwood, Kollywood, Bollywood and Hollywood.

ప్రముఖ నటి బి.సరోజాదేవి కి టి.సుబ్బరామిరెడ్డి లలిత కళాపరిషత్‌ ‘విశ్వనట సామ్రాజ్ఞి’ బిరుదు ప్రదానం


BVN_6147 BVN_6193 BVN_6275 (1) BVN_6275 BVN_6294 BVN_6323 BVN_6329 BVN_6467 BVN_6516 (1) BVN_6647 BVN_6655 BVN_6666 BVN_6688 BVN_6698 BVN_6700 BVN_6701

‘‘నేనెక్కడ కనిపించినా తెలుగు ప్రేక్షకులు ‘చిటపట చినుకులు పడుతూ ఉంటే…’ 

పాటని గుర్తు చేస్తుంటారు. ‘కృష్ణార్జునయుద్ధం’లో నేను ఎన్టీఆర్‌ని చిన్నన్నయ్యా అంటుంటాను. ఆ సంభాషణని గుర్తు చేసి ఒకసారి చెప్పండని అడుగుతుంటారు. మరోసారి ఈ వేదికపై ఆ విషయాన్ని గుర్తు చేసుకోవడం ఆనందంగా ఉంద’’న్నారు ప్రముఖ నటి బి.సరోజాదేవి. ఆమెకి టి.సుబ్బరామిరెడ్డి లలిత కళాపరిషత్‌ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి విశాఖపట్నంలో ‘విశ్వనట సామ్రాజ్ఞి’ బిరుదుని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘‘టి.సుబ్బరామిరెడ్డికి కళలన్నా, కళాకారులన్నా ఎంతో గౌరవం. శివరాత్రి రోజున ఈ పురస్కారం అందుకోవడం ఆనందంగా ఉంద’’న్నారు.‘‘ఆ రోజుల్లో హీరోల్ని మించి పారితోషికం అందుకొన్న కథానాయిక బి.సరోజాదేవి. ఆమెకి తెలుగు ప్రజల తరఫున ప్రదానం చేసిన బిరుదు… ‘విశ్వనట సామ్రాజ్ఞి’’ అన్నారు టి.సుబ్బరామిరెడ్డి. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, ద్రోణంరాజు శ్రీనివాస్‌, పడాల అరుణ, నటుడు, ఎంపీ మురళీమోహన్‌ నటీమణులు జమున, వాణిశ్రీ, గీతాంజలి, గాయని పి.సుశీల తదితరులు పాల్గొన్నారు.  

  శివనామ స్మరణతో సోమవారం విశాఖ సాగరతీరం మార్మోగింది. సుబ్బరామిరెడ్డి లలిత కళాపరిషత్‌ ఆధ్వర్యంలో ఏటా సాగరతీరంలో నిర్వహించే మహా కుంభాభిషేకం ఈ ఏడాది కూడా ఘనంగా నిర్వహించారు. విశాఖ జిల్లా నుంచే కాకుండా పొరుగు జిల్లాల నుంచి కూడా పెద్దఎత్తున భక్తులు సాగరతీరానికి తరలివచ్చారు. దీంతో తీరం వెంబడి భక్తుల శివనామ స్మరణతో మార్మోగింది. కోటి లింగాలకు కుంభాభిషేకం, యాగం నిర్వహించడానికి ప్రత్యేకంగా యాగశాలను నిర్మించారు. స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి కోటి లింగాలకు ప్రత్యేకంగా పూజలు నిర్వహించి ఈ కార్యక్రమం ప్రారంభించారు. ప్రధమ పూజను డాక్టర్‌ టి.సుబ్బరామిరెడ్డి నిర్వహించగా అక్కడి నుంచి మంత్రి గంటా, ముక్కాముల స్వామీ, సినీ ప్రముఖులు జమున, వాణిశ్రీ, గీతాంజలి, మురళీ మోహన్‌ తదితరులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు సెలబ్రిటీలు మాట్లాడుతూ శివ భక్తుడైన డాక్టర్‌ సుబ్బరామిరెడ్డి లోక కళ్యాణార్ధం ప్రతీఏటా బీచ్‌ వద్ద కోటి లింగాలను ఏర్పాటుచేసి పూజలు నిర్వహించడం దీనికి వేలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశాన్ని కల్పించడం అభినందనీయమన్నారు. వేలాదిమంది భక్తులు తరలి వచ్చినా ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేని విధంగా నగర పోలీసులు ఏర్పాట్లు చేయడం శుభపరిణామన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి ద్రోణంరాజు శ్రీనివాస్‌, పీసీసీ మహిళా అధ్యక్షురాలు పేడాడ రమణకుమారి, నగర కాంగ్రెస్‌ అధ్యక్షుడు బెహరా భాస్కరరావు, పెద్దఎత్తున పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు. పరమేశ్వరుని దర్శించుకునేందుకు వీలుగా తెల్లవారుజామున 5.30 గంటల నుంచీ వీలు కల్పించినట్టు డాక్టర్‌ సుబ్బరామిరెడ్డి తెలిపారు. పూజా కార్యక్రమాలు అనంతరం భక్తులు సముద్ర స్నానాలు ఆచరించారు. 

చిటపట చినుకులు… గుర్తుచేస్తుంటారు

‘‘నేనెక్కడ కనిపించినా తెలుగు ప్రేక్షకులు ‘చిటపట చినుకులు పడుతూ ఉంటే…’ పాటని గుర్తు చేస్తుంటారు. ‘కృష్ణార్జునయుద్ధం’లో నేను ఎన్టీఆర్‌ని చిన్నన్నయ్యా అంటుంటాను. ఆ సంభాషణని గుర్తు చేసి ఒకసారి చెప్పండని అడుగుతుంటారు. మరోసారి ఈ వేదికపై ఆ విషయాన్ని గుర్తు చేసుకోవడం ఆనందంగా ఉంద’’న్నారు ప్రముఖ నటి బి.సరోజాదేవి. ఆమెకి టి.సుబ్బరామిరెడ్డి లలిత కళాపరిషత్‌ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి విశాఖపట్నంలో ‘విశ్వనట సామ్రాజ్ఞి’ బిరుదుని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘‘టి.సుబ్బరామిరెడ్డికి కళలన్నా, కళాకారులన్నా ఎంతో గౌరవం. శివరాత్రి రోజున ఈ పురస్కారం అందుకోవడం ఆనందంగా ఉంద’’న్నారు.‘‘ఆ రోజుల్లో హీరోల్ని మించి పారితోషికం అందుకొన్న కథానాయిక బి.సరోజాదేవి. ఆమెకి తెలుగు ప్రజల తరఫున ప్రదానం చేసిన బిరుదు… ‘విశ్వనట సామ్రాజ్ఞి’’ అన్నారు టి.సుబ్బరామిరెడ్డి. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, ద్రోణంరాజు శ్రీనివాస్‌, పడాల అరుణ, నటుడు, ఎంపీ మురళీమోహన్‌ నటీమణులు జమున, వాణిశ్రీ, గీతాంజలి, గాయని పి.సుశీల తదితరులు పాల్గొన్నారు.

4tollywood-7a

నాగసౌర్య,మాళవిక నాయర్ జంటగా శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ,దాసరి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం

విజయవంతమైన చిత్రాలలోని నాయకా,నాయికలు అలాగే దర్శకులు…వీరి కాంబినేషన్ ను రిపీట్ చేస్తూ రూపొందే చిత్రాలపై ఇటు ప్రేక్షక వర్గాలలోనూ, అటు సినీ వ్యాపార వర్గాలలోనూ ఆసక్తి రేకెత్తుతుంది.

ప్రస్తుతం అలా ఆసక్తిని కలిగించే చిత్రం ఒకటి త్వరలో ప్రారంభం కాబోతోంది.దీనిని,  ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మరో నూతన చలన చిత్ర నిర్మాణ సంస్థ ‘దాసరి ప్రొడక్షన్స్’ తో కలసి నిర్మించబోతోంది.
వివరాల్లోకి వెళితే…
ఆమధ్య యువ కథానాయకుడు నాగసౌర్య ,మాళవిక నాయర్ జంటగా రూపొందిన ‘కళ్యాణ వైభోగమే’ చిత్రం ఎంతటి విజయం సాధించిందో ప్రేక్షకులకు విదితమే. అలాగే ‘నాగసౌర్య, దర్శకుడు అవసరాల శ్రీనివాస్ ల కాంబినేషన్ లో రూపొందిన ఊహలు గుస గుస లాడే, జో అచ్యుతానంద చిత్రాల విజయాలు తెలిసిందే.
ఇప్పుడు వీరి కాంబినేషన్లో అంటే.. కథానాయకుడిగా నాగసౌర్య, ఆయనకు జోడీగా మాళవిక నాయర్, దర్శకునిగా అవసరాల శ్రీనివాస్ లను టీమ్ గా చేసుకుని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. ఇలాంటి విజయ వంతమైన చిత్రాల నాయక,నాయికలు, దర్శకుడు, ప్రతిభ కలిగినవారితో ఈ చిత్రాన్ని నిర్మించటం ఎంతో ఆనందంగా ఉంది. మార్చి రెండవ వారంలో చిత్రం షూటింగ్ ప్రారంభమవుతుంది. చిత్రంలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు కొద్ది రోజులలోనే ప్రకటిస్తామని ఈ చిత్ర నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, దాసరి పద్మజ, సహ నిర్మాత వివేక్ కూచి భొట్ల తెలిపారు.
Naga Shaurya & Malavika Nair paired up in a film under the direction of Avasarala Srinivas, produced jointly by People Media Factory and Dasari Productions.Young hero Naga Shaurya and talented actress Malavika Nair are yet again paired up in the forthcoming film which will be directed by multifaceted persona Avasarala Srinivas. Noted production house People Media Factory and Dasari Productions are set to bankroll this movie jointly.

Earlier, the duo Naga Shaurya & Malavika Nair appeared onscreen together in Kalyana Vaibhogame and won huge accolades. Also, the director Avasarala Srinivas has directed Naga Shaurya in Oohalu Gusagusalade & Jyo Achyutananda. So, now the successful combination is set to repeat and entertain the audience the most. It’s very overwhelming and happy to produce a film with such a talent. The shooting will begin in march 2nd week. Soon we will unveil the details of other cast and crew, says producer’s TG Vishwa Prasad, Dasari Padmaja and Co- Producer Vivek Kuchibotla