ARJUN CHAKRAVARTHY, A Hard-Hitting Emotional Sports Drama to get Pan-India Release

ARJUN CHAKRAVARTHY, A Hard-Hitting Emotional Sports Drama to get Pan-India ReleaseBased on the true life story of a Kabaddi player who represented India in the 1980s, the film ‘ARJUN CHAKRAVARTHY’ is shaping up. Srini Gubbala is producing the movie under Gannet Celluloid banner while it is being written and directed by Venu KC.
March 24th happens to be World Kabaddi Day and so the makers of ‘Arjun Chakravarthy’ have unveiled the glimpse.
This is a true story of a Kabaddi player who went unnoticed and the glimpse runs on the backdrop of goosebumps dialogues.The film has first timers Vijaya Rama Raju and Sija Rose in the lead roles while Ajay, Dayanand Reddy, Ajay Ghosh and Durgesh are part of the supporting cast.Revealing the details of the shooting, the makers said, it’s been two years since ‘ARJUN CHAKRAVARTHY’ shooting has commenced and so far 75 per cent of the shoot has been wrapped up and it was shot in over 125 locations across India including Telangana, Andhra Pradesh, Jammu & Kashmir etc.

The protagonist went through seven physical look changes to portray the life journey of the character in all the age variations from childhood to middle age.

Also sets for the film to look very authentic, which includes village set in the 1960s, 1980s, Hyderabad town set in the 1960s were assembled and the art department was handled by Sumith Patel. Extensive search for nearly two years went into the making of these sets.

The makers are pretty confident about the film and they stated that this film has Rustic & Raw imagery, the picturisation, music and characters journey will win many hearts of the film audience.

ARJUN CHAKRAVARTHY is being shot in Telugu and Tamil simultaneously and being dubbed in Hindi, Malayalam, Kannada and aiming for the PAN INDIA release.
Cast: Vijaya Rama Raju, Sija Rose, Ajay, Dayanand Reddy, Ajay Ghosh, Durgesh

Crew:
Writer & Director: Venu KC
Producer: Srini Gubbala
Banner: Gannet Celluloid
Executive Producer: Venu KC
Music: Vignesh Baskaran
Cinematography: Jagadeesh Cheekati
Art Director: Sumith Patel
Editor: Prathap Kumar
Costume Design: Poojitha Tadikonda

Pro: Lakshmivenugopal

పాన్ ఇండియా స్థాయిలో విడుద‌ల‌వుతున్న మ‌న‌సును క‌దిలించే భావోద్వేగ స్పోర్ట్స్ డ్రామా ‘అర్జున్ చ‌క్ర‌వ‌ర్తి’

1980ల కాలంలో భార‌త‌దేశానికి ప్రాతినిధ్యం వ‌హించిన ఒక క‌బ‌డ్డీ ఆట‌గాడి నిజ జీవిత క‌థ ఆధారంగా రూపొందుతోన్న చిత్రం ‘అర్జున్ చ‌క్ర‌వ‌ర్తి’. గ‌న్నెట్ సెల్యులాయిడ్ ప‌తాకంపై శ్రీ‌ని గుబ్బాలా నిర్మిస్తున్న ఈ చిత్రానికి, వేణు కె.సి. ర‌చ‌న చేస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.నూత‌న తార‌లు విజ‌య‌రామ‌రాజు, సిజా రోజ్ హీరో హీరోయిన్లుగా న‌టిస్తుండ‌గా.. అజ‌య్‌, ద‌యానంద్ రెడ్డి, అజ‌య్ ఘోష్‌, దుర్గేష్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.
ప్రపంచ కబడ్డీ దినోత్సవం సందర్భంగా ‘అర్జున్ చక్రవర్తి’ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటనను పోస్టర్ మరియు వీడియో రూపంలో విడుదలచేశారు. వీడియోను వీక్షిస్తే..
“గెలుపులన్నీ మసకబారిన…పతాకాలన్నీ నేలరాలిన…కన్నీళ్ళన్నీ సంద్రాలైన…జ్ఞాపకాలన్నీ నీకై ఎదురుచూసే ….రారా ‘అర్జునా’…అడుగే పిడుగై ఓటమే ఓడేలా…కదలిరారా అర్జునా…..అనే మాటలు వినిపిస్తాయి. కబడ్డీ  క్రీడాకారుడు అయిన అర్జున్ ను భావోద్వేగంతో స్టేడియం ప్రతిధ్వనించేలా పిలవటం కనిపిస్తుంది.ఈ సినిమా గురించి నిర్మాత‌లు మాట్లాడుతూ, “రెండు సంవ‌త్స‌రాల క్రితం అర్జున్ చ‌క్ర‌వ‌ర్తి షూటింగ్ ప్రారంభ‌మైంది. ఇప్ప‌టివ‌ర‌కు తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జ‌మ్ము-క‌శ్మీర్ స‌హా దేశ‌వ్యాప్తంగా 125 పైగా ప్ర‌దేశాల్లో చిత్రీక‌ర‌ణ జ‌రిపి, 75 శాతం సినిమాని పూర్తి చేశాం.” అని చెప్పారు.ఇందులో హీరో పాత్ర ప్ర‌యాణం చిన్న‌త‌నం నుంచి మ‌ధ్య వ‌య‌సు దాకా సాగుతుంది. ఆ వ‌య‌సు తార‌త‌మ్యాలు క‌నిపించ‌డం కోసం హీరో ఏడు ర‌కాల శారీర‌క మార్పుల్ని ప్ర‌ద‌ర్శించ‌డం విశేషం.‌

‘అర్జున్ చ‌క్ర‌వ‌ర్తి’ అనేది పీరియాడిక‌ల్ డ్రామా కావ‌టాన‌.. 1960, 1980ల కాలం నాటి విలేజ్ సెట్ల‌ను, 1960ల నాటి హైద‌రాబాద్ టౌన్ సెట్‌ను క‌ళాద‌ర్శ‌కుడు సుమిత్ ప‌టేల్ ఆధ్వ‌ర్యంలోని ఆర్ట్ డిపార్ట్‌మెంట్ ఎంతో శ్ర‌మ‌కోర్చి ప్రామాణికంగా నిర్మించింది. దాదాపు రెండేళ్ల నిశిత ప‌రిశోధ‌నతో ఈ సెట్ల‌ను నిర్మించారు.

ఈ సినిమాపై నిర్మాత‌లు గ‌ట్టి న‌మ్మ‌కంతో ఉన్నారు. ఇందులోని గ్రామీణ వాతావ‌ర‌ణం దృశ్య‌ప‌రంగా బాగా ఆక‌ట్టుకుంటుంద‌నీ, సంగీతం, పాత్ర‌ల ప్ర‌యాణం ప్రేక్ష‌కుల హృద‌యాల‌ను గెలుచుకుంటాయ‌నీ వారు చెప్పారు.

తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఏక కాలంలో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటున్న ‘అర్జున్ చ‌క్ర‌వ‌ర్తి’ని హిందీ, మ‌ల‌యాళం, క‌న్న‌డ భాష‌ల్లో అనువ‌దించి, పాన్ ఇండియా విడుద‌ల కోసం సిద్ధం చేస్తున్నారు.

తారాగ‌ణం:
విజ‌య రామ‌రాజు, సిజా రోజ్‌, అజ‌య్‌, ద‌యానంద్ రెడ్డి, అజ‌య్ ఘోష్‌, దుర్గేష్‌.

సాంకేతిక బృందం:
ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: వేణు కె.సి.
నిర్మాత‌: శ్రీ‌ని గుబ్బ‌ల‌
బ్యాన‌ర్‌: గ‌న్నెట్ సెల్యులాయిడ్‌
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: వేణు కె.సి.
సంగీతం: విఘ్నేష్ భాస్క‌ర‌న్‌
ఛాయాగ్ర‌హ‌ణం: జ‌గ‌దీష్ చీక‌టి
క‌ళ‌: సుమిత్ ప‌టేల్‌
కూర్పు: ప్ర‌తాప్ కుమార్‌
కాస్ట్యూమ్ డిజైన్‌: పూజిత తాడికొండ‌
పీఆర్వో: ల‌క్ష్మీ వేణుగోపాల్‌.

20210324_075137 ARJUN CHAKRAVARTHY TITLE HERO Director Producer