Mar 29 2023
Mar 26 2023
SSMB28, Superstar Mahesh Babu and director Trivikram’s much-awaited collaboration, to release on January 13, 2024
* సంక్రాంతికి మహేష్ బాబు-త్రివిక్రమ్ హ్యాట్రిక్ ఫిల్మ్
* ఆకట్టుకుంటున్న కొత్త పోస్టర్
‘అతడు’, ‘ఖలేజా’ వంటి క్లాసిక్ సినిమాల తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కలయికలో రూపొందుతోన్న మోస్ట్ వాంటెడ్ ఫిల్మ్ ‘ఎస్ఎస్ఎంబి 28′(వర్కింగ్ టైటిల్). టాలీవుడ్ అగ్ర చిత్ర నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో ఎస్.రాధాకృష్ణ (చినబాబు) భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే, శ్రీలీల కథానాయికలుగా నటిస్తున్నారు. చిత్ర ప్రకటన వచ్చినప్పటి నుంచే ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. తాజాగా ఈ సినిమా కొత్త విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు.
ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్న మహేష్-త్రివిక్రమ్ హ్యాట్రిక్ ఫిల్మ్ ని సంక్రాంతి కానుకగా 2024, జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల చేయబోతున్నట్లు తెలుపుతూ చిత్ర యూనిట్ ఆదివారం సాయంత్రం ఓ కొత్త పోస్టర్ ను వదిలారు. “సూపర్ స్టార్ మహేష్ బాబు ‘ఎస్ఎస్ఎంబి 28′తో సరికొత్త మాస్ అవతార్‌లో జనవరి 13, 2024 నుండి ప్రపంచవ్యాప్తంగా థియేటర్‌లలో అలరించనున్నారు” అంటూ మేకర్స్ విడుదల చేసిన పోస్టర్ అసలుసిసలైన సంక్రాంతి సినిమాని తలపిస్తూ విశేషంగా ఆకట్టుకుంటోంది.
పండుగలా ‘ఎస్ఎస్ఎంబి 28′ కొత్త పోస్టర్:
మేకర్స్ చెప్పినట్టుగా తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో మహేష్ బాబు సరికొత్త మాస్ అవతార్ లో కనిపిస్తున్నారు. పోస్టర్ ని బట్టి చూసే ఇది మిర్చి యార్డ్ లో జరిగే యాక్షన్ సన్నివేశమని అనిపిస్తోంది. మిర్చి యార్డ్ లో కొందరికి బుద్ధిచెప్పి.. కళ్లద్దాలు, నోట్లో సిగరెట్ తో గుంటూరు మిర్చి ఘాటుని తలపిస్తూ స్టైల్ గా నడిచొస్తున్న మహేష్ బాబు మాస్ లుక్ ఆకట్టుకుంటోంది. మొత్తానికి వచ్చే సంక్రాంతికి మహేష్ బాబు, త్రివిక్రమ్ కలిసి మాస్ బొమ్మ చూపించబోతున్నారని పోస్టర్ తోనే అర్థమవుతోంది.
మహేష్ బాబు సినిమాలకు సంక్రాంతి సెంటిమెంట్ ఉంది. మహేష్ బాబు నటించిన ‘ఒక్కడు’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘సరిలేరు నీకెవ్వరు’ వంటి సినిమాలు సంక్రాంతి కానుకగా విడుదలై ఘన విజయాలను అందుకున్నాయి. ఇక దర్శకుడు త్రివిక్రమ్ గత చిత్రం ‘అల వైకుంఠపురములో’ సైతం 2020 సంక్రాంతికి విడుదలై ఇండస్ట్రీ రికార్డులను సృష్టించడం విశేషం. అసలే హ్యాట్రిక్ కాంబినేషన్, అందులోనూ సంక్రాంతి సీజన్ కావడంతో ‘ఎస్ఎస్ఎంబి 28′ చిత్రం సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయమని అభిమానులు నమ్మకంగా ఉన్నారు.
సంగీత ప్రపంచంలో సంచలనాలు సృష్టిస్తున్న తమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్న విషయం విదితమే. ఎడిటర్ గా జాతీయ అవార్డ్ గ్రహీత నవీన్ నూలి , కళా దర్శకునిగా ఎ.ఎస్. ప్రకాష్, ఛాయాగ్రాహకుడు గా పి.ఎస్.వినోద్ వ్యవహరిస్తున్నారు.
తారాగణం: మహేష్ బాబు, పూజా హెగ్డే, శ్రీలీల
రచన, దర్శకత్వం: త్రివిక్రమ్
నిర్మాత: ఎస్.రాధాకృష్ణ(చినబాబు)
సంగీతం: తమన్
డీఓపీ: పి.ఎస్.వినోద్
ఆర్ట్ డైరెక్టర్: ఎ.ఎస్. ప్రకాష్
ఎడిటర్: నవీన్ నూలి
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్
SSMB28, Superstar Mahesh Babu and director Trivikram’s much-awaited collaboration, to release on January 13, 2024
Superstar Mahesh Babu’s SSMB28, directed by filmmaker Trivikram, is undoubtedly one of the most keenly awaited actor-director collaborations among audiences. The film features Pooja Hegde and Sreeleela as female leads. S.Radha Krishna (China Babu) is producing the entertainer under Haarika and Hassine Creations.
The release date of SSMB28 was confirmed today. The film will hit screens on January 13, 2024. With all the commercial ingredients in the right mix, the project promises to be an ideal festive treat. A special poster, confirming the news, features Mahesh Babu in a brand-new stylish avatar, where he sports a beard and a thin moustache, donning a black shirt and blue jeans, while smoking a cigarette in front of a lorry.
A series of red chillies are flying mid air as Mahesh Babu arrives and a few men look up to him. The Super Star is at his massy best in the poster. Some of Mahesh Babu’s best films – Okkadu, Sarileru Neekevvaru, Seethamma Vakitlo Sirimalle Chettu – released for Sankranthi and the unit promises another memorable outing that has all the makings of a blockbuster and will please his fans. The team is believed to be thrilled with the way the film has been shaping up.
SSMB28 is the third association between Mahesh Babu and Trivikram, after two much-celebrated films Athadu and Khaleja. While hit composer S Thaman scores the music for SSMB28, the crew comprises noted technicians including cinematographer PS Vinod, art director AS Prakash and editor Navin Nooli. Other details about the film and its team will be out soon.
Cast & Crew Details:
Stars: Super Star Mahesh Babu, Pooja Hegde, Sreeleela,
Written & Directed by: Trivikram
Music: Thaman S
Cinematography: PS Vinod
Editor: Navin Nooli
Art Director – A.S. Prakash
Producer: S. Radha Krishna(Chinababu)
Presenter – Smt. Mamatha
Banner – Haarika & Hassine Creations
Pro: Lakshmivenugopal
Mar 16 2023
*Behind the Scenes: The Making of Phalana Abbayi Phalana Ammayi – Highlights from the Pre-Release Press Meet*
Mar 15 2023
Kafeefi, Phalana Abbayi Phalana Ammayi’s fourth single, a vibrant, upbeat party number, unveiled
‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ నుంచి పెప్పీ నెంబర్ ‘కఫీఫీ’ విడుదల
‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్యుతానంద’ వంటి ఫీల్ గుడ్ సినిమాలతో ఘన విజయాలను అందుకున్న యువ కథానాయకుడు నాగశౌర్య, దర్శకుడు శ్రీనివాస్ అవసరాల కలయికలో వస్తున్న హ్యాట్రిక్ ఫిల్మ్ ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. కార్తికేయ-2, ధమాకా వంటి వరుస బ్లాక్ బస్టర్లతో దూసుకుపోతున్న ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించింది. టీజీ విశ్వ ప్రసాద్, పద్మజ దాసరి నిర్మాతలు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో మాళవిక నాయర్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మార్చి 17న ఈ చిత్రం థియేటర్లలో భారీస్థాయిలో విడుదల కానుంది. ఈ సినిమాలో మొత్తం ఐదు పాటలున్నాయి. నాలుగు పాటలు, నేపథ్య సంగీతం కళ్యాణి మాలిక్ అందించగా.. ఒక పాట వివేక్ సాగర్ స్వరపరచడం విశేషం. కళ్యాణి మాలిక్ స్వరపరిచిన పాటల్లో ఇప్పటికే మూడు పాటలు విడుదలై ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ‘కనుల చాటు మేఘమా’ పాటకు అద్భుతమైన స్పందన లభించింది. ఇక ఇప్పుడు ఈ చిత్రం నుంచి వివేక్ సాగర్ సంగీతం సమకూర్చిన ‘కఫీఫీ’ పాట విడుదలైంది.
‘కఫీఫీ’ లిరికల్ వీడియోను బుధవారం ఉదయం విడుదల చేశారు మేకర్స్. ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ నుండి ఇప్పటిదాకా విడుదలైన పాటలు హాయిగా, ఆహ్లాదకరంగా సాగే మెలోడీలు అయితే.. ఈ పెప్పీ నెంబర్ మాత్రం అందరిలో ఉత్సాహాన్ని నింపేలా ఉంది. ‘కఫీఫీ’ అంటూ అందరూ కాలు కదిపేలా అద్బుతమైన బాణీ సమకూర్చారు వివేక్. “నలుగురిలో ఉంటే.. చిలిపిగ పోతుంటే.. చనువుకి నో నో చెప్పేదే కఫీఫీ” అంటూ పాట సాగింది. పాట సందర్భానికి, బాణీకి తగ్గట్లుగా కిట్టు విస్సాప్రగడ అందించిన సాహిత్యం అందంగా, అర్థవంతంగా ఉంది. “ఇది అది కాదంటూ.. వివరము వేరంటూ.. పరిమితిలోనే ఉంచేదే కఫీఫీ”, ” పరిధులు లేని వింత సహవాసం పరిగెడుతుంటే తగదుగా” అంటూ మళ్లీ మళ్లీ పాడుకునేలా క్యాచీ లిరిక్స్ తో లోతైన భావాన్ని పలికించారు. గాయకులు బెన్ హ్యూమన్, విష్ణుప్రియ తమ మధుర గాత్రంతో పాటను ఎంతో ఉత్సాహంగా ఆలపించారు.
‘కఫీఫీ’ సాంగ్ ఎంత ఎనర్జిటిక్ గా సాగిందో.. లిరికల్ వీడియోలో నాయకానాయికలు నాగశౌర్య, మాళవిక అంతకంటే ఎనర్జిటిక్ గా కనిపించారు. పబ్ లో జరుగుతున్న పార్టీలో స్నేహితులతో కలిసి నాయకానాయికలు ఉత్సాహంగా చిందేయడం అలరిస్తోంది. ముఖం మీద చిరునవ్వుతో ఇద్దరూ ఎంతో ఆనందంగా కనిపిస్తున్నారు. నువ్వా నేనా అన్నట్లుగా పోటీపడి డ్యాన్స్ చేస్తున్నారు. పాటలోని ఉత్సాహాన్ని, నాయకానాయికలు ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తూ యశ్ మాస్టర్ సమకూర్చిన నృత్య రీతులు ఆకట్టుకుంటున్నాయి. మొత్తానికి ఈ పాటకి థియేటర్లలో అద్భుతమైన స్పందన లభించడం ఖాయమనిపిస్తోంది.
నటీనటులు – నాగ శౌర్య, మాళవిక నాయర్, శ్రీనివాస్ అవసరాల, మేఘ చౌదరి, అశోక్ కుమార్, అభిషేక్ మహర్షి, శ్రీ విద్య, వారణాసి సౌమ్య చలంచర్ల, హరిణి రావు, అర్జున్ ప్రసాద్
నిర్మాతలు – టీజీ విశ్వ ప్రసాద్, పద్మజ దాసరి
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ,దర్శకుడు – - శ్రీనివాస్ అవసరాల
సహ నిర్మాత – వివేక్ కూచిభొట్ల
డీవోపీ – సునీల్ కుమార్ నామ
సంగీతం – కళ్యాణి మాలిక్, వివేక్ సాగర్(కాఫీఫై సాంగ్)
లిరిక్స్ – భాస్కరభట్ల, లక్ష్మి భూపాల, కిట్టు విస్సాప్రగడ
ఎడిటర్ – కిరణ్ గంటి
ఆర్ట్ డైరెక్టర్ – అజ్మత్ అన్సారీ(UK), జాన్ మర్ఫీ(UK), రామకృష్ణ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – సుజిత్ కుమార్ కొల్లి
అసోసియేట్ ప్రొడ్యూసర్స్ – సునీల్ షా, రాజా సుబ్రమణియన్
కొరియోగ్రాఫర్స్ – రఘు, యశ్, రియాజ్, చౌ, గులే
కో-డైరెక్టర్స్ – శ్రీనివాస్ డి, హెచ్.మాన్సింగ్ (హెచ్.మహేష్ రాజ్)
మేకప్ – అశోక్, అయేషా రానా
కాస్ట్యూమ్ డిజైనర్ – హర్ష చల్లపల్లి
పీఆర్ఓ – లక్ష్మీవేణుగోపాల్
Kafeefi, Phalana Abbayi Phalana Ammayi’s fourth single, a vibrant, upbeat party number, unveiled
Phalana Abbayi Phalana Ammayi, a romance drama starring Naga Shaurya and Malvika Nair, directed by Srinivas Avasarala and produced by People Media Factory in collaboration with Dasari Productions, is releasing in theatres on March 17. While three songs composed by Kalyani Malik – Kanula Chatu Meghama, the title track and Neetho Ee Gadichina Kalam – were out recently, the fourth single, Kafeefi, which has music by Vivek Sagar, was out today.
Ben Human and Vishnupriya have crooned for the song written by Kittu Vissapragada. Kafeefi is a party number filmed at a pub on Naga Shaurya, Malvika, Sri Vidya, Abhishek Maharshi and others. While Kafeefi is a word sung by the lead pair on the stage initially, the crowds start finding it catchy and groove to it, much to their surprise.
After a series of warm melodies and a pathos number, Kafeefi lends a unique cosmopolitan flavour to the film’s album. The song is in the comfort zone of the composer, Vivek Sagar, known for his urban, peppy numbers with a catchy musical hook. The trendy orchestration is in sync with the vibe of the situation. Naga Shaurya and Malvika showcase their mettle on the dance floor and respond to choreographer Yash’s instructions with elan.
The opening lines ‘Nalugurilo unte..Chilipiga pothunte…Chanuvuki no no cheppede kafeefi’ have the lead pair elaborating on what kafeefi is all about – precisely, a person’s ability to draw a line even in tricky situations. The other stanzas in the song, with simple, relatable lyrics, emphasise several scenarios where the world around the couple misreads their equation, during which ‘kafeefi’ comes into play. Its happy-go-lucky spirit is sure to resonate with music buffs.
There’s a good buzz for Phalana Abbayi Phalana Ammayi ahead of its release this weekend. Right from the trailer to the teaser and the songs, the makers have promised a pleasant boy-meets-girl story spanning over a decade with stunning visuals, terrific performances and chemistry between the lead pair. Srinivas Avasarala, Megha Chowdhury, Ashok Kumar, Varanasi Soumya Chalamcharla, Harini Rao, Arjun Prasad, and others essay crucial roles in the film too.
Mar 13 2023
Follow Us!