*’MAD Square’ is 10 Times the Fun of ‘MAD’: Director Kalyan Shankar*

థియేటర్లలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్’ : ప్రెస్ మీట్ లో చిత్ర బృందంబ్లాక్ బస్టర్ చిత్రం ‘మ్యాడ్’కి సీక్వెల్ గా రూపొందుతోన్న ‘మ్యాడ్ స్క్వేర్’ కోసం సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, విష్ణు ఓఐ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ పతాకాలపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. 2025, మార్చి 29న ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో ఈ చిత్రం విడుదల కానుంది. ఇటీవల విడుదలైన టీజర్ కు విశేష స్పందన లభించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం ఐటీసీ కోహినూర్ లో ప్రెస్ మీట్ నిర్వహించిన చిత్ర బృందం, సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.

నార్నే నితిన్ మాట్లాడుతూ, “మ్యాడ్-1 కి అద్భుతమైన స్పందన లభించింది. ఈసారి మ్యాడ్-2 దానికి మించి ఉంటుంది. థియేటర్లలో ఎవరూ సీట్లలో కూర్చొని ఉండరు. అంతలా నవ్వుతారు సినిమా చూస్తూ. ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను.” అన్నారు.

సంగీత్ శోభన్ మాట్లాడుతూ, “మీరు టీజర్ లో చూసింది చాలా తక్కువ. సినిమాలో అంతకుమించిన వినోదం ఉంటుంది. మ్యాడ్ స్క్వేర్ పై అంచనాలు, ఊహించిన దానికంటే ఎక్కువ ఉన్నాయి. మ్యాడ్ సినిమా సమయంలో నిర్మాత వంశీ గారు ఒక మాట చెప్పారు.. సినిమా నచ్చకపోతే టికెట్ డబ్బులు వెనక్కి ఇస్తామని. ఇప్పుడు ఆయన మాటగా నేను చెప్తున్నా.. ఎవరికైనా సినిమా నచ్చకపోతే టికెట్ డబ్బులకి డబుల్ ఇచ్చేస్తాం (నవ్వుతూ). మళ్ళీ సక్సెస్ మీట్ లో కలుద్దాం.” అన్నారు.

రామ్ నితిన్ మాట్లాడుతూ, “మ్యాడ్ సినిమా సమయంలో మాకు అందరూ ఎంతో సపోర్ట్ చేశారు. మొదటి సినిమాకి అంత ఆదరణ రావడం అనేది మామూలు విషయం కాదు. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు హృదయ పూర్వక ధన్యవాదాలు. అలాగే మీడియాకి, ప్రేక్షకులకు కృతజ్ఞతలు.” అన్నారు.

నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ, “మంచి సినిమా తీశాము. మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాము. రెండు గంటల పాటు మనస్ఫూర్తిగా నవ్వుకోవడానికి ఈ సినిమాకి రండి. స్నేహితులతో కలిసి మా సినిమా చూసి ఎంజాయ్ చేయండి.” అన్నారు.

దర్శకుడు కళ్యాణ్ శంకర్ మాట్లాడుతూ, “మ్యాడ్ సినిమాను మీరందరూ చూసి ఎంజాయ్ చేశారు. ‘మ్యాడ్ స్క్వేర్’ అయితే దానికి పది రెట్లు ఉంటుంది. ప్రతి సీనూ మిమ్మల్ని నవ్విస్తుంది. మార్చి 29న విడుదలవుతున్న మా సినిమాని చూసి ఆదరించండి. ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొడుతున్నాం అనే నమ్మకం ఉంది.” అన్నారు.

నిర్మాత హారిక సూర్యదేవర మాట్లాడుతూ, “మ్యాడ్ సినిమా సమయంలో మీడియా ఇచ్చిన సపోర్ట్ ను మర్చిపోలేము. మ్యాడ్ స్క్వేర్ కి కూడా అలాగే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇటీవల విడుదలైన టీజర్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మ్యాడ్ స్క్వేర్ పై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుంది. మ్యాడ్ స్క్వేర్ టైటిల్ కి తగ్గట్టుగానే రెట్టింపు వినోదం ఉంటుంది. మార్చి 29న థియేటర్లలో ఈ సినిమా చూసి హ్యాపీగా నవ్వుకోండి.” అన్నారు.

సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో మాట్లాడుతూ, “మ్యాడ్ ను పెద్ద హిట్ చేశారు. మ్యాడ్ స్క్వేర్ దానిని మించి ఉండబోతుంది. ఈ సినిమా ఘన విజయం సాధిస్తుందని బలంగా నమ్ముతున్నాను. కళ్యాణ్ గారు లాంటి దర్శకుడితో పని చేయడం సంతోషంగా ఉంది. మునుముందు మరిన్ని మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. వంశీ గారికి, చినబాబు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ సినిమాలో నటించిన ముగ్గురు హీరోలూ భవిష్యత్ లో పెద్ద స్టార్ లు అవుతారు. పాటలను పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు నా ధన్యవాదాలు. మార్చి 29న విడుదలవుతున్న మా మ్యాడ్ స్క్వేర్ సినిమాని చూడండి. మీ అందరికీ నచ్చుతుంది.” అన్నారు.

చిత్రం: మ్యాడ్ స్క్వేర్
విడుదల తేదీ: మార్చి 29, 2025
బ్యానర్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ & ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకరా స్టూడియోస్

తారాగణం: సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్‌, విష్ణు ఓఐ
దర్శకత్వం: కళ్యాణ్ శంకర్
సమర్పణ: సూర్యదేవర నాగ వంశీ
నిర్మాతలు: హారిక సూర్యదేవర, సాయి సౌజన్య
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
ఛాయాగ్రహణం: శామ్‌దత్ ISC
కూర్పు: నవీన్ నూలి
ప్రొడక్షన్ డిజైనర్: శ్రీ నాగేంద్ర తంగాల
అదనపు స్క్రీన్ ప్లే: ప్రణయ్ రావు తక్కళ్లపల్లి
కళ: పెనుమర్తి ప్రసాద్ M.F.A
ఫైట్ మాస్టర్: కరుణాకర్
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్

*’MAD Square’ is 10 Times the Fun of ‘MAD’: 

Director Kalyan Shankar*The highly anticipated MAD Square, boasting a vibrant and talented young cast, is set for a grand theatrical release worldwide on March 29. With filming wrapped and post-production in full swing, the team shared their enthusiasm at a press meet in Hyderabad. Producers Suryadevara Naga Vamsi and Harika Suryadevara, Music Director Bheems Ceciroleo, Director Kalyan Shankar, and actors Ram Nithin, Sangeet Sobhan, and Narne Nithin expressed unwavering confidence in the film’s blockbuster appeal.

Producer Suryadevara Naga Vamsi said, “We’ve crafted an exceptional film, and we’re hopeful it’ll strike a chord with all of you. Get ready for two hours of pure, hearty laughter—bring your friends and join us for an unforgettable joyride.”

Harika Suryadevara, producer, added, “We are overwhelmed by the incredible response to the teaser. MAD Square carries huge expectations, and we are committed to not only meeting but exceeding them. True to its title, this film will be a mad square.”

Music Director Bheems Ceciroleo stated, “I’m confident that MAD Square is going to be a massive blockbuster. The energy of the film is unmatched, and it’s poised to take the careers of all three leads to new heights.”

Actor Ram Nithin, reflecting on his journey, shared, “I’m forever grateful to the audience for the love they showed my previous film, MAD. I owe this opportunity to my director and producers, and I’m thrilled to be part of MAD Square.”

Director Kalyan Shankar promised a larger-than-life experience, stating, “I assure you, MAD Square is 10 times the fun of MAD. I’m confident that when the audience watches it on March 29, they’ll agree.”

Actor Sangeet Sobhan teased, “What you saw in the teaser is just 1% of what’s in store. MAD Square doubles the entertainment quotient, and we can’t wait for you to experience it.”

Rounding off the enthusiasm, Narne Nithin said, “MAD Square is a full-length laugh riot. I swear the audience won’t be able to stay seated—it’s that entertaining!”

With its high-energy vibe, stellar cast, and promise of non-stop entertainment, MAD Square is gearing up to take audiences by storm on its grand release date, March 29.

About MAD Square

MAD Square is the sequel to the blockbuster movie MAD, which was released in October 2023. A coming-of-age comedy-drama, the film revolves around the antics of three college friends and the hilarious situations surrounding them. The sequel promises to deliver double the fun and double the madness!

Title: Mad Square
Release Date: March 29, 2025
Banner: Sithara Entertainments, Fortune Four Cinemas & Srikara Studios

Cast: Narne Nithin, Sangeeth Shobhan, Narne Nithin, Ram Nithin
Director: Kalyan Shankar
Presenter: Suryadevara Naga Vamsi
Producers: Haarika Suryadevara & Sai Soujanya
Music: Bheems Ceciroleo
Editor: Navin Nooli
DOP: Shamdat (ISC)
Production Designer: Sri Nagendra Tangala
Additional Screenplay: Pranay Rao Takkallapalli
Art Director: Penumarty Prasad M.F.A
Fight Master: Karunakar

 GANI8914 GANI7961 GANI7966 GANI8912

*Sithara Entertainments, a powerhouse in Telugu cinema, is bringing a cinematic spectacle “RETRO” starring Suriya for Telugu audiences*

సూర్య నటిస్తున్న ‘రెట్రో’ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్న సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ చేతికి సూర్య ‘రెట్రో’ తెలుగు హక్కులు

విభిన్న చిత్రాలు, పాత్రలలో ప్రేక్షకుల హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు ప్రముఖ నటుడు, జాతీయ అవార్డు విజేత సూర్య. ప్రస్తుతం సూర్య నటిస్తున్న రెట్రో చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. టీజర్‌తో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ చిత్రం మే 1న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సొంతం చేసుకుంది.

ఒక వైపు వరుస సినిమాలను నిర్మిస్తూ భారీ విజయాలను అందుకుంటున్న సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, మరోవైపు పంపిణీ రంగంలోనూ తనదైన ముద్ర వేస్తోంది. లియో (తమిళం), దేవర (తెలుగు), భ్రమయుగం (మలయాళం) వంటి చిత్రాలను తెలుగునాట విజయవంతంగా పంపిణీ చేసింది. ఇప్పుడు తెలుగులో రెట్రో చిత్రాన్ని విడుదల చేస్తుంది. సితార పంపిణీ చేస్తుందంటే, తెలుగు రాష్ట్రాల్లో భారీ విడుదల ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సూర్య తెలుగు అభిమానులు థియేటర్లలో పండుగ జరుపుకునేలా ఘనంగా రెట్రో విడుదల ఉండనుంది.

ప్రతిభగల దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రెట్రో రూపొందుతోంది. భారీ తారాగణంతో, అద్భుతమైన సాంకేతిక బృందంతో, కార్తీక్ సుబ్బరాజ్ శైలి విలక్షణమైన దర్శకత్వ ముద్రతో.. ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని కలిగించేలా రెట్రో రూపుదిద్దుకుంటోంది. ప్రచార చిత్రాలు కూడా విశేషంగా ఆకట్టుకోవడంతో, ఈ ఏడాది ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటిగా రెట్రో నిలిచింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.

ఈ చిత్రంలో పూజా హెగ్డే, జోజు జార్జ్, జయరామ్, నాజర్, ప్రకాష్ రాజ్ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ స్వరకర్తగా వ్యవహరిస్తున్నారు.

సూర్య, జ్యోతిక నేతృత్వంలోని ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ 2D ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రెట్రో రూపొందుతోంది. ఈ చిత్రంతో కార్తీక్ సుబ్బరాజ్, తన అసాధారణ ప్రతిభతో వెండితెరపై అద్భుతం సృష్టించడానికి సిద్ధమవుతున్నారు.

రెట్రో తెలుగు హక్కులను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సొంతం చేసుకోవడంతో తెలుగునాట ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే తెలుగు రాష్ట్రాల్లో రెట్రోను భారీ స్థాయిలో విడుదల చేయనున్నట్లు సితార సంస్థ తెలిపింది.

*Sithara Entertainments, a powerhouse in Telugu cinema, is bringing a cinematic spectacle “RETRO” starring Suriya for Telugu audiences*

The highly anticipated film “RETRO,” featuring acclaimed national award-winning actor Suriya, is poised to make a massive impact. The film captured everyone’s attention with the powerful teaser and is all set to release on May 1st. The much-awaited film is releasing in Telugu states, with Telugu theatrical rights acquired by Sithara Entertainments.

Known for delivering blockbuster theatrical experiences, Sithara Entertainments has successfully distributed films like Leo (Tamil), Devara (Telugu), and Brahmayugam (Malayalam) across industries. Now, they are releasing RETRO in Telugu. A massive release in Telugu states is guaranteed, and Suriya Telugu fans are ready to celebrate RETRO on the next level in theaters.

With its captivating premise, stellar cast, and Karthik Subbaraj’s distinctive directorial touch, the film promises to offer an electrifying retro ride. With every content, RETRO is shaping up to be one of the most awaited releases of the year. The post-production work for the film is happening firmly.

The film has impressive ensemble cast, including, Pooja Hegde, Joju George, Jayaram, Nassar, and Prakash Raj among others in pivotal roles. The music for the film has been composed by the acclaimed Santhosh Narayanan.

Backed by 2D Entertainment, the prestigious banner led by Suriya and Jyotika, RETRO is set to redefine cinematic brilliance with the dynamic vision of Karthik Subbaraj at the helm.

The buzz around RETRO is soaring high, and with Sithara Entertainments on board, the Telugu theatrical release promises to be massive!
RETRO-TELUGU-SitharaEnts-PLAIN RETRO-TELUGU-SitharaEnts

Lucky Baskhar Creates History as the First South Indian Film to Trend for 13 Weeks consecutively on Netflix!

చరిత్ర సృష్టించిన లక్కీ భాస్కర్ చిత్రం

నెట్‌ఫ్లిక్స్‌లో వరుసగా 13 వారాల పాటు ట్రెండ్ అయిన మొదటి దక్షిణ భారతీయ చిత్రంగా చరిత్ర సృష్టించిన లక్కీ భాస్కర్దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన చిత్రం లక్కీ భాస్కర్. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. అక్టోబర్ 31, 2024 న విడుదలైన థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు, ప్రేక్షకుల మెప్పు పొందింది. బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించిన లక్కీ భాస్కర్, దుల్కర్ సల్మాన్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. తాజాగా ఈ చిత్రం మరో చరిత్ర సృష్టించింది.

ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో లక్కీ భాస్కర్ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు బ్రహ్మరథం పడుతున్నారు. దాంతో నెట్‌ఫ్లిక్స్‌లో వరుసగా 13 వారాల పాటు ట్రెండ్ అయిన మొదటి దక్షిణ భారతీయ చిత్రంగా సరికొత్త చరిత్ర సృష్టించింది.

కట్టిపడేసే కథా కథనాలు, నటీనటుల అద్భుత నటన, సాంకేతిక నిపుణుల పనితీరు.. ఇలా అన్నీ తోడై లక్కీ భాస్కర్ ను గొప్ప చిత్రంగా నిలిపాయి. అందుకే అప్పుడు థియేటర్లలో, ఇప్పుడు ఓటీటీలో ఈ స్థాయి స్పందన లభిస్తోంది. ఈ చిత్రం యొక్క వైవిద్యమైన కథాంశం, భాషతో సంబంధం లేకుండా అందరి మన్ననలు పొందుతోంది. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం కథకి ప్రాణం పోసింది. ఇక భాస్కర్ పాత్రలో ఒదిగిపోయిన దుల్కర్ సల్మాన్, తన అత్యుత్తమ నటనతో సినిమాని మరో స్థాయికి తీసుకెళ్ళారు. అలాగే చిత్రాన్ని ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయేలా చేశారు.

నెట్‌ఫ్లిక్స్‌లో ప్రీమియర్‌ని ప్రదర్శించినప్పటి నుండి, లక్కీ భాస్కర్ చిత్రం స్ట్రీమింగ్ ట్రెండ్‌లలో ఆధిపత్యం చెలాయించింది. మిలియన్ల కొద్దీ వీక్షణలను పొందడంతోపాటు, ప్రపంచవ్యాప్తంగా ఎందరో ప్రేక్షకులకు అభిమాన చిత్రంగా మారింది. మొదటి వారంలో ఏకంగా 15 దేశాలలో నెట్‌ఫ్లిక్స్ యొక్క టాప్ 10లో మొదటి స్థానాన్ని పొందింది. అలాగే 17.8 బిలియన్ నిమిషాల వీక్షణలతో, రెండు వారాల పాటు ప్రపంచవ్యాప్తంగా రెండవ స్థానంలో నిలిచింది. ఇక ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో వరుసగా 13 వారాల పాటు ట్రెండ్ అయిన తొలి సౌత్ ఇండియన్ సినిమాగా చరిత్ర సృష్టించింది.

నెట్‌ఫ్లిక్స్‌లో లక్కీ భాస్కర్ చిత్రం సరికొత్త చరిత్ర సృష్టించడంతో చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేసింది. మీలో ఎవరైనా ఇంకా ఎవరైనా లక్కీ భాస్కర్ చిత్రాన్ని చూడనట్లయితే వెంటనే నెట్‌ఫ్లిక్స్‌ లో వీక్షించి, భాస్కర్ ప్రయాణాన్ని ఆస్వాదించండి.

Lucky Baskhar Creates History as the First South Indian Film to Trend for 13 Weeks consecutively on Netflix!

Dulquer Salmaan’s Lucky Baskhar has achieved a record breaking milestone becoming the first South Indian film to trend on Netflix for 13 consecutive weeks! Directed by Venky Atluri and produced by Naga Vamsi S and Sai Soujanya. The film continues to win hearts across the globe.From its theatrical release to its digital run, Lucky Baskhar has been a massive success praised for its gripping storyline, standout performances and soul stirring music by G.V. Prakash Kumar. Dulquer Salmaan delivers one of his finest performances as Baskhar, bringing both depth and charisma to a story that has resonated with audiences of all generations.

Since premiering on Netflix, the film has dominated streaming trends gaining millions of views and cementing its place as audience favourite worldwide. In its first week, it trended #1 on Netflix’s Top 10 in over 15 countries and held the #2 spot globally for two weeks with an impressive 17.8 billion minutes viewed. It has now made history as the first South Indian film to trend for 13 consecutive weeks on Netflix.
With this historic achievement,

Sithara Entertainments, Fortune Four Cinemas and the entire team behind the film celebrate a truly remarkable feat. If you haven’t watched it yet, Lucky Baskhar is now streaming on Netflix.

Luckybhaskar NF LB Still

MAD Square: MAD Gang is BACK and it’s crazier than ever!

MAD Square: MAD Gang is BACK and it’s crazier than ever!

The teaser for this highly awaited sequel released today and it’s a blasting stuff all the way. Mad team is pulling out all the stops to make MAD Square a memorable summer entertainer.

Helmed once again by Kalyan Shankar. MAD Square brings back our favorite mischief makers, Narne Nithin, Sangeeth Shobhan, Ram Nithin & Vishnu Oi (Laddu) who redefined entertainment with their infectious energy in the First Part. The teaser is a laugh riot packed with crackling chemistry, perfect punchlines and over the top madness.

Shamdat Sainudeen is the cinematographer. Editing by the National Award Winner Navin Nooli. Bheems Ceciroleo is back with a score that’s as catchy as it is enchanting.

Backed by the powerhouse trio of Sithara Entertainments, Fortune Four Cinemas and Srikara Studios with producers Haarika Suryadevara and Sai Soujanya and presenter Suryadevara Naga Vamsi, this film has all the makings of a blockbuster. Set to hit theaters on March 29, 2025.

Movie: Mad Square
Release Date: March 29, 2025
Genre: Comedy Drama
Banner: Sithara Entertainments & Fortune Four Cinemas
Presented by: Srikara Studios

Cast: Narne Nithin, Sangeeth Shobhan, Ram Nithin, Vishnu Oi
Director: Kalyan Shankar
Producer: Suryadevara Naga Vamsi
Music: Bheems Ceciroleo
Editor: Navin Nooli
DOP: Shamdat (ISC)
Production Designer: Sri Nagendra Tangala
Additional Screenplay: Pranay Rao Takkallapalli
Art Director: Penumarty Prasad M.F.A
Fight Master: Karunakar

‘మ్యాడ్ స్క్వేర్’ టీజర్ విడుదల.. పొట్టచెక్కలు అయ్యేలా నవ్వించడానికి ‘మ్యాడ్’ గ్యాంగ్ వచ్చేసింది!

‘మ్యాడ్’కి రెట్టింపు వినోదాన్ని పంచనున్నట్లు టీజర్ తో హామీ ఇచ్చిన ‘మ్యాడ్ స్క్వేర్’!

బ్లాక్ బస్టర్ చిత్రం ‘మ్యాడ్’కి సీక్వెల్ గా ‘మ్యాడ్ స్క్వేర్’ను ప్రకటించినప్పటి నుండి, సినీ ప్రియులంతా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘లడ్డు గానీ పెళ్లి’, ‘స్వాతి రెడ్డి’ పాటలు ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇప్పుడు ఆ అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లేలా ‘మ్యాడ్ స్క్వేర్’ నుంచి టీజర్ విడుదలైంది.

అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న ‘మ్యాడ్ స్క్వేర్’ టీజర్ ఈరోజు విడుదలైంది. విడుదలైన నిమిషాల్లోనే ఈ టీజర్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఈ వేసవికి ‘మ్యాడ్ స్క్వేర్’, ప్రేక్షకులకు మరిచిపోలేని వినోదాన్ని పంచనుందని టీజర్ తో స్పష్టమైంది.

మ్యాడ్ సినిమాలో తనదైన ప్రత్యేక శైలి హాస్య సన్నివేశాలు, ఆకర్షణీయమైన కథనంతో ఎంతో పేరు తెచ్చుకున్న దర్శకుడు కళ్యాణ్ శంకర్, ఈ సీక్వెల్ తో మరోసారి నవ్వుల విందుని అందించబోతున్నారు. మొదటి భాగంలో తమ అల్లరితో నవ్వులు పూయించిన నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ మరియు విష్ణు ఓఐ (లడ్డు).. ‘మ్యాడ్ స్క్వేర్’లో అంతకుమించిన అల్లరి చేయబోతున్నారు. టీజర్ లో వారి అల్లరి, పంచ్ డైలాగ్ లు కడుపుబ్బా నవ్విస్తున్నాయి.

‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రానికి సంగీత సంచలనం భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు చార్ట్‌బస్టర్‌లుగా నిలిచాయి. ప్రముఖ ఛాయగ్రాహకుడు శామ్‌దత్ కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.

మ్యాడ్ స్క్వేర్ ను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ పతాకాలపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ప్రేక్షకులు ఊహించిన దానికంటే ఎక్కువ వినోదాన్ని, ఎక్కువ మ్యాడ్ నెస్ ను మ్యాడ్ స్క్వేర్ లో చూడబోతున్నారని చిత్ర బృందం తెలిపింది. 2025, మార్చి 29న ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో ఈ చిత్రం విడుదల కానుంది.

చిత్రం: మ్యాడ్ స్క్వేర్
విడుదల తేదీ: మార్చి 29, 2025
బ్యానర్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ & ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకరా స్టూడియోస్

తారాగణం: సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్‌, విష్ణు ఓఐ
దర్శకత్వం: కళ్యాణ్ శంకర్
సమర్పణ: సూర్యదేవర నాగ వంశీ
నిర్మాతలు: హారిక సూర్యదేవర, సాయి సౌజన్య
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
ఛాయాగ్రహణం: శామ్‌దత్ ISC
కూర్పు: నవీన్ నూలి
ప్రొడక్షన్ డిజైనర్: శ్రీ నాగేంద్ర తంగాల
అదనపు స్క్రీన్ ప్లే: ప్రణయ్ రావు తక్కళ్లపల్లి
కళ: పెనుమర్తి ప్రసాద్ M.F.A
ఫైట్ మాస్టర్: కరుణాకర్
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్

M2-Still-1 M2-Still-3 (1)

Hari Hara Veera Mallu Second Single – An Instant Chartbuster!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మక చిత్రం ‘హరి హర వీరమల్లు’ నుంచి రెండవ గీతం ‘కొల్లగొట్టినాదిరో’ విడుదల

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘హరి హర వీరమల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు ఈ చిత్రాన్ని భారీస్థాయిలో నిర్మిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న ‘హరి హర వీర మల్లు’ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ‘మాట వినాలి’ గీతం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సినిమా నుంచి రెండవ గీతం విడుదలైంది.

‘హరి హర వీర మల్లు’ నుంచి రెండవ గీతంగా విడుదలైన ‘కొల్లగొట్టినాదిరో’ పాట అద్భుతంగా ఉంది. ఈ గీతం సినిమాపై అంచనాలను మరోస్థాయికి తీసుకెళ్ళింది. పాట ప్రారంభం నుంచి ముగింపు వరకు.. ఎంతో వినసొంపుగా, శ్రోతలను కట్టిపడేసేలా సాగింది. ఇక పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రజెన్స్ లిరికల్ వీడియోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పవన్ కళ్యాణ్ సరసన జంటగా నటించిన నిధి అగర్వాల్ పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చారు. తెరపై ఈ జోడి చూడముచ్చటగా ఉంది. అలాగే ఈ పాటలో అనసూయ భరద్వాజ్, పూజిత పొన్నాడ మెరిసి తమ నృత్యంతో అదనపు ఆకర్షణగా నిలిచారు.

ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి స్వరపరిచిన ‘కొల్లగొట్టినాదిరో’ గీతం సంగీత ప్రియులను మంత్రముగ్ధులను చేస్తోంది. బహుళ భాషల్లో విడుదలైన ఈ గీతాన్ని ప్రతిభగల గాయనీ గాయకులు మంగ్లీ, రాహుల్ సిప్లిగంజ్, రమ్య బెహరా, యామిని ఘంటసాల, ఐరా ఉడిపి, మోహన భోగరాజు, వైష్ణవి కన్నన్, సుదీప్ కుమార్, అరుణ మేరీ ఆలపించి పాటకు మరింత మాధుర్యం తీసుకొచ్చారు.

కీరవాణి యొక్క అద్భుతమైన స్వరకల్పనకు తెలుగులో చంద్రబోస్, తమిళంలో పా. విజయ్, మలయాళంలో మంకొంబు గోపాలకృష్ణన్, కన్నడలో వరదరాజ్, హిందీలో అబ్బాస్ టైరేవాలా సాహిత్యం అందించారు.

హరి హర వీరమల్లు చిత్రం 17వ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో భారీ బడ్జెట్ తో పీరియడ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. పవన్ కళ్యాణ్ చారిత్రాత్మక యోధుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో బాబీ డియోల్, నిధి అగర్వాల్, నర్గీస్ ఫక్రీ, నోరా ఫతేహి వంటి ప్రముఖ నటీనటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

‘హరి హర వీరమల్లు’ చిత్రానికి చిత్రానికి జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. 2025, మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానున్న ఈ చిత్రం, బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తుందని చిత్ర బృందం నమ్మకంగా ఉంది.

ప్రముఖ ఛాయగ్రాహకుడు మనోజ్ పరమహంస కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ సినిమాకి, లెజెండరీ కళా దర్శకుడు తోట తరణి అద్భుతమైన సెట్ లను రూపొందించారు. ప్రముఖ వీఎఫ్ఎక్స్ సూపర్‌వైజర్, ‘బాహుబలి’ ఫేమ్ శ్రీనివాస్ మోహన్, హాలీవుడ్ దిగ్గజ యాక్షన్ దర్శకుడు నిక్ పావెల్ ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి పని చేస్తున్నారు.

తారాగణం: పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్, బాబీ డియోల్, నాజర్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు, నరా ఫతేహి
దర్శకత్వం: క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ
నిర్మాత: ఎ. దయాకర్ రావు
సమర్పణ: ఎ. ఎం. రత్నం
బ్యానర్: మెగా సూర్య ప్రొడక్షన్స్
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
ఛాయాగ్రహణం: మనోజ్ పరమహంస, జ్ఞానశేఖర్ వి.ఎస్
కూర్పు: ప్రవీణ్ కె.ఎల్
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి, చంద్రబోస్, పెంచల్ దాస్
విజువల్ ఎఫెక్ట్స్: హరి హర సుతాన్, సోజో స్టూడియోస్, యూనిఫై మీడియా, మెటావిక్స్
కళా దర్శకుడు: తోట తరణి
నృత్య దర్శకత్వం: బృందా, గణేష్
స్టంట్స్: శామ్ కౌశల్, టోడర్ లాజారో జుజీ, రామ్ – లక్ష్మణ్, దిలీప్ సుబ్బరాయన్, విజయ్ మాస్టర్
పీఆర్ఓ: లక్ష్మివేణుగోపాల్

Hari Hara Veera Mallu Second Single – An Instant Chartbuster!

The much awaited second single from Powerstar Pawan Kalyan’s upcoming magnum opus Hari Hara Veera Mallu is finally out and it has become an instant blockbuster further raising expectations for the film!

Right from the very first note, the song hooks listeners with its high energy beats and electrifying vibe. Pawan Kalyan’s unmatched screen presence after a long time adds to the excitement keeping fans glued to their screens. Nidhhi Agerwal, who pairs opposite the Pawan Kalyan brings a refreshing charm to the visuals making their on screen chemistry a delight to watch. The song also features Anasuya Bharadwaj and Pujitha Ponnada adding grace and elegance with their dance moves.

Composed by Oscar-winning music director M.M. Keeravani, the song is an absolute earworm enchating listeners from the very first play. The track features an ensemble of powerhouse singers across multiple languages – Mangli, Rahul Sipligunj, Ramya Behara, Yamini Ghantasala, Airaa Udupi, Mohanabhogaraju, Vaishnavi Kannan, Sudeep Kumar and Aruna Mary each bringing their unique touch to this mesmerizing composition.

The soulful and impactful lyrics penned by Chandrabose, Abbas Tyrewala, PA Vijay, Varadharaj Chikkaballapura and Mankombu Gopalakrishnan add another layer of magic making this track even more special.

Directed by Jyothi Krishna, Krish Jagarlamudi and backed by AM Ratnam under Mega Surya Production. Hari Hara Veera Mallu is set to be the first major release of Summer 2024, Hitting the big screens on March 28th. This larger than life spectacle promises to take the box office by storm.

 HHVM 2nd Single-Plain-01 (1) HHVM 2nd Single-Plain-02