Nov 14 2020
Naga Shaurya and Ritu Verma ‘Varudu Kaavalenu’
నాగ శౌర్య , రీతువర్మ జంటగా ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ చిత్రం ‘వరుడు కావలెను‘
*నాగ శౌర్య , రీతువర్మ ల ‘వరుడు కావలెను‘
*చిత్రం పేరు ఖరారు చేస్తూ వీడియో విడుదల
‘వరుడు కావలెను‘….!
వినగానే ఇది తమ అమ్మాయికి తగిన ‘వరుడు‘ కోసం ‘వధువు‘ తల్లి దండ్రులు పత్రికలలో ఇచ్చే ప్రకటన అనిపిస్తుంది. కానీ ఇది ఒక చిత్రం పేరు. మీరు వింటున్నది నిజమే….
ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ యువ కథానాయకుడు నాగ శౌర్య , నాయిక ‘రీతువర్మ’ జంటగా ‘లక్ష్మీ సౌజన్య’ ను దర్శకురాలిగా పరిచయం చేస్తూ రూపొందిస్తున్న చిత్రానికి ‘వరుడు కావలెను‘ అనే పేరును నిర్ణయించారు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేస్తూ దీనికి సంభందించి ఓ ఆకట్టుకునే అందమైన వీడియో ను కూడా విడుదల చేశారు. ఈ వీడియో లో నాగశౌర్య, రీతువర్మ ఎంతో అందంగా కనిపిస్తారు. ఈ చిన్న దృశ్యానికి విశాల్ చంద్రశేఖర్ అందించిన నేపథ్య సంగీతం మరింత వన్నె తెచ్చింది. ‘వరుడు కావలెను‘ అనేపేరు చిత్ర కథ కు పూర్తిగా సరైనదన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు చిత్ర దర్శక నిర్మాతలు.
హైదరాబాద్ లో ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. చిత్ర నాయకా, నాయికలతో పాటు ప్రధాన తారాగణం పాల్గొనగా సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది అని తెలుపుతూ చిత్ర యూనిట్ తరపున ప్రేక్షకులకు, మీడియా వారికి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు
నాగశౌర్య, రీతువర్మ నాయకా,నాయికలు కాగా నదియా, మురళీశర్మ, వెన్నెలకిషార్, ప్రవీణ్, అనంత్, కిరీటి దామరాజు, రంగస్థలం మహేష్, అర్జున్ కళ్యాణ్, వైష్ణవి చైతన్య, సిద్దిక్ష ఇతర ప్రధాన పాత్రలు.
ఈ చిత్రానికి మాటలు: గణేష్ కుమార్ రావూరి, ఛాయాగ్రహణం: వంశి పచ్చి పులుసు, సంగీతం: విశాల్ చంద్రశేఖర్,ఎడిటర్: నవీన్ నూలి; ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్, సమర్పణ: పి.డి.వి.ప్రసాద్
నిర్మాత: సూర్య దేవర నాగవంశీ
కథ- స్క్రీన్ ప్లే- దర్శకత్వం: లక్ష్మీసౌజన్య
Sithara Entertainments, a well-known film production company,
has teamed up with Naga Shaurya and Ritu Varma for the film ‘Varudu Kaavalenu’.
* Naga Shaurya and Ritu Verma ‘Varudu Kaavalenu’
* Video has been released on finalizing the name of the movie
‘Varudu Kaavalenu’….!
Upon hearing this it felt like a similar ad in the magazine of the
‘bride”s parents searching for a suitable ‘groom’ for their daughter.
But this is the name of the movie. What you heard is true.
Sithara Entertainments, an prestigious film company with young hero ‘Naga Shaurya’ and heroine ‘Ritu Verma’.
Introducing ‘Lakshmi Sowjanya’ as the director for the upcoming film named as
‘Varudu Kaavalenu’. By now an official announcement has been made and
an impressively beautiful video has been released.In this video
the hero ‘Naga Shaurya’ and heroine ‘Ritu Varma’ looks so beautiful.
The background music provided by Vishal Chandrashekar
added even more vanity to this movie.
The director and producer of the film have expressed the belief that the
name ‘Varudu Kaavalenu’ is completely appropriate for the story of the film.
The film is currently shooting in Hyderabad. Scenes are being shot with
the film’s hero and heroine as well as the main cast.
On behalf of the film unit, Diwali wishes were extended to the audience and the media.
Naga Shaurya’, ‘Ritu Verma’ as hero heroines, the other main cast are Nadhiya,
Murali Sharma,Vennela Kishore, Praveen, Anant, Kiriti Damaraju, Rangasthalam Mahesh,
Arjun Kalyan, Vaishnavi Chaitanya, Sidiksha and remaining other main characters.
For the film the
Cinematography: Vamsi Patchi Pulusu, Music: Vishal Chandrasekhar, Dailogues: Ganesh Kumar Ravuri; Editor: Naveen Nooli,
Art: A.S. Prakash, Presents: P.D.V. Prasad.
Producer: Suryadevara Naga Vamsi
Story-Screenplay-Direction: Lakshmi Sowjanya
Follow Us!