May 26 2012
ఏవీయస్ " బ్లాగ్ బస్టర్ అవార్డ్స్ " కు ఆసియా రికార్డు
ఏవీయస్ ” బ్లాగ్ బస్టర్ అవార్డ్స్ “ కు ఆసియా రికార్డు
నటుడు, దర్శకుడు, రచయిత ఏవీయస్ ఇటివల బ్లాగ్ బస్టర్ అవార్డ్స్ పేరిట ఆన్ లైన్ వోటింగు
విధానం ప్రవేశ పెట్టారు.. ప్రపంచ వ్యాప్తంగా వున్న తెలుగు సినిమా అభిమానులు ఈ సైట్ లో
ఆన్ లైన్ లో వోటింగ్ చేస్తున్నారు… “ avsfilm.in ” అనే తన బ్లాగు ద్వారా ఏవీయస్ ఈ సినిమా
అవార్డుల ఎంపిక విధానాన్ని మొట్ట మొదటి సారిగా పరిచయం చేసి కొద్ది రోజుల క్రితం
వీక్షకుల ముందుంచారు… అప్పటినుంచి ఈ బ్లాగులో వోటింగ్ మొదలయింది… పదకొండు
క్యాతగిరిలా నుంచి అవార్డులను ఈ విధానం ద్వారా వ్యుయర్స్ తమ అభిమాన నటినటులను,
సాంకేతిక నిపుణులను ఎంచుకుంటారు. ఇలా ఒక కాన్సెప్ట్ ను ప్రవేశ పెట్టటం ఇదే మొదటి సారి
అని పలువురు ఏవీయస్ ప్రయత్నాన్ని అభినందించారు. ఇందుకు బలాన్ని చేకూరుస్తూ
ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు ఈ కాన్సెప్టు కు తమ రికార్డులలో చోటు కల్పించారు…
కొద్ది రోజుల్లోనే ఆసియా రికార్డులలో కూడా ఈ కాన్సేప్టును రికార్డు లలో నమోదు చేస్తామని
వారు ఏవీయస్ కు పంపిన లేఖలో పేర్కొన్నారు… ఆసియా రికార్డు కూడా సాధించిన
తరువాత అమేజింగ్ వరల్డ్ రికార్డులలో కూడా తన కాన్సెప్ట్ స్థానం సంపాదించు కోగలదన్న
ఆశాభావాన్ని వ్యక్తం చేశారు… ఇటువంటి రికార్డు సాధించిన మొదటి తెలుగు వాడిగా తన
పేరు నమోదు కావటం ఆనందకరంగా వుందని ఏవీయస్ పేర్కొన్నారు
Follow Us!