Apr 23 2016
chal chal gurram stills
Apr 20 2016
‘ముకుంద’ సినిమాలో వరుణ్ తేజ్ ఫ్రెండ్ పాత్రలో నటించిన శైలేష్ మంచి కార్ రేసర్ అని తెలిసి ఆశ్చర్యపోయాను. తనే సోలో హీరోగా చేసిన ఈ సినిమా తనకు మంచి సక్సెస్ కావాలని హీరో శ్రీకాంత్ అన్నారు. శైలేష్ బొలిశెట్టి, దీక్షాపంత్, అంగనా రాయ్ నాయకా,నాయికలుగా ఎం.ఆర్.ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నూతన దర్శకుడు మోహనప్రసాద్ దర్శకత్వంలో నిర్మాత ఎం.రాఘవయ్య నిర్మిస్తున్న చిత్రం ‘ఛల్ ఛల్ గుఱ్ఱం‘. ఈ చిత్రం ఆడియో వేడుక హైదరాబాద్ లోని హోటల్ ఆవాస లో నిన్న (19-4-16) సాయంత్రం పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో వైభవంగా జరిగింది.
వెంగి సంగీత దర్శకత్వం అందించిన ఈ సినిమా పాటల బిగ్ సీడీని హీరో శ్రీకాంత్ విడుదల చేశారు. పాటల ఆడియో సీడీలను తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేయగా, తొలి కాపీని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అందుకున్నారు.
ఈ సందర్భంగా.’పాటలు, ట్రైలర్ బావున్నాయి. వెంగి మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. కమర్షియల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ చిత్రం మంచి హిట్ కావాలి. యూనిట్ కు ఆల్ ది బెస్ట్ అని తమ్మారెడ్డి భరద్వాజ తెలిపారు. హ్హీరో తరుణ్ చిత్రం విజయం సాధించాలని యూనిట్ కు శుభాకాంక్ష లందించారు
దర్శకుడు మోహన ప్రసాద్ మాట్లాడుతూ ‘నాపై, నా కథపై నమ్మకంతో దర్శకుడిగా అవకాశం ఇచ్చిన రాఘవయ్యగారికి థాంక్స్. మంచి ఎమోషనల్,లవ్, కామెడి అన్నీ ఎలిమెంట్స్ ఉన్న సినిమా ఇది. శైలేష్ రెండో సినిమా అయినప్పటికీ చక్కగా నటించాడని దర్శకుడు మోహన్ ప్రసాద్ అన్నారు. చల్ చల్ గుఱ్ఱంలో దాదాపు 34 పాత్రాలు ఉంటాయి. కానీ ఏ పాత్రా మరో పాత్రతో రక్త సంబంధం కలిగి ఉండక పోవటం విశేషం. ఇదొక యునిక్ కాన్సెప్ట్. మనుషుల మద్య వస్తు సంబంధం కాకుండా సంస్కార బంధం ఉండాలన్న కోణంలో పూర్తిగా కార్పోరేట్ బ్యాగ్రౌండ్ లో తీర్చిదిద్దాం. కుటుంబ కధ నేపద్యంలో సాగే ఈ సినిమాలో ప్రతి అంశమూ ఆడియన్స్ కి కొత్త అనుభూతినిస్తుంది. సినిమాలో పా త్ర లన్నీ నిజ జీవితంలో చూసినవే. సినిమాలోని ప్రతి డైలాగ్ లో కామెడి వినిపిస్తుంది. కాని దాని వెనక కొన్ని నగ్న సత్యాలుంటాయి. అని దర్శకుడు మోహన ప్రసాద్ తెలిపారు.
చిత్ర కధానాయకుడు శైలేష్ మాట్లాడుతూ’ చిత్ర దర్శకుడు మోహన ప్రసాద్ చెప్పిన కధలోని ప్రధాన అంశం ఎంతగానో నచ్చి ఈ చిత్రాన్ని చేయటం జరిగింది . కధలోని నవ్యత అందరికీ నచ్చు తుంద నే నమ్మకముంది. చిత్ర సంభాషణలు, సంగీతం అలరిస్తాయి. వెంగి మ్యూజిక్ సినిమాకు ప్లస్ అవుతుంది.అని హీరో శైలేష్ అన్నారు
చిత్ర నిర్మాత ఎమ్.రాఘవయ్య మాట్లాడుతూ ..’ ఒక మంచి కదా చిత్రాన్నినిర్మించామని నమ్ముతున్నాము. ప్రేక్షకులను చల్ చల్ గుఱ్ఱం అలరిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. మే నెలాఖరున గానీ, జూన్ ప్రధమార్ధంలో గానీ చిత్రాన్ని విడుదల చేయ నున్నట్లు తెలిపారు.
చిత్రంలోని పాటలన్నీ సంగీత ప్రియులను ఆకట్టు కుంటాయని మ్యూజిక్ డైరెక్టర్ వెంగి అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు పొన్నాల లక్ష్మయ్య, మర్రి శశిధర్ రెడ్డి, స్వామి గౌడ్, సి. రామచంద్రయ్య, చిత్రయూనిట్ ను అభినందించారు.
చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రలలో నాగబాబు,బెనర్జీ,అశోక్ కుమార్,చిట్టిబాబు,ముక్తార్ ఖాన్,ప్రవీణ్ కుమార్,సుడిగాలి సుదీర్,అంబటి శ్రీని, హర్ష, జోగి నాయుడు,కృష్ణంరాజు,తిరుపతి ప్రకాష్,దువ్వాసిమోహన్,జూనియర్ రేలంగి,మీనా,శిల్ప తదితరులు నటిస్తున్నారు .
ఈ చిత్రానికి కెమెర; వి.శ్యాంప్రసాద్,మ్యూజిక్: వెంగి, కొరియోగ్రఫీ: రఘు, ప్రదీప్అంథోని, భాను, ఎడిటింగ్: శంకర్, ఫైట్స్: రాం సుంకర, ఆర్ట్: జె.కె.మూర్తి, ,
నిర్మాత: ఎం.రాఘవయ్య, కధ-మాటలు-స్క్రీన్ ప్లే- దర్శకత్వం: మోహన ప్రసాద్., బ్యానర్: ఎమ్.ఆర్.ఎంటర్ టైన్మెంట్స్
Follow Us!