FUNCTIONS

AnupRubens releases ‘Jivvu Jivvu’ song from ‘Katamarayudu’

Rubens releases ‘Jivvu Jivvu’ song from ‘Katamarayudu’
The third song of ‘Katamarayudu’, starring Pawan Kalyan and Shruti Hassan, and directed and produced respectively by Kishore Pardasani and Sharath Marrar of Northstar Entertainments, was released today by music director Anup Rubens on Radio Mirchi 98.3 FM.  Titled ‘Jivvu Jivvu’, the song is written by Varikappula Yadagiri, who was also present during the song’s release.
Speaking on the occasion, Anup Rubens said, ”The first two songs have got an amazing response from the audience.  I thank Power Star Pawan Kalyan garu for giving me the opportunity to compose music for this movie.  This is my second film with him.  After listening to ‘Baaje Baaje’ from ‘Gopala Gopala’, he called me up and told me we will be working again.  He has kept that word by offering me ‘Katamarayudu’.  It’s my personal experience that Power Star is an individual who always keeps his promises.  We have done ‘Jivvu Jivvu’ song for his fans.  We hope everybody likes it”.
The lyricist said, “I too am a big fan of Powerstar Pawan Kalyan garu.  I am very happy to have written this song for his film.  ’Jivvu Jivvu’ is a mass, folkish song that his fans and others will definitely like.  I thank the director, the producer and the music director for giving me the opportunity to write this number”.
Aditya Gupta of Aditya Music said, ”We have released the songs of almost all of Pawan Kalyan garu’s movies.  All of them received tremendous response.  We are happy that we are releasing the music of ‘Katamarayudu’, too, on our label.  Both ‘Mira Mira Meesam’ and ‘Laage Laage’ have been huge hits.  The former has so far got 4 Million views and 2 Lakh likes.  The second song is also about to cross the 2 Million mark”.
He further said, “Marking the festival of Holi today, we are releasing ‘Jivvu Jivvu’ on Radio Mirchi.  The other numbers will be released with a gap of two days starting from now.  The full album will be released on March 18, during the pre-release function.  Today’s launch was transmitted LIVE through our official Facebook page.  The response from fans and audience was huge. All of the songs of ‘Katamarayudu’ are trending big-time.  The songs are available on Aditya Music’s official YouTube channel, Apple Music, ITunes and Saavn.  We thank Power Star Pawan Kalyan garu and producer Sharath Marrar for the opportunity”.
`కాట‌మ‌రాయుడు` చిత్రంలో `జివ్వు జివ్వు..` సాంగ్ రిలీజ్ చేసిన అనూప్‌
DSC_8530 DSC_8503 DSC_8507 DSC_8531 DSC_8536
ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ హీరోగా నార్త్ స్టార్  ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌ఫై కిషోర్ పార్థ‌సాని ద‌ర్శ‌క‌త్వంలో శ‌ర‌త్ మ‌రార్ నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం `కాట‌మ‌రాయుడు`. అనూప్ సంగీత ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా మూడో సాంగ్‌ను రేడియో మిర్చి 98.3లో విడుద‌ల చేశారు. `జివ్వు జివ్వు అగునా..`.అంటూ ప‌ల్ల‌వితో సాగే ఈ పాట విడుద‌ల కార్య‌క్ర‌మంలో సంగీత ద‌ర్శ‌కుడు అనూప్ రూబెన్స్‌, సాంగ్‌కు సాహిత్యాన్ని అందించిన వ‌రికుప్ప‌ల యాద‌గిరి పాల్గొన్నారు. 
 
మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనూప్ మాట్లాడుతూ - “`కాట‌మ‌రాయుడు`లో మొద‌టి రెండు పాట‌ల‌కు ఆడియెన్స్ నుండి అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ సినిమాకు సంగీతం అందించే అవ‌కాశం క‌లిగించిన ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌గారికి థాంక్స్‌. ప‌వ‌న్‌సార్‌తో ఇది నాకు రెండో సినిమా. `గోపాల గోపాల` సినిమాలో `భాజే భాజే…`సాంగ్ విన‌గానే ప‌వ‌న్‌గారు నాకు ఫోన్ చేసి అనూప్ మ‌నం మ‌రోసారి క‌లిసి ప‌నిచేస్తున్నామ‌ని అన్నారు. అప్పుడు ఫోన్‌లో ఇచ్చిన మాట‌ను `కాట‌మ‌రాయుడు` సినిమాతో పూర్తి చేశారు. ఈ విష‌యం ద్వారా ఆయ‌న మాట ఇస్తే పూర్తి చేస్తార‌ని నాకు ప‌ర్స‌న‌ల్‌గా తెలిసింది. ఆయ‌న అందించిన స‌పోర్ట్‌కు థాంక్స్‌. ఈ జివ్వు జివ్వు అనే సాంగ్‌ను ప‌వ‌ర్‌స్టార్‌గారి ఫ్యాన్స్ కోసం చేశాం.  అందరికీ ఈ సాంగ్ కూడా న‌చ్చేలా ఉంటుంది“ అన్నారు. 
 
పాట‌ల ర‌చ‌యిత వ‌రికుప్ప‌ల యాద‌గిరి మాట్లాడుతూ - “నేను కూడా ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌గారికి పెద్ద అభిమానిని. ఈరోజు ఆయ‌న న‌టించిన `కాట‌మ‌రాయుడు` సినిమాలో పాట రాయ‌డం ఎంతో ఆనందంగా ఉంది. `జివ్వు జివ్వు ..` అనే ఈ సాంగ్ అభిమానుల‌కు, ప్రేక్ష‌కులకు న‌చ్చే మాస్ – ఫోక్ సాంగ్‌. ఈ అవ‌కాశం ఇచ్చిన ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌గారికి, శ‌ర‌త్‌మ‌రార్‌గారికి, డైరెక్ట‌ర్ డాలీగారికి, మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనూప్‌గారికి థాంక్స్‌“అన్నారు. 
 
ఆదిత్య మ్యూజిక్ ఆదిత్య గుప్తా మాట్లాడుతూ - “ మా ఆదిత్య మ్యూజిక్  సంస్థ‌లో దాదాపు ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌గారు న‌టించిన దాదాపు అన్ని సినిమాల పాట‌ల‌ను విడుద‌ల చేశాం. అన్నింటికి అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చాయి. అలాగే ఇప్పుడు ప‌వ‌ర్‌స్టార్ లెటెస్ట్ మూవీ`కాట‌మ‌రాయుడు` పాట‌ల‌ను విడుద‌ల చేయ‌డం ఆనందంగా ఉంది. అల్రెడి విడుద‌లైన రెండు పాట‌ల‌కు ప్రేక్ష‌కుల నుండి ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వ‌స్తుంది. అందులో టైటిల్ సాంగ్ `మిరా మిరా మీసం…` కు నాలుగు మిలియ‌న్ వ్యూస్‌, రెండు లక్ష‌ల లైక్స్ వ‌చ్చాయి. అలాగే సెకండ్ సాంగ్ `లాగే లాగే…`రెండు మిలియ‌న్ వ్యూస్‌కు ద‌గ్గ‌ర‌లో ఉంది. ఈరోజు హోలీ పండుగ సంద‌ర్భంగా ప‌వ‌న్‌క‌ళ్యాణ్ అభిమానుల‌ను దృష్టిలో పెట్టుకుని వ‌రికుప్ప‌ల యాద‌గిరి రాసిన మాస్ ఫోక్ సాంగ్ `జివ్వు జివ్వు ..` అనే సాంగ్‌ను రేడియో మిర్చిలో విడుద‌ల చేశాం. ఈ ప‌క్కా మాస్ మ‌సాలా సాంగ్ ఇటు  అభిమానులు, ప్రేక్ష‌కులను ఎంట‌ర్‌టైన్ చేస్తుంది. మిగిలిన పాట‌ల‌ను రెండు రోజులకు ఒకొక్క పాట‌ను విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేశాం. ఫుల్ ఆల్బ‌మ్‌ను మార్చి 18న జ‌ర‌గ‌బోయే ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌లో విడుద‌ల చేస్తాం. ఈరోజు విడుద‌ల చేసిన జివ్వు జివ్వు…సాంగ్ విడుద‌ల‌ను ఆదిత్య మ్యూజిక్ అఫిసియ‌ల్ ఫేస్ బుక్ పేజ్ ద్వారా లైవ్ అంద‌జేశాం. దీనికి ఆడియెన్స్ నుండి, అభిమానుల మంచి స్పంద‌న వ‌చ్చింది. కాట‌మ‌రాయుడు పాట‌ల‌న్నీ ట్రెండింగ్‌లో ఉన్నాయి. అలాగే కాట‌మ‌రాయుడు పాటలు అఫిసియ‌ల్ ఆదిత్య యూ ట్యూబ్ ఛానెల్‌, యాపిల్ మ్యూజిక్‌, ఐ ట్యూన్స్‌, సావ‌న్‌లో అందు బాటులో ఉన్నాయి. 
 
కాట‌మ‌రాయుడు ఆడియో విడుద‌ల చేసే అవ‌కాశం ఇచ్చిన ప‌వ‌ర్‌స్టార్ ఫ‌వ‌న్‌క‌ళ్యాణ్‌గారికి, నిర్మాత శ‌ర‌త్ మరార్‌గారికి ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు“ అన్నారు. 

వైభవంగా జరిగిన ‘జాదూగాడు’ ఆడియో వేడుక

DSC_0099 DSC_0101 DSC_0103 DSC_0077 DSC_0078 DSC_0074 DSC_0076 DSC_0079 DSC_0080 DSC_0081 DSC_0082 DSC_0084 DSC_0085 DSC_0089 DSC_0090 DSC_0092 DSC_0093 DSC_0094 DSC_0096 DSC_0098

 

 ‘జాదూగాడు’ ఆడియో ఆవిష్కరణ

నాగశౌర్య, సోనారిక జంటగా సత్య ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రూపొందుతోన్న చిత్రం ‘జాదూగాడు’. యోగేష్‌ దర్శకత్వంలో వి.వి.ఎన్‌.ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ తనయుడు సాగర్ మహతి సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. ఆడియో మ్యాంగో మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి విడుదలైంది. బిగ్‌ సీడీని మణిశర్మ ఆవిష్కరించారు. మణిశర్మ, బి.గోపాల్‌, కోన వెంకట్‌, గోపీచంద్‌ మలినేని, నల్లమలుపు శ్రీనివాస్‌ సంయుక్తంగా ఆడియో సీడీలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా…

మణిశర్మ మాట్లాడుతూ ‘’నేను సాధారణంగా ఆడియో వేడుకలను రాను. వచ్చినా స్టేజ్ పై ఎక్కి మాట్లాడను. ఈ సినిమా విషయంలో మాట్లాడాలనిపించింది. ఆల్‌ ది వెరీ బెస్ట్‌ టు జాదూగాడు టీమ్‌ అండ్‌ సాగర్‌. మంచి టీమ్ కలిసి చేస్తున్న మంచి చిత్రం’’ అన్నారు.

నాగశౌర్య మాట్లాడుతూ ‘’నన్ను హీరోగా అనుకోవడమే కాకుండా బడ్జెట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ప్రసాద్ గారు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ద్వారా ఫస్ట్‌ టైమ్‌ లవ్‌ ఇమేజ్‌ నుంచి మారి మాస్‌ యాక్షన్‌ మూవీ చేస్తున్నాను. నన్ను నమ్మి సినిమా తీసే ప్రతి నిర్మాత నాకు దేవుడుతో సమానం. హీరో కావాలనే తపనతో ఐదు సంవత్సరాలు ఎంతో కష్టపడి ఫిల్మ్ నగర్‌లో ఓపెన్‌ చేసిన ప్రతి ఆఫీస్‌లో ఫోటోలు ఇచ్చాను. పిలిచిన ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి పెర్‌ఫార్మ్‌ చేశాను. ఆ కష్టమెంటో నాకు బాగా తెలుసు. ముఖ్యంగా నా ఫస్ట్‌ మూవీ నిర్మాత సాయి కొర్రపాటిగారికి, అవసరాల శ్రీనివాస్‌గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సినిమా విషయానికి వస్తే మా డైరెక్టర్‌గారి కసి, మా మధుగారి కథ, శ్రీరామ్‌గారి విజువల్స్‌, సాగర్‌గారి మ్యూజిక్‌, అందమైన కోస్టార్‌.. వీళ్ళంతా కలవడం వల్ల ఒక మంచి మూవీ రెడీ అయింది. నాపై నమ్మకంతో ఈ చిత్రాన్ని నిర్మించిన నిర్మాత ప్రసాద్‌గారికి, డైరెక్టర్‌ యోగిగారికి మనస్ఫూర్తిగా థాంక్స్‌ చెప్తున్నాను’’ అన్నారు.

బి.గోపాల్‌ మాట్లాడుతూ ‘నాకు ఎంతో ఇష్టమైన మ్యూజిక్‌ డైరెక్టర్‌ మణిశర్మగారు. నేను చేసిన సినిమాలకు పాటలతో, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌తో ప్రాణం పోశాడు. ఆ సినిమాలు అంత పెద్ద హిట్‌ కావడంలో మణిశర్మగారు ముఖ్యపాత్ర పోషించారు. వాళ్ళబ్బాయి ఫస్ట్‌టైమ్‌ మ్యూజిక్‌ చేస్తున్నాడు. మణిశర్మ అంత పెద్ద మ్యూజిక్‌ డైరెక్టర్‌ అవ్వాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

కోన వెంకట్‌ మాట్లాడుతూ ‘’నేను, ఈ సినిమా ప్రొడ్యూసర్‌, డైరెక్టర్‌ రామ్‌గోపాల్‌వర్మ అనే ఒక హెడ్‌ క్వార్టర్స్‌ నుంచి బయలుదేరాం. మా యోగికి ఒక రికార్డ్‌ వుంది. ఇంత గ్యాప్‌తో యోగి చేసిన ఈ సినిమాలో ఏదో జాదూ వుందని మాత్రం చెప్పగలను. సినిమా తప్పకుండా పెద్ద హిట్టయి యూనిట్ మంచి పేరు తెస్తుందని భావిస్తున్నాను’’ అన్నారు.

సాగర్‌ మహతి మాట్లాడుతూ ‘’ఎంతో మంది గొప్ప వారు పనిచేసిన ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈరోజు నుంచి నేను కూడా పార్ట్ కావడం అదృష్టంగా భావిస్తున్నాను. మ్యూజిక్‌ డైరెక్టర్‌గా ఇప్పుడు మీ ముందు నిలబడి మాట్లాడుతున్నానంటే దానికి కారకులు మా తాతగారు, నాన్నగారు. ఎన్ని జన్మలకైనా ఆ రుణం తీర్చుకోలేనిది. నాన్నగారి గురించి ఎంత చెప్పినా తక్కువే. నాకు ఇంత మంచి మ్యూజిక్‌ లైఫ్‌ని ఇచ్చిన నాన్నగారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాగశౌర్య ఈ సినిమాలో ఎక్స్‌ట్రార్డినరీగా చేశాడు. యోగేష్‌ చాలా అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా సూపర్‌ డూపర్‌ హిట్‌ కావాలని కోరుకుంటున్నాను. టీమ్ కి ఆల్ ది బెస్ట్’’ అన్నారు.

కళ్యాణి మాలిక్‌ మాట్లాడుతూ ‘’2003లో నా మొదటి సినిమా రిలీజ్‌ అయింది. ఆరోజు నేను ఎంత ఎక్సైట్‌ అయ్యానో, ఈరోజు అంత ఎక్సైట్‌ అవుతున్నాను. ఎందుకంటే ఈ సినిమా నా సినిమాగా భావిస్తున్నాను. సాగర్‌ నాకు చాలా క్లోజ్‌ ఫ్రెండ్‌. ఈ ఆడియో, సినిమా పెద్ద హిట్టయి తనకి మంచి పేరు తీసుకురావాలి’’ అన్నారు.

మెహర్‌ రమేష్‌ మాట్లాడుతూ ‘’యోగి నాకు మంచి ఫ్రెండ్‌. తను ఈ సినిమాని ఇరగదీశాడు. గ్యాప్‌ తీసుకొని చేసినా కలర్‌ఫుల్‌గా తీశాడు, నాగశౌర్యని చాలా బాగా ప్రెజెంట్‌ చేశాడు. తప్పకుండా ఈ సినిమా పెద్ద హిట్‌ అవుతుంది’’ అన్నారు.

సోనారిక మాట్లాడుతూ ‘’ఈ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. శౌర్య అమేజింగ్‌ కో యాక్టర్‌. ఈ సినిమాకి చాలా మంచి పాటలు ఇచ్చిన సాగర్‌కి వెరీ థాంక్స్‌. ఈ సినిమాని మేమంతా ఎంతో కష్టపడి చేశాం. తప్పకుండా మా ప్రయత్నాన్ని ఆదరించాలి’’ అన్నారు.

ఈ కార్యక్రమంలో రమేష్ ప్రసాద్, దామోదర్ ప్రసాద్, నందినిరెడ్డి సహా పలువురు సినీ రంగ ప్రముఖులు పాల్గొని ఆడియో, సినిమా పెద్ద హిట్ కావాలని ఆకాంక్షించారు.

నాగశౌర్య, సోనారిక జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో కోట శ్రీనివాసరావు, కాశీ విశ్వనాథ్‌, మాధవి, అజయ్‌, శ్రీనివాసరెడ్డి, పృథ్వి, సప్తగిరి, తాగుబోతు రమేష్‌, జాకీర్‌ హుస్సేన్‌, ఆశిష్‌ విద్యార్థి, రవి కాలే, ప్రభాస్‌ శ్రీను తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ, మాటలు: మధుసూదన్‌, పాటలు: వరికుప్పల యాదగిరి, శ్రీమణి, విశ్వ, సినిమాటోగ్రఫీ: సాయిశ్రీరామ్‌, సంగీతం: సాగర్‌ మహతి, ఎడిటింగ్‌: ఎం.ఆర్‌.వర్మ, ఆర్ట్‌: సాహి సురేష్‌, ఫైట్స్‌: వెంకట్‌, నిర్మాత: వి.వి.ఎన్‌.ప్రసాద్‌, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: యోగేష్‌.

 

 

 

వినూత్నంగా జరిగిన ‘దాగుడుమూత దండాకోర్’ ఆడియో వేడుక

DSC_7025 DSC_7021 paper statement 001 paper statement 002 DSC_7009 DSC_7011 DSC_7030 DSC_7042 DSC_7044 DSC_7058 DSC_7063 DSC_7076 DSC_7083 DSC_7089 DSC_7098 DSC_7102 DSC_7107 DSC_7109 DSC_7112 DSC_7118 DSC_6736 DSC_6739 DSC_6763 DSC_6801 DSC_6813 DSC_6935 DSC_6954 DSC_6962 DSC_6963 DSC_6970 DSC_6973 DSC_6994 DSC_7008 DSC_7143 DSC_7145 DSC_7150 DSC_7187 DSC_7194 DSC_7198 DSC_7207 DSC_7211 DSC_7220 KK8_6941 KK8_7165 KK8_7176

‘గోపాల గోపాల’ ఆడియో విడుదల

RSK_1992 RSK_1993 audio-gopalagopala1 audio-gopalagopala2 audio-gopalagopala3 audio-gopalagopala4 audio-gopalagopala5 RSK_1990 RSK_1993 RSK_1997 RSK_2000 RSK_2002 RSK_2009 RSK_2012 RSK_2013 RSK_2016 RSK_2017 RSK_2019 RSK_2024 RSK_2027 DSC_0001 DSC_0005 DSC_0014 DSC_0018 DSC_0022 DSC_0040 DSC_0041 DSC_0049 DSC_0050 DSC_0074 DSC_0076 DSC_0079 DSC_0088 DSC_0091 DSC_0092 DSC_0094 DSC_0095 DSC_0096 DSC_0098 RSK_1819

‘జోరు’ సంగీత విజయోత్సవం

001 (32) 001 (1) audiosuccess-joru 001 (23) 001 (9) 001 (10) 001 (8) 001 (15) 001 (16) 001 (18) 001 (20) 001 (22) 001 (24) 001 (25) 001 (26)