‘నాగ శౌర్య , రీతువర్మ’ ‘వరుడు కావలెను‘ టీజర్ విడుదల

యువ కథానాయకుడు నాగ శౌర్య , నాయిక ‘రీతువర్మ’ జంటగా ‘లక్ష్మీ సౌజన్య’ దర్శకత్వంలో

ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ రూపొందిస్తున్న చిత్రం  ‘వరుడు కావలెను‘.
నేటి (31-8-2021) ఉదయం 10.08 నిమిషాలకు  ‘వరుడు కావలెను‘ చిత్రం టీజర్ ను విడుదల చేసి హారిక అండ్ హాసిని క్రియేషన్స్  అధినేత ఎస్. రాధాకృష్ణ (చినబాబు) గార్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సితార ఎంటర్ టైన్మెంట్స్.
చిత్ర కథ,సంభాషణల బలం స్పష్టంగా కనిపిస్తుంది టీజర్ లో. నాయకా,నాయికల పాత్రల మనస్తత్వాలు, అభిరుచులు,ఆలోచనలు, కథానుగుణంగా సాగే వినోదం, సంగీతం, నటీ నటుల (నాగశౌర్య, రీతువర్మ, నదియ, హిమాజ, వెన్నెల కిషోర్, ప్రవీణ్) ఉత్తమాభినయం టీజర్ లో ప్రతి క్షణం క(అ)నిపిస్తాయి. ఖచ్చితంగా ‘వరుడు కావలెను‘ చిత్రాన్ని ప్రేమ కథా చిత్రాలలో ప్రత్యేకంగా చూసేలా చేస్తాయి. ఓ ఫీల్ గుడ్ మూవీని చూడ బోతున్నామన్న ఆసక్తిని కలిగిస్తుంది ఈ టీజర్. చివరలో హ్యాపీ బర్త్ డే బాబాయ్ అంటూ హారిక అండ్ హాసిని క్రియేషన్స్  అధినేత ఎస్. రాధాకృష్ణ (చినబాబు) గార్కి పుట్టినరోజు శుభాకాంక్షలు నిర్మాత సూర్యదేవర నాగవంశి తెలపటం కనిపిస్తుంది. ఇందులో అక్టోబర్ నెలలో చిత్రం ధియేటర్ లలో విడుదల అన్నది స్పష్టం చేశారు.
ఇప్పటికే చిత్రం నుంచి విడుదల అయిన ‘‘‘కోలకళ్ళే ఇలా గుండే గిల్లే ఎలా’, అలాగే ‘దిగు దిగు నాగ’  పాటలు బహుళ ప్రజాదరణ పొందినాయి. దీనికి ముందు ఇప్పటివరకు విడుదల చేసిన చిత్రాలు, ప్రచార చిత్రాలు వంటి వాటికి కూడా ప్రేక్షకాభిమానులనుంచి ఎన్నో ప్రశంసలు లభించాయి. సామాజిక మాధ్యమాలలో కూడా వీటికి ప్రాచుర్యం లభించింది. ప్రస్తుతం చిత్ర నిర్మాణ కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్నాయి.  ‘వరుడు కావలెను‘ చిత్ర కథ, కథనం, మాటలు, పాటలు, సన్నివేశాలు, భావోద్వేగాలు,నటీ నటుల అభినయాలు చిత్ర కథానుగుణంగా సాగి  అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తాయి అన్న నమ్మకాన్ని వ్యక్తం  చేస్తున్నారు చిత్ర దర్శక నిర్మాతలు.
‘వరుడు కావలెను’ చిత్రంలో నాగశౌర్య, రీతువర్మ నాయకా,నాయికలు కాగా  నదియా, మురళీశర్మ, వెన్నెలకిషార్, ప్రవీణ్, అనంత్, పమ్మి సాయి, కిరీటి దామరాజు, రంగస్థలం మహేష్, అర్జున్ కళ్యాణ్, వైష్ణవి చైతన్య, సిద్దిక్ష ఇతర ప్రధాన పాత్రలు.
ఈ చిత్రానికి మాటలు: గణేష్ కుమార్ రావూరి, ఛాయాగ్రహణం: వంశి పచ్చి పులుసు, సంగీతం: విశాల్ చంద్రశేఖర్; ఎడిటర్: నవీన్ నూలి; ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్, పి.ఆర్.ఓ. లక్ష్మీవేణుగోపాల్
 సమర్పణ: పి.డి.వి.ప్రసాద్
నిర్మాత: సూర్య దేవర నాగవంశి
కథ- దర్శకత్వం: లక్ష్మీసౌజన్య
Teaser release of Naga Shaurya and Ritu Varma “VARUDUKAVALENU”
Young Hero Naga Shaurya and Heroine Ritu Varma starer Varudu Kaavalenu under the direction of Lakshmi Sowjanya in the production of prestigious banner Sitara Entertainments.
Today(31-08-2021) morning at 10:08 Sitara Entertainments released the teaser of Varudu Kaavalenu wishing Happy Birthday to S. RadhaKrishna (Chinababu) owner of Haarika Hassine Creations.
Story and dialogues strength is clearly known in the teaser. Characteristics,thought process, mindset of lead actors and fun, music are felt in every second of the teaser and definitely makes Varudu Kaavalenu stand out in the genre of love stories. Teaser gives the vibe of a feel good movie is in store for us.At the end Producer Suryadevara Nagavamsi wished Happy Birthday to S.Radhakrishna (Chinababu) and also mentioned the October release in theatres.
Already the songs “Kola Kale ilaa” and “Digu Digu Naga” which got released won the hearts of audience and also the First glimpse and posters also garnered positive response and appreciation from audience and in the social media. Currently movie post production works in the last phase of completion. Producers are pretty confident that Varudu Kaavalenu story, dialogues, songs,emotions and artistes performances will surely connect with the audience.
Varudu Kaavalenu is starring Naga Shaurya, Ritu Varma along with Nadiya, Murali Sharma, Vennela Kishore, Praveen, Ananth, Pammi Sai, Kireeri Daamaraju, Rangasthalam Mahesh, Arjun Kalyan, Vaishnavi Chaitanya, Sidduque sha.
Dialogues are penned by Ganesh Kumar Ravuri,Cinematography by Vamsi Patchipulusu, Music by Vishal Chandrashekhar, Editing by Navin Nooli, Art by A.S.Prakash, P.R.O. LakshmiVenuGopal.
Presented by:P.D.V Prasad
Producer:Suryadevara Naga Vamsi
Story-Direction:Lakshmi Sowjanya
Vk-Web-TeaserOutNow VK Teaser - Still1 VK Teaser - Still 3 VK Teaser - Still 2

*’విరాట్ రాజ్’ హీరోగా “సీతామనోహర శ్రీరాఘవ” చిత్రం

*’విరాట్ రాజ్’ హీరోగా “సీతామనోహర శ్రీరాఘవ” చిత్రం
*అలనాటి అందాల హీరో హరనాథ్ సోదరుడు వెంకట సుబ్బరాజు మనుమడు ఈ ‘విరాట్ రాజ్’
*ప్రచార చిత్రాలను,వీడియోను విడుదల చేసిన నట శిక్షకుడు శ్రీ సత్యానంద్ గారు
 వెండితెర కు మరో నట వారసుడు పరిచయం అవుతున్నారు. అతని పేరు ‘విరాట్ రాజ్’.
అలనాటి అందాల హీరో హరనాథ్ సోదరుడు వెంకట సుబ్బరాజు మనుమడు ఈ ‘విరాట్ రాజ్’ ఈరోజు అతని పుట్టినరోజు. ఈ సందర్భంగా చిత్రం హీరోను, పేరును పరిచయం చేస్తూ రూపొందించిన ప్రచార చిత్రాలను,వీడియోను అతని నట శిక్షకుడు శ్రీ సత్యానంద్ గారు విడుదల చేసి ఆశీస్సులు అందించారు.
చిత్రం పేరు ‘సీతామనోహర శ్రీరాఘవ’. విరాట్ రాజ్ పరిచయ ప్రచార చిత్రాలను  పరిశీలిస్తే పెద తాత హరనాథ్ స్ఫురణకు వస్తారు. ఓ చిత్రంలో అందంగా,క్యూట్ గా కనిపిస్తున్న విరాట్ రాజ్  మరో ప్రచార చిత్రం లో గన్ చేతబట్టి యాక్షన్ లోక్  వెంకట సుబ్బరాజు గారు ‘భక్త తుకారాం, కోడె నాగు, రిక్షా రాజి’ వంటి అలనాటి పలు చిత్రాలలో కీలక పాత్రలలో నటించారు. ఇటు తాత వెంకట సుబ్బరాజు, అటు పెద తాత హరనాథ్ గారు స్ఫూర్తి తో ఈ ‘సీతామనోహర శ్రీరాఘవ’ చిత్రం ద్వారా హీరోగా పరిచయం కావడం సంతోషంగా ఉంది. ఇది సరైన చిత్రంగా భావిస్తున్నాను. మీడియా, చిత్ర పరిశ్రమలోని పెద్దలు, ప్రేక్షకులు ఆశీస్సులు కావాలని కోరుకుంటున్నాను అన్నారు ‘విరాట్ రాజ్’
ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్న
దుర్గా శ్రీ వత్సస.కె. మాట్లాడుతూ…’హీరోగా విరాట్ రాజ్ పరిచయం అవుతున్న ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా నేనూ పరిచయం కావడం సంతోషంగా ఉంది. ఒక ఇమేజ్ కు మాత్రమే పరిమితం కాకుండా ఈ చిత్రం ద్వారా భిన్నమైన చిత్రాలకు సరితూగే ఇమేజ్ ను ‘విరాట్ రాజ్’ స్వంతం చేసుకునేలా ఈ చిత్రం కథను సిద్ధం చేయటం జరిగింది. చిత్రం పేరు ‘సీతామనోహర శ్రీరాఘవ’. పేరు వెనుక కథ ఏమిటన్నది ప్రస్తుతానికి గోప్యంగా ఉంచుతున్నాము. సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ చిత్రంగా, మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం పలు భావోద్వేగాల సమ్మిళితం అన్నారు దర్శకుడు. కె.జి.ఎఫ్. 2, సలార్  చిత్రాలకు సంగీతం సమకూరుస్తున్న ‘రవి బస్ రుర్’ ఈ  చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు.
వెండితెరకు మరో నట వారసుడు ను తమ
‘వందన మూవీస్’ చిత్ర నిర్మాణ సంస్థ ద్వారా పరిచయం చేయటం చాలా ఆనందం గా ఉంది అన్నారు చిత్ర నిర్మాత సుధాకర్.టి. సెప్టెంబర్ లో షూటింగ్ ప్రారంభం అవుతుందని, చిత్రంలో ఇతర తారాగణం, సాంకేతిక నిపుణులు ఎవరన్నది మరోసారి ప్రకటించటం జరుగుతుందని అన్నారు.
ఈ చిత్రానికి సంగీతం: రవి బస్ రుర్ ; పాటలు: రామజోగయ్య శాస్ర్తి; కెమెరా: కల్యాణ్. బి; ఎడిటర్: జి.యం.శాస్త్రి; యాక్షన్: వెంకట్;
నిర్మాత: సుధాకర్.టి; కథ-స్క్రీన్ ప్లే-మాటలు- దర్శకత్వం: దుర్గా శ్రీ వత్సస.కె.
బ్యానర్: వందన మూవీస్
*Introducing Virat Raj in “Sita Manohara Sree Raghava”*
*Yesteryear handsome actor Haranath’s grandson Virat Raj debuts as a hero, and acting guru Satyanand unveils a Poster and video glimpse.
Another talented youngster is getting introduced as a hero in the Telugu film industry. He is Virat Raj, the grandson of actor Venkata Subbaraju, who was the brother of the handsome actor of yesteryear Haranath. Virat Raj plays the lead role in the production of Vandana Movies’ “Sita Manohara Sree Raghava.”
On the occasion of his birthday today, acting guru Sri Satyanand unveiled the Poster,video glimpse and wished him great success.
Venkata Subbaraju played key roles in hits such as “Kode Naagu”, “Bhakta Tukaram”, and “Riksha Raji”. Virat Raj expressed his happiness on being introduced in “Sita Manohara Sree Raghava,” which is billed to be a wholesome family entertainer.
Talented youngster Durgaa Srivatsasa K is making his debut as the director. “I could not have to get a better launchpad than this. The title itself gives away the theme of the story. Apart from the family elements, the film is packaged as a mass entertainer. It will appeal to all sections of audiences,” Durga stated.
The team is glad to announce Ravi Basrur’s name as the music director. Ravi Basrur is the man behind the Pan-Indian rage “KGF-2″ franchise and ‘Salar’.
Informing further details, producer Sudhakar said, “We are happy to introduce another talented actor to the silver screen. The regular shoot will commence in September. The other cast and crew details will be finalized shortly.”
 The film will also feature some prominent actors.
Story, Dailogues,screenplay, and direction: Durga Srivatsasa K
 Producer: Sudhakar T
 Banner: Vandana Moviees
 Music Director: Ravi Basrur
 Cinematography: Kalyan B
 Lyrics: Ramajogaiah Sastry
 Editor: GM Sastry
 Fights: Venkat
001a OUT EMPTY 001a OUT 003 3 X 4.5 OUT 003 EMPTY

అన్నయ్యకు ప్రేమతో జన్మదిన శుభాకాంక్షలు – పవన్ కల్యాణ్ (అధ్యక్షులు – జనసేన)

అన్నయ్యకు ప్రేమతో జన్మదిన శుభాకాంక్షలు

చిరంజీవి.. నాకే కాదు ఎందరికో మార్గదర్శి.
చిరంజీవి… నాకే కాదు ఎందరికో స్ఫూర్తి ప్రదాత.
చిరంజీవి.. నాకే కాదు ఎందరికో ఆదర్శప్రాయుడు.
ఇలా శ్రీ చిరంజీవి గారి గురించి ఎన్ని చెప్పుకొన్నా కొన్ని మిగిలిపోయే ఉంటాయి. ఆయన తమ్ముడిగా పుట్టడం ఒక అదృష్టమైతే.. ఆయనలోని సుగుణాలను  చూస్తూ పెరగడం మరో అదృష్టం. అన్నయ్యను అభిమానించి ఆరాధించే  లక్షలాదిమందిలో నేను తొలి అభిమానిని. ఆయనను చూస్తూ.. ఆయన సినిమాలను వీక్షిస్తూ… ఆయన ఉన్నతిని కనులార చూశాను.  ఒక అసామాన్యునిగా ఎదిగిన సామాన్యుడు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం ఆయనలోని అద్భుత లక్షణం. భారతీయ సినీ యవనికపై తనకంటూ ఒక స్థానం సంపాదించుకున్నా.. తెలుగు సినిమాను భారత చలనచిత్ర రంగంలో అగ్రపథాన నిలబెట్టినా.. అవార్డులు రివార్డులు ఎన్ని వరించినా… నందులు తరలి వచ్చినా… పద్మభూషణ్ గా కీర్తి గడించినా… చట్ట సభ సభ్యునిగా.. కేంద్ర మంత్రిగా పదవులను ఆలంకరించినా.. ఆయన తల ఎగరేయలేదు. విజయాలు ఎన్ని సాధించినా.. రికార్డులు ఎన్ని సృష్టించినా అదే విధేయత, అదే వినమ్రత శ్రీ చిరంజీవి గారి సొంతం. అందువల్లేనేమో ఆయనను సొంత మనిషిలా భావిస్తారు లక్షలాది మంది. విద్యార్థి దశలోనే సేవాభావాన్ని పెంపొందించుకున్న శ్రీ చిరంజీవి గారు నాడు రక్త నిధిని, నేడు ప్రాణ వాయువు నిధిని స్థాపించి… కొడిగడుతున్న ప్రాణాలకు ఆయువునిస్తూ తనలోని సేవాగుణాన్ని ద్విగుణీకృతం చేసుకున్నారు. ఆపదలో ఎవరైనా వున్నారంటే ఆదుకోవడంలో ముందుంటారు. దానాలు.. గుప్తదానాలు ఎన్నో చేశారు… చేస్తూనే వున్నారు. కరోనాతో పనులు లేక అల్లాడిపోయిన సినిమా కార్మికుల ఆకలి తీర్చడానికి అన్నయ్య ఎంతో తపనపడ్డారు. అందువల్లే సినీ కార్మికులు అందరూ శ్రీ చిరంజీవి గారిని తమ నాయకునిగా ఆరాధిస్తున్నారు. వర్తమాన చరిత్రగా ఆయన జీవితాన్ని లిఖిస్తున్నారు.
శ్రీ చిరంజీవి గారు మా కుటుంబంలో  అన్నగా పుట్టినా మమ్మల్ని తండ్రిలా సాకారు. తండ్రి స్థానంలో నిలిచారు. ఆ ప్రేమమూర్తి పుట్టిన రోజు  సందర్భంగా ప్రేమపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. శ్రీ చిరంజీవి గారికి ఆయురారోగ్యాలతో కూడిన దీర్ఘాయుష్షు ప్రసాదించాలని, చిరాయువుతో చిరంజీవిగా భాసిల్లాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.
-పవన్ కల్యాణ్
(అధ్యక్షులు – జనసేన)

అన్నయ్యకు ప్రేమతో జన్మదిన శుభాకాంక్షలు (1) Pawan 1

 

Birthday greetings with love to my brother

షూటింగ్ విరామంలో ‘భీమ్లా నాయక్’

యోగి కమండలం కొమ్ములోంచి

చెట్లకి ప్రాణ ధారలు వదుల్తాడు

యోధుడు తుపాకి గొట్టం అంచునుంచి
ప్రకృతికి వత్తాసు పలుకుతాడు
నాయకుడు ఈ రెండింటినీ 
తన భుజాన మోసుకుంటూ
ముందుకు కదుల్తాడు…..!”
 
-షూటింగ్ విరామంలో ‘భీమ్లా నాయక్’
ఈ వీడియో చివరలో కనిపించే వాక్యాలివి. ఫైరింగ్ ప్రాక్టీస్ ముగించి పవన్ కల్యాణ్ నడుచుకుంటూ వెళుతున్నప్పుడు ఇవి కనిపిస్తాయి. సందర్భోచితంగా ఈ దృశ్యాలను ఇలా అక్షర బద్ధం చేసింది చిత్రం యూనిట్.
సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం ‘భీమ్లా నాయక్’. స్క్రీన్ ప్లే- సంభాషణలు సుప్రసిద్ధ దర్శకుడు, రచయిత ‘త్రివిక్రమ్’ అందిస్తుండగా నిర్మాత సూర్యదేవర నాగవంశి నిర్మిస్తున్న ఈ
చిత్రానికి దర్శకుడు సాగర్ కె చంద్ర.
ఈ చిత్రం షూటింగ్ విరామంలో పవన్ కల్యాణ్ రైఫిల్ ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తున్న దృశ్యాలను కెమెరాలో బంధించింది చిత్రం యూనిట్. వీటిని షూటింగ్ విరామంలో ‘భీమ్లా నాయక్’ అంటూ మీడియాకు విడుదలచేశారు.

ఈ చిత్రం లోని తొలి గీతాన్ని సెప్టెంబర్ 2 న విడుదల చేస్తున్నాము అని  తెలిపారు చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశి 2022 జనవరి 12 న చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు తెలిపారు. 

పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి,నిత్య మీనన్, ఐశ్వర్య రాజేష్’, ఇతర ప్రధాన పాత్రల్లో  రావు రమేష్, మురళీశర్మ, సముద్ర ఖని, రఘుబాబు, నర్రా శ్రీను , కాదంబరికిరణ్, చిట్టి, పమ్మి సాయి, నటిస్తున్నారు. 

సంభాషణలు, స్క్రీన్ ప్లే: త్రివిక్రమ్ 

ఛాయాగ్రాహకుడు: రవి కె చంద్రన్ ISC

సంగీతం: తమన్.ఎస్

ఎడిటర్:‘నవీన్ నూలి

ఆర్ట్ : ఏ.ఎస్.ప్రకాష్

వి.ఎఫ్.ఎక్స్. సూపర్ వైజర్: యుగంధర్ టి

పి.ఆర్.ఓ: లక్షీవేణుగోపాల్

సమర్పణ: పి.డి.వి. ప్రసాద్ 

నిర్మాత:సూర్యదేవర నాగవంశి

దర్శకత్వం: సాగర్ కె చంద్ర

PLL_4945 copy

“హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు” లో ‘పంచమి’ గా నిధి అగర్వాల్

*”హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు” లో ‘పంచమి’ గా నిధి అగర్వాల్

*నేడు నిధి అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా ప్రచారచిత్రం విడుదలపవన్ కళ్యాణ్ హీరోగా, క్రియేటివ్‌ డైరెక్టర్ క్రిష్ జాగ‌ర్ల‌మూడి రూపొందిస్తోన్న మాగ్న‌మ్ ఓప‌స్ ఫిల్మ్‌ ‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’.‘నిధి అగర్వాల్‘ నాయిక. మెగా సూర్యా ప్రొడ‌క్షన్ బ్యాన‌ర్‌పై లెజండ‌రీ ప్రొడ్యూస‌ర్ ఎ.ఎం. ర‌త్నం సమర్పణలో నిర్మాత దయాకర్ రావు ఈ ఎపిక్‌ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

నేడు నిధి అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా ఆమె ప్రచార చిత్రంను విడుదల చేశారు చిత్ర బృందం. “హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు” లో నిధి అగర్వాల్ ప్రధాన భూమికను పోషిస్తున్నారు. కధానాయిక గా ఆమె పోషిస్తున్న పాత్ర పేరు ‘పంచమి‘.
“కృష్ణ పక్ష  పంచమి వెన్నెల వన్నెలవా..
శుక్ల పక్ష  పంచమి  నెలవంక వయ్యారానివా?
ఓ అందాల పంచమి.. ఎవరివే  నీవెవరివే?” అంటూ ఆమెను వర్ణించారు. ప్రచార చిత్రంలో నృత్య భంగిమలో అందమైన ఆమె రూపం ను వీక్షిస్తే ఎంతో అందంగానూ, అపూర్వంగా ఉంది. విభిన్నమైన పాత్రగానూ, వెండితెరపై అలరిస్తుంది అనిపిస్తోంది. ఆమె పాత్ర ఎలా ఉంటుంది అన్నది మరింత ఉత్సుకతను కలిగిస్తోంది.

నేటి త‌రం ద‌ర్శ‌కుల్లో ఒక ఇంద్ర‌జాలికుడు లాంటి దర్శకుడు క్రిష్ త‌న ట్రేడ్‌మార్క్ అంశాల‌తో ఈ చిత్రాన్ని అపూర్వంగా తీర్చిదిద్దుతున్నారు. 17వ శ‌తాబ్దం నాటి మొఘ‌లాయిలు, కుతుబ్ షాహీల శ‌కం నేప‌థ్యంలో జ‌రిగే క‌థ‌తో, అత్య‌ద్భుత‌మైన విజువ‌ల్ ఫీస్ట్‌గా ఈ”హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు” సినిమా  రూపొందుతోంది. ఇది భార‌తీయ సినిమాలో ఇప్ప‌టిదాకా చెప్ప‌ని క‌థ‌. క‌చ్చితంగా ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌కు ఒక మ‌ర‌పురాని అనుభ‌వాన్ని ఇస్తుంది.
ఏ విష‌యంలోనూ రాజీప‌డ‌ని ఉన్న‌త‌స్థాయి నిర్మాణ విలువ‌ల‌తో నూటయాభై కోట్లకు పైగా భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. పాన్‌-ఇండియా స్థాయిలో నిర్మాణ‌మ‌వుతోన్న ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీ, త‌మిళ‌,  మ‌ల‌యాళంభాష‌ల్లో ఏక కాలంలో విడుద‌ల చేయ‌నున్నారు. ఇప్పటివరకు ‘హరిహర వీరమల్లు’ షూటింగ్‌ యాభై శాతం పూర్త‌యింది. త్వరలో చిత్రం నూతన షెడ్యూల్ ప్రారంభం అవుతుందని నిర్మాత‌ ఎ.ద‌యాక‌ర్ రావు తెలియచేశారు.

ఈ చిత్రానికి అగ్ర‌శ్రేణి సంగీత ద‌ర్శ‌కుడు ఎం.ఎం. కీర‌వాణి సంగీత బాణీలు అందిస్తుండ‌గా, పేరుపొందిన సినిమాటోగ్రాఫ‌ర్ జ్ఞాన‌శేఖ‌ర్ వి.ఎస్‌. కెమెరాను హ్యాండిల్ చేస్తున్నారు. ప్రముఖ రచయిత సాయిమాధ‌వ్ బుర్రా ఈ చిత్రానికి సంభాషణలు సమకూరుస్తున్నారు.
క్రిష్ జాగ‌ర్ల‌మూడి ద‌ర్శ‌క‌త్వంలో లెజండ‌రీ ప్రొడ్యూస‌ర్ ఎ.ఎం. ర‌త్నం సమర్పణలో మెగాసూర్యా ప్రొడ‌క్ష‌న్‌ బ్యాన‌ర్‌ పై నిర్మాత‌ ఎ.ద‌యాక‌ర్ రావు ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

 Nidhhi Agerwal looks classy in her birthday poster from Hari Hara Veera Mallu

A beautiful poster of Nidhhi Agerwal from Hari Hara Veera Mallu has been released today to mark the actress’ birthday.

The poster designed in poetic manner shows the actress in a dancing pose. Niddhi herself has launched the poster on her big day.

Film Starring Powerstar Pawan Kalyan in the titular role will depict the life of legendary warrior Veera Mallu, is directed by Krish.

The film is being made on a grandeur budget of Rs 150 crore. Fifty per cent of the shoot is over and the remaining will be completed soon.

Produced by A Dayakar Rao on Mega Surya Production banner, the movie will be presented by A M Ratnam in Telugu, Tamil, Hindi, Malayalam and Kannada.

The film has musical score by M M Keeravani, cinematography by Gnana Shekar V S, and dialogues by Sai Madhav Burra.

The film is the first collaboration between Krish and Pawan Kalyan. It is set in 17th century with the backdrop of Mughals and Qutb Shahis.

staring: PAWANKALYAN, NIDHI AGARWALCrew:
Presented by AM Ratnam
Direction: Krish Jagarlamudi
Producer: A. Dayakar Rao
Banner: Mega Surya Production
Cinematography: Gnanashekar VS
Music: MM Keeravani
Dialogues: Sai Madhav Burra

Nidhhi birthday poster plain still Nidhhi birthday poster