Jul 28 2022
ధనుష్ ‘సార్’ టీజర్ విడుదల
ధనుష్ ‘సార్’ టీజర్ విడుదల
*యాక్షన్, ఎమోషన్ ల మేళవింపు ’సార్’ దృశ్య మాలిక
*నేడు చిత్ర కథానాయకుడు ధనుష్ పుట్టినరోజు
* అంబరాన్నంటిన ధనుష్ అభిమానుల ఆనందం
ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ నేతృత్వంలో పలు చిత్రాల నిర్మాణంతో దూసుకుపోతున్న సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఒక అడుగు ముందుకేసి రెండు సార్లు జాతీయ అవార్డు గెలుచుకున్న స్టార్ యాక్టర్ ‘ధనుష్’తో జతకడుతూ ’సార్’ చిత్రాన్ని శ్రీమతి సాయి సౌజన్య (ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్) తో కలసి నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ చిత్ర నిర్మాణ సంస్థ ‘సార్’ కు సమర్పకునిగా వ్యవహరిస్తోంది.
వెంకీ అట్లూరి దర్శకత్వం లో తెలుగు, తమిళంలో నిర్మిస్తున్న ఈ ద్విభాషా చిత్రం ‘సార్’(తెలుగు) ’వాతి’,(తమిళం) షూటింగ్ కార్యక్రమాలు దాదాపు ముగింపు దశలో ఉన్నాయి. ‘సార్’ ధనుష్ తో సంయుక్త మీనన్ జోడీ కడుతున్న ఈ చిత్రం టీజర్ ఈరోజు విడుదల అయింది. దీనికి
ఈరోజు చిత్ర కథానాయకుడు ధనుష్ పుట్టినరోజు
వేదిక అయింది.
విడుదల అయిన ధనుష్ ‘సార్’ టీజర్ పరికిస్తే
యాక్షన్, ఎమోషన్ ల మేళవింపు ’సార్’ దృశ్య మాలిక అనిపిస్తుంది. పాత్రల మధ్య సంభాషణలు సైతం ఇందుకు అద్దం పడతాయి.
“జీరో ఫీజ్ జీరో ఎడ్యుకేషన్
మోర్ ఫీజ్ మోర్ ఎడ్యుకేషన్” ఇదే రా ఇప్పటి ట్రెండ్. పాత్ర అంటుంది ఓ సందర్భంలో..
మరోచోట ఓ లెక్చరర్ ”త్రిపాఠి మన కాలేజ్ లోని బెస్ట్ లెక్చరర్స్ ని గవర్నమెంట్ కాలేజీ కి పంపించేస్తే మన దగ్గరకి వచ్చి చదువుకునేది ఎవరు…!” అంటారు….
సమాధానంగా “మనం పంపేది థర్డ్ గ్రేడ్ జూనియర్ లెక్చరర్స్ ని”… అని. ఆ పాత్ర సమాధానం.
“సార్… మై సెల్ఫ్
బాల గంగాధర్ తిలక్
త్రిపాఠి ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్ లో జూనియర్ లెక్చరర్..
అంటూ ఇందులో మనకు కనిపించే ‘సార్’
“విద్య అనేది గుడిలో దేవుడికి పెట్టే
నైవేద్యం తో సమానం. పంచండి …
ఫైవ్ స్టార్ హోటల్లో డిష్ లాగా అమ్మకండి” అంటాడు కథానాయకుడు ధనుష్ ఆవేదన మిళితమైన తీవ్ర స్వరంతో…. ముగింపుగా”
విద్యావ్యవస్థ తీరు తెన్నుల మీదుగా సాగే
ప్రయాణం అందులోని సమస్యలు, సంఘటనలు
‘సార్’ జీవితాన్ని ఏ తీరానికి చేర్చాయన్న ది అటు ఆసక్తి ని, ఇటు ఉద్విగ్నత కు గురి చేస్తుంది. అరవై తొమ్మిది క్షణాల పాటు సాగే ఈ టీజర్ ‘సార్’ పై మరింత అంచనాలు పెరిగేలా చేసింది.
టీజర్ విడుదలైన క్షణం నుంచే తమ అభిమాన హీరో పుట్టిన రోజుకు సరైన బహుమతి అన్నట్లుగా తెలుగు, తమిళ రాష్ట్రాల్లో అభిమానుల ఆనందం అంబరాన్ని అంటుకున్నాయి. తెలుగు, తమిళ భాషల్లో ’సార్’ అక్టోబర్ లో విడుదలకానుంది.
తారాగణం: ధనుష్, సంయుక్తా మీనన్, సాయికుమార్, తనికెళ్ల భరణి
, సముద్ర ఖని, తోటపల్లి మధు, నర్రా శ్రీను, పమ్మి సాయి, హైపర్ ఆది, సార, ఆడుకాలం నరేన్, ఇలవరసు, మొట్టా రాజేంద్రన్, హరీష్ పేరడి, ప్రవీణ తదితరులు.
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
ఎడిటర్: నవీన్ నూలి
సినిమాటోగ్రాఫర్: జె.యువరాజ్
మ్యూజిక్: జి.వి. ప్రకాష్‌కుమార్
యాక్షన్ కొరియోగ్రాఫర్: వెంకట్
సమర్పణ: శ్రీకర స్టూడియోస్
నిర్మాతలు: నాగవంశీ ఎస్. – సాయి సౌజన్య
రచన- దర్శకత్వం: వెంకీ అట్లూరి
పి ఆర్ ఓ: లక్ష్మీవేణుగోపాల్
Dhanush dazzles as a lecturer set to reform the education system in Sir/Vaathi teaser; fans call it a perfect gift on the star’s birthday
Leading producer Suryadevara Naga Vamsi of the popular banner Sithara Entertainments is joining forces with Sai Soujanya of Fortune Four Cinemas for a bilingual film Sir (Telugu)/Vaathi (Tamil), headlined by national-award winning actor Dhanush. Srikara Studios is presenting the film. Venky Atluri is the writer and director of the prestigious project that’s nearing completion. Samyuktha Menon plays the female lead in the film.
The teaser of the bilingual was launched today, commemorating Dhanush’s birthday. This glimpse is a perfect mishmash of action and emotion, enhanced by a series of impactful dialogues. A character in the film says, ’Zero fees…Zero education…More fees…More education…This is the trend now,’ to which a lecturer responds, ‘Tripathi, if we let the best lecturers in our college leave for government colleges, who’ll come to study here?’
The dialogue-baazi continues with the line, ‘We’re only letting third-grade lecturers leave.’ Dhanush in his introductory dialogue, adds, ‘Sir..myself Bala Gangadhar Tilak…I’m a junior lecturer at Tripathi Educational Institute…Education is like an offering you give to a God in a temple…Share it with everyone but don’t sell it like a five-star hotel dish.’ Sir takes on unfair practices within the education system and deals with the challenges faced by its pivotal character.
Right from Dhanush’s fluent dialogue delivery in Telugu to his appearance in a variety of looks and intriguing action sequences, the teaser is a feast for his fans with a perfect balance of mass and class elements. They couldn’t have asked for a better gift on the star’s birthday. The Sir teaser increases the curiosity around the film’s release in October.
Sai Kumar, Tanikella Bharani, Samuthirakani, Thotapalli Madhu, Narra Srinivas, Pammi Sai, Hyper Aadhi, Shara, Aadukalam Naren, Ilavarasu, Motta Rajendran, Hareesh Peradi and Praveena too play crucial roles in the film. J Yuvraj cranks the camera for the film with national award-winning composer GV Prakash coming up with the background score. Another award-winning technician Navin Nooli is the editor and Avinash Kolla is the production designer. Venkat handles the action choreography.
Follow Us!