Apr
2
2021
పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ – పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా చిత్ర నిర్మాణం
*15 చిత్రాల నిర్మాణానికి ప్రణాళికలు రూపకల్పన
*తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఓ ప్రతిష్ఠాత్మక నిర్ణయం..
ప్రతిభావంతులైన యువ సృజనశీలురకు శుభవార్త. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గారికి చెందిన చిత్ర నిర్మాణ సంస్థ ‘పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్’… వరుసగా చిత్రాలు నిర్మిస్తున్న ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఎల్.ఎల్.పి.’ కలసి చిత్రాలు నిర్మించాలని నిర్ణయించుకున్నాయని తెలియచేసేందుకు సంతోషిస్తున్నాం.
కోట్లాదిమంది అభిమానులను మెప్పించే పవన్ స్టార్… ప్రజలకు ఎల్లవేళలా అండగా నిలిచే నేత శ్రీ పవన్ కల్యాణ్ గారు ఎప్పుడూ నవ్యరీతి చిత్రాలను, సృజనాత్మక కథలను ఇష్టపడతారు. నవతరం ఆలోచనలు కలిగిన రచయితలను, ఆ విధమైన కథలు చెప్పగలిగే దర్శకులను… బహు భాషల్లో మన కథలను తీసుకువెళ్లగలిగే ప్రతిభ ఉన్నవారిని ప్రోత్సహించాలనే సదుద్దేశంతో పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ ను స్థాపించారు.
నిర్మాత శ్రీ టి.జి.విశ్వప్రసాద్ గారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఎల్.ఎల్.పి. ద్వారా విస్తృతంగా చిత్రాలు నిర్మిస్తున్నారు. సినిమా నిర్మాణాన్ని పరిశ్రమ పంథాలో.. ప్రణాళికాబద్ధంగా సాగించాలనే ఆలోచనతో ఈ సంస్థ ద్వారా వేగంగా చిత్రాలు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సంస్థకు సంబంధించి పదికిపైగా చిత్రాలు నిర్మాణ దశలో ఉన్నాయి.
సినిమా నిర్మాణం అనేది సృజనాత్మక పరిశ్రమగా మరోమారు వెల్లడయ్యేలా పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ – పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఎల్.ఎల్.పి. సంస్థల భాగస్వామ్యం ఉండబోతుంది. పలురీతుల ప్రాజెక్టుల రూపకల్పనకు ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయి.
ఇందులో 6 పరిమిత చిన్న తరహా చిత్రాలు… 6 మధ్యతరహా చిత్రాలు… 3 భారీ చిత్రాలు ఉండనున్నాయి.
పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ – పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చేతులు కలపడం వల్ల – యువ ప్రతిభావంతుల స్వచ్ఛమైన ఆలోచనలు… కలలు కార్యరూపం దాల్చే వేదిక రూపుదిద్దుకుంటుంది. కథా రచయితలు, దర్శకుల ప్రతిభకు అనువైన వాతావరణాన్ని కల్పించేలా ఈ భాగస్వామ్యం ఉంటుంది.
శ్రీ హరీష్ పాయ్ ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా కీలక బాధ్యతల్లో ఉంటారు. సంస్థ ప్రతినిధులు నిర్దేశిత సమయంలో మరింత సమాచారాన్ని తెలియచేస్తారు.
This press note is to announce the ambitious collaboration between Pawan Kalyan Creative Works and People Media Factory LLP.
Pawan Kalyan creative works established by the actor, politician Mr. Pawan Kalyan garu with love for cinema and storytelling. He founded PKCW with a noble intention of encouraging new writers, story tellers and talent in making movies in multiple languages across different generes.
People Media Factory LLP was founded by the producer T.G. Vishwa Prasad garu, who has been producing movies in a factory model, with 10+ feature films in the production pipeline at the moment.
This coming-together of Pawan Kalyan Creative Works and People Media Factory LLP aims at materializing projects as mentioned below, apart from the exciting possibility of Mr. Pawan Kalyan garu himself starring in a couple of them.
• 6 Small scale projects
• 6 medium scale projects
• 3 large scale projects
PKCW and PMF are joining hands to create a fulfilling platform for the incoming breed of young talent on which the latter can transform their fresh and original ideas into reality. The focus will be on working with aspiring storytellers, filmmakers, and people of all crafts of cinema making towards creating a sustainable ecosystem for the talent to thrive in.
Mr. Harish Pai will play a key role as executive producer in encouraging new talent that can leverage the collaboration to explore promising opportunities.
The representatives will announce further information in due course of time.
By venupro •
Uncategorized •
Follow Us!