Ranarangam release date posters

16x13-1 sAKSHI 16x25-1 nmtg AJ half page HD DC - FULL PAGE-1

Sharwanand’s Ranarangam completes censor, gets ‘U/A’


‘శర్వానంద్, కాజల్, కళ్యాణి ప్రియదర్శిని’ ల కాంబినేషన్ లో సుధీర్ వర్మ దర్శకత్వంలో  సితార ఎంటర్ టైన్మెంట్స్ చిత్రం ‘రణరంగం’ సెన్సార్ పూర్తి , ఆగస్టు 15 న విడుదల 
యువ కథానాయకుడు శర్వానంద్, కాజల్, కళ్యాణి ప్రియదర్శి ని ల కాంబినేషన్ లో ప్రముఖ దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో, ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం ‘రణరంగం’. సెన్సార్ పూర్తి  ఆగస్టు 15 న విడుదల.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ… ఈ రోజు చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. చిత్రానికి ‘యు/ఎ’ సర్టిఫికెట్ లభించింది. ఆగస్టు 15 న ‘రణరంగం’ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక స్క్రీన్స్ లో విడుదల చేస్తున్నట్లు   తెలిపారు. ఇటీవల కాకినాడలో ప్రేక్షకాభిమానుల సమక్షంలో విడుదల అయిన చిత్రం థియేట్రికల్ ట్రైలర్ కు అద్భుతమైన స్పందన లభించింది. దర్శకుడు సుధీర్ వర్మ ‘రణరంగం’ ను తెరకెక్కించిన తీరు ఎంతో ప్రశంసనీయం. అన్ని వర్గాలవారిని ఈచిత్రం అలరిస్తుంది అనే నమ్మకముందని.అన్నారు. ‘గ్యాంగ్ స్టర్’ గా ఈ చిత్రం లో కథానాయకుడు శర్వానంద్  పోషిస్తున్న పాత్ర ఆయన గత చిత్రాలకు భిన్నం గా ఉండటమే కాకుండా, ఎంతో వైవిద్యంగానూ, ఎమోషన్స్ తో కూడినదై ఉంటుంది. ‘గ్యాంగ్ స్టర్’ అయిన చిత్ర  కథానాయకుని జీవితంలో 1990 మరియు ప్రస్తుత కాలంలోని  సంఘటనల సమాహారమే ఈ ‘రణరంగం’.భిన్నమైన భావోద్వేగాలు,కధ, కధనాలు ఈ చిత్రం సొంతం. మా హీరో శర్వానంద్ ‘గ్యాంగ్ స్టర్’ పాత్రలో చక్కని ప్రతిభ కనబరిచారు. నాయికలు కాజల్ అగర్వాల్, కల్యాణి ప్రియదర్శిని ల పాత్రలు కథానుగుణంగా సాగుతూ ఆకట్టుకుంటాయి. ఆదిత్య మ్యూజిక్ కంపెనీ ద్వారా విడుదల అయిన చిత్రం ఆడియోకు కూడా మంచి స్పందన లభించింది. ప్రేక్షకులు కూడా ఈ నూతన  ’గ్యాంగ్ స్టర్’  చిత్రాన్ని ఆదరిస్తారనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.ఈ చిత్రానికి మాటలు: అర్జున్ – కార్తీక్, సంగీతం : ప్రశాంత్ పిళ్ళై , ఛాయాగ్రహణం :దివాకర్ మణి, పాటలు: రామజోగయ్య శాస్త్రి, కృష్ణ చైతన్య,ఎడిటర్: నవీన్ నూలి,  ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్, పోరాటాలు:వెంకట్, నృత్యాలు: బృంద, శోభి,శేఖర్, ప్రొడక్షన్ కంట్రోలర్: సి.హెచ్. రామకృష్ణారెడ్డి,
సమర్పణ: పి.డి.వి.ప్రసాద్.
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
రచన-దర్శకత్వం: సుధీర్ వర్మ

Sharwanand’s Ranarangam  completes censor, gets ‘U/A’ still 1 TAA_7330 (1)Ranarangam is the upcoming movie of Sharwanand, Kajal Aggarwal and Kalyani Priydarshan in the lead roles. The film has completed the censor formalities and got ‘U/A’ certificate.
Written and directed by Sudheer Varma, ‘Ranarangam’ is a gangster backdrop movie and recently director Trivikram has launched the trailer in Kakinada. The trailer is getting a tremendous response and there is a good buzz on the movie.
Being the first combination of Sharwa and Sudheer Varma, ‘Ranarangam’ has garnered decent craze.
Ace cameraman Divakar Mani has handled the cinematography for this film.
Sithara Entertainments banner has produced ‘Ranarangam’ and is slated for release on August 15th.

Starring – Sharwanand, Kajal Aggarwal, Kalyani Priyadarshan

Crew:
Written & Directed by – Sudheer Varma
Cinematographer – Divakar Mani
Music Director – Prashant Pillai
Editor – Navin Nooli
Production Designer – Raveender
Sound Designer – Renganaath Ravee
Publicity Designs – Anil & Bhanu
Lyrics – Krishna Chaitanya, Ramajogayya Shastry
Stunts – Venkat
Dialogues – Arjun-Carthyk
Choreography – Brinda, Shobi, Sekhar
Production Controller – Ch. Rama Krishna Reddy
Presents – PDV Prasad
Producer – Suryadevara Naga Vamsi
Banner – Sithara Entertainments

RELEASING WORLDWIDE ON 15th AUGUST !

‘Ranarangam” new stills

Ranarangam Still1 Ranarangam Still2 Ranarangam Still3 Ranarangam Still4 Ranarangam Still5 Ranarangam Still6 Ranarangam Still7 Ranarangam Still8 Ranarangam Still9

రణరంగం మీ అందరికి నచ్చే సినిమా అవుతుందని ఆశిస్తున్నాను – దర్శకుడు త్రివిక్రమ్*

రణరంగం మీ అందరికి నచ్చే సినిమా అవుతుందని ఆశిస్తున్నాను – దర్శకుడు త్రివిక్రమ్*

DSC_0785 DSC_0791 DSC_0792
శర్వానంద్, కాజల్, కళ్యాణి ప్రియదర్శిని హీరోహీరోయిన్లుగా.. ప్రముఖ దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో,ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం ‘రణరంగం’. ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది. ఈ సందర్బంగా ఈ చిత్ర థియేట్రికల్  ట్రైలర్ ఆవిష్కరణ వేడుక కాకినాడలో అశేష అభిమానుల సమక్షంలో వైభవంగా జరిగింది. సుప్రసిద్ధ సినీ దర్శకుడు, మాటల మాంత్రికుడు  త్రివిక్రమ్ ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కథానాయకుడు శర్వానంద్ ,నాయిక కల్యాణి ప్రియదర్శిని లతోపాటు రణరంగం చిత్రంలోని ఇతర నటులు,సాంకేతికనిపుణులు,యూనిట్ సభ్యులు ఈ ఫంక్షన్ లో పాల్గొనడం జరిగింది.

‘‘సినిమా ట్రైలర్స్‌ చూసినప్పుడు మళ్లీ చూడాలని చాలా కొద్ది సార్లే అనిపిస్తుంది. ‘రణరంగం’ ట్రైలర్‌ చూడగానే అలా అనిపించింది’’ అని దర్శకుడు త్రివిక్రమ్‌ అన్నారు.కాకినాడలో ఈ చిత్రం ట్రైలర్‌ విడుదల చేసిన త్రివిక్రమ్‌ మాట్లాడుతూ–‘‘ఒకప్పుడు మా నాన్నగారి బలవంతం మీద ఉద్యోగం కోసం కాకినాడ వచ్చాను.ఆ ఉద్యోగం రాకూడదని అప్పట్లో ప్రార్థనలు కూడా చేశా. మళ్లీ కాకినాడకు రావడం ఇదే. నాకు ఏ ఊరితో అయినా సినిమాలతో కూడిన జ్ఞాపకాలే గుర్తుంటాయి. తొలిసారి కాకినాడకు వచ్చినప్పుడు ‘ఆదిత్య 369’ సినిమా చూశాను. శ్రీనాథ్‌అనే వ్యక్తి ద్వారా శర్వానంద్‌ ఎప్పట్నుంచో తెలుసు. ‘ప్రస్థానం’ సినిమాలో మంచి క్యారెక్టర్‌ చేశాడు. ‘రణరంగం’ సినిమాలో 40ఏళ్ల కుర్రాడిలా శర్వా బాగా నటించాడు. లేట్‌ ట్వంటీస్‌లో ఉన్న కుర్రాడు మిడ్‌ 40 ఏజ్‌ ఉన్న పాత్రను బాగా చేయడమే ఈ సినిమా మొదటి విజయంగా భావిస్తున్నాను.
సుధీర్‌ నాకు ఎప్పటి నుంచో పరిచయం. నాకు ఇష్టమైన వ్యక్తుల్లో ఒకడు. శర్వా కాలేజీ విద్యార్థిగా ఉన్నప్పుడే నాకు తెలుసు. సుధీర్‌ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. శర్వా, కల్యాణి కెమిస్ట్రీ బాగుంది. సుధీర్‌ ప్రేమకథలూ తీయొచ్చు అనిపించింది. ‘ప్రస్థానం’లో చిన్న వయసులోనే బరువైన పాత్ర పోషించాడు శర్వా. ‘రణరంగం’లోనూ అలాంటి అవకాశమే వచ్చింది. ఛాయాగ్రహణం, సంగీతం బాగా కుదిరాయ’’న్నారు. ఈ సినిమాలో 1980లో జరిగే కథ కొంత, ఇప్పటి కాలానికి చెందిన కథ కొంత ఉంటుందన్నారు. చాలా కేర్‌ తీసుకుని బ్యాలెన్డ్స్‌గా తీశారనిపిస్తోంది. కల్యాణి చెప్పినట్లు సుధీర్‌ లవ్‌స్టోరీస్‌ కూడా తీయొచ్చు. సినిమా విజయం సాధించాలి. టీమ్‌ అందరికీ ఆల్‌ ది బెస్ట్‌’’ అని అన్నారు. రణరంగం మీ అందరికి నచ్చే సినిమా అవుతుందని ఆశిస్తున్నాను’ అన్నారు.

*ఈ సందర్బంగా హీరోయిన్ కల్యాణి ప్రియదర్శిని మాట్లాడుతూ…*తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. కాకినాడలో ఈ చిత్ర షూటింగ్ కోసం వచ్చాను. మళ్లీ ఇప్పుడు రావడం సంతోషంగా ఉంది. కెమెరామెన్ దివాకర్ వర్క్ బ్యూటిఫుల్ గా ఉంటుంది. నేను త్రివిక్రమ్ గారికి ఫ్యాన్ ని ఆయన ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ చెయ్యడం ఆనందంగా ఉంది. శర్వాతో వర్క్ చెయ్యడం మర్చిపోలేని అనుభూతి.ఈ సందర్భంగా  ‘‘కాకినాడకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. సుధీర్‌గారి గత సినిమాలు గమనిస్తే గన్స్, బ్లడ్‌లతో కొన్ని వయలెన్స్‌ అంశాలు ఉంటాయి. ఈ సినిమా చూసిన తర్వాత క్యూట్‌ లవ్‌ స్టోరీస్‌ కూడా ఆయన తీయగలరని ప్రేక్షకులు అర్థం చేసుకుంటారు. నాకు గన్‌ పట్టుకోవడం నేర్పించారు. కెమెరామెన్‌ దివాకర్‌ అందమైన విజువల్స్‌ అందించారు. ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలకు థ్యాంక్స్‌. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అని కల్యాణి ప్రియదర్శన్‌ చెప్పింది

*దర్శకుడు సుధీర్ వర్మ మాట్లాడుతూ…*సినిమా అందరికి నచ్చుతుందని భావిస్తున్న. శర్వా ఈ సినిమాను మంచి ఎనిర్జీ తో చేసాడు. త్రివిక్రమ్ గారికి థాంక్స్ మాకు సపోర్ట్ చేస్తునందుకు. నేను చెప్పదలుచుకున్న విషయాలు సినిమాలో చెప్పాను. రణరంగం మీ అందరిని అలరిస్తుంది భావిస్తున్న’అన్నారు.  ‘‘నేను ఏం మాట్లాడాలనుకున్నానో ట్రైలర్‌లో చెప్పా. ఏం చెప్పాలనుకుంటున్నానో సినిమాలో చూపిస్తా. శర్వానంద్‌తో రెండేళ్లు కలసి పనిచేశా. తొలి రోజు తాను ఎంత ఎనర్జీతో ఉన్నాడో ఇప్పటి వరకూ అలానే ఉన్నాడు’’ అన్నారు.మాకు సహకరించిన టీమ్‌ అందరికీ ధన్యవాదాలు’’ అన్నారు సుధీర్‌ వర్మ.

*హీరో శర్వానంద్ మాట్లాడుతూ…చిత్రం ‘‘ట్రైలర్‌ను లాంచ్‌ చేసిన త్రివిక్రమ్‌గారికి థ్యాంక్స్‌. నేను సినిమాల్లోకి రావడానికి క్యారెక్టర్ల కోసం ప్రయత్నించే సమయంలో త్రివిక్రమ్‌గారిని కలుస్తుండేవాణ్ణి. అప్పుడు ఆయన దర్శకుడు కాలేదు. పెద్ద రైటర్‌. ఓ సందర్భంలో ఆయన, నేను కలిసి కారులో వెళ్తున్నప్పుడు ‘ఏదైనా సినిమాల్లో క్యారెక్టర్‌ ఇవ్వండి సార్‌’ అన్నాను. ‘నీతో చేస్తే కచ్చితంగా హీరోగానే చేస్తా. క్యారెక్టర్‌ అయితే ఎప్పటికీ ఇవ్వను’ అన్నారు. అప్పుడు ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో… ఇప్పుడు నేను ఈ స్థాయిలో ఉన్నాను. మా ట్రైలర్‌ ఆడియన్స్‌కు నచ్చిందనే అనుకుంటున్నాను’’ అన్నారు. ‘‘ఈ సినిమా కోసం కాకినాడలో కొన్ని రోజులు షూటింగ్‌ చేశాం. ఇక్కడే ట్రైలర్‌ విడుదల చేయడం ఆనందంగా ఉంది. ఈ రోజు మర్చిపోలేని రోజు. ఉదయం విమానాశ్రయంలో పవన్‌ కల్యాణ్‌గారిని కలిశాను.  పరిశ్రమకు రాకముందు.. పవన్‌ గారి  షూటింగులకు వెళ్లేవాణ్ని. అది గుర్తుపెట్టుకుని ‘శర్వా ఎలా ఉన్నావ్‌?’ అని అడిగారు.సినిమా గురించిన విశేషాలు పంచుకున్నాను. ‘రణరంగం’ ఈనెల 15న థియేటర్లోకి వస్తోంది. ఆదరించండి’’ అన్నారు.

ఈ కార్యక్రమంలోచిత్ర సమర్పకులు పీడీవీ ప్రసాద్,నిర్మాత  సూర్యదేవర నాగవంశీ, నటులు అజయ్, రాజా, సంగీత దర్శకుడు కార్తీక్,  రచయితలు కృష్ణచైతన్య, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

ఈ చిత్రానికి మాటలు: అర్జున్ – కార్తీక్, సంగీతం : ప్రశాంత్ పిళ్ళై , ఛాయాగ్రహణం :దివాకర్ మణి, పాటలు: రామజోగయ్య శాస్త్రి, కృష్ణ చైతన్య,ఎడిటర్: నవీన్ నూలి,  ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్, పోరాటాలు:వెంకట్, నృత్యాలు: బృంద, శోభి,శేఖర్, ప్రొడక్షన్ కంట్రోలర్: సి.హెచ్. రామకృష్ణారెడ్డి.

సమర్పణ: పి.డి.వి.ప్రసాద్.
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
రచన-దర్శకత్వం: సుధీర్ వర్మ

I hope you all like Ranarangam – Director Trivikram  Starring Sharwanand and Kalyani Priyadarshan in the lead roles, Ranarangam is gearing up for a worldwide release on August 15th. The trailer of the film was launched by Trivikram Srinivas today.

Speaking at the event, Trivikram said that he got a distinctive vibe as soon as he saw the trailer of Ranarangam. I wish that the film turns out to be a good hit. The director Sudheer Varma put in a lot of hard work for the film. Sharwanand came up with a very good performance. Even the heroines performed really well, I hope, said Trivikram.

The female lead Kalyani Priyadarshan stated that she is really happy to be a part of this exciting project. I am a big fan of Trivikram garu. The fact that he released the trailer of the film gives me immense joy, she said.

The director of the flick, Sudheer Varma went on to say that Sharwanand put in a lot of hard work for this mafia drama. The audience will get to see what I actually intended to say through this film, he concluded.

Sharwanand said that he feels really lucky to have met Pawan Kalyan in the airport earlier in the day. He added that Trivikram said he would direct a film with him as the main lead and that will be a moment to cherish for the rest of his love. I hope the audiences love the film when it releases on August 15th, he stated.

Cast: Sharwanand, Kajal Aggarwal, Kalyani PriyadarshanCrew:
Writer & Director: Sudheer Varma
Presents – PDV Prasad
Producer: Suryadevara Naga Vamsi
Banner: Sithara Entertainments
Cinematographer: Divakar Mani
Music Director: Prashant Pillai, Karthik Rodriguez, Sunny MR
Editor: Navin Nooli
Production Designer: Raveender
Sound Designer: Renganaath Ravee
Publicity Designs: Anil & Bhanu
Lyrics: Krishna Chaitanya, Ramajogayya Shastry
Stunts: Venkat
Dialogues: Arjun – Carthyk
Choreography: Brinda, Shobi, Sekhar
Production Controller: Ch. Rama Krishna Reddy

షూటింగ్ జరుపుకుంటున్న ప్రపంచ ప్రఖ్యాత వెస్ట్ ఇండీస్ క్రికెట్ ఆటగాడు డ్వేన్ బ్రావో తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్రం


షూటింగ్ జరుపుకుంటున్న ప్రపంచ ప్రఖ్యాత వెస్ట్ ఇండీస్ క్రికెట్ ఆటగాడు
డ్వేన్ బ్రావో తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్రం 
ప్రపంచ ప్రఖ్యాత వెస్ట్ ఇండీస్ క్రికెట్ ఆటగాడు డ్వేన్ బ్రావో తో ప్ర‌ముఖ నిర్మాణ‌ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సోష‌ల్ అవేర్నేష్ ఫిల్మ్ ను అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్న విష‌యం తెలిసిందే. కేవ‌లం ఎంట‌ర్ టైన్మెంట్ మూవీస్ మాత్ర‌మే కాకుండా… అన్ని ర‌కాల జోన‌ర్స్ లో విభిన్న క‌థా చిత్రాల‌ను అందించాల‌నేదే పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఉద్దేశ్యం. అందులో భాగంగానే ‘ఎం.ఎల్.ఎ, వైఫ్ ఆఫ్ రామ్, గూఢ‌చారి, ఓ..బేబి…ఇలా వైవిధ్య‌మైన, విజ‌య‌వంత‌మైన చిత్రాలు నిర్మించి అన‌తి కాలంలోనే అటు ఆడియ‌న్స్ లో, ఇటు ఇండ‌స్ట్రీలో అభిరుచి గ‌ల నిర్మాణ సంస్థ‌గా మంచి గుర్తింపు ఏర్పరుచుకుంది పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ. ప్ర‌స్తుతం విక్ట‌రీ వెంక‌టేష్ – యువ స‌మ్రాట్ నాగ చైత‌న్య‌ల క్రేజీ కాంబినేష‌న్ లో భారీ మ‌ల్టీస్టార‌ర్ ‘వెంకీ మామ’ చిత్రాన్ని,  అలాగే అనుష్క ప్ర‌ధాన పాత్ర‌లో ‘నిశ్శ‌బ్దం’ అనే ఇంట‌ర్నేష‌న‌ల్ మూవీని కూడా నిర్మిస్తుంది.

అయితే… కేవలం వ్యాపార దృక్పథమే కాకుండా, సామాజిక స్పృహ కు సంబంధించిన విషయాలలో కూడా ప్రజలలో అవగాహన కల్పించాల‌నే స‌దుద్దేశ్యంతో సోష‌ల్ అవేర్నెస్ ఫిల్మ్స్ ను నిర్మిస్తున్నారు  సంస్థ నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల. ఈ నిర్మాణ సంస్థ‌తో ఎ.ఎన్.టి ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ క‌లిసి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా సోష‌ల్ అవేర్న‌ష్ ఫిల్మ్ ను నిర్మిస్తోంది.

‘కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR)’ లో భాగంగా వెస్ట్ ఇండీస్ క్రికెట‌ర్ డ్వేన్ బ్రావోతో క‌లిసి ఈ సినిమాని నిర్మిస్తుంది.  ఈ మూవీకి ఆర్తి శ్రీవాత్స‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.  ఆమె ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ల్యాండ్ ఆఫ్ విడోస్ మరియు వైట్ నైట్ ఈ రెండు డాక్యుమెంట‌రీస్ ఇంట‌ర్నేష‌న‌ల్  ఫిల్మ్ ఫెస్టివ‌ల్స్ లో అవార్డులు గెలుచుకున్నాయి. ఇప్పుడు మ‌హిళల‌కు శుభ్ర‌త విష‌యంలో అవ‌గాహ‌న క‌ల్పించేందుకు గాను ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

 
డ్వేన్ బ్రావో తన అధికారిక సోషల్ మీడియా ఖాతా అయినా పేస్ బుక్ లో ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు.
ఈ చిత్ర విశేషాల‌ను ద‌ర్శ‌కురాలు ఆర్తి శ్రీవాత్స‌వ తెలియ‌చేస్తూ…డ్వేన్ బ్రావోతో క‌లిసి ఈ సినిమాని నిర్మిస్తున్నందుకు చాలా సంతోషంగాను, గ‌ర్వంగాను ఉంది.  జులైలో త‌మిళ‌నాడులో షూటింగ్ జరిగింది. దీంతో ఇండియ‌లో షూటింగ్ పూర్త‌య్యింది. ఆగ‌ష్టులో వెస్ట్ ఇండీస్ లోని ట్రినిడాడ్, టోబాగో ల‌లో  షూటింగ్ చేయ‌నున్నాం అని చెప్పారు.

ఈ మూవీకి నిర్మాత – టి.జి.విశ్వ‌ప్ర‌సాద్, కో – ప్రొడ్యూస‌ర్ – వివేక్ కూచిభోట్ల‌, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ – శ్రీ న‌ట‌రాజ్, ప్రాజెక్ట్ డిజైన్ & ఎగ్జిక్యూష‌న్ – ఎ.ఎన్.టి ప్రొడక్ష‌న్స్.

The world-famous West Indies cricketer Dwayne Bravo has collaborated with renowned production company People Media Factory and ANT productions to make a social awareness film. People Media Factory has garnered abundant fame in less span of time with its extraordinary film making.
Entertainment is always been our priority, but also, we have believed in interesting films and genres. We always wanted to tell interesting stories like Wife of Ram, Goodachari, and Oh Baby. We continue to make movies with exceptional stories, the line up of movies which include the most awaited film in Telugu Venky Mama and International film Silence. As a part of our contribution to society we bring this much needed film of the hour “Men Take Lead”.

 Dwayne Bravo   has released the poster of short film where he plays a keyrole, posted in his fb account


Happy to reveal the poster of “Men Take Lead” my upcoming docu-feature. I always wanted to help the young girls and women in my country and elevate the quality of their lives. So excited that it is becoming a reality through this social awareness film. Dedicating this film to all the women around the world. New Beginnings!!! #Menstrualhygiene #womenshealth #periodpoverty
#itsnottattaboo#MHM #Champion #WakeUp #RunDWorld. #People Media Factory

 As a part of corporate social responsibility(CSR), the People Media Factorty has teamed up with West Indies cricketer Dwayne Bravo and producing this movie. Arthi Srivastava will be directing the film. The documentaries Land of Widows and White Knight, helmed by her bagged many awards at International Film Festivals. Now the film is being made to educate women on the matter of cleanliness.
Director Arti Srivastava said, ‘the film was shot in Tamil Nadu in July. The shooting in India has been completed. We will be shooting in Trinidad and Tobago in the West Indies in August.

Producer-TG Viswa Prasad, Co-Producer – Vivek Kuchibhotla, Executive Producer – Sri Nataraj, Project Design and Execution-ANT Productions