Mad Square

Blockbuster Sequel ‘MAD Square’ to Hit Cinemas on March 29, 2025

బ్లాక్ బస్టర్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ మార్చి 29న భారీస్థాయిలో విడుదల

బ్లాక్ బస్టర్ చిత్రం మ్యాడ్ కి సీక్వెల్ గా ‘మ్యాడ్ స్క్వేర్ ప్రకటించినప్పటి నుండి, సినీ ప్రియులంతా చిత్ర విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టీజర్ విడుదల కాకముందే, ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఇప్పటికే విడుదలైన లడ్డు గానీ పెళ్లి, స్వాతి రెడ్డి పాటలు చార్ట్‌బస్టర్‌లుగా మారడంతో పాటు అన్ని చోట్ల ప్లేలిస్ట్‌లలో అగ్రస్థానంలో నిలిచాయి.

మ్యాడ్ స్క్వేర్ చిత్రాన్ని 2025 మార్చి 29న ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల చేయనున్నట్లు తాజాగా నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఒక సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్ ఎంతో ఆకర్షణీయంగా ఉంది. అలాగే “మీరు హ్యాండిల్ చేయగలిగిన దానికంటే ఎక్కువ వినోదం, మీరు ఊహించిన దానికంటే ఎక్కువ మ్యాడ్ నెస్.” అని నిర్మాతలు పేర్కొన్నారు. మొత్తానికి మ్యాడ్ స్క్వేర్ చిత్రంతో థియేటర్లలో వినోద అనుభవాన్ని మరో స్థాయికి తీసుకువెళ్ళబోతున్నారు నిర్మాతలు.

మ్యాడ్ సినిమాలో తనదైన ప్రత్యేక శైలి హాస్య సన్నివేశాలు, ఆకర్షణీయమైన కథనంతో ఎంతో పేరు తెచ్చుకున్న దర్శకుడు కళ్యాణ్ శంకర్, ఈ సీక్వెల్ తో మరోసారి నవ్వుల విందుని అందించబోతున్నారు. సంగీత సంచలనం భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ ఛాయగ్రాహకుడు శామ్‌దత్ కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.

మ్యాడ్ స్క్వేర్ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ పతాకాలపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.

2023 లో విడుదలైన మ్యాడ్ మొదటి భాగం సంచలన విజయం సాధించడంతో, కేవలం ప్రకటనతోనే మ్యాడ్ స్క్వేర్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సరికొత్త హాస్య చిత్రం ముగ్గురు కాలేజీ స్నేహితుల జీవితాలు, వారి పరిస్థితుల చుట్టూ తిరుగుతుంది. ఈ సీక్వెల్ మొదటి భాగాన్ని మించి రెట్టింపు వినోదాన్ని అందించేందుకు సిద్ధం అవుతోంది

చిత్రం: మ్యాడ్ స్క్వేర్
విడుదల తేదీ: మార్చి 29, 2025
బ్యానర్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ & ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకరా స్టూడియోస్

తారాగణం: సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్‌
దర్శకత్వం: కళ్యాణ్ శంకర్
సమర్పణ: సూర్యదేవర నాగ వంశీ
నిర్మాతలు: హారిక సూర్యదేవర, సాయి సౌజన్య
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
ఛాయాగ్రహణం: శామ్‌దత్ ISC
కూర్పు: నవీన్ నూలి
ప్రొడక్షన్ డిజైనర్: శ్రీ నాగేంద్ర తంగాల
అదనపు స్క్రీన్ ప్లే: ప్రణయ్ రావు తక్కళ్లపల్లి
కళ: పెనుమర్తి ప్రసాద్ M.F.A
ఫైట్ మాస్టర్: కరుణాకర్
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్

Blockbuster Sequel ‘MAD Square’ to Hit Cinemas on March 29, 2025

Ever since thKarunakarement of the sequel MAD Square to the blockbuster movie MAD, audiences, film enthusiasts, and trade circles have been eagerly awaiting its release. Even before the unveiling of a teaser, anticipation has already reached sky-high levels. The movie’s music has been creating waves, with the songs Laddu Gaani Pelli and Swathi Reddy becoming chartbusters and topping playlists everywhere.

Now the makers have now officially announced the release date as March 29, 2025. Alongside this announcement, a brand-new poster has been revealed, accompanied by a promise from the makers as: “More FUN than you can handle ????, More MADNESS than you can imagine ????????.” MAD Square is set to elevate the entertainment experience to a whole new level in theatres.

Directed by Kalyan Shankar, known for his distinctive style of storytelling and humor, the film is expected to deliver yet another laugh riot. The happening music director Bheems Ceciroleo has composed the music for the movie. National Award-winning editor Naveen Nooli is handling the editing, ensuring an engaging narrative. MAD Square is produced by Haarika Suryadevara and Sai Soujanya. under the prestigious banners of Sithara Entertainments, Fortune Four Cinemas & Srikara Studios., While Suryadevara Naga Vamsi presenting the film.

About MAD Square

MAD Square is the sequel to the blockbuster movie MAD, which was released in October 2023. A coming-of-age comedy-drama, the film revolves around the antics of three college friends and the hilarious situations surrounding them. The sequel promises to deliver double the fun and double the madness!

Title: Mad Square
Release Date: March 29, 2025
Banner: Sithara Entertainments, Fortune Four Cinemas & Srikara Studios

Cast: Narne Nithin, Sangeeth Shobhan, Narne Nithin, Ram Nithin
Director: Kalyan Shankar
Presenter: Suryadevara Naga Vamsi
Producer: Haarika Suryadevara & Sai Soujanya
Music: Bheems Ceciroleo
Editor: Navin Nooli
DOP: Shamdat (ISC)
Production Designer: Sri Nagendra Tangala
Additional Screenplay: Pranay Rao Takkallapalli
Art Director: Penumarty Prasad M.F.A
Fight Master: Karunakar

 MAD2DatePoster-Plain (1) MAD2-DatePoster

The Mad Gang is back with a BANG delivering the Maddest Song of the Year – ‘Swathi Reddy’

మ్యాడ్ స్క్వేర్’ చిత్రం నుండి రెండవ గీతం ‘స్వాతి రెడ్డి’ విడుదల
‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రం కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. 2023 లో విడుదలైన మ్యాడ్ మొదటి భాగం సంచలన విజయం సాధించడంతో, కేవలం ప్రకటనతోనే రెండవ భాగంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రచార చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ‘మ్యాడ్’ విజయంలో సంగీతం కీలక పాత్ర పోషించింది. దీంతో ‘మ్యాడ్ స్క్వేర్’ పాటలపై ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తి ఉంది. ‘లడ్డు గాని పెళ్లి’ అంటూ ఈ చిత్రం నుంచి విడుదలైన మొదటి గీతంకి విశేష స్పందన లభించింది. ఇప్పుడు రెండవ గీతంగా ‘స్వాతి రెడ్డి’ అంటూ సాగే పాటను విడుదల చేసింది చిత్ర బృందం. ‘లడ్డు గాని పెళ్లి’ తరహాలోనే విన్న వెంటనే కట్టిపడేసేలా ఎంతో ఉత్సహంగా ఈ గీతం సాగింది.
మొదటి భాగంలో ‘కళ్ళజోడు కాలేజ్ పాప’ వంటి బ్లాక్ బస్టర్ పాటతో ఒక ఊపు ఊపిన భీమ్స్ సిసిరోలియో, ‘స్వాతి రెడ్డి’తో మరోసారి తన సత్తా చాటారు. రాబోయే రోజుల్లో ఈ పాట తెలుగునాట ఒక ఊపు ఊపడం ఖాయంగా చెప్పవచ్చు. ఉత్సాహభరితమైన సంగీతం అందించడమే కాకుండా, అంతే ఉత్సాహంగా స్వాతి రెడ్డితో కలిసి ఈ పాటను ఆలపించారు భీమ్స్. ఇక సురేష్ గంగుల సాహిత్యం ప్రేక్షకుల నాడిని పట్టుకున్నట్టుగా ఉంది. అందరూ పాడుకునేలా తేలికైన పదాలతో అద్భుతమైన సాహిత్యం అందించారు.
సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్‌ ల త్రయం మరోసారి నవ్వించడానికి వస్తున్నారు. మొదటి భాగానికి మించిన వినోదాన్ని పంచడానికి ఈ ముగ్గురు సిద్ధమవుతున్నారు. అదే ఉత్సాహం తాజాగా విడుదలైన రెండవ గీతంలోనూ కనిపించింది. ఇక ఈ పాటలో రెబా మోనికా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ పాట ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని అందించడం ఖాయంగా కనిపిస్తోంది.
మ్యాడ్ సినిమాలో తనదైన ప్రత్యేక శైలి హాస్య సన్నివేశాలు, ఆకర్షణీయమైన కథనంతో ఎంతో పేరు తెచ్చుకున్న దర్శకుడు కళ్యాణ్ శంకర్, ఈ సీక్వెల్ తో మరోసారి నవ్వుల విందుని అందించబోతున్నారు. ఈ ‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రానికి ప్రముఖ ఛాయగ్రాహకుడు శామ్‌దత్ కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.
ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగ వంశీ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై శ్రీకర స్టూడియోస్ తో కలిసి హారిక సూర్యదేవర, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సీక్వెల్ ఫిబ్రవరి 26, 2025న థియేటర్లలో అడుగు పెట్టనుంది. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడవుతాయి.
తారాగణం: సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్‌
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
ఛాయాగ్రహణం: శామ్‌దత్
కూర్పు: నవీన్ నూలి
దర్శకత్వం: కళ్యాణ్ శంకర్
సమర్పణ: సూర్యదేవర నాగ వంశీ
నిర్మాతలు: హారిక సూర్యదేవర, సాయి సౌజన్య
బ్యానర్స్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్
The Mad Gang is back with a BANG delivering the Maddest Song of the Year – ‘Swathi Reddy’
Mad Square has already earned its place as one of the most anticipated franchises in recent times. With Part 1 setting the bar sky high, all eyes are now on Part 2 and the team isn’t holding back!
The young and dynamic crew has dropped their second single ‘Swathi Reddy’. It’s an energetic and striking number that’s already hitting the bullseye as another instant chartbuster.
The track is composed by Bheems Ceciroleo who also delivered the blockbuster Kallajodu College Papa in the first part. This time he’s back with another rocking and crazy song that’s set to be the talk of the town in the days ahead. Bheems Ceciroleo and Swathi Reddy lend their voices to this energetic track and Suresh Gangula lyrics hit right on the audience’s pulse.
The trio of Sangeeth Shobhan, Narne Nithin and Ram Nithin are back in their element bringing their absolute best to this much awaited sequel. Reba Monica John sets the stage on fire with her electrifying moves in the special song. This song is going to be a theatrical treat for audience everywhere!
Renowned technicians Cinematographer Shamdat Sainudeen ISC and National Award winning Editor Navin Nooli are at their finest. Looks like Director Kalyan Shankar is on the brink of delivering yet another blockbuster with this crazy entertainer.
Produced by the esteemed Haarika Suryadevara and Sai Soujanya under the banners of Sithara Entertainments and Fortune Four Cinemas in collaboration with Srikara Studios.
Presented by the Blockbuster Producer S. Naga Vamsi.
The film is Set to hit theatres in the first half of 2025. Mad Square Part 2 is already raising the excitement levels. More updates will follow soon.
 2nd single001 copy MAD-2-Jamachettu-OutNow Image 1

Sithara Entertainments unveils the MAD MAXX Entertainer MAD Square’s catchy and foot-tapping folk “Baraat Anthem”!

” మ్యాడ్ స్క్వేర్ ”

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ‘మ్యాడ్ స్క్వేర్’ నుంచి ‘లడ్డు గాని పెళ్లి’ గీతం విడుదల

కళాశాల నేపథ్యంలో ముగ్గురు యువకులు చేసే అల్లరి ప్రధానంగా రూపొందిన వినోదాత్మక చిత్రం ‘మ్యాడ్’ ఎంతటి సంచలన విజయాన్ని సాధించిందో తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రానికి సీక్వెల్ గా మ్యాడ్ మ్యాక్స్ ఎంటర్‌టైనర్ ‘మ్యాడ్ స్క్వేర్’ను తీసుకురాబోతుంది.

కేవలం ప్రకటనతోనే ‘మ్యాడ్ స్క్వేర్’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా యువత ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో “లడ్డు గాని పెళ్లి” అనే బరాత్ గీతంతో ప్రచార కార్యక్రమాలను ఘనంగా ప్రారంభించింది చిత్ర బృందం. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి మొదటి గీతంగా “లడ్డు గాని పెళ్లి”ని సెప్టెంబర్ 20న విడుదల చేశారు.

‘మ్యాడ్’ చిత్రంలో భీమ్స్ సిసిరోలియో స్వరపరిచిన “కళ్ళజోడు కాలేజీ పాప” అనే పాట యువతను విశేషంగా ఆకట్టుకొని చార్ట్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు ‘మ్యాడ్ స్క్వేర్’ కోసం ఆయన స్వరపరిచిన “లడ్డు గానీ పెళ్లి” గీతం అంతకుమించిన ఆదరణ పొందుతుంది అనడంలో సందేహం లేదు. తీన్మార్ బీట్‌ లతో థియేటర్లలో ప్రతి ఒక్కరూ కాలు కదిపేలా ఈ గీతం ఉంది.

జానపద సంచలనం, గాయని మంగ్లీతో కలిసి భీమ్స్ సిసిరోలియో స్వయంగా ఈ గీతాన్ని ఆలపించారు. వారి గాత్రం ఈ పాటకు మరింత ఉత్సాహం తీసుకొచ్చింది. సినిమా ఇతివృత్తం మరియు పాత్రలకు అనుగుణంగా.. కాసర్ల శ్యామ్ అందించిన సాహిత్యం అందరూ పాడుకునేలా ఎంతో అందంగా ఉంది. జానపద బీట్‌లు మరియు యువకులు ఆటపట్టించే రీతిలో జోకులు పేల్చుతూ సాగే సాహిత్యంతో, ఈ పాట ప్రత్యేకంగా నిలుస్తుంది. వీక్షకుల అభిమాన గీతాల్లో ఒకటిగా ఇది తక్షణమే స్థానాన్ని సంపాదించుకుంటుంది అనడంలో అనుమానమే లేదు.

మ్యాడ్ బాయ్స్ గ్యాంగ్ సంగీత్ శోభన్, నార్నే నితిన్ మరియు రామ్ నితిన్ “లడ్డు గానీ పెళ్లి” గీతంతో మళ్ళీ తిరిగి వచ్చారు. ఈ నూతన గీతంలో “కాలేజీ పాప” పాట బిట్ ఇన్‌స్ట్రుమెంటల్‌ కి వారు చేసిన నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ‘మ్యాడ్ స్క్వేర్’ తో రెట్టింపు వినోదాన్ని పంచడానికి, రెట్టింపు ఉత్సాహంతో మ్యాడ్ గ్యాంగ్ వస్తోందని ఈ ఒక్క పాటతోనే అర్థమవుతోంది.

అందరూ మెచ్చుకునేలా ‘మ్యాడ్’ చిత్రాన్ని రూపొందించిన రచయిత, దర్శకుడు కళ్యాణ్ శంకర్.. సీక్వెల్‌ను మరింత వినోదాత్మకంగా మలిచే పనిలో ఉన్నారు. ‘మ్యాడ్’ కోసం పని చేసిన ప్రతిభ గల సాంకేతిక నిపుణులు ‘మ్యాడ్ స్క్వేర్’ కోసం కూడా పని చేస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి.. ప్రముఖ ఛాయాగ్రాహకుడు షామ్‌దత్ కెమెరా బాధ్యతలు నిర్వహిస్తుండగా, జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.

శ్రీకరా స్టూడియోస్‌తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాత సూర్యదేవ నాగవంశీ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడవుతాయి.

తారాగణం: నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్

రచన, దర్శకత్వం: కళ్యాణ్ శంకర్
సమర్పణ: సూర్యదేవ నాగవంశీ
నిర్మాతలు: హారిక సూర్యదేవర, సాయి సౌజన్య
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
కూర్పు : నవీన్ నూలి
ఛాయాగ్రహణం : షామ్‌దత్
కళా దర్శకత్వం: శ్రీ నాగేంద్ర తంగాల
పీఆర్ఓ: లక్ష్మివేణుగోపాల్
బ్యానర్స్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌, శ్రీకరా స్టూడియోస్‌

Sithara Entertainments unveils the MAD MAXX Entertainer MAD Square’s catchy and foot-tapping folk “Baraat Anthem”!

MAD became a sensational blockbuster with three college going boys forming a tight friendly bond and their unadulterated gags cracking up audiences like never before. Now, the happening production house Sithara Entertainments has decided to bring a sequel with a Boys group back to give us a MAD MAXX Entertainer, MAD Square.

The young and robust team have kick-started promotions with a cracking Baarat Anthem – “Laddu Gani Pelli”. They released the energetic track on September 20th, as the first single from the album composed by Bheems Ceciroleo.

In the first film, the composer came up with an all-time chartbuster song, “Kallajodu College Papa”. Staying true to the teenmar beats of it, even “Laddu Gaani Pelli” has unlimited energy and it will definitely make everyone dance in the theatres.

Bheems Ceciroleo himself crooned the song along with folk sensation, singer Mangili. Lyrics by Karsala Shyam stay relevant to the theme and characters of the film. With folk beats and lyrics that have youngsters cracking jokes in a teasing manner, this song stands out and will be an instant addition to our playlists.

MAD boys gang – Sangeeth Shobhan, Narne Nithin and Ram Nithin are back to groove in this number. Their steps for “College Papa” song bit instrumental imbibed into this new song, will send nostalgic tremors for sure. On the whole, the track delivers what we expect from the MAD gang to the tee.

Ace technicians like Cinematographer Shamdat Sainudeen ISC, editor Navin Nooli are back to create magic once again in tandem with writer-director Kalyan Shankar.

Haarika Suryadevara and Sai Soujanya of Sithara Entertainments and Fortune Four Cinemas, respectively, are producing the film along with Srikara Studios.

Suryadevars Naga Vamsi is presenting the film and the makers will announce more details soon.

MADSquare-Song Still - 1 MADSquare-Song Still - 3