Jun 30 2024
Jun 30 2024
Sithara Entertainments Releases Soothing First Single “Srimathi Garu” from Dulquer Salmaan and Venky Atluri’s “Lucky Baskhar” Composed by GV Prakash Kumar
దుల్కర్ సల్మాన్, వెంకీ అట్లూరి కలయికలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ”లక్కీ భాస్కర్” చిత్రం నుంచి “శ్రీమతి గారు” గీతం విడుదల
వివిధ భాషలలో సినిమాలు చేస్తూ, దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్. తెలుగులోనూ “మహానటి”, “సీతా రామం” వంటి ఘన విజయాలను సొంతం చేసుకున్న ఆయన, ఇప్పుడు “లక్కీ భాస్కర్” అనే మరో వైవిధ్యమైన చిత్రంతో అలరించడానికి సిద్ధమవుతున్నారు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని, ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ భారీ స్థాయిలో నిర్మిస్తోంది.
”లక్కీ భాస్కర్” సినిమాలో బ్యాంక్ క్యాషియర్‌గా మునుపెన్నడూ చూడని కొత్త లుక్‌లో దుల్కర్ సల్మాన్ కనిపిస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్ విశేషంగా ఆకట్టుకొని, సినిమాపై అంచనాలను పెంచేసింది. జాతీయ అవార్డు గ్రహీత జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి “శ్రీమతి గారు” అనే మొదటి గీతాన్ని జూన్ 19వ తేదీన చిత్ర బృందం ఆవిష్కరించింది.
జి.వి. ప్రకాష్ కుమార్ స్వరపరిచిన ఈ మెలోడీ ఎంతో వినసొంపుగా ఉంది. వయోలిన్ తో మొదలై, ఫ్లూట్ మెలోడీగా మారి, డ్రమ్ బీట్‌లతో మరో స్థాయికి వెళ్లి.. జి.వి. ప్రకాష్ కుమార్ ప్రత్యేక శైలిలో ఎంతో అందంగా సాగింది ఈ పాట. విశాల్ మిశ్రా, శ్వేతా మోహన్‌లు తమ మధుర స్వరాలతో చక్కగా ఆలపించి, పాటకు మరింత అందాన్ని తీసుకువచ్చారు.
గీతరచయిత శ్రీమణి అందించిన సాహిత్యం, ఈ గీతానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. “కోపాలు చాలండి శ్రీమతి గారు.. కొంచెం కూల్ అవ్వండి మేడం గారు” అంటూ అందరూ పాడుకునేలా, తేలికైన పదాలతో అర్థవంతమైన సాహిత్యం అందించారు. కోపగించుకున్న భార్య పట్ల భర్తకు గల వాత్సల్యాన్ని తెలుపుతూ, “చామంతి నవ్వు”, “పలుకే ఓ వెన్నపూస” వంటి పదబంధాలను ఉపయోగిస్తూ, గాఢమైన ప్రేమను వ్యక్తీకరించారు.
దర్శకుడు వెంకీ అట్లూరి గత చిత్రం “సార్”లో స్వరకర్త జి.వి. ప్రకాష్ కుమార్, గాయని శ్వేతా మోహన్ కలయికలో వచ్చిన “మాస్టారు మాస్టారు” గీతం ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. ఇప్పుడు ఈ “శ్రీమతి గారు” గీతం కూడా ఆ స్థాయి విజయాన్ని సాధించి, ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటుంది అనడంలో సందేహం లేదు.
1980-90 ల కాలంలో, అసాధారణ విజయాన్ని సాధించిన ఒక సాధారణ బ్యాంక్ క్యాషియర్ యొక్క ప్రయాణాన్ని ”లక్కీ భాస్కర్” చిత్రంలో చూడబోతున్నాం. ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ సరసన మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తోంది.
‘లక్కీ భాస్కర్’ చిత్రానికి అత్యుత్తమ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. నిమిష్ రవి ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి కళా దర్శకుడిగా బంగ్లాన్, ఎడిటర్ గా నవీన్ నూలి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ పాన్ ఇండియా మూవీ తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
తారాగణం: దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి
సంగీతం: జి.వి. ప్రకాష్ కుమార్
ఛాయాగ్రహణం: నిమిష్ రవి
కూర్పు: నవీన్ నూలి
రచన, దర్శకత్వం: వెంకీ అట్లూరి
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
బ్యానర్స్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్
సమర్పణ: శ్రీకర స్టూడియోస్
పీఆర్ఓ: లక్ష్మీ వేణుగోపాల్
Sithara Entertainments Releases Soothing First Single “Srimathi Garu” from Dulquer Salmaan and Venky Atluri’s “Lucky Baskhar” Composed by GV Prakash Kumar
Dulquer Salmaan, the Multi-lingual superstar known in Telugu cinema for blockbusters like “Mahanati” and “Sita Ramam” stars in “Lucky Baskhar” a captivating character drama. Directed by blockbuster filmmaker Venky Atluri, the film is produced by the renowned Telugu production house Sithara Entertainments on a grand scale.
The recently released teaser of “Lucky Baskhar” has heightened expectations showcasing Dulquer Salmaan at his charming best. Now, the makers have unveiled the first single “Srimathi Garu” composed by national award-winning composer GV Prakash Kumar, on June 19th.
The song, sung beautifully by Vishal Mishra and Shwetha Mohan starts with captivating violin sections, transitions into a lilting flute melody and is enriched by drum beats adding grandeur to the composition.
Lyricist Shreemani’s words perfectly capture the tender affection of a husband for his angry wife, using phrases like “Chamanti navvu” and “Paluke oo Vennapoosa” to express deep love. GV Prakash Kumar’s live orchestration with expert use of flute, strings, and simple beats adds to the song’s appeal. Following the success of “Mastaaru Mastaaru” from “SIR” the collaboration of singer Shwetha Mohan, composer GV Prakash Kumar and director Venky Atluri delivers another endearing melody.
Meenakshi Chaudhary plays the leading lady opposite Dulquer Salmaan. Set in the late 1980s and early 1990s, “Lucky Baskhar” follows the journey of an ordinary bank cashier who achieves extraordinary success.
Ace cinematographer Nimish Ravi captures this journey in splendid style, while the talented Banglan contributes his expertise in production design. National Award-winning editor Navin Nooli handles the film’s editing. Produced by Suryadevara Naga Vamsi of Sithara Entertainments and Sai Soujanya of Fortune Four Cinemas with Srikara Studios presenting this pan-India film will release in Telugu, Malayalam, Hindi, and Tamil languages worldwide. More details will be announced soon.
Jun 30 2024
Sithara Entertainments’ Launch Mass Maharaja Ravi Teja’s Landmark Film #RT75 (Production No 28) with Pooja Ceremony
Jun 10 2024
Bobby Kolli, Sithara Entertainments’ release special birthday glimpse from of Nandamuri Balakrishna from NBK109
నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ‘NBK109′ నుండి ప్రత్యేక గ్లింప్స్ విడుదల
తెలుగు చిత్రసీమలో అత్యంత విజయవంతమైన నిర్మాణ సంస్థల్లో ఒకటైన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని భారీస్థాయిలో నిర్మిస్తోంది. జూన్ 10వ తేదీన బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా.. ఆయన శుభాకాంక్షలు తెలుపుతూ ప్రత్యేక గ్లింప్స్ ను విడుదల చేశారు నిర్మాతలు. “జాలి, దయ, కరుణ లాంటి పదాలకు అర్థం తెలియని అసురుడు” అంటూ పవర్ ఫుల్ డైలాగ్ తో బాలకృష్ణ పాత్రను పరిచయం చేసిన తీరు ఆకట్టుకుంది.
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మార్చి 8న ‘NBK109′ నుండి ఇప్పటికే చిత్ర బృందం ఫస్ట్ గ్లింప్స్ ను విడుదల చేయగా విశేష స్పందన లభించింది. ఇక ఇప్పుడు బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ప్రత్యేక గ్లింప్స్ మరింత ఆకర్షణగా ఉంది.
రచయిత, దర్శకుడు బాబీ తన సినిమాల్లో హీరోలను కొత్తగా, పవర్ ఫుల్ గా చూపిస్తుంటారు. అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు మెచ్చేలా ఆయన హీరోల పాత్రలను మలిచే తీరు మెప్పిస్తుంది. ‘NBK109′లో బాలకృష్ణ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉండబోతుందని గ్లింప్స్ ని బట్టి అర్థమవుతోంది. చూడటానికి స్టైలిష్ గా ఉంటూ, అసలుసిసలైన వయలెన్స్ చూపించే పాత్రలో బాలకృష్ణను చూడబోతున్నాం. అభిమానులు, మాస్ ప్రేక్షుకులు బాలకృష్ణను ఎలాగైతే చూడాలి అనుకుంటారో.. అలా ఈ గ్లింప్స్ లో కనిపిస్తున్నారు.
సంచలన స్వరకర్త ఎస్.థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, విజయ్ కార్తీక్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. గ్లింప్స్ లో వారి పనితనం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విజయ్ కార్తీక్ విజువల్స్ కట్టి పడేస్తున్నాయి. ఎస్.థమన్ నేపథ్య సంగీతం గ్లింప్స్ ని మరోస్థాయిలో నిలబెట్టింది.
నిరంజన్ ఎడిటింగ్ బాధ్యత నిర్వహిస్తున్న ఈ చిత్రానికి అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఈ చిత్రంలో ప్రతినాయక పాత్రలో నటిస్తున్నారు.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడించనున్నారు.
Bobby Kolli, Sithara Entertainments’ release special birthday glimpse from of Nandamuri Balakrishna from NBK109
Nandamuri Balakrishna commands Telugu Cinema as “Natural Born King” – NBK, the “God of Masses” and his recent form has been the big talk of the town. He is delivering some memorable characters and huge theatrical blockbusters. Now, he is gearing up to entertain masses with NBK109 in the direction of super successful writer-director Bobby Kolli.
Sithara Entertainments, one of the busiest and most successful production houses of Telugu Cinema, is producing the film on a lavish canvas. The makers have unveiled a special birthday glimpse to introduce the character of Nandamuri Balakrishna, “A Monster that even Evil would fear”.
Already, they released an important glimpse giving us a sneak peek into the world of NBK109 and now, they have introduced the character with a hint about his dangerous mission.
Bobby Kolli has carved a niche for himself in making thundering action blockbuster movies with big stars. Going by the two glimpses released by the makers, he seems to be presenting NBK at his stylish and violent best, in NBK109.
Adding to his stunning visual choreography, S Thaman’s adept background score makes it an experience for viewers. Also, cinematographer Vijay Kartik Kannan presented NBK in mass frames of Bobby Kolli, aptly adhering to the fans’ anticipation.
Niranjan Devaramane’s cuts and Avinash Kolla’s production design also stands out in this monstrous glimpse. Famous Bollywood actor Bobby Deol is playing the antagonist role in the film.
Suryadevara Naga Vamsi and Sai Soujanya of Sithara Entertainments and Fortune Four Cinemas, respectively, are producing the film and Srikara Studios is presenting it. More details will be announced soon.
Jun 1 2024
Hari Hara Veera Mallu to be completed on fast-track
17వ శతాబ్దంలో పేదల పక్షాన పోరాడిన ఒక యోధుడి కథగా రూపొందుతోన్న ఈ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం కోసం, నిర్మాతలు ప్రత్యేకంగా చార్మినార్, ఎర్రకోట సహా మచిలీపట్నం ఓడరేవు వంటి భారీ సెట్‌లను అంతర్జాతీయ స్థాయి నిర్మాణ విలువలతో ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. ఈ సినిమా చేస్తున్నట్లు అధికారిక ప్రకటన వచ్చినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రమే కాదు యావత్ సినీ ప్రేమికులు సైతం చాలా ఆసక్తికరంగా ఎప్పుడెప్పుడు ఈ సినిమా థియేటర్లలో వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో సినిమా యూనిట్ నుంచి ఒక కీలక అప్డేట్ వచ్చింది.
భారతదేశంలోనే అత్యంత డిమాండ్ ఉన్న ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస ఈ సినిమాకి సంబంధించిన సినిమాటోగ్రఫీ బాధ్యతలు స్వీకరించారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించే పనిలో పడ్డారు. అందులో భాగంగానే నిర్మాత ఏం రత్నం, దర్శకుడు జ్యోతి కృష్ణతో పాటు ప్రొడక్షన్ డిజైనర్ తోట తరణి, విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ శ్రీనివాస్ మోహన్‌లతో మనోజ్ పరమహంస చర్చిస్తున్న ఒక ఫోటోని చిత్ర యూనిట్ అధికారికంగా విడుదల చేసింది. అంతేకాదు సినిమాకి సంబంధించిన షూటింగ్ త్వరితగతిన పూర్తిచేసేందుకు కొత్త లొకేషన్ల కోసం రెక్కీ కూడా పూర్తి చేస్తోంది. సమాంతరంగా మరొకపక్క ఇప్పటివరకు షూట్ చేసిన సినిమాకి సంబంధించి వీఎఫ్ఎక్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా శరవేగంగా పూర్తి చేస్తున్నారు.
ఈ ఏడాది చివరి నాటికి హరి హర వీర మల్లు పార్ట్-1 ‘స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ని విడుదల చేయడానికి టీమ్ సిద్ధమవుతోంది. హరిహర వీరమల్లు టీజర్ విడుదలైన తర్వాత సినిమా మీద అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఎప్పుడెప్పుడు సినిమా విడుదలవుతుందా, ఎప్పుడెప్పుడు ఈ విజువల్ వండర్ ని వెండితెరపై చూస్తామా అని ప్రేక్షకులు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.
ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్‌తో పాటు అందాల నటి నిధి అగర్వాల్, బాబీ డియోల్, సునీల్, నోరా ఫతేహి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. జ్ఞానశేఖర్ వి.ఎస్, మనోజ్ పరమహంస ఛాయాగ్రాహకులుగా వ్యవహరిస్తున్నారు.
నటీనటులు & సాంకేతిక నిపుణుల వివరాలు:
తారాగణం: పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్, బాబీ డియోల్, ఎం. నాజర్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు, నోరా ఫతేహి తదితరులు
నిర్మాత: ఎ. దయాకర్ రావు
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
ఛాయాగ్రహణం: జ్ఞానశేఖర్ వి.ఎస్, మనోజ్ పరమహంస
కూర్పు: ప్రవీణ్ కె.ఎల్
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి, చంద్రబోస్
విజువల్ ఎఫెక్ట్స్: హరి హర సుతన్, సోజో స్టూడియోస్, యూనిఫి మీడియా, మెటావిక్స్
కళా దర్శకుడు: తోట తరణి
నృత్య దర్శకులు: బృందా, గణేష్
స్టంట్స్: శామ్ కౌశల్, టోడర్ లాజరోవ్ జుజీ, రామ్-లక్ష్మణ్, దిలీప్ సుబ్బరాయన్, విజయ్ మాస్టర్
పి ఆర్ ఓ: లక్ష్మీవేణుగోపాల్
బ్యానర్: మెగా సూర్య ప్రొడక్షన్
Hari Hara Veera Mallu to be completed on fast-track
Power Star Pawan Kalyan will be seen playing a warrior role in a historical Epic warrior movie, Hari Hara Veera Mallu, for the first time in his career. His fans are overjoyed ever since the announcement and are eagerly waiting for the film to release in theatres.
The Hari Hara Veera Mallu team has surprised everyone with an exhilarating, intense teaser and the fans have gone crazy for the visuals and presentation of their matinee idol on screen. Young director Jyothi Krisna has been key in bringing out the teaser to make a fresh announcement about the film.
Highly sought after cinematographer Manoj Paramahamsa has been roped in for the remainder of the film and the skilled technician immediately started planning the shoot. The team released a photo of him involved in a deep conversation with production designer Thotha Tharani and VFX supervisor Srinivas Mohan alongside producer AM Rathnam and director Jyothi Krisna.
The team is now completing recce for new locations to shoot remainder of the film at a quick pace. Along with that, they are completing VFX and post production works of the film shot till date. The team is determined and on track to release Hari Hara Veera Mallu Part-1 Sword vs Spirit, by the end of this year.
Follow Us!