Aug 17 2024
Power Star Pawan Kalyan’s Hari Hara Veera Mallu team wishes leading lady Niddhi Agerwal with a stunning special poster
కథానాయిక నిధి అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా ‘హరి హర వీర మల్లు’ చిత్రం నుంచి ప్రత్యేక పోస్టర్ విడుదల
కథానాయిక నిధి అగర్వాల్‌కి ప్రత్యేక పోస్టర్‌తో జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ‘హరి హర వీర మల్లు’ చిత్ర బృందం
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న ‘హరి హర వీర మల్లు’ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంతో సినీ ప్రేక్షకులకు మునుపెన్నడూ లేని విధంగా అద్భుతమైన విజువల్ ఫీస్ట్ అందించేందుకు పవన్ కళ్యాణ్ సిద్ధం అవుతున్నారు. ఇప్పటి వరకు చేయని చారిత్రాత్మక యోధుడు పాత్రలో ఆయన కనిపించనున్నారు. కొంత విరామం తర్వాత ఆగస్టు 14 నుంచి ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ తిరిగి ప్రారంభమైన విషయం విదితమే. ప్రస్తుతం యాక్షన్ దర్శకుడు స్టంట్ సిల్వ పర్యవేక్షణలో భారీ యుద్ధ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు.
ఇక ఇప్పుడు చిత్ర బృందం మరో అప్డేట్ ఇచ్చింది. ఈ సినిమాలో కథానాయికగా నటిస్తున్న నిధి అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పోస్టర్‌తో శుభాకాంక్షలు తెలిపింది. పోస్టర్‌లో నిధి మహాలక్ష్మి దేవి అవతారంగా, బంగారు చీరలో, అద్భుతంగా కనిపిస్తున్న నగలతో మెరుస్తోంది. తనదైన అందంతో ఆమె మాయ చేసేలా కనిపిస్తోంది.
అణగారిన వర్గాల కోసం పాలకుల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడే ఒక యోధుడిగా ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ కనిపించనున్నారు.
యువ దర్శకుడు జ్యోతి కృష్ణ ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలు తీసుకొని, సినీ ప్రేమికులకు, పవన్ కళ్యాణ్ అభిమానులకు వెండితెరపై ఒక అద్భుతమైన అనుభూతిని అందించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో బాలీవుడ్ సంచలన నటుడు బాబీ డియోల్, లెజెండరీ నటుడు అనుపమ్ ఖేర్ సహా అనేక మంది ప్రముఖ నటీనటులు కూడా భాగమయ్యారు. ప్రముఖ ఛాయగ్రాహకుడు మనోజ్ పరమహంస కెమెరా బాధ్యతలు నిర్వహిస్తుండగా, లెజెండరీ కళా దర్శకుడు తోట తరణి ఈ చిత్రం కోసం అద్భుతమైన సెట్ లను రూపొందిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
లెజెండరీ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ.దయాకర్ రావు ఈ చిత్రాన్ని భారీ వ్యయంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ‘హరి హర వీర మల్లు’ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం ‘హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ త్వరలో ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.
Power Star Pawan Kalyan’s Hari Hara Veera Mallu team wishes leading lady Niddhi Agerwal with a stunning special poster
Power Star Pawan Kalyan with Hari Hara Veera Mallu is set to give movie-lovers and audiences a great visual experience like never before.
Now, the production house has wished their leading lady, Niddhi Agerwal with a special poster on the eve of her birthday. In the poster, the actress looks like incarnation of Goddess Mahalakshmi, in the golden saree and with carefully crafted jewellery. It is hard to take your eyes off her and the actress is set to make every viewer’s heart skip a beat with her beauty.
Pawan Kalyan will be seen as a legendary heroic outlaw, who will fight against atrocities of rulers for the downtrodden. Young Jyothi Krisna has taken over the project and he is dedicated to give fans and movie-lovers a lasting experince and a stunning visual feast in theatres.
Bobby Deol, Anupam Kher and many more brilliant actors are part of the cast of this epic action saga, Hari Hara Veera Mallu. Ace Cinematographer Manoj Paramahamsa is handling cinematography and legendary production designer Thotha Tharani is handling art direction. Oscar award winning music composer MM Keeravani is composing music for the film.
Legendary producer AM Rathnam is presenting the movie on a massive scale on his Mega Surya Productions banner & the film is produced by A Dayakar Rao. The movie will release in two parts and the first one, Hari Hara Veera Mallu Part-1: Sword vs Spirit is set to release soon in Telugu, Tamil, Hindi and Malayalam languages, worldwide.
Follow Us!