Mar 11 2023
*Phalana Abbayi Phalana Ammayi is a definitive blockbuster and will remain forever in our hearts. The word ‘Phalana’ will create a lot of buzz going forward: Naga Shourya*
* ఘనంగా ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్
* వేడుకలో చిత్ర ట్రైలర్ విడుదల
*సహజంగా, అందంగా ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ ట్రైలర్
ప్రీ రిలీజ్ వేడుకలో యువ హీరో అడివి శేష్ మాట్లాడుతూ.. “ఈ వేడుకకు రావడం చాలా సంతోషంగా ఉంది. విశ్వప్రసాద్ గారు, వివేక్ గారు నా గూఢచారి ప్రొడ్యూసర్స్ మాత్రమే కాదు.. గూఢచారి సేవియర్స్ కూడా. నాకు ఎంతో ఇష్టమైన వారు ఇక్కడ ఉన్నారు. ఈ సినిమా ట్రైలర్ నాకు బాగా నచ్చింది. ఇళయరాజా గారి పాటలు పెట్టుకొని డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటే ఎంత బాగుంటుందో.. ఈ ట్రైలర్ చూస్తే అలా అనిపించింది. దానికి మూల కారణం శ్రీనివాస్ గారి దర్శకత్వం, కళ్యాణి మాలిక్ గారి సంగీతం. ఈ కాంబినేషన్ ఎంతో ఇష్టం. కల్యాణ వైభోగమే సినిమాలో నాగశౌర్య, మాళవిక జోడి ఆకట్టుకుంది. మరోసారి అదే మాయ చేస్తారు అనిపిస్తుంది. మార్చి 17న ఈ సినిమాని తప్పకుండా థియేటర్ లో చూడండి” అన్నారు.
ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ మాట్లాడుతూ.. “వచ్చే వారం విడుదలవుతోన్న ఈ సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది. నేను చూసిన రచయితల్లో, దర్శకుల్లో ఎంతో గొప్ప మనిషి శ్రీనివాస్ అవసరాల. వైజయంతి సినిమాస్, అన్నపూర్ణ స్టూడియోస్, నిరంజన్ గారు కలిసి ఒక కొత్త బ్యానర్ ప్రారంభించి ఈ సినిమా నిర్మించాలి అనుకున్నాము. కానీ కొత్త బ్యానర్ ప్రారంభం ఆలస్యం కావడం వల్ల ఇంత మంచి సినిమాను నిర్మించే అదృష్టం నా మిత్రులకు దక్కింది. కళ్యాణ్ మాలిక్ సహా టీమ్ అందరికీ అభినందనలు తెలుపుతున్నాను” అన్నారు.
చిత్ర దర్శకుడు శ్రీనివాస్ అవసరాల మాట్లాడుతూ.. “ఈ సినిమా స్క్రిప్ట్ దశ నుంచి నాతో ఉన్న విద్యాసాగర్ గారికి థాంక్స్. వివేక్ గారు ఎప్పుడూ పాజిటివ్ గా ఉంటారు. విశ్వప్రసాద్ గారు ఎంతో సపోర్టివ్ గా ఉంటారు. నా సినీ ప్రయాణంలో నాతో కొన్ని పేర్లు ముడి పడ్డాయి. అందులో మొదటగా చెప్పాల్సిన మనిషి కళ్యాణి మాలిక్ గారు. నా సినిమాకి సంగీతం అందించడం అదృష్టంగా భావిస్తున్నాను. భాస్కరభట్ల గారు, లక్ష్మీభూపాల గారు అద్భుతమైన పాటలు రాశారు. భాస్కరభట్ల పదాల బావి. ఊహలుగుసగుసలాడే సినిమా నుంచి సాగుతున్న ఎడిటర్ కిరణ్ గారితో ప్రయాణంలో ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఈ సినిమాకి ఎమోషన్ పండించగల నటి కావాలి. ఈ కథ చెప్పినప్పుడు మాళవిక స్పందన చూసే పూర్తి నమ్మకం వచ్చేసింది. రచయితగా, దర్శకుడిగా నాకు మంచి పేరు వచ్చిందంటే దానికి ప్రధాన కారణం నాగశౌర్య. తను అద్భుతమైన నటుడు. అతని నటన కోసం సెట్ కి ఉత్సాహంగా వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. 1960 నాటి నాకిష్టమైన పాటను ఇందులో రీమిక్స్ చేశాము. ఆ పాటను ఆలపించిన నా మొదటి దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి గారికి ప్రత్యేక కృతఙ్ఞతలు. సునీల్ నామా గారు ఈ కథను సరిగ్గా అర్థం చేసుకొని సినిమాకి అవసరమైన సినిమాటోగ్రఫీని అందించారు. అలాగే నా టీమ్ అందరికీ థాంక్స్” అన్నారు.
చిత్ర కథానాయకుడు నాగశౌర్య మాట్లాడుతూ.. “ఈ వేడుకకు అతిథులుగా వచ్చిన వారంతా నాకు కుటుంబసభ్యులు లాంటి వారు. వారి ఆశీస్సులు ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి అనేది మనం తరచూ ఉపయోగించే మాట. ఈ సినిమా విడుదలయాక ఫలానా శౌర్య, ఫలానా శ్రీనివాస్, ఫలానా మాళవిక అంటారు. ఊహలుగుసగుసలాడే, జ్యోఅచ్యుతానంద సినిమాలను మర్చిపోతారు. ఈ సినిమా మాకు కేరాఫ్ గా నిలుస్తుంది. శ్రీనివాస్ డైరెక్షన్, డైలాగ్స్ అంటే చాలామందికి ఇష్టం. ఆయన డైరెక్షన్ లో నన్ను చూడటం చాలా చాలా ఇష్టం. ఆ నమ్మకంతో చెబుతున్నాడు ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది. నాలుగు సంవత్సరాలుగా టీమ్ అంతా కలిసి ఎంతో కష్టపడి ఈ సినిమా చేశాం. ఆరోగ్యం సహకరించకపోయినా శ్రీనివాస్ గారు ఎప్పుడూ స్క్రిప్ట్ మీద పని చేస్తూనే ఉంటారు. ఆయన హిట్ గురించి, ఫ్లాప్ గురించి మాట్లాడరు.. ఎప్పుడూ స్క్రిప్ట్ గురించే మాట్లాడతారు. కళ్యాణి మాలిక్ గారు ఇచ్చిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి ప్రాణం. విశ్వప్రసాద్ చాలా మంచి ప్రొడ్యూసర్. వరుసగా మంచి సినిమాలు చేస్తున్నారు. నిర్మాతగా పరిచయమవుతున్న దాసరి పద్మ గారికి స్వాగతం. వివేక్ గారు ఎప్పుడూ మంచి సపోర్ట్ ఇస్తారు. కొంతమంది అందమైన అమ్మాయిలు నటిస్తారు.. కానీ నటిస్తున్నప్పుడు అందంగా కనిపించడం చాలా కష్టం.. అది మాళవికలో ఉంది. నాకు ఎంతో ఇష్టమైన నటి మాళవిక. మేమిద్దరం పెద్ద హిట్ కొట్టబోతున్నాం. ఈ సినిమా రికార్డులు బద్దలు కొట్టేస్తుంది అని చెప్పను కానీ.. ఈ సినిమాతో మీ మనస్సులో మేము కుర్చీలు వేసుకొని కూర్చుంటాము. దీని తర్వాత 10 15 ఫ్లాప్ లు తీసినా మమ్మల్ని క్షమిస్తారు. అంత మంచి సినిమా ఇది” అన్నారు.
చిత్ర నాయిక మాళవిక నాయర్ మాట్లాడుతూ.. “శౌర్య గురించి ఎంత చెప్పినా తక్కువే. కళ్యాణ వైభోగమే సినిమాతో మా ప్రయాణం మొదలైంది. నాకు మంచి స్నేహితుడు, నటుడిగా ఎంతో గౌరవిస్తాను. శౌర్యతో కలిసి నటించడం సంతోషంగా ఉంది. శ్రీనివాస్ గారికి సాహిత్యం మీద ఎంతో పట్టుంది. ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. నాకు ఆప్తులైన కళ్యాణి మాలిక్ గారు, లక్ష్మీభూపాల్ గారు ఈ సినిమాలో భాగం కావడం సంతోషంగా ఉంది. మా నిర్మాతలు వివేక్ గారికి, పద్మజ గారికి ధన్యవాదాలు” అన్నారు.
చిత్ర నిర్మాత దాసరి పద్మజ మాట్లాడుతూ.. “ఇంతమంచి సినిమాలో భాగమయ్యే అవకాశమిచ్చిన విశ్వ ప్రసాద్ గారికి, వివేక్ గారికి కృతఙ్ఞతలు. శ్రీనివాస్ గారి, నాగశౌర్య గారి సినిమాలు ఎంతో బాగుంటాయి. ఈ సినిమాతో మరో విజయాన్ని అందుకుంటారని ఆశిస్తున్నాను. మాళవిక పక్కింటి అమ్మాయిలా సహజంగా ఉంటుంది. మూవీ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్” అన్నారు.
చిత్ర సంగీత దర్శకుడు కళ్యాణి మాలిక్ మాట్లాడుతూ.. “ఈ సినిమాలో నాకు నచ్చిన కొన్ని అంశాలు ఉన్నాయి. నాగశౌర్య-మాళవిక జోడి నటన ఎంతగానో ఆకట్టుకుంటుంది. ప్రతి సన్నివేశం చూసినప్పుడు ఇంతకంటే గొప్పగా ఎవరైనా నటించగలరా అనిపించింది. తన మూడో సినిమాకి కూడా నాకు అవకాశమిచ్చిన శ్రీనివాస్ గారికి థాంక్స్. గత రెండు సినిమాల్లాగే ఈ సినిమా కూడా హిట్ అవుతుందనే నమ్మకముంది. సినిమాని ఇంత బాగా ప్రమోట్ చేస్తూ ప్రేక్షకుల్లోకి తీసుకెళ్తున్న నిర్మాతలు విశ్వప్రసాద్, వివేక్, పద్మజ గారికి ధన్యవాదాలు” అన్నారు.
రచయిత, నిర్మాత కోన వెంకట్ మాట్లాడుతూ.. “ఇక్కడికి రావడం ఒక ఫ్యామిలీ ఈవెంట్ కి వచ్చినట్లు ఉంది. అవసరాల శ్రీనివాస్, విశ్వప్రసాద్ గారు, వివేక్ గారు, దాసరి ప్రసాద్ గారు, పద్మ గారు అందరూ నాకు మంచి స్నేహితులు. ప్రసాద్ గారు, పద్మ గారు నిన్నుకోరి షూటింగ్ సమయంలో అమెరికాలో మాకు ఎంతో సహాయం చేశారు. ఈ సినిమాతో వాళ్ళు నిర్మాతలుగా పరిచయం కావడం సంతోషంగా ఉంది. నాగశౌర్య చాలా సహజమైన నటుడు. సరైన పాత్ర పడితే అద్భుతం చేస్తాడు. కళ్యాణి మాలిక్ గారి పాటలు హాయిగా, అద్భుతంగా ఉంటాయి. నేను చింతకాయలరవి సినిమా చేస్తున్న సమయంలో సురేష్ బాబు గారు నాకు శ్రీనివాస్ ని పరిచయం చేశారు. ఆ సినిమాకి శ్రీనివాస్ కొన్ని సన్నివేశాలు కూడా రాశారు. అప్పటినుంచి ఆ బంధం అలా కొనసాగుతుంది. ఈ చిత్రం అందరికీ మంచి విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాను” అన్నారు.
దర్శకుడు బాబీ కొల్లి మాట్లాడుతూ.. “నేను ఈ వేడుకకు రావడానికి ప్రధాన కారణం నిర్మాతలు విశ్వప్రసాద్ గారు, వివేక్ గారు. మన సంతోషాన్ని పంచుకోవడానికి ఇండస్ట్రీలో ఎందరో ఉంటారు. కానీ మన కష్టాన్ని పంచుకునే వ్యక్తులు చాలా తక్కువమంది ఉంటారు. వారిలో వివేక్ గారు ముందు వరుసలో ఉంటారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా చాలా మంచి చేస్తున్నారు విశ్వప్రసాద్ గారు, వివేక్ గారు. నాగశౌర్య గారి కుటుంబానికి సినిమానే ప్రపంచం. శౌర్య మంచి కంటెంట్ ఉన్న సినిమాలతో ముందుకు వెళ్తున్నాడు. ఆయన కటౌట్ కి, కంటెంట్ కి సరైన మాస్ సినిమా పడితే మరోస్థాయికి వెళ్తాడు. శ్రీనివాస్ గారి ఊహలుగుసగుసలాడే సినిమా నాకు చాలా ఇష్టం. ఈ సినిమా దానిని మించిన క్లాసిక్ అవుతుందని నమ్ముతున్నాను. మాళవిక గారు కళ్ళతోనే భావాలు పలికించగల నటి. కళ్యాణి మాలిక్ గారు ఎన్నో క్లాసిక్ సాంగ్స్ ఇచ్చారు. ఈ సినిమాకి మంచి సంగీతం అందించారని అందరూ ప్రశంసిస్తున్నారు” అన్నారు.
దర్శకుడు మారుతి మాట్లాడుతూ.. “దర్శకులు శ్రీనివాస్ సినిమాలలో ఓ ప్రత్యేకత ఉంటుంది. ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి టైటిల్ తోనే మంచి మార్కులు కొట్టేశారు అనిపిస్తుంది. నాగశౌర్య-శ్రీనివాస్ అవసరాల కాంబినేషన్ చాలా బాగుంటుంది. ట్రైలర్ చూస్తుంటూనే ఈ సినిమా ఘన విజయం సాధిస్తుందని అర్థమవుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ కలిసి ఎంతో ఇష్టంతో ఈ సినిమా చేశారు. ఇది చాలా మంచి సినిమా. ఇలాంటి సినిమాలను థియేటర్లోనే చూడండి. ఇది చాలా పెద్ద సినిమా అవుతుంది” అన్నారు.
దర్శకురాలు నందిని రెడ్డి మాట్లాడుతూ.. “పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నా హోమ్ బ్యానర్ లాంటిది. ఈ సినిమాలో భాగమైన వారంతా నాకు అంత్యంత ఆప్తులు. నాగశౌర్య, మాళవిక జంటగా నేను కల్యాణవైభోగమే సినిమా చేశాను. కానీ ఈ ట్రైలర్ చూశాక వీళ్ళతో ఇలాంటి లవ్ స్టోరీ చేయలేకపోయానే అనిపించింది. శ్రీనివాస్ అవసరాల కథలు, సంభాషణలు చాలా బాగుంటాయి. కళ్యాణి మాలిక్ గారి సంగీతం ఎప్పుడూ ప్రత్యేకంగా ఉంటాయి. మా శౌర్య మంచి మనసున్న అబ్బాయి. శౌర్య, మాళవిక ఎంతో ప్రతిభ ఉన్న నటులు. శ్రీనివాస్ లాంటి దర్శకుడికి ఇలాంటి నటులు దొరికితే ఇది ఖచ్చితంగా క్లాసిక్ అవుతుంది” అన్నారు.
సుమ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమం ఆద్యంతం ఆహ్లాదకరంగా సాగింది. నిర్మాతలు ప్రసన్న కుమార్, ఎస్.కె.ఎన్, గీత రచయితలు భాస్కరభట్ల, లక్ష్మీభూపాల్, గాయకుడూ ఆభాస్ జోషి, ఎడిటర్ కిరణ్, నటీనటులు అశోక్ కుమార్, మేఘ చౌదరి, అర్జున్ ప్రసాద్, సౌమ్య, హరిణి, అభిషేక్, శ్రీవిద్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నటీనటులు – నాగ శౌర్య, మాళవిక నాయర్, శ్రీనివాస్ అవసరాల, మేఘ చౌదరి, అశోక్ కుమార్, అభిషేక్ మహర్షి, శ్రీ విద్య, వారణాసి సౌమ్య చలంచర్ల, హరిణి రావు, అర్జున్ ప్రసాద్
నిర్మాతలు – టీజీ విశ్వ ప్రసాద్, పద్మజ దాసరి
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ,దర్శకుడు – - శ్రీనివాస్ అవసరాల
సహ నిర్మాత – వివేక్ కూచిభొట్ల
డీవోపీ – సునీల్ కుమార్ నామ
సంగీతం – కళ్యాణి మాలిక్, వివేక్ సాగర్(కాఫీఫై సాంగ్)
లిరిక్స్ – భాస్కరభట్ల, లక్ష్మి భూపాల, కిట్టు విస్సాప్రగడ
ఎడిటర్ – కిరణ్ గంటి
ఆర్ట్ డైరెక్టర్ – అజ్మత్ అన్సారీ(UK), జాన్ మర్ఫీ(UK), రామకృష్ణ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – సుజిత్ కుమార్ కొల్లి
అసోసియేట్ ప్రొడ్యూసర్స్ – సునీల్ షా, రాజా సుబ్రమణియన్
కొరియోగ్రాఫర్స్ – రఘు, యశ్, రియాజ్, చౌ, గులే
కో-డైరెక్టర్స్ – శ్రీనివాస్ డి, హెచ్.మాన్సింగ్ (హెచ్.మహేష్ రాజ్)
మేకప్ – అశోక్, అయేషా రానా
కాస్ట్యూమ్ డిజైనర్ – హర్ష చల్లపల్లి
పీఆర్ఓ – లక్ష్మీవేణుగోపాల్
*Phalana Abbayi Phalana Ammayi is a definitive blockbuster and will remain forever in our hearts. The word ‘Phalana’ will create a lot of buzz going forward: Naga Shourya*
*Phalana Abbayi Phalana Ammayi’s grand pre-release event with Adivi Sesh, Bobby, Kona Venkat, Maruti, and other celebrities as special guests*
Phalana Abbayi Phalana Ammayi (PAPA) is a heartwarming romantic drama that explores the ups and downs of relationships in modern world. The film follows the story of Naga Shaurya, a charming and carefree young man, and Malvika Nair, a beautiful and independent woman, as they navigate the complexities of love and life. With its compelling storyline, dynamic performances, and vibrant musical score, PAPA is sure to captivate audiences of all ages. The new trailer showcases different stages of the life of the lead pair and how their love evolves over time. There are quirks, lilting tunes, classical BGM, powerhouse performances in PAPA.
*About the pre-release event:*
The pre-release event is graced by cast and crew members Naga Shaurya, Malavika Nair, Srinivas Avasarala, Shreyas, Kiran, Ashok Kumar, Kalyani Malik, Sri Vidya, Sowmya, Abhishek, Sunil Kumar, Bhaskarabatla, Lakshmi Bhupal, and others. Kona Venkat, Adivi Sesh, BVS Ravi, Maruti, Nandini Reddy, and Bobby are present as the special guests.
Editor Kiran proudly said he has edited all Avasarala’s films. He redefined the definition of editing by saying it’s not removal but retaining relevant portions. He said, “I am thankful that Srinivas Avasarala gave this opportunity. We have spent a lot of time on this movie and it came out really well. PAPA is carved with perfection. I travelled to London for the shoot and I was in awe with the actors and their producers.”
Actor Ashok Kumar called watching PAPA will be a different experience and working on the sets of a Srinivas Avasarala film is like a breeze. Megha thanked director Srinivas Avasarala for the trusting her for this project. She said, “I loved all the songs in the movie and my personal favourite is Kanula Chaatu.” Arjun was excited when I heard I will share the screen with Nagar Shourya and Malvika Nair. He said, “I also worked as Asst Director in the UK schedule. Thanks to Srinivas Avasarala for everything.”
Harini Rao said, “I am thankful to everyone present here. Working for this film is like being with friends. Even my favourite song is Kanula Chaatu.” She also hummed Oka Laalana.
Lakshmi Bhupal said, “It feels great to have written the song Kanula Chaatu Meghama. Thanks for everyone for trusting me on this melodious song.”
Bhaskarbhatla wrote three songs for the film and said the songs have good literary values and he wished the team to make more movies and taste success.
Abhishek said, “It was a good meaty role for me, and I thank everyone for that” and Sri Vidya added to that saying “This is my first film officially and I am a bit nervous about it. Thanks for selecting me for Keerthi.”
Singer Aabhas Joshi wished a grand success to the film and sang Kanula Chaatu Meghama on stage.
SKN praised the producers for this project and Nisabdham’s director Hemanth called the pre-release function a family event. He said, “I worked with Srinivas Avasarala in Nishabdam and he is a wonderful human being. Naga Shaurya and Malvika Nair look like the boy and girl next door. I wish them a great success.”
BVS Ravi said, “I am confident the PAPA will have all the classical touches of Srinivas Avasarala. Kalyani Malik’s music is soothing. And I am hopeful that People Media will taste a lot of success”.
Kona Venkat said, “Ninnu Kori movie was shot in the house of the producers of PAPA. I am happy that they turned into producers. My association with Srinivas Avasarala started with Chintakayala Ravi. Phalana is a reference used in Telugu and I want PAPA to be a reference for new-age films.”
Kriti of People factory wished the entire team all the best and Prasanna said the movie title has a good Ugadi feel to it.
Maruti heaped praises on Avasarala. He said, “Srinivas Avasarala has a unique writing style, and it came out in all his films. Srinivas and Naga Shaurya combination is very successful. Please watch PAPA on big screen.”
Malvika Nair thanked all media fraternity for showering love. She said, “As actors we go through many phases, and with Naga Shaurya it has been a delight to have a great journey with him. Srinivas Avasarala has immense knowledge in literature. I am grateful that I have so many well-wishers. Sunil Nama gave a lot of space for me to deliver the best.”
Producer Padmaja said, “Thanks to Vivek and Vishwa to join hands with them. And thanks to Adivi Sesh, Kona Venkat, Bobby and others for gracing this occasion. We love all the movies of Srinivas Avasarala and are excited to watch PAPA on big screen.”
Bobby praised Vishwa Prasad for heading with solid films and wished him and his team a grand success. He said, “Naga Shaurya’s family has a lot of dedication for cinema. I love all Avasarala’s films. Kalyani Malik is always special. I wish PAPA all the best.”
Nandini Reddy said, “People Media film is like a family event. I was jealous whenever I saw the footage of PAPA that I couldn’t create such a romance between Naga Shaurya and Malvika. This film is realistic, something special and wish the team a grand success.”
Sagar said, “PAPA unleashes the sensitive side of Srinivas Avasarala. Srini is a very good psychologist and it’s evident from this film. We will see a different kind of Srini in this film.”
Adivi Sesh said, “Vivek and Vishwa Prasad are my producers and saviours. PAPA is an interesting film and I got vibe of going on a long drive and listening to Ilaiyaraja songs.”
Kalyani Malik said, “What I like about PAPA the most are Naga Shaurya and Malvika Nair. While doing background score, I gave a lot of space to elevate their performances. The lyricists added life to my songs. It’s wonderful to collaborate with Srinivas Avasarala for the third time.”
Srinivas Avasarala said, “I am thankful to everyone who supported me all through the journey, especially Kalyani Malik for the wonderful music for all my films. Bhaskarbhatla and Lakshmi Bhupal for the lyrics. My long-time collaborator editor Kiran Ganti always gave good output. Vivek Kuchibotla’s positive energy is perpetuating everyone. Vishwa Prasad gave immense support. I am happy that Dasari Prasad and Padmaja launched as producers for the film. I am proud to introduce Aabhas Joshi’s voice to Telugu cinema. We also did sync sound for the film. Malvika Nair explored her vulnerable side in the film and exceled at it. The surprise package is Mohankrishna Indraganti whom I launched as a singer in PAPA.”
Naga Shourya said, “I thank friends, family, and film fraternity for coming to the event. After the release of Phalana Abbayi Phalana Ammayi, everyone will refer us with the word ‘Phalana’. PAPA will be a definitive blockbuster. Srinivas Avasarala worked really hard despite his ill health at many times. There were script revisions to make things perfect. There is a special bonding among me, Avasarala, and Kalyani Malik. The music and background score is fabulous. PAPA will remain forever in your hearts.”
*About PAPA and its cast & crew*
PAPA celebrates the magic of love and audience shall experience a real and raw love story like never before. PAPA is produced by T. G. Vishwa Prasad, Padmaja Dasari, People Media Factory in association with Dasari creations. It’s co-produced by Vivek Kuchibotla. The film is gearing up for a big release on March 17 as Ugadi special.
The cast of PAPA includes Naga Shaurya, Malvika Nair, Srinivas Avasarala, Megha Chowdhury, Ashok Kumar, Abhishek Maharshi, Sri Vidya, Varanasi Soumya Chalamcharla, Harini Rao, Arjun Prasad, and others. Srinivas Avasarala penned the story, screenplay, dialogues, and directed the film. The movie is shot beautifully by Sunil Kumar Nama, who is the DOP. Music is composed by Kalyani Malik and Vivek Sagar did one song (Kafeefi). Kiran Ganti edited the film and Azmat Ansari (UK), John Murphy (UK), and Ramakrishna are the art directors. Sujith Kumar Kolli is the film’s Executive producer and Sunil Shah, Raja Subramanian supported the project as Associate producers. Lyrics for the film are by Bhaskarabhatla, Lakshmi Bhupala, Kittu Vissapragada. The dances are choreographed by Raghu, Yash, Riyaz, Chau, and Gule.
Follow Us!