DJ TILLU

Dj Tillu Movie Details :

Cast : Siddhu Jonnalagadda, Shraddha Srinath

Writer: Vimal Krishna, Siddhu Jonnalagadda
Music : Kaala Bhairava
DOP : Saiprakash Ummadisingu
Executive Producer: Dheeraj Mogilineni

Banner : Sithara Entertainments
Presenter: PDV Prasad
Producer : Suryadevara Naga Vamsi
Director : Vimal Krishna

DJ Tillu team celebrates the film’s success in a grand style at Visakhapatnam

విశాఖలో ఘనంగా “డిజె టిల్లు” బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్*

టాలీవుడ్ లెటెస్ట్ సూపర్ హిట్ డిజె టిల్లు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ , ఫార్చూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించింది. దర్శకుడు విమల్ కృష్ణ తెరకెక్కించారు. సూర్యదేవర నాగవంశీ నిర్మాత. సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన డిజె టిల్లు సినిమా గత శనివారం ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా సినిమా బ్లాక్ బస్టర్ డిజె టిల్లు వేడుకల్ని విశాఖ గురజాడ కళాక్షేత్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్రబృందానికి జ్ఞాపికల్ని బహూకరించారు.
బ్లాక్ బస్టర్ డిజె టిల్లు ఈవెంట్ లో హీరోయిన్ నేహాశెట్టి మాట్లాడుతూ..డిజె టిల్లు మీకు ఇంత బాగా నచ్చినందుకు సంతోషంగా ఉంది. వైజాగ్ నాకు చాలా ప్రత్యేకం. నా సక్సెస్ జర్నీ ఇక్కడి నుంచే మొదలైంది. నేను వేరే ఒక సినిమా షూటింగ్ లో విశాఖలో ఉండగా ఈ సినిమా కోసం పిలుపు వచ్చింది. రాధిక పాత్రను నేను సరిగ్గా పోషించగలను అని నమ్మిన దర్శకుడు విమల్, నిర్మాత నాగవంశీ గారికి కృతజ్ఞతలు. ఇవాళ మీ రెస్పాన్స్ చూస్తుంటే రాధిక క్యారెక్టర్ లో మెప్పించానని అర్థమవుతోంది. అన్నారు.
దర్శకుడు విమల్ కృష్ణ మాట్లాడుతూ..డిజె టిల్లు చిత్రంతో మాకు గొప్ప విజయాన్ని అందించారు. మీరు ఇచ్చింది సక్సెస్ మాత్రమే కాదు ఒక కొత్త జీవితం. ఓవర్సీస్ సహా మా చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు. అన్నారు.
హీరో సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ…మా 12 ఏళ్ల కల ఈ సాయంత్రం నిజమైంది. మాకు సినిమా తప్ప ఇంకేం తెలియదు. ఆ సినిమాలతోనే అనుకున్నది సాధించాలని అనుకున్నాం. క్రిష్ణ అండ్ హిస్ లీల సినిమా చేసి ఓటీటీలో రిలీజ్ చేశాం. అ తర్వాత మా వింతగాథ వినుమా సినిమా చేస్తే ఫర్వాలేదన్నారు. ఇప్పుడు డిజె టిల్లు రిలీజ్ అయ్యాక బ్లాక్ బస్టర్ అంటున్నారు. ఈ జర్నీలో నేను థాంక్స్ చెప్పుకోవాలనుకునే వ్యక్తి మా నిర్మాత వంశీ అన్న. మమ్మల్ని నమ్మి సినిమా ఇచ్చారు. మా తలరాత మేమే రాసుకోవాలని చేపట్టిన మా కలం, బలం ఇవాళ విజయం సాధించాయి. ఎన్ని పాండమిక్ లు, తుఫాన్ లు వచ్చినా మీకు నచ్చే సినిమాలు చేయాలనే మా ప్రయత్నాలు ఆపము. అన్నారు.
నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ…డిజె టిల్లు చిత్రానికి ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. మా సంస్థకు మరో మంచి సక్సెస్ ఇచ్చారు. డిజె టిల్లు టీమ్ అందరికీ శుభాకాంక్షలు చెబుతున్నా. అన్నారు.
DJ Tillu team celebrates the film’s success in a grand style at Visakhapatnam
The new entrant into the Tollywood super-hit list is DJ Tillu. Sitara Entertainments, a leading production house, produced the film in collaboration with Fortune Four Cinemas. Directed by Vimal Krishna and produced by Suryadevara Naga Vamsi, DJ Tillu has a terrific star cast including Siddhu Jonnalagadda, Neha Shetty, Prince Cecil among others.
The movie released last Saturday and earned the love of the audience. Celebrating the film’s success, DJ Tillu’s team embarked on a success tour covering Vijayawada, Guntur, Eluru, Kovvuru, Rajahmundry, and Vizag. The last leg of celebrations was held at Gurajada Kalakshetram, Visakhapatnam, where the team came together for a success meet, thanking the audience for the blockbuster response to DJ Tillu.
Neha Shetty, the lead actress of DJ Tillu said, “I’m glad you liked DJ Tillu so much. Vizag is very special to me, and my success journey started from here. I got a call from DJ Tillu’s movie team while I was shooting for another movie in Vizag. Thanks to director Vimal and producer Naga Vamsi (garu) for believing that I can play the role of Radhika with poise and perfection. Looking at the humongous response today, it is evident that you are impressed with my portrayal of Radhika in DJ Tillu.”
Director Vimal Krishna remarked, “Thanks for your wonderful response for DJ Tillu and making it a grand success. You gave a new lease of life to cinema, and this gives us wings to experiment more. Also, a big thank you to the overseas audience for supporting our film.”
Siddhu Jonnalagadda said, “This evening marks the realisation of our 12-year-old dream. We know nothing but cinema. We wanted to achieve success with movies. We released Krishna and His Leela on OTT followed by Maa Vintha Gaadha Vinuma, which got a good response. And now, here we are with DJ Tillu – a blockbuster. In our journey, we want to thank one person a lot and that’s our producer Naga Vamsi. He believed in us and gave a nod to make a film the way we want. DJ Tillu is a project we have taken up to change our fate and it showed its magic. We coupled solid writing with wacky humour and once the final script is out, we were sure that it had blockbuster written all over it. This success gave us the confidence to make more good films in future.”
Producer S Naga Vamsi said, “Thanks for making DJ Tillu a grand success and bringing a lot of joy to Sithara Entertainments. This will be etched in our memories forever. Our team is ever grateful to you, and we want to sign off with a promise to bring many more great films to you.”
SAM_6610 SAM_6612 SAM_6656

పశ్చిమ గోదావరి జిల్లాలో ‘డిజె టిల్లు’ కి అడుగ‌డుగునా బ్ర‌హ్మ‌ర‌ధం:

పశ్చిమ గోదావరి జిల్లాలో ’డిజె టిల్లు’ కి అడుగ‌డుగునా బ్ర‌హ్మ‌ర‌ధం:
 
“డీజే టిల్లు కొట్టు కొట్టు డీజే టిల్లు కొట్టు
బేస్ జర పెంచి కొట్టు బాక్సులు పలిగెటట్టు”
‘డిజె టిల్లు’ పాటలోని సాహిత్యం లాగానే ఇవాళ   బాక్సాఫీసు బాక్సులు పగులుతున్నాయి. రోజు రోజుకీ చిత్రం సాధిస్తున్న కలెక్షన్స్ భారీ విజయంగా నమోదు చేస్తున్నాయి.
సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన సినిమా ఈ డిజె టిల్లు. ఈ సినిమాను ఫార్చూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించింది. డెబ్యూ డైరెక్టర్ విమల్ కృష్ణ తెరకెక్కించారు. సూర్యదేవర నాగవంశీ నిర్మాత. గత శుక్రవారం విడుద‌ల‌యిన ‘డిజె టిల్లు’ అన్ని కేంద్రాలలో, ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తూ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.
చిత్రం సాధించిన విజయాన్ని, ఆ ఆనందాన్ని ప్రేక్షకులతో కలసి పంచుకునే దశలో హీరో సిద్దు జొన్నలగడ్డ, నాయిక నేహా శెట్టి, దర్శకుడు విమల్ కృష్ణ ల రెండవ రోజు (15-2-22) పర్యటన ఇలా సాగింది.
ఈరోజు ఉదయం విజయవాడ లోని శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆశీస్సులు తీసుకున్న చిత్ర బృందం పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు లోని విజయలక్ష్మి , కొవ్వూరు లోని వై స్క్రీన్స్ , రాజమండ్రి లోని శ్యామల ధియేటర్ లలో చిత్ర బృందం సందడి చేసి, ప్రేక్షకులకు వినోదాన్ని పంచింది.
టిల్లు టీం కు థియేట‌ర్ లో ప్రేక్ష‌కులు మ‌రింత ఉత్సాహాన్ని అందించారు. తమ ముందుకు వ‌చ్చిన టిల్లును చూసి  కేరింత‌లు కొట్టారు… ప్రేక్ష‌కులు టిల్లు టిల్లు అంటే చేసే నినాదాలు ధియేటర్స్ లో ప్రతిధ్వనిoచాయి.
థియేట‌ర్స్ లో ప్రేక్ష‌కులతో క‌ల‌సి చూసిన హీరో సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌, హీరోయిన్ నేహా శెట్టి, ద‌ర్శ‌కుడు విమల్ కృష్ణ స్పందనలు ఇలా సాగాయి.
హీరో సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ మాట్లాడుతూ..’డిజె టిల్లు స‌క్సెస్ మీతో సెల‌బ్రేట్ చేసుకోవ‌డం చాలా ఆనందంగా ఉంది. మీ ఆనందం చూసి క‌డుపు నిండిపోయింది.  ఇక రాధిక తో నేను ప‌డుతున్న పాట్లు చూసారుగా మిమ్మ‌ల్ని ఏడిపించేంత‌వ‌ర‌కూ న‌వ్వించాలి అనుకున్నాం అది ఇప్ప‌డు చూస్తున్నాం.. చాలా ఆనందంగా ఉంది. టిల్లు గాడు మిమ్మ‌ల్ని ఆనంద పెట్టేందుకే ఇక‌పై కూడా ప్ర‌య‌త్నిస్తుంటాడు.. అన్నారు.. డిజె టిల్లు టైటిల్ సాంగ్ కి స్టెప్స్ వేసి ప్రేక్ష‌కుల్ని అల‌రించారు.
హీరోయిన్ నేహా శెట్టి మాట్లాడుతూ..’రాధిక మీకు న‌చ్చిందా..? (ప్రేక్ష‌కుల నుండి చాలా అంటూ రెస్పాన్స్ వ‌చ్చింది) థాంక్యూ .. నేను మిమ్మ‌ల్ని ఇలా క‌లుసుకోవ‌డం చాలా ఆనందంగా ఉంది.. ఇంత రెస్పాన్స్ ని నేను ఎక్స్ పీరియ‌న్స్ ఎప్పుడూ చేయ‌లేదు. చాలా ఆనందంగా ఉంది.. టిల్లు తో క‌ల‌సి మిమ్మ‌ల్ని నేరుగా క‌లుసుకోవ‌డం చాలా ఆనంద‌గా ఉంది..  డిజె టిల్లు చిత్రం నా కెరియ‌ర్ లో బెస్ట్ గా నిలుస్తుంది అన్నారు.
ద‌ర్శ‌కుడు విమ‌ల్ మాట్లాడుతూ..’ఆడియ‌న్స్ కి చాలా థ్యాంక్స్.. మీకు టిల్లు క్యారెక్ట‌ర్ ఎంత‌గా న‌చ్చిందో మీ కేరింత‌లు చెబుతున్నాయి .
టిల్లు కి మీరు ఇస్తున్న రెస్పాన్స్ నా జీవితంలో మ‌ర్చిపోలేను. ప్రేక్ష‌కుల‌కు చాలా థ్యాంక్స్ అన్నారు. ‘డిజె టిల్లు’ విజయ యాత్ర ప్రేక్ష‌కుల కేరింత‌ల‌తో మారు మ్రోగింది. టిల్లు కి అడుగ‌డుగునా బ్ర‌హ్మ‌ర‌ధం పట్టారు ప్రేక్షకులు. ప్రేక్షకుల అభిమానాన్ని గుండెల నిండా నింపుకున్న చిత్ర బృందం ఉత్తరాంధ్ర వైపు ప్రయాణం మొదలు పెట్టింది. రేపు (16-2-22)అక్కడి ధియేటర్లలోనూ, సాయంత్రం వైజాగ్ లోని గురజాడ కళాక్షేత్రం లో జరిగే సక్సెస్ మీట్ లోనూ ప్రేక్షకాభిమానుల సమక్షంలో మరోమారు తమ సంతోషాన్ని పంచుకోనుంది చిత్ర బృందం.
aa Eluru1 Eluru2 Eluru3 Layer 29 copy

గుంటూరు పివిఆర్ లిమిటెడ్ ది సినిమాస్ లో ప్రేక్షకుల తో చిత్ర విజయానందాన్ని పంచుకున్న డిజె టిల్లు టీం

గుంటూరు పివిఆర్ లిమిటెడ్ ది సినిమాస్ లో ప్రేక్షకుల తో చిత్ర విజయానందాన్ని పంచుకున్న డిజె టిల్లు టీంపూర్తి స్థాయి వినోదాత్మక చిత్రంగా ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న డిజె టిల్లు ఇప్పుడు స‌క్సెస్ యాత్ర‌లో ప్రేక్ష‌కుల్ని క‌లుసుకుంటున్నాడు.వాళ్ళతో నవ్వుల్ని పంచుకుంటున్నారు.సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన సినిమా ఈ డిజె టిల్లు. ఈ సినిమాను ఫార్చూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించింది. డెబ్యూ డైరెక్టర్ విమల్ కృష్ణ తెరకెక్కించారు. సూర్యదేవర నాగవంశీ నిర్మాత. ఈ శుక్రవారం  విడుదలయిన ‘డిజె టిల్లు’ విడుదల అయిన అన్ని కేంద్రాలలో, ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తూ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా తమ డిజె టిల్లు టీం విజ‌య‌యాత్ర లో భాగంగా గుంటూరులో  ది సినిమాస్  ని సంద‌ర్శించారు. స‌డ‌న్ గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన టిల్లును చూసి కేరింత‌లు కొట్టారు ప్రేక్షకులు. థియేట‌ర్ లో ప్రేక్ష‌కుల తో క‌ల‌సి చూసిన హీరో సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌, హీరోయిన్ నేహా శెట్టి, ద‌ర్శ‌కుడు విమ‌ల్ ఆడియ‌న్స్ మ‌ధ్య కేక్ క‌ట్ చేసి స‌క్సెస్ ని సెల‌బ్రేట్ చేసుకున్నారు..

ఈ సంద‌ర్భంగా హీరో సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ మాట్లాడుతూః డిజె టిల్లు స‌క్సెస్ మీతో సెల‌బ్రేట్ చేసుకోవ‌డం చాలా ఆనందంగా ఉంది. టిల్లు గాడు చేసే అల్ల‌రి మీతో క‌ల‌సి చూడ‌టం నాకు చాలా థ్రిల్లింగ్ గా ఉంది. మీన‌వ్వులు కామెంట్స్ ని చాలా బాగా ఎంజాయ్ చేసాను..రాధికాకు ఫుల్ స‌రెండ‌ర్ అయినా ఆమె ఎట్లా అంటే అట్లా అంటూ టిల్లు స్ట‌యిల్ లో మాట్లాడి ఆక‌ట్టుకున్నారు.
హీరోయిన్ నేహా శెట్టి మాట్లాడుతూః సినిమా మీకు న‌చ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. రాధిక క్యారెక్ట‌ర్ మీకు న‌చ్చిందా..? అంటూ ఆడియ‌న్స్ తో క‌ల‌సి సినిమా చూడ‌టం చాలా సంతోషంగా ఉంది. మీ ఆద‌ర‌ణ‌కు చాలా రుణ ప‌డిఉంటాను అన్నారు.
ద‌ర్శ‌కుడు విమ‌ల్ మాట్లాడుతూః ఆడియ‌న్స్ కి చాలా థ్యాంక్స్.. మీకు టిల్లు క్యారెక్ట‌ర్ ఎంత‌గా న‌చ్చిందో మీ కేరింత‌లు చెబుతున్నాయి అన్నారు..
SAM_4980 SAM_4983

ప్రేక్షకుల ఆనందోత్సాహాల నడుమ సందడి చేస్తున్న ‘డిజె టిల్లు’ టీమ్:

ప్రేక్షకుల ఆనందోత్సాహాల నడుమ సందడి చేస్తున్న ‘డిజె టిల్లు’ టీమ్:
అప్పటి వరకు సినిమా చూస్తూ తెరమీద నాయకా నాయికలు ను, వారి నటనను చూస్తు, నవ్వులతో మునిగి పోయిన వారికి అంతలోనే చిత్ర నాయక, నాయికలు ఎదురయ్యే సరికి వారి ఆనందం తో ధియేటర్ మారుమ్రోగింది. ఈ సంఘటన విజ‌య‌వాడ కాపిట‌ల్ మాల్ లో జరిగింది. ‘డిజె టిల్లు’టీం ధియేటర్లో ఈరోజు సందండి చేసింది. సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన సినిమా ఈ డిజె టిల్లు. ఈ సినిమాను ఫార్చూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించింది. డెబ్యూ డైరెక్టర్ విమల్ కృష్ణ తెరకెక్కించారు. సూర్యదేవర నాగవంశీ నిర్మాత. ఈ శుక్రవారం విడ‌ద‌ల‌యిన ‘డిజె టిల్లు’ విడుదల అయిన అన్ని కేంద్రాలలో, ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తూ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా తమ డిజె టిల్లు టీం విజ‌య‌యాత్ర లో భాగంగా విజ‌య‌వాడ కాపిట‌ల్ మాల్ ని సంద‌ర్శించారు. ఆడియ‌న్స్ తో క‌ల‌సి సినిమా చూసిన టీం త‌మ ఆనందాన్ని ప్రేక్ష‌కుల‌తోనూ మీడియాతో నూ పంచుకున్నారు. ‘డిజె టిల్లు’ అంటూ ప్రేక్ష‌కుల అరుపుల‌తో ధియేటర్ మరింత  జోష్ ని నింపుకుంది..
ఈసంద‌ర్భంగా
హీరో సిద్దు జోన్న‌ల‌గ‌డ్డ మాట్లాడుతూ…’తెలంగాణా యాస తో వ‌స్తున్నాం ఎలా ఉంటుంది ఈ సినిమా నైజాం వ‌ర‌కూ మాకు ఎలాంటి సందేహాలు లేవు..కానీ ఆంధ్ర‌లో ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే డౌట్ ఉండేది. కానీ ఈరోజు విజ‌యవాడ‌లో ఆడియ‌న్స్ తో క‌ల‌సి చూసాక మంచి సినిమా ఎక్క‌డైనా మంచి సినిమానే అని ప్రేక్ష‌కులు రుజువు చేసారు. చాలా ఆనందంగా ఉంది. డిజె టిల్లు అనే క్యారెక్ట‌ర్ రాయ‌డం,చేయ‌డం ఒక క‌త్తిమీద సాము లాంటిది. కానీ ప్రేక్ష‌కులు మాకు మేం ఊహించిన దానికంటే పెద్ద విజ‌యం అందించారు. ఈ సినిమా స‌క్సెస్ ఇచ్చిన కిక్ ఎప్ప‌టికీ మ‌రిచిపోలేను. మిమ్మ‌ల్ని ఏడిపించేంత న‌వ్విస్తాడు టిల్లు దానికి నాది గ్యారెంటీ అన్నారు.
ద‌ర్శ‌కుడు విమ‌ల్ కృష్ణ మాట్లాడుతూ..’ఈ విజ‌యం తో ఏం మాట్లాడాలో అర్దం కావ‌డం లేదు. ప్రేక్ష‌కుల‌కు చాలా థ్యాంక్స్. మా న‌మ్మ‌కాన్ని ప‌దింత‌లు చేసి ప్రేక్ష‌కులు మాకు విజ‌యం అందించారు. ఈ క్యారెక్ట‌ర్ ని డిజైన్ చేయ‌డంలోనూ సిద్దూ పాత్ర చాలా ఉంది. విజ‌య‌వాడ  లో ప్రేక్షకుల రెస్పాన్స్ మా ఆనందాన్ని ప‌దింత‌లు చేసింది అన్నారు.
SAM_4661_copy_1600x1060 SAM_4670_copy_1600x1060 SAM_4742_copy_1600x1060 SAM_4784_copy_1600x1060
హీరోయిన్ నేహా శెట్టి మాట్లాడుతూ…’నా మొద‌టి థియేట‌ర్ విజిట్ ఇది. నా సినిమా ఆడియ‌న్స్ తో చూడ‌టం ఎప్ప‌టికీ గుర్తుండి పోతుంది. థియేట‌ర్ లో రెస్పాన్స్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది.  డిజె టిల్లు ఒక సూప‌ర్ ఫ‌న్ రైడ్ .. ప్రేక్ష‌కులు ఎంతగానో ఆనందిస్తున్నారు. ఈ విజయం ఎంతో సంతోషాన్ని ఇస్తోంది అన్నారు. ప్రేక్షకాభిమానుల ఆనందాన్ని తమ గుండెల్లో నింపుకొని మరిన్ని ధియేటర్ ల వైపు తమ ప్రయాణాన్ని కొనసాగించింది చిత్ర యూనిట్.

DJ Tillu’s success has motivated us to introduce younger talents into the industry: Producer Suryadevara Naga Vamsi

“డిజె టిల్లు” విజయం కొత్త వాళ్లను మరింత ప్రోత్సహించే ధైర్యాన్నిచ్చింది – నిర్మాత సూర్యదేవర నాగవంశీ*
* డిజె టిల్లు సీక్వెల్ సినిమా సిద్ధు తోనే త్వరలో…

సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన సినిమా డిజె టిల్లు. ఈ సినిమాను ఫార్చూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించింది. డెబ్యూ డైరెక్టర్ విమల్ కృష్ణ తెరకెక్కించారు. సూర్యదేవర నాగవంశీ నిర్మాత. ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘డిజె టిల్లు’ విడుదల అయిన అన్ని కేంద్రాలలో, ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తూ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా తమ విజయానందాన్ని మీడియాతో పంచుకున్నారు చిత్ర నిర్మాత, హీరో, దర్శకుడు. అదేమిటో వారి మాటల్లోనే….

హీరో సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ…నేను ఇప్పటిదాకా బ్లాక్ బస్టర్ అనే మాట వినలేదు. ఇప్పుడు డిజె టిల్లుతో వింటున్నా. ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో ఇవాళ తెలిసింది. చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. మేము థియేటర్ లో 10శాతం వర్కవుట్ అవుతుంది అని అనుకున్న సీన్స్ అంతకు ఎన్నో రెట్లు ప్రేక్షకులు స్పందిస్తున్నారు. తమన్ గారి నేపథ్య సంగీతం సన్నివేశాలకు మరింత బలాన్ని ఇచ్చింది. నేను ఇక్కడి వాడినే అందుకే ఆ బాడీ లాంగ్వేజ్, మాటతీరు అన్నీ సహజంగా వచ్చాయి. స్వయంగా రాసుకున్న డైలాగ్స్ కాబట్టి సులువుగా డిజె టిల్లులా మాట్లాడగలిగా. ఇందాకే త్రివిక్రమ్ గారిని కలిసి వచ్చాం. ఆయన స్క్రిప్టు చూసి ఎక్కడ ఎంత రెస్పాన్స్ వస్తుందని చెప్పారో ఇవాళ థియేటర్ లో అదే రిపీట్ అవుతోంది. ఇది ఆయనకు సినిమా మీదున్న అవగాహనకు నిదర్శనం. ఆయన పరిచయం మా అదృష్టం.  నిర్మాతకు ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన తెలుగు ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు. అన్నారు.

నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ..డిజె టిల్లు కథ విన్నప్పుడే ఈ రకమైన స్పందన ప్రేక్షకుల నుంచి వస్తుందని ఊహించాం. ఇవాళ మా అంచనా నిజమైంది. సినిమా విజయం సాధిస్తుందని తెలుసు. అంతకంటే పెద్ద విజయాన్ని అందించారు. ఇలాంటి చిత్రాలతో సక్సెస్ అందుకున్నప్పుడే రిస్క్ చేయాలనే ధైర్యం కలుగుతుంది. ఇంకా కొత్త వాళ్లను ప్రోత్సహించాలనే ఇంట్రెస్ట్ వస్తుంది. మీరు చిన్న సినిమా ఎందుకు చేస్తున్నారని గతంలో అడిగారు. ఇలాంటి ప్రాజెక్టులే ఎక్కువ సంతృప్తినిస్తాయి. ఏ స్థాయి సినిమా చేసినా మా సంస్థకున్న పేరును కాపాడుకోవాలి. రేపు భీమ్లా నాయక్ వస్తోంది. అది చూసిన వాళ్ళు డిజె టిల్లును ఏదో చుట్టేశారు అనుకోకూడదు. ఏ సినిమా అయినా మా సంస్థ గౌరవాన్ని నిలబెట్టేలా ఉండాలి. మేము అలాగే ప్లాన్ చేసుకుంటాం. డిజె టిల్లు సీక్వెల్ సినిమానే సిద్ధు నెక్ట్ పిక్చర్ గా చేస్తున్నాం. అన్నారు.

దర్శకుడు విమల్ కృష్ణ మాట్లాడుతూ…ఇవాళ థియేటర్ లకు వెళ్తి అక్కడ ప్రేక్షకుల సందడి చూసి నమ్మలేకపోయాం. డిజె టిల్లు కు మేము ఇంత క్రేజ్ సృష్టించామా అనిపించింది. సినిమాలో సంభాషణలకు వస్తున్న స్పందన,ఈ క్రెడిట్ అంతా నేను సిద్ధుకు ఇస్తాను. నిర్మాత నాగవంశీ గారి నమ్మకం, మా కష్టం అంతా ఇవాళ ఈ విజయానికి కారణం అంటూ ప్రస్తుతం ఈ విజయాన్ని ఆస్వాదిస్తున్నాను అన్నారు.

 
DJ Tillu’s success has motivated us to introduce younger talents into the industry: Producer Suryadevara Naga VamsiSiddhu Jonnalagadda, Neha Shetty starrer DJ Tillu, directed by Vimal Krishna, has opened to a terrific response and is running to packed houses across the globe upon its release today i.e. February 12. The film is produced by Suryadevara Naga Vamsi under Sithara Entertainments, in collaboration with Fortune Four Cinemas. The producer Naga Vamsi, actor Siddhu Jonnalagadda and director Vimal Krishna expressed their happiness on the blockbuster reception for the film.

“I’ve never come across the word blockbuster in my career and I only got to experience that high today. I’m flooded with calls and messages. The crowd responses are way beyond what we expected. S Thaman’s background score played a key role in enhancing the impact of the film. Having grown up in Hyderabad, the body language, dialogue delivery of a character like DJ Tillu came to me quite naturally. The fact that I also wrote the dialogues made the job easier for me,” actor Siddhu Jonnalagadda said.

“We had just met Trivikram garu and the box office response is exactly like what he had predicted. It truly shows us the trust he had in the film and a team like ours. It was a privilege to associate with him and I’m thankful to audiences for making DJ Tillu a huge success,” he further added.

“I foresaw the reception for DJ Tillu right when I heard the story. Our prediction has come true. We’ve always been confident of its success but this unanimous response has left us overjoyed. This has motivated us to take up many more challenging scripts, encourage new talents to the industry. It’s extremely satisfying to see a film made on a small scale achieving such a monumental success. Regardless of the budget, our only aim was to make a good film, live up to the reputation of our banner and we never compromised on the quality of DJ Tillu. We’ll once again be collaborating with Siddhu for the sequel to DJ Tillu,” producer S Naga Vamsi shared.

“I couldn’t believe my eyes when I saw crowds roaring in laughter at the theatres. As a team, we’ve managed to do the impossible with DJ Tillu. Siddhu deserves a major share of the credit for the film’s dialogues. It’s our team effort and the trust of S Naga Vamsi (garu) that we managed to create such an impact among audiences,” director Vimal Krishna stated.

IMG_20220212_161122 DSC_6588 IMG_20220212_161104 DSC_6590_1 IMG_20220212_161013 DSC_6582