*MAD SQUARE – A Summer Celebration on the Big Screens*

‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రానికి కుటుంబ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు : దర్శకుడు కళ్యాణ్ శంకర్

వేసవిలో వినోదాన్ని పంచడానికి థియేటర్లలో అడుగుపెట్టిన ‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రం ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందుతూ, భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. బ్లాక్ బస్టర్ చిత్రం ‘మ్యాడ్’కి సీక్వెల్ గా రూపొందిన ఈ ‘మ్యాడ్ స్క్వేర్’లో నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్‌ ప్రధాన పాత్రలు పోషించారు. కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. శ్రీకర స్టూడియోస్ తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించారు. ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ సమర్పకులు. భీమ్స్ సిసిరోలియో పాటలను స్వరపరచగా, తమన్ నేపథ్య సంగీతం అందించారు. భారీ అంచనాల నడుమ ‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రం మార్చి 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్లలో నవ్వులు పూయిస్తున్న ఈ చిత్రం.. మూడు రోజులలోనే ప్రపంచవ్యాప్తంగా రూ.55.2 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో ముచ్చటించిన దర్శకుడు కళ్యాణ్ శంకర్ తన ఆనందాన్ని పంచుకున్నారు.

‘మ్యాడ్’కి రెట్టింపు వినోదం ‘మ్యాడ్ స్క్వేర్’తో అందిస్తామని చెప్పారు. ఆ మాట నిలబెట్టుకున్నాం అనుకుంటున్నారా?
ఖచ్చితంగా. స్వయంగా కొన్ని థియేటర్లకు వెళ్ళి చూశాం. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరూ సినిమా చూసి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మ్యాడ్ ఎక్కువగా యువతకి చేరువైంది. కానీ, మ్యాడ్ స్క్వేర్ చిత్రాన్ని యువతతో పాటు, కుటుంబ ప్రేక్షకులు కూడా ఆదరిస్తున్నారు.

ఈ స్థాయి స్పందన ముందే ఊహించారా?
లేదండి. సినిమాకి మంచి ఆదరణ లభిస్తుందనే నమ్మకం ఉంది కానీ, మ్యాడ్-1 ఫుల్ రన్ కలెక్షన్స్ ని మొదటి రోజే రాబట్టే స్థాయిలో మ్యాడ్ స్క్వేర్ పై అంచనాలు ఉన్నాయని అసలు ఊహించలేదు.

“పెద్ద కథ ఆశించి సినిమాకి రాకండి, సరదాగా నవ్వుకోవడానికి రండి” అని ముందే చెప్పడం ఎంతవరకు ప్లస్ అయింది?
చాలా ప్లస్ అయింది. మన సినిమా ఎలా ఉండబోతుందో ముందే చెబితే, ప్రేక్షకులకు అందుకు తగ్గ అంచనాలతోనే థియేటర్ కి వస్తారు. రాజమౌళి గారు కూడా సినిమా మొదలుపెట్టే ముందే కథ ఇలా ఉండబోతుంది అని చెప్తుంటారు. అలా చెప్పడం వల్ల ప్రేక్షకులను మనం ముందే ప్రిపేర్ చేసినట్టు అవుతుంది.

సెకండ్ హాఫ్ డల్ అయిందనే మాటలు కొన్ని వినిపించాయి కదా?
మొదటి షోకి కొందరు అలా అన్నారు కానీ, తర్వాత షోల నుంచి ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో సునీల్ గారికి, మురళీధర్ గారికి మధ్య వచ్చే సన్నివేశాలను చూసి ఫ్యామిలీ ఆడియన్స్ బాగా నవ్వుకుంటున్నారు. ఆంథోనీ క్యారెక్టర్ కి కూడా మంచి స్పందన లభిస్తోంది.

మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి..?
మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ థియేటర్ లో సినిమా చూసి 15 ఏళ్ళు అవుతుంది. అలాంటావిడ మ్యాడ్ స్క్వేర్ టీజర్ చూసి, సినిమాకి తీసుకెళ్లమని అడిగారట. సినిమా చూస్తూ నవ్వినవ్వి కళ్ళలో నీళ్లు తిరిగాయి అన్నారట. ఆ వయసు వాళ్ళు నా సినిమా చూసి, అంతలా నవ్వుకున్నామని చెప్పడాన్ని.. నేను బెస్ట్ కాంప్లిమెంట్ గా భావిస్తున్నాను.

నిర్మాత చినబాబు గారి గురించి?
చినబాబు గారు మొదటి నుంచి మాకు ఎంతో సపోర్ట్ గా నిలిచారు. రైటింగ్, షూటింగ్ విషయంలో ఆయన ఎన్నో సూచనలు ఇచ్చారు.

ఎడిటర్ నవీన్ నూలి గారి గురించి?
ఈ సినిమా ఇంత బాగా రావడంలో ఎడిటర్ నవీన్ నూలి గారి పాత్ర ఎంతో ఉంది. సినిమా అంతా తీయడం అయిపోయిన తర్వాత ఎడిటింగ్ చేయడం కాకుండా, షూటింగ్ దశ నుంచి మాతో ట్రావెల్ అయ్యారు. ప్రతి షెడ్యూల్ కి ముందు ఆయనతో చర్చించి, క్రిస్ప్ రన్ టైం వచ్చేలా చేశాము.

ఓవర్సీస్ 1 మిలియన్ కలెక్ట్ చేయడం ఎలా అనిపించింది?
చాలా సంతోషంగా ఉందండి. 1 మిలియన్ అనేది పెద్ద విషయం కదా. అలాంటిది తక్కువ టైంలోనే ఆ మార్క్ ని అందుకోవడం ఆనందంగా ఉంది.

రవితేజ గారితో సూపర్ హీరో సినిమా చేయబోతున్నారు కదా. దానిలో కూడా కామెడీ ఉంటుందా?
ఖచ్చితంగా కామెడీ ఉంటుంది. అలాగే సినిమా కొత్తగా ఉంటుంది. సూపర్ హీరోకి ఒక మంచి బ్యాక్ స్టోరీ ఉంటుంది. ఇది సైన్స్ ఫిక్షన్ కాదు. పూర్తిగా ఫిక్షన్.

మీ బలం ఏంటి?
కామెడీ అయినా ఎమోషన్ అయినా ఊహించనివిధంగా రావాలి. అలా తీసుకురావడమే నా బలం అని నేను నమ్ముతాను. ఇప్పుడు ఇది జరుగుతుందని అందరూ అనుకున్నప్పుడు, అది జరగకూడదు. కానీ, అది కన్విన్సింగ్ ఉండాలి.

మీరు వరుస కామెడీ సినిమాలు చేయడానికి కారణం?
జనాలలో ఈ మధ్య బాగా సీరియస్ నెస్ పెరిగిపోతుంది. చిన్న చిన్న విషయాలకు కూడా ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. అందుకే జనాలను నవ్వించాలనే ఉద్దేశంతో కామెడీ సినిమాలు చేస్తున్నాను. పైగా కామెడీ సినిమాలకు డిమాండ్ కూడా ఎక్కువగా ఉంది.

*MAD SQUARE – A Summer Celebration on the Big Screens*

MAD SQUARE is the latest sensation winning hearts everywhere both in terms of applause and box office performance. Living up to expectations film is performing incredibly well and the long weekend has turned into a major advantage this summer. The momentum is strong, and the film shows no signs of slowing down.

As part of the grand celebrations, director Kalyan Shankar interacted with the media and shared his happiness:

“I’ve visited many theatres, and watching audiences enjoy the film feels amazing. MAD connected with youth in a big way but I’m especially happy that MAD SQUARE is going beyond that even families are flooding into theatres. I honestly didn’t expect this much love from the audience.”

The MAD Gang – Narne Nithin, Sangeeth Shoban, Ram Nithin and Vishnu have become crowd favorites with immense love pouring in for their performances.

Bheems Ceciroleo is receiving widespread applause for his music while Thaman has lived up to expectations with his impactful background score.

Shamdat’s visuals and Navin Nooli’s editing have also been spot on elevating the cinematic experience.

Director Kalyan Shankar also revealed:

“There’s a film you can expect soon with Ravi Teja garu in my upcoming projects.”
He added:

“It feels great to receive calls and appreciation from some of the biggest names in the industry.”

Producer Harika hits the bull’s eye once again with the film being produced by Naga Vamsi under the banners of Sithara Entertainments, Fortune Four Cinemas and Srikara Studios.

GANI9231 GANI9182

MAD Square : Team Celebrates a Massive Victory

మ్యాడ్ స్క్వేర్’ చిత్రంపై ప్రేమను కురిపిస్తున్న ప్రేక్షకులకు కృతఙ్ఞతలు : సక్సెస్ ప్రెస్ మీట్ లో చిత్ర బృందం

తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసిన ‘మ్యాడ్ స్క్వేర్’ సినిమా థియేటర్లలో అడుగుపెట్టింది. బ్లాక్ బస్టర్ చిత్రం ‘మ్యాడ్’కి సీక్వెల్ గా రూపొందిన ‘మ్యాడ్ స్క్వేర్’లో నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్‌ ప్రధాన పాత్రలు పోషించారు. కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. శ్రీకర స్టూడియోస్ తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించారు. ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ సమర్పకులు. భీమ్స్ సిసిరోలియో పాటలను స్వరపరచగా, తమన్ నేపథ్య సంగీతం అందించారు. భారీ అంచనాల నడుమ ‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రం, నేడు(మార్చి 28) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్లలో నవ్వులు పూయిస్తున్న ఈ చిత్రానికి మొదటి షో నుంచే విశేష స్పందన లభిస్తోంది. మొదటి భాగానికి రెట్టింపు వినోదం ‘మ్యాడ్ స్క్వేర్’లో ఉందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో షో షోకి వసూళ్లు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించిన చిత్ర బృందం, తమ ఆనందాన్ని పంచుకుంది.

చిత్ర సమర్పకులు సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ, “మా మ్యాడ్ స్క్వేర్ సినిమా తెలుగు రాష్ట్రాలలో ఉదయం 8 గంటల షోతో మొదలై, సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. అన్ని షోలు హౌస్ ఫుల్ అవుతున్నాయి. భారీ ఓపెనింగ్స్ వస్తున్నాయి. కొన్ని ఏరియాల్లో మ్యాడ్ క్లోజింగ్ కలెక్షన్స్, మొదటిరోజే మ్యాడ్ స్క్వేర్ కి వచ్చే అవకాశముంది. మేము ముందు నుంచి చెబుతున్నట్టు, ప్రేక్షకులను నవ్వించడమే లక్ష్యంగా ఈ సినిమాని రూపొందించాము. ఆ విషయంలో విజయం సాధించాము. ఈ వేసవిలో ప్రేక్షకులు మా సినిమా చూసి బాగా నవ్వుకోవాలని కోరుకుంటున్నాము. కుటుంబ ప్రేక్షకులకు కూడా ఈ సినిమా బాగా నచ్చుతుంది.” అన్నారు.

నిర్మాత హారిక సూర్యదేవర మాట్లాడుతూ, “మా సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ముందుగా కృతఙ్ఞతలు. మా కష్టానికి తగ్గ ఫలితం దక్కడం చాలా సంతోషంగా ఉంది. కాలేజ్ స్టూడెంట్స్ మాత్రమే కాకుండా, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా సినిమాకి వస్తున్నారు. సినిమా చూస్తూ అందరూ నవ్వుతూనే ఉన్నారు. అన్ని థియేటర్లలోనూ ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. నిర్మాతగా ఇలాంటి మరిన్ని మంచి సినిమాలు అందించాలని ఉంది.” అన్నారు.

దర్శకుడు కళ్యాణ్ శంకర్ మాట్లాడుతూ, “సీక్వెల్ కదా మొదటి భాగంతో పోలుస్తారనే టెన్షన్ తోనే థియేటర్ కి వెళ్ళాము. ప్రేక్షకులంతా ఎంజాయ్ చేస్తుంటే, దీనికోసమే కదా మనం సినిమా తీసింది అనే ఫీలింగ్ వచ్చింది. సంగీత దర్శకులు భీమ్స్ గారికి, థమన్ గారికి ధన్యవాదాలు. ఎడిటర్ నవీన్ నూలి క్రిస్పీ రన్ టైంతో సినిమాకి బ్యాక్ బోన్ గా నిలిచారు. మేము సర్ ప్రైజ్ లా దాచిన సునీల్ గారి పాత్రకి మంచి స్పందన రావడం సంతోషంగా ఉంది. అందరూ థియేటర్ కి వెళ్ళి, సినిమా చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను.” అన్నారు.

కథానాయకుడు నార్నె నితిన్ మాట్లాడుతూ, “మ్యాడ్ స్క్వేర్ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మేము ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన లభిస్తోంది. థియేటర్ లో ప్రేక్షకులు గోల చేసుకుంటూ సినిమా చూస్తుంటే, మాటల్లో చెప్పలేనంత ఆనందం కలిగింది.” అన్నారు.

కథానాయకుడు రామ్ నితిన్‌ మాట్లాడుతూ, “ప్రేక్షకులు మ్యాడ్ ని అంత పెద్ద సక్సెస్ చేసినందుకే మ్యాడ్ స్క్వేర్ వచ్చింది. మ్యాడ్ స్క్వేర్ ని చూసి కూడా అలాగే ఎంజాయ్ చేస్తున్నారు, అలాగే నవ్వుతున్నారు. మాకు ఇంతకంటే ఆనందం ఏముంటుంది. నవ్విస్తే ఇంత ఆనందం ఉంటుందని, ఇప్పుడే తెలిసింది. మా సినిమాపై ఇంతటి ప్రేమ కురిపిస్తున్న ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు.” అన్నారు.

కథానాయకుడు సంగీత్ శోభన్ మాట్లాడుతూ, “మా దర్శకుడు కళ్యాణ్ శంకర్ గారు, నిర్మాత నాగవంశీ గారు ముందే చెప్పారు.. నవ్వించడానికి ఈ సినిమా తీశామని. ప్రేక్షకులు అదే అంచనాలతో థియేటర్ కి వచ్చి, సినిమా చూసి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన పట్ల చాలా ఆనందంగా ఉన్నాము.” అన్నారు.

నటి ప్రియాంక జ‌వాల్క‌ర్ మాట్లాడుతూ, “థియేటర్ లో నా పాత్రకి ఈ స్థాయి స్పందన లభిస్తుందని అసలు ఊహించలేదు. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. ఇలాంటి విజయవంతమైన సినిమాలో భాగం కావడం సంతోషంగా ఉంది.” అన్నారు.

MAD Square : Team Celebrates a Massive Victory

The MAD Square team gathered today for a Blockbuster Success Press Meet basking in the overwhelming love and box office glory following the film’s sensational release earlier today. Directed by Kalyan Shankar and produced by Haarika Suryadevara and Sai Soujanya under Sithara Entertainments, Fortune Four Cinemas and Srikara Studios. The film is a sequel to MAD has taken Tollywood by storm earning rave reviews and shattering expectations on its opening day.

Press meet was a lively affair filled with gratitude, laughter and pride. The lead trio Narne Nithin, Sangeeth Shoban, Ram Nithin and Priyanka Jawalkar alongside director Kalyan Shankar, dop shamdat and the producers faced the media with beaming smiles.

We poured our hearts into MAD Square and seeing the audience laugh, cheer and embrace it like this is beyond our wildest dreams said Narne Nithin.

Ram Nitin and Sangeeth Shoban have been on the fun side thanking the audience in their own unique style.

Early reports indicate that MAD Square has smashed opening day records for a youth comedy in Telugu cinema with packed houses and roaring applause across India and overseas markets like the USA where premiere pre sales had already crossed $400K.

The mastermind behind the MAD franchise Director Kalyan Shankar spoke about the journey of crafting a sequel that outdid its predecessor. “We wanted to go bigger, crazier and deliver ‘MAD Maxx’ entertainment. The love from the audience today shows we’ve hit the mark he said.

The trio’s impeccable comic timing has been hailed as a winning formula with Vishnu Oi’s Laddu and a surprise cameo by Sunil adding extra spice to the laughter riot.

Producer Haarika Suryadevara couldn’t hide her delight at the film’s explosive start. “The response has been incredible and we can’t wait to see what the film achieves in the coming days.”

The press meet also highlighted Bheems Ceciroleo’s catchy tracks and Thaman’s background score earning special praise from attendees.

With trade analysts predicting a blockbuster weekend ahead , This film is well on its way to cementing its place as Best Entertainer of 2025.
GANI8348 GANI_8039 DSC_8165 DSC_8157 DSC_8134 GANI_8049

MAD Square MADMAXX Event : A Night of Madness and Celebration

ఘనంగా ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రీ రిలీజ్ వేడుక

ఇలాంటి సినిమాలు ఆరోగ్యానికి చాలా మంచిది: ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అక్కినేని నాగచైతన్య

బ్లాక్ బస్టర్ చిత్రం ‘మ్యాడ్’కి సీక్వెల్ గా రూపొందిన ‘మ్యాడ్ స్క్వేర్’పై భారీ అంచనాలు ఉన్నాయి. నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్‌ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. శ్రీకర స్టూడియోస్ తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించారు. ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ సమర్పకులు. భీమ్స్ సిసిరోలియో పాటలను స్వరపరచగా, తమన్ నేపథ్య సంగీతం అందించారు. ఈ వేసవికి వినోదాల విందుని అందించడానికి ‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రం మార్చి 28న థియేటర్లలో అడుగుపెడుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు విశేషంగా ఆకట్టుకొని.. ఈ సినిమా సంచలన విజయం సాధిస్తుందనే నమ్మకాన్ని కలిగించాయి. బుధవారం సాయంత్రం ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో వైభవంగా నిర్వహించారు. యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య ముఖ్య అతిథిగా హాజరైన ఈ వేడుకలో ప్రముఖ దర్శకులు మారుతి, వెంకీ అట్లూరితో పాటు చిత్ర బృందం పాల్గొంది.

ఈ సందర్భంగా ముఖ్య అతిథి అక్కినేని నాగచైతన్య మాట్లాడుతూ, “మ్యాడ్ స్క్వేర్ ట్రైలర్ చూశాను. అది మ్యాడ్ స్క్వేర్ కాదు, మ్యాడ్ మ్యాక్స్. ట్రైలర్ చాలా బాగుంది. నాకు ఈ వేడుకకు రావడం సంతోషంగా ఉంది. నేను మ్యాడ్ సినిమాలోని కామెడీ సీన్స్ చూస్తూ, ఒత్తిడిని దూరం చేసుకుంటూ ఉంటాను. ఇలాంటి సినిమాలు ఆరోగ్యానికి చాలా మంచిది. డల్ గా ఉన్నప్పుడు మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా సూచించాలనేది నా అభిప్రాయం. ఇలాంటి సినిమాలు చూడటం వల్ల.. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి సరదాగా గడిపేలా చేస్తాయి. ఫ్రెండ్ షిప్ ని స్ట్రాంగ్ చేస్తాయి. కొత్త ఫ్రెండ్స్ ని పరిచయం చేస్తాయి. మ్యాడ్ లాంటి సినిమాలు రావడం సంతోషంగా ఉంది. మ్యాడ్ సినిమాతో ఈ ముగ్గురు హీరోలు స్టార్స్ అయిపోయారు. ప్రతి ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిలా వీళ్ళ పేర్లను గుర్తు పెట్టుకుంటారు. కామెడీ చేయడం అనేది చాలా కష్టం. నార్నె నితిన్, రామ్, సంగీత్ లో ఆ టాలెంట్ ఉంది కాబట్టే ఇంత నవ్వించగలిగారు. ఒక స్టోరీ డిస్కషన్ లో దర్శకుడు కళ్యాణ్ తో కూర్చున్నప్పుడు ఆయన నేరేషన్ కే పడిపడి నవ్వాను. ఇక ఈ సినిమా ఎలా ఉంటుందో ఊహించగలను. నా ఫేవరెట్ డీఓపీ శామ్‌దత్ గారు ఈ సినిమాకి పనిచేశారు. నిర్మాతగా హారిక మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను. నాది, నాగవంశీ జర్నీ ప్రేమమ్ తో మొదలైంది. తన ధైర్యమే నాగవంశీని ఇంతదూరం తీసుకొచ్చింది. దర్శకులకు, నటులకు ఎంతో ధైర్యాన్ని ఇస్తూ వరుస విజయాలు అందుకుంటున్నారు. అలాగే నిర్మాత చినబాబు గారు అంటే నాకు ఎంతో ఇష్టం. మ్యాడ్ స్క్వేర్ పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. మంచి ఓపెనింగ్స్ వచ్చి, సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. మ్యాడ్ 2 మాత్రమే కాదు, మ్యాడ్ 100 కూడా రావాలని కోరుకుంటున్నాను. టీం అందరికీ ఆల్ ది బెస్ట్.” అన్నారు.

దర్శకుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ, “నేను మ్యాడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా వచ్చాను. ఆ సమయంలో నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్‌ పేర్లు అప్పుడప్పుడే తెలుస్తున్నాయి. కానీ, ఇప్పుడు ఈ ముగ్గురు ప్రతి కుటుంబానికి చేరువయ్యారు. ముగ్గురు కలిసి సినిమాని బాగా ప్రమోట్ చేశారు. ఈ సినిమాలో కొన్ని సీన్స్ చూసి నేను పగలబడినవ్వాను. హారిక మొదటి సినిమాతోనే పెద్ద హిట్ కొట్టారు. ఇప్పుడు రెండో సినిమాతో ఇంకా పెద్ద హిట్ అందుకుంటారనే నమ్మకం ఉంది. భీమ్స్ గారు స్వరపరిచిన పాటలు పెద్ద హిట్ అయ్యాయి. మ్యాడ్ స్క్వేర్ సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికీ ఆల్ ది బెస్ట్.” అన్నారు.

దర్శకుడు మారుతి మాట్లాడుతూ, “సమ్మర్ లో మ్యాడ్. సరైన సమయంలో సరైన సినిమాని తీసుకురావడం అంటే ఇదేనేమో. మ్యాడ్ చూసినప్పుడు.. కొత్త డైరెక్టర్ చాలా బాగా చేశాడు, మంచి టైమింగ్ ఉంది అనుకున్నాను. కళ్యాణ్ లాంటి డైరెక్టర్స్ రావాలి. ఇలాంటి మంచి మంచి సినిమాలు తీయాలి. చిన్న సినిమాలు క్వాలిటీ సినిమాలు మిస్ అవుతున్నాం. అలాంటి సమయంలో ఒక చిన్న సినిమాని ఇంత క్వాలిటీగా తీస్తున్న నాగవంశీకి ముందుగా కంగ్రాట్స్ చెప్పాలి. నా సినిమాతోనే సితార ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్ మొదలైంది. ఈ బ్యానర్ లో పనిచేయాలని అందరూ అనుకునే స్థాయికి సితార ఎదిగినందుకు నాకు సంతోషంగా ఉంది. చినబాబు గారి బ్లెస్సింగ్స్ తో నాగవంశీ మంచి మంచి సినిమాలు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి పని చేసిన ప్రతి ఒక్కరికీ అడ్వాన్స్ కంగ్రాట్స్. ఎందుకంటే సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది. ఈ వేసవిలో ప్రేక్షకులకు కావాల్సిన వినోదాన్ని ఈ సినిమా అందిస్తుందని కోరుకుంటున్నాను. టీం అందరికీ ఆల్ ది బెస్ట్.” అన్నారు.

నిర్మాత హారిక సూర్యదేవర మాట్లాడుతూ, “మమ్మల్ని సపోర్ట్ చేయడానికి మీడియాకి, ఈ ఈవెంట్ ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు కృతఙ్ఞతలు. మా వేడుకకు నాగచైతన్య గారు, మారుతి గారు, వెంకీ అట్లూరి గారు అతిథులుగా రావడం సంతోషంగా ఉంది. ఒక కామెడీ సీన్ తీసి నవ్వించడం కష్టం. అలాంటిది మా దర్శకుడు కళ్యాణ్ శంకర్ గారు రెండు కామెడీ సినిమా తీసి ఫ్రాంచైజ్ రన్ చేసున్నారంటే గ్రేట్. డీఓపీ శామ్‌దత్ గారు మంచి విజువల్స్ ఇచ్చారు. ఎడిటర్ నవీన్ నూలి గారు తన ఎక్సపీరియన్స్ తో ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉండేలా సినిమాని మలిచారు. భీమ్స్ సిసిరోలియో గారు అద్భుతమైన సంగీతం అందించారు. ఆయన సంగీతం వల్లే మ్యాడ్ స్క్వేర్ పై ఈ స్థాయి అంచనాలు ఏర్పడ్డాయి. నార్నె నితిన్ లో మంచి ప్రతిభ ఉంది. ఈ సినిమాతో హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంటారు. మొదటి భాగంతో ప్రేక్షకుల ప్రేమను గెలుచుకున్న సంగీత్ శోభన్, రెండో భాగంతో కూడా పొందుతాడు. రామ్ నితిన్ సినిమాకి పాజిటివ్ ఎనర్జీ తీసుకొస్తాడు. నేపథ్య సంగీతం అందించిన తమన్ ప్రత్యేక కృతఙ్ఞతలు. నన్ను సపోర్ట్ చేసిన మా నాన్నగారు చినబాబు గారికి, మా అన్నయ్య నాగవంశీ గారికి ధన్యవాదాలు. మా సినిమాకి పని చేసిన ప్రతి ఒక్కరికీ థాంక్స్.” అన్నారు.

కథానాయకుడు నార్నె నితిన్ మాట్లాడుతూ, ” ఈ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చిన నాగచైతన్య గారికి థాంక్స్. ఏడాదిన్నర క్రితం మేము మ్యాడ్ సినిమాతో వచ్చాము. అప్పుడు మా పేర్లు కూడా ఎవరికీ సరిగా తెలియదు. అయినా మా సినిమాని పెద్ద హిట్ చేశారు. మా దేవుళ్ళు ప్రేక్షకులే. ఇప్పుడు మిమ్మల్ని ఇంకా ఎంటర్టైన్ చేయడానికి మ్యాడ్ స్క్వేర్ తో వస్తున్నాం. మా దర్శకుడు కళ్యాణ్ శంకర్ గారికి సినిమా అంటే చాలా పిచ్చి ఉంది. అందుకే దానిని మ్యాడ్ అనే సినిమా టైటిల్ తో చూపిస్తున్నారు. నన్ను నమ్మి, నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు కళ్యాణ్ గారికి, చినబాబు గారికి, నాగవంశీ గారికి, హారిక గారికి ధన్యవాదాలు. డీఓపీ శామ్‌దత్ గారు మమ్మల్ని అందంగా చూపించారు. భీమ్స్ సిసిరోలియో గారు అద్భుతమైన సంగీతం అందించారు. ఈ సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికీ థాంక్స్.” అన్నారు.

కథానాయకుడు సంగీత్ శోభన్ మాట్లాడుతూ, “నాగచైతన్య గారు ఎప్పుడూ పాజిటివ్ గా ఉంటారు. ఆయన ఈ వేడుకకు రావడం సంతోషంగా ఉంది. జూనియర్ ఎన్టీఆర్ గారు మా టీజర్ చూసి ఎంజాయ్ చేయడంతో మాలో కాన్ఫిడెన్స్ పెరిగింది. థాంక్యూ సో మచ్ తారక్ అన్న. ఈ వేడుకకు హాజరైన వెంకీ అట్లూరి గారికి, మారుతి గారికి థాంక్స్. చినబాబు గారు, నాగవంశీ గారు, హారిక గారు మాకు ఎంతో సపోర్ట్ చేశారు. దర్శకుడు కళ్యాణ్ శంకర్ గారు మిక్సింగ్ పనులుండి రాలేకపోయారు. సక్సెస్ మీట్ కి వస్తారు. మాతో పాటు విడుదలవుతున్న నితిన్ గారి ‘రాబిన్ హుడ్’ కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నాను.” అన్నారు.

కథానాయకుడు రామ్ నితిన్ మాట్లాడుతూ, “ముందుగా ముఖ్య అతిథిగా వచ్చిన నాగచైతన్య గారికి, అలాగే మారుతి గారికి, వెంకీ అట్లూరి గారికి థాంక్స్. సినిమా మీద నాకున్న ప్రేమ, అభిమానం, గౌరవం నన్ను ఇక్కడివరకు తీసుకొచ్చాయి. అలాంటి సినిమాని నాకు పరిచయం మా అమ్మకి, సినిమాల్లోకి వస్తానంటే నన్ను ప్రోత్సహించిన నాన్నకి, అలాగే నన్ను సపోర్ట్ చేసిన మా మావయ్యకి రుణపడి ఉన్నాను. నిహారిక గారు నిర్మించిన ‘హలో వరల్డ్’ అనే సిరీస్ చూసి, నన్ను నమ్మి ‘మ్యాడ్’లో మనోజ్ పాత్ర చేసే అవకాశం ఇచ్చిన నిర్మాతలు చినబాబు గారికి, నాగవంశీ గారికి, హారిక గారికి జీవితాంతం రుణపడి ఉంటాను. నన్ను గైడ్ చేసిన దర్శకుడు కళ్యాణ్ శంకర్ గారికి ధన్యవాదాలు. ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన నన్ను, ఇంతలా ఆదరిస్తున్న ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు. ” అన్నారు.

నటి రెబా మోనికా జాన్‌, “స్వాతి రెడ్డి పాట ద్వారా ఈ సినిమాలో భాగం కావడం సంతోషంగా ఉంది. పాటకు మంచి ఆదరణ లభించింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. ఈ చిత్రం మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను.” అన్నారు.

నటుడు విష్ణు ఓఐ మాట్లాడుతూ, “ఈ సినిమాని నిర్మించి, దర్శకుడు కళ్యాణ్ శంకర్ గారికి, మాకు బ్యాక్ బోన్ గా నిలిచిన నిర్మాతలు నాగవంశీ గారికి, హారిక గారికి కృతఙ్ఞతలు. ఈ సినిమా షూటింగ్ ఎంతో సరదాగా జరిగింది. మార్చి 28న థియేటర్లలో మ్యాడ్ స్క్వేర్ చూడండి.. మీ అందరికీ నచ్చుతుంది.” అన్నారు.

MAD Square MADMAXX Event : A Night of Madness and Celebration

The highly anticipated pre release event for MAD Square took place at Annapurna Studios in Hyderabad. With the film set to hit theaters in just two days on March 28 event served as a grand celebration to build excitement for what promises to be a chaotic, laughter filled ride.

The evening was graced by Chief Guest Yuva Samrat Akkineni Naga Chaitanya., Director Maruthi and Venky Atluri also added power to this buzzing occasion. Naga Chaitanya shared his best wishes and said that MAD is his go to comedy film adding that films like MAD are good for health! Venky Atluri was full of praise for the film saying the promotional content had already hooked him and that he’s rooting strongly for its release. Maruthi also shared his heartfelt wishes leaving a strong impact on the entire auditorium.

The lead cast Narne Nithiin, Sangeeth Shobhan and Ram Nithin shared their moments and emotional stories that truly struck a chord with everyone.

Vishnu Oi, Reba John, DOP Shamdat and many others from the team graced the event and shared their special moments.

The film is directed by Kalyan Shankar. Music Composed by Bheems Ceciroleo. BGM by Thaman. Trailer is already making waves in social media. Sithara Entertainments, Fortune four cinemas and srikara studios riding high on recent successes like Tillu Square, Lucky Bhaskar and Daaku Maharaaj it shows the confidence in the film’s potential to outdo its predecessor. With a runtime of 2 hours and 7 minutes and a UA certificate already secured MAD Square will be a sharp, entertaining theatrical run.

 IMG_6432 IMG_6431 IMG_6429 IMG_6430

Press Note: #MADSquare Trailer Out Now – The Madness is Back with a Bang

‘మ్యాడ్ స్క్వేర్’ చిత్ర ట్రైలర్ విడుదల.. రెట్టింపు వినోదం గ్యారెంటీ!

తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్’. బ్లాక్ బస్టర్ చిత్రం ‘మ్యాడ్’కి సీక్వెల్ గా వస్తున్న ‘మ్యాడ్ స్క్వేర్’పై ప్రకటనతోనే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రచార చిత్రాలు, పాటలు విశేషంగా ఆకట్టుకొని సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. ముఖ్యంగా టీజర్, అందులోని సంభాషణలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ఇక ఇప్పుడు ‘మ్యాడ్ స్క్వేర్’పై అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లేలా ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది.

బుధవారం ఉదయం హైదరాబాద్ లోని ఏఎంబీ మాల్ లో ‘మ్యాడ్ స్క్వేర్’ ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. సినీ అభిమానుల సమక్షంలో ట్రైలర్ ను విడుదల చేశారు. ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ట్రైలర్ నవ్వులు పూయించింది. మొదటి భాగంతో పోలిస్తే రెట్టింపు వినోదాన్ని మ్యాడ్ స్క్వేర్ లో చూడబోతున్నామని ట్రైలర్ తో మరోసారి రుజువైంది.

ట్రైలర్ ను గమనిస్తే, మ్యాడ్ విజయానికి కారణమైన ప్రత్యేక శైలి హాస్యం, ప్రధాన పాత్రల అల్లరిని మ్యాడ్ స్క్వేర్ లో కూడా చూడబోతున్నామని అర్థమవుతోంది. హాస్యాస్పదమైన సంభాషణలు మరియు విచిత్రమైన పరిస్థితులతో మ్యాడ్ స్క్వేర్ వినోదాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్తుంది. అలాగే తమన్ అద్భుతమైన నేపథ్య సంగీతం ట్రైలర్ కు ప్రధాన బలాలలో ఒకటిగా నిలిచింది. విడుదలైన నిమిషాల్లోనే ఈ ట్రైలర్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమంలో నిర్మాత హారిక సూర్యదేవర మాట్లాడుతూ, “మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన మీడియాకి ముందుగా కృతఙ్ఞతలు. గత వారం నుంచి చూస్తున్నాను.. ట్రైలర్ ఇంకా రాలేదని అందరూ అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు చాలా స్ట్రాంగ్ గా వచ్చామని నమ్ముతున్నాను. ఈ సినిమాలో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. మార్చి 28న థియేటర్ కి వెళ్ళి చూసి ఎంజాయ్ చేయండి. ఇది పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రం. ఈ వేసవి సెలవుల్లో పెద్ద విజయాన్ని అందుకుంటామనే నమ్మకం ఉంది.” అన్నారు.

నిర్మాత సూర్యదేవర నాగ వంశీ మాట్లాడుతూ, “సినిమా చాలా బాగా వచ్చింది. ప్రేక్షకులు మనస్ఫూర్తిగా నవ్వుకుంటారు. టికెట్ కొని థియేటర్ కి వచ్చిన ప్రతి ఒక్కరూ తాము పెట్టిన ప్రతి రూపాయికి న్యాయం జరిగిందని భావిస్తారు.” అన్నారు.

కథానాయకుడు నార్నే నితిన్ మాట్లాడుతూ, “ఏడాదిన్నర క్రితం మ్యాడ్ సినిమాతో మీ ముందుకు వచ్చాము. మేము కొత్తవాళ్ళం అయినప్పటికీ మాకు మంచి విజయాన్ని అందించారు. ప్రేక్షకులకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్ తో వస్తున్నాం. ఈసారి వినోదం రెట్టింపు ఉంటుంది. మార్చి 28న సినిమా చూసి ఆనందించండి.” అన్నారు.

కథానాయకుడు సంగీత్ శోభన్ మాట్లాడుతూ, “ట్రైలర్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సినిమా కూడా మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది.” అన్నారు.

కథానాయకుడు రామ్ నితిన్ మాట్లాడుతూ, “మ్యాడ్ సమయంలో మీడియా ఎంతో సపోర్ట్ చేసింది. మ్యాడ్ 2 కి అలాగే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ సినిమా అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది.” అన్నారు.

‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రానికి సంగీత సంచలనం భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘లడ్డు గానీ పెళ్లి, ‘స్వాతి రెడ్డి’, ‘వచ్చార్రోయ్’ పాటలు చార్ట్‌బస్టర్‌ లుగా నిలిచాయి.

ప్రముఖ ఛాయగ్రాహకుడు శామ్‌దత్ అద్భుత కెమెరా పనితనం, జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటింగ్ ప్రతిభ తోడై.. వెండితెరపై భారీ వినోదాన్ని అందించడానికి మ్యాడ్ స్క్వేర్ సిద్ధమైంది.

మ్యాడ్ సినిమాతో థియేటర్లలో నవ్వుల వర్షం కురిపించిన దర్శకుడు కళ్యాణ్ శంకర్, సీక్వెల్ తో మరోసారి నవ్వుల విందుని అందించబోతున్నారు. ప్రధాన పాత్రలు పోషించిన నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ త్రయం మొదటి భాగానికి మించిన అల్లరి చేయబోతున్నారు.

మ్యాడ్ స్క్వేర్ ను శ్రీకర స్టూడియోస్ తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ప్రేక్షకులు ఊహించిన దానికంటే ఎక్కువ వినోదాన్ని మ్యాడ్ స్క్వేర్ లో చూడబోతున్నారని చిత్ర బృందం తెలిపింది.

భారీ అంచనాల నడుమ 2025, మార్చి 28న థియేటర్లలో అడుగు పెట్టనున్న మ్యాడ్ స్క్వేర్, ఈ వేసవికి ప్రేక్షకులకు మరిచిపోలేని వినోదాన్ని పంచనుంది.

చిత్రం: మ్యాడ్ స్క్వేర్
విడుదల తేదీ: మార్చి 28, 2025
బ్యానర్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ & ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకరా స్టూడియోస్

తారాగణం: సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్‌, విష్ణు ఓఐ
దర్శకత్వం: కళ్యాణ్ శంకర్
సమర్పణ: సూర్యదేవర నాగ వంశీ
నిర్మాతలు: హారిక సూర్యదేవర, సాయి సౌజన్య
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
నేపథ్య సంగీతం: తమన్
ఛాయాగ్రహణం: శామ్‌దత్ ISC
కూర్పు: నవీన్ నూలి
ప్రొడక్షన్ డిజైనర్: శ్రీ నాగేంద్ర తంగాల
అదనపు స్క్రీన్ ప్లే: ప్రణయ్ రావు తక్కళ్లపల్లి
కళ: పెనుమర్తి ప్రసాద్ M.F.A
ఫైట్ మాస్టర్: కరుణాకర్
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్

Press Note: #MADSquare Trailer Out Now – The Madness is Back with a Bang

The much anticipated theatrical trailer for MAD Square is out now and it’s everything audience have been craving and more! Trailer promises double the laughter, chaos and entertainment setting the stage for a grand theatrical release on March 28, 2025.

The trailer showcases the signature quirky humor and high energy vibe that made the original a hit amplified by Thaman’s electrifying background score. From hilarious one liners to whacky situations MAD Square is going to take the entertainment game to the next level.

Bheems Ceciroleo has already set the vibe with chartbusters like Laddu Gaani Pelli” “Swathi Reddy “ and “Vaccharroi” songs that are already ruling playlists and reels.

With Shamdat Sainudeen’s vibrant lens capturing the madness and Navin Nooli’s slick cuts keeping the pace tight Mad Square is all set to explode on the big screens with massive entertainment.

Directed by Kalyan Shankar and produced by Haarika Suryadevara and Sai Soujanya under Sithara Entertainments, Fortune Four Cinemas and Srikara Studios MAD Square brings back the beloved MAD gang – Narne Nithiin, Sangeeth Shobhan and Ram Nithin for a rollercoaster ride of youthful fun. Presented by Suryadevara Naga Vamsi. The film has already created a massive buzz with its teaser and songs.

Title: Mad Square
Release Date: March 28, 2025
Genre: Comedy Drama
Banner: Sithara Entertainments & Fortune Four Cinemas
Presented by: Srikara Studios

Cast: Narne Nithin, Sangeeth Shobhan and Ram Nithin
Director: Kalyan Shankar
Presenter: Suryadevara Naga Vamsi
Producers: Haarika Suryadevara & Sai Soujanya
Music: Bheems Ceciroleo
BGM: Thaman S
Editor: Navin Nooli
DOP: Shamdat (ISC)
Production Designer: Sri Nagendra Tangala
Additional Screenplay: Pranay Rao Takkallapalli
Art Director: Penumarty Prasad M.F.A
Fight Master: Karunakar

trailer-out-now still (1) IMG_2355 IMG_2352 IMG_2353 IMG_2354

‘మ్యాడ్ స్క్వేర్’లో ‘మ్యాడ్’ని మించిన కామెడీ ఉంటుంది: మ్యాడ్ గ్యాంగ్

బ్లాక్ బస్టర్ చిత్రం ‘మ్యాడ్’కి సీక్వెల్ గా రూపొందుతోన్న ‘మ్యాడ్ స్క్వేర్’ కోసం సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. మార్చి 28న విడుదల కానున్న ‘మ్యాడ్ స్క్వేర్’పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రచార కార్యక్రమాల్లో భాగంగా తాజాగా మీడియాతో ముచ్చటించిన మ్యాడ్ గ్యాంగ్ నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.మీ ముగ్గురి కాంబినేషన్ బాగుంది. ఇతర సినిమాల్లో కూడా కలిసి నటిస్తారా?
రామ్ నితిన్: మ్యాడ్ అనేది మాకు ఎంతో స్పెషల్ మూవీ. మ్యాడ్ వరకే ఆ ప్రత్యేకత ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది.
సంగీత్ శోభన్: ఇప్పటిదాకా అయితే దాని గురించి ఆలోచించలేదు.

ఈ చిత్రానికి మెయిన్ హీరో ఎవరంటే ఏం చెప్తారు?
వినోదమే ఈ సినిమాకి మెయిన్ హీరో. ఆ వినోదమే మ్యాడ్ స్క్వేర్ ని నడిపిస్తుంది.

మ్యాడ్ స్క్వేర్ తో ఎంత మ్యాడ్ క్రియేట్ చేయబోతున్నారు?
రామ్ నితిన్: మ్యాడ్ తో పోలిస్తే మ్యాడ్ స్క్వేర్ లో కామెడీ ఎక్కువ ఉంటుంది. ఈసారి అశోక్(నార్నె నితిన్), మనోజ్(రామ్ నితిన్) పాత్రలు కూడా ఎక్కువ వినోదాన్ని పంచుతాయి. ప్రేక్షకులు ఈ కామెడీని బాగా రిసీవ్ చేసుకుంటారని నమ్ముతున్నాము.

మ్యాడ్ స్క్వేర్ కోసం ఎలాంటి కసరత్తులు చేశారు?
రామ్ నితిన్: మ్యాడ్ నా మొదటి సినిమా. ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనే భయం కాస్త ఉండేది. మ్యాడ్ స్క్వేర్ కి ఎలాంటి భయం లేదు. చాలా కాన్ఫిడెంట్ గా చేశాము. దాంతో పర్ఫామెన్స్ ఇంకా బెటర్ గా వచ్చింది.
నార్నె నితిన్: మ్యాడ్ లో ప్రతి పాత్రకు ఒక ట్రాక్ ఉంటుంది. నా పాత్ర మొదట కాస్త సీరియస్ గా ఉంటుంది. చివరికి వచ్చేసరికి మిగతా పాత్రల్లాగా కామెడీ చేస్తుంటాను. ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్ లో పూర్తి కామెడీ పాత్రలో కనిపిస్తాను. అందుకు తగ్గట్టు నన్ను నేను మలుచుకున్నాను.
సంగీత్ శోభన్: మ్యాడ్ విజయం ఇచ్చిన కాన్ఫిడెన్స్ తో మ్యాడ్ స్క్వేర్ ను ఆడుతూపాడుతూ చేశాము. ఇంకా ఎక్కువ నవ్వించాలనే ఆలోచన తప్ప, ప్రత్యేక కసరత్తులు చేయలేదు.

సీక్వెల్ చేద్దామని చెప్పినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు?
రామ్ నితిన్: చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. మ్యాడ్ షూటింగ్ పూర్తవుతున్న సమయంలో మంచి టీంని మిస్ అవుతున్నాను అనే బాధ ఉండేది. కానీ, సినిమా విడుదలై పెద్ద హిట్ అవ్వడం, వెంటనే సీక్వెల్ అనడంతో.. చాలా ఆనందించాము.

నిర్మాత నాగవంశీ గారు ఈ సినిమాలో కథ లేదు అన్నారు కదా?
నార్నె నితిన్: బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాల నుంచి కథ ఆశించాలి. ఇది నవ్వించడమే లక్ష్యంగా తీసిన సినిమా. అందుకే పెద్ద కథ ఉంటుందని ఆశించకండి, సరదాగా నవ్వుకోవడానికి రండి అనే ఉద్దేశంతో నాగవంశీ గారు చెప్పారు.
సంగీత్ శోభన్: ఒక సినిమా మనం ఏ ఉద్దేశంతో చేశామనేది ముందే ప్రేక్షకులకు తెలిసేలా చేస్తే మంచిది. ఇది నవ్వించడానికి తీసిన సినిమా కాబట్టి, ఆ అంచనాలతో ప్రేక్షకులు థియేటర్లకు రావాలనే ఉద్దేశంతో అలా చెప్పాము.

మ్యాడ్ విషయంలో నాగవంశీ గారి పాత్ర ఎంత ఉంది?
రామ్ నితిన్: నాగవంశీ గారి పాత్రే కీలకం. ఆయన ఎప్పుడూ సినిమా గురించే ఆలోచిస్తూ ఉంటారు. నన్ను కేవలం ఒక వెబ్ సిరీస్ లో చూసి, మనోజ్ పాత్రకు సరిపోతానని సూచించారంటే.. నాగవంశీ గారు సినిమా గురించి ఎంత ఆలోచిస్తారో అర్థం చేసుకోవచ్చు. అలాగే ఆయన దర్శకుడిని, నటీనటులను నమ్మి పూర్తి స్వేచ్ఛను ఇస్తారు.

సినిమాలో హీరోయిన్ పాత్రలు ఉంటాయా?
నార్నె నితిన్: మొదటి భాగానికి కొనసాగింపుగా వారి పాత్రలు మా జీవితాల్లో ఉంటాయి. కానీ, వారు తెర మీద కనిపించరు.

మ్యాడ్ స్క్వేర్ ఎలా ఉండబోతుంది?
సంగీత్ శోభన్: మ్యాడ్ విజయానికి కారణం వినోదం. అదే మా బలం. దానిని దృష్టిలో పెట్టుకొని పూర్తి వినోద భరిత చిత్రంగా మ్యాడ్ స్క్వేర్ ను మలచడం జరిగింది. అలాగే ఈ సినిమాలో కామెడీ పూర్తిగా కొత్తగా ఉంటుంది.

కుటుంబ ప్రేక్షకులు చూసేలా సినిమా ఉంటుందా?
సంగీత్ శోభన్: మొదటి పార్ట్ సమయంలో కూడా ఇలాంటి అనుమానాలే వ్యక్తమయ్యాయి. కానీ, సినిమా విడుదలైన తర్వాత కుటుంబ ప్రేక్షకులు ఎంతో ఆదరించారు. మ్యాడ్ స్క్వేర్ ను కూడా క్లీన్ కామెడీ ఫిల్మ్ గానే రూపొందించాము. వంశీ గారు చెప్పినట్టు ముఖ్యంగా పెళ్లి సీక్వెన్స్ అందరికీ నచ్చుతుంది.

లడ్డు పాత్ర ఎలా ఉండబోతుంది?
సంగీత్ శోభన్: మ్యాడ్ లో కంటే మ్యాడ్ స్క్వేర్ లో లడ్డు పాత్ర మరింత కామెడీగా ఉంటుంది. మేము ముగ్గురం కలిసి లడ్డుని ఫుల్ గా ఆడుకుంటాము.

నార్నె నితిన్ గారు మీ బావగారు జూనియర్ ఎన్టీఆర్ ఏమైనా సలహాలు ఇస్తారా?
నార్నె నితిన్: నా మొదటి సినిమా నుంచి సలహాలు ఇస్తూ ఉన్నారు. దానికి తగ్గట్టుగానే నన్ను నేను మలుచుకుంటున్నాను. భవిష్యత్ లో కూడా ఆయన సలహాలు తీసుకుంటాను.

మ్యాడ్ ఫ్రాంచైజ్ కంటిన్యూ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారా?
చేస్తే బాగుంటుంది. కానీ, వెంటనే కాకుండా కాస్త విరామం ఇచ్చి చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాము.

 GANI7550 GANI7539 GANI7537 GANI7554